Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

వ్యక్తిగత నియమాలు - సామూహిక లక్ష్యం (పాండవులు) - megaminds

భారత యుద్ధంలో కౌరవ యుద్ద నాయకులు స్వంత నియమాలకి సామూహిక లక్ష్యం వదిలేసారు. వ్యక్తిగతం గా వాళ్ళు నిరంతరం చాల గొప్పవారిగా, వారి పక్షం కంటే వ...

భారత యుద్ధంలో కౌరవ యుద్ద నాయకులు స్వంత నియమాలకి సామూహిక లక్ష్యం వదిలేసారు. వ్యక్తిగతం గా వాళ్ళు నిరంతరం చాల గొప్పవారిగా, వారి పక్షం కంటే వారు గొప్పవారనే అహంకారం వారిని నాశనం చేసింది.
పాండవులూ వ్యక్తిగతంగానే గొప్పవారే కాని వారి పక్షం గెలిచి ధర్మం నిలబెట్టడానికి వారి నియామాలని పక్కన పెట్టడానికి అహంకార పద లేదు.
ఆ సంఘటనలు ఒక్కొక్కటి చెబుతాను.
ధర్మరాజు అబద్ధం ఆడని వాడని నిష్ఠ గరిష్ఠుడు. అశ్వత్థమ అనే ఏనుగుని చంపితే అశ్వత్తామా చచ్చాడని గట్టిగా చెప్పి, ఏనుగును అనేది మెల్లగా చెప్పాడు. రథం గాలిలో నడిచేది భూమి మీదకు దిగింది అని చెప్పారు. అతని నియమాన్ని పక్కన పెట్టేసాడు. ద్రోణుడు చావడానికి శ్రీ కృష్ణుడి పథకం పారింది.
దుష్టద్యుమ్నుడు పాండవుల సేనాని. శస్త్ర విహీనుడయి కూలబడిన ద్రోణుడిని తల తెగనరికి, తన పుట్టుక కారణాన్ని పూర్తి చేసాడు. ఒక సైన్యాధ్యక్షుడు నిరాయదుడిని నిర్వీర్యం చేసాడు. అది నియమ విరుద్ధం. తనకు అపకీర్తి తెస్తుంది. కాని ఆ ధర్మయుద్ధం ధర్మజుడే గెలవాలి కదా!
భూమి లో దిగబడ్డ రథాన్ని పైకెత్తుకునే కర్ణుడు బ్రతకడం చాలు అని కృష్ణుడు అనగానే, కర్ణుడిని మట్టుబెట్టాడు. ప్రపంచం తనను ఏమంటుంది అనే తలపు ఆ జగదేక వీరుడు తన నియమాలను పక్కన పెట్టి ధర్మరాజు గెలపూకు మార్గం సుగమం చేసాడు.
దుర్యోధనుణ్ణి మట్టు పెట్టడానికి గదా యుద్ధం లో నాభి కింద కొట్ట్తగూడదనే నియమం పక్కన పెట్టి, ధర్మం గెలవడానికి తాను చేసే పని లోకం తప్పు పడు తుందనే విషయం ఆ అరివీర భయంకురుడు అయిన భీముడు మూలకు నెట్టాడు.
ఇదంతా సామాన్యులు చేసాదంటే ఏమిటి
అనొచ్చు కాని సాక్షాత్తు పరమాత్ముడి అవతారమైన శ్రీ కృష్ణుడు తాను యుద్ధ భూమిలో ఆయుధం ధరించనని మాట చెప్పి, భీష్ముడు ఎన్ని రోజులూ పడిపోకపోవడం, రోజు రోజుకి పాండవ సైన్యం నాశనం అయ్యిపోతుంటే రథం నడిపే కృష్ణుడు నాకెందుకు అనుకో లేదు. ఈ ధర్మయుద్ధం గెలిపించడం తన బాధ్యత అంటూ తనే సుదర్శనాన్ని భీష్ముడి పై ప్రయోగించడానికి ఆయుధం ధరించి తనే రణ రంగం పైకి దూకాడు. భీష్ముడు చావడానికి కూడా తయార య్యాడు. అర్జునుడు వేడుకుంటే ఆగిపోయాడు. తాను చచ్చే ఉపాయం తానే చెప్పాడు. ఆయనెంతటి వాడో ఈ సంఘటనతో మనకు తెలుస్తోంది.
వీళ్ళకు వ్యక్తి గతం సామూహిక ధర్మం ముందు పక్కన పెట్టారు. ఏండ్లు అధర్మం తో దేశాన్ని నాశనం చేసిన దుర్యోధనుడి దుష్ట పాలనకు స్వస్తి చెప్పారు.
ఇలా సోమయ్య గారు చెప్పడం , నేను వినడం మొదటి సారి.
షేర్ చేసి, చర్చించండి. సమాజం ముఖ్యం, వ్యక్తి తను తననియమాలు, సుఖాలు సంతోషాలు సమాజం కోసం సమర్పితం చేస్తేనే సమాజం, ధర్మం, వ్యక్తి కూడా సుఖంగా ఉండేది.
నమస్సుల తో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..