Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో స్ఫూర్తిని నింపిన స్వతంత్ర యోధులు శచీంద్ర నాథ్ సన్యాల్, సుభద్ర కుమారి చౌహాన్, మగన్ భాయ్ దేశాయ్, రామ్ సింగ్

మన స్వాతంత్య్ర సమరయోధులు జాతికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొనడమే కాదు, జీవితంలో అన్ని రకాల సౌఖ్యాల...

మన స్వాతంత్య్ర సమరయోధులు జాతికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొనడమే కాదు, జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలను త్యాగం చేశారు. పలు కేసుల్లో మా భారతి విముక్తి కోసం ఎందరో తమ సర్వస్వం త్యాగం చేశారు. ఇంకా ఎందరో తమ భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా విద్యాభ్యాసాన్ని వదిలి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. మాతృభూమి విముక్తే వారికి అన్నింటి కన్నా మిన్న. మన స్వాతంత్య్ర యోధులు చేసిన సాహసోపేతమైన పోరాటం ఫలితంగానే 15 ఆగస్టు, 1947న భారతదేశం స్వాతంత్య్రం పొందింది.

1922 ఫిబ్రవరి 4వ తేదీన గోరఖ్ పూర్ కు 20 కిలో మీటర్ల దూరంలోని 'చౌరీ చౌరా' లో పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టారు. స్వాతంత్య్ర్య పోరాటానికి ఈ సంఘటన కొత్త శక్తినిచ్చింది. కానీ, 'చౌరీ చౌరా' సంఘటనలో ప్రాణాలు విడిచిన అమరవీరులకు రావలసిన గుర్తింపు లభించకపోవడం అత్యంత దురదృష్టకరం. 'చౌరీ చౌరా' సంఘటనలోని అమరులకు చరిత్ర పుటల్లో తగిన ప్రాధాన్యం లభించకపోయినా స్వాతంత్య్రం కోసం వారు చిందించిన రక్తం నేలలో ఇప్పటికీ ఉండి ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది.

2021 ఫిబ్రవరి 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ కు చెందిన గోరఖ్ పూర్ లోని చౌరీ చౌరాలో "చౌరీ చౌరా" సంఘటన శతవార్షికోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో చిరస్మరణీయమైన సంఘటనగా చెప్పదగిన చౌరీ చౌరా 100 సంవత్సరాలు పూర్తయిన రోజు అది. 'చౌరీ చౌరా' సంఘటన శతవార్షిక వేడుకలకు గుర్తుగా ప్రధానమంత్రి ఒక పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేశారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ వేడుక జరిగింది. ఈ సారి అజాది కా అమృత్ మహోత్సవ సందర్భంలో సుభద్ర కుమారి చౌహాన్, శచీంద్ర నాథ్ సన్యాల్, సద్గురు రామ్ సింగ్, గాంధేయవాది మగన్ దేశాయ్ ల జీవిత విశేషాలు చైతన్యవంతం చేస్తాయి. ఈ మహోన్నత వ్యక్తులందరూ భారతదేశ స్వాతంత్యం కోసం పోరాడడమే కాదు, స్వాతంత్య్రానంతర భారతదేశానికి పటిష్టమైన పునాదులు కూడా వేశారు.
Sachindra Nath Sanyal

సెల్యులార్ జైలులో రెండు సార్లు చిత్ర హింసలకు గురైన శచీంద్ర నాథ్ సన్యాల్: భారతదేశాన్ని విముక్తం చేయాలి. దేశానికే అంకితమైన జీవితం గడపాలి అని నేను బాల్యంలో ఉండగానే తీర్మానించుకున్నాను అని శచీంద్ర నాథ్ సన్యాల్ చెబుతూ ఉండేవారు. స్వాతంత్య్ర సమర యోధులందరిలోనూ శచీంద్ర నాథ్ సన్యాల్ ఒక్కరే కాలాపానీలో రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన ఏకైక విప్లవ యోధుడు. ఆయన పలుమార్లు అరెస్టులు, హౌస్ అరెస్టులు అనుభవించారు. నిర్బంధంలో ఎన్నో బాధలు పడినప్పటికీ నిర్బంధం నుంచి వెలులికి వచ్చిన మరుక్షణం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసే వారు, మాతృభూమిని విముక్తం చేయాలనే ఆయన పోరాటం ఎప్పుడూ ఆగలేదు. 1893 ఏప్రిల్ 3వ తేదీన వారణాసిలో జన్మించిన శచీంద్ర నాథ్ సన్యాల్ తన సాహసం, దేశభక్తితో కొత్తతరం విప్లవ యోధులకు స్ఫూర్తిగా నిలిచారు.

బెనారస్ లోని క్వీన్స్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయన కాశీకి చెందిన తొలి విప్లవ పార్టీ అనుశిలాన్ సమితి ఏర్పాటు చేశారు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడుగా కూడా ఆయన ఉన్నారు. లాహోర్ కుట్ర, బెనారస్ కుట్రలో పాల్గొన్నందుకు ఆయన విచారణ ఎదుర్కొన్నారు. 1915లో సన్యాల్ ను అరెస్టు చేసి కాలాపానీకి పంపారు. భారత మాత విముక్తి కోసం ఆయన దీర్ఘకాలం పాటు రాస్ బిహారీ బోస్ తో సన్నిహితంగా వ్యవహరించారు. 1925 ఆగస్టు 9వ తేదీన రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వంలోని విప్లవ పార్టీ సభ్యులు బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాకు ధనంతో కూడిన సంచులను రవాణా చేస్తున్న రైలును కాకోరి వద్ద దోచుకున్నారు. ఆ కేసులో శచీంద్ర నాథ్ సన్యాల్ కూడా అరెస్టయ్యారు. ఆయన చిన్న సోదరులు భూపేంద్ర 5 సంవత్సరాలు, మన్మథ్ నాధ్ 14 సంవత్సరాలు జైలు శిక్షకు గురయ్యారు. శచీంద్ర నాథ్ సన్యాల్ కు గోరఖ్ పూర్ లో సన్నిహిత అనుబంధం ఉంది. క్షయవ్యాధి సోకడంతో ఆయన గోరఖ్ పూర్ లోనే తుదిశ్వాస విడిచారు.

subhadra kumari chauhan

సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న తొలి భారత మహిళ సుభద్ర కుమారి చౌహాన్: పద్యాలు, కథలు, పాటలు అత్యంత పరకమైన పదజాలంతో రాసే వారు. బాలల కోసం ఎందరో సాహస యోధుల వీరగాధలు, పద్యాలు రాసిన ప్రముఖ రచయిత్రి ఆమె. ఆమె తన కథల ద్వారా జాతి చైతన్యాన్ని రగిలించడంతో పాటు మధ్య తరగతి ప్రజల ఆలోచనలను కులతో పంచుకునేవారు.

స్వాతంత్య్ర్య పోరాటంలో భాగంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న తొలి మహిళగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుభద్ర కుమారి చౌహాన్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన సహాజ్ పూర్ గ్రామంలో డామార్ రామ్ వార్ సింగ్ కుటుంబంలో 1904 ఆగస్టు 16వ తేదీన జన్మించారు. ప్రయాగ్ రాజ్ ని క్రాస్డ్ నైట్ బాలికా పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఆమె 1919లో మిడిల్ స్కూల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. భాంద్వాకు చెందిన ఠాకూర్ లక్ష్మణ్ సింగ్ ను వివాహం చేసుకున్న అనంతరం అదే ఏడాది ఆమె నివాసం జబల్ పూర్ కి మారింది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం మాత్రమే కాదు, అమె ఎన్నో స్ఫూర్తిదాయకమైన పద్యాలు రచించారు.

భారత స్వాతంత్య్రవ్యమంలో క్రియాశీల పాత్ర పోషించినందుకు అమె పలుమార్లు జైలు శిక్ష అనుభవించి చిత్రహింసలకు గురయ్యారు. ఈ చిత్రహింసలకు సంబంధించిన కథనాలను కూడా ఆమె తన కథల్లో వివరించారు. తన సాహిత్యం ద్వారా ఆమె స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేలా ఇతరులను చైతన్యవంతులను చేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు ఆమె అత్యంత ఉగ్ర స్వరంతో తిరుగుబూటు ప్రసంగాలు చేశారు. ఆమె వ్రాసిన అత్యంత ప్రముఖమైన "ఖూబ్ లఢీ మర్ధానీ" పద్యం ద్వారానే రాణి లక్ష్మీబాయి కథ దేశంలో ఇంటింటికీ చేసింది. రాణి లక్ష్మీబాయి అసాధారణ సాహసం, శౌర్యం గురించి బాలలు తెలుసుకోగలిగారు.

ఆ రోజుల్లో సాహితీ రంగంలో పురుషాధిక్యం ఉన్నప్పటికీ ఆమె తన రచనలతో జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించగలిగారు. కేవలం 9 సంవత్సరాల వయసులోనే ఆమెని కవిత ప్రచురితమయింది. మొత్తం మీద ఆమె రచించిన 88 పద్యాలు, 46 కథానికలు ప్రచురణకు నోచుకున్నాయి. "ముకుల్", "ఖలోనేవాలా", "యే కదంబ్ కా పేడ్", "త్రిధార" వంటి కవితలతో పాటు "బిఖారి మోతి", "ఉన్మాదిని" (1934), "సీదే సాదే చిత్ర " (1947) కథలు ప్రచురితం అయ్యాయి. భారత కోస్తా రక్షణ దళానికి చెందిన ఒక నౌకకు ఆమె పేరు పెట్టారు. జాతీయతా దృక్పథం గల చైతన్యవంతమైన రచయిత్రి అయిన ఆమె "లింగ, కుల వివక్షతో కూడిన సమాజం"లో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

గత ఏడాది ఆమె 117వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ ఒక సృజనాత్మకమైన డూడుల్ తో ఆమెను సత్కరించింది. కేవలం 44 సంవత్సరాల చిన్న వయసులోనే 1948 ఫిబ్రవరి 15వ తేదీన సుకుమార్ చౌహాన్ మరణించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2015 జూన్ 5వ తేదీన ప్రధానమంత్రి నివాసంలోని లాన్ లో ఒక కదంబ వృక్షాన్ని వృక్షాన్ని నాటిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ " ఈ కదంబ వృక్షమే యమునా నదికి అభిముఖంగా ఉంటే కన్నయ్య వలె మారటానికి నేను కూడా దానిపై నెమ్మదిగా కూచుంటాను" అన్న సుభద్ర కుమారి మోహాన్ కవితను ఉటంకించారు..

సిద్ధాంతాలతో ఏనాడూ రాజీ పడని గాంధేయవాది మగన్ భాయ్ దేశాయ్: భాయ్ దేశాయ్ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడమే కాదు, దేశానికి స్వాతంత్యం సిద్ధించడానికి ముందు, తర్వాత కూడా సంఘ సంస్కరణల్లో క్రీయాశీల పాత్ర పోషించారు. 1889 అక్టోబర్ 11వ తేదీన ఆయన గుజరాత్ లోని లేదా జిల్లాకు చెందిన ధర్మాజ్ గ్రామంలో ఒక దైవభక్తి ప్రపూరితమైన కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యానం చేస్తుండగా మహాత్మాగాంధీ ప్రసంగం విన్న అనంతరం స్పూర్తిని పొంది విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఆయన చదువు పూర్తి చేసుకుని ఉపాధ్యాయుడుగా పని చేయడం ప్రారంభించారు.

1930 సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఆయన మగన్ భాయ్ దేశాయ్ చురుగ్గా పాల్గొన్నారు. 1932 సంవత్సరంలో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర పోషించిన ఆయన బ్రిటిష్ పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పారు ఉద్యమంలో కొనసాగారు. 1939లో గాంధీజీ సిద్ధాంతాలు ప్రచారానికి మగన్ భాయ్ దేశాయ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరీ ర్ పేరిట ఒక మ్యాగజైన్ ప్రారంభించారు. దేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత కూడా ఆయన విద్య, దేశీయ పరిశ్రమలు, సద్యపాన నిషేధం కోసం పోదాముతూ గాంధీజీ విజువల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాషలోనే సిద్ధాంతాలకు గట్టి మద్దతుదారుడైన ముగన్ భాయ్ దేశాయ్ భాయ్ హిందీ, మద్యపాన నిషేధం, స్వ యోజన విద్య, గాంధీజీ సాహిత్యం వంటి వివిధ అంశాలపై ఏర్పాటైన 30కి పైగా ప్రాంతీయ జాతీయ స్థాయి కమిటీంతో సన్నిహితంగా పని చేశారు.

విద్య, సంస్కృతి, చరిత గాంధీజీ సిద్ధాంతాలు, చితం, రాజకీయాలు, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం మంటి పలు అంశాలపై వ్యాసాలు నాయదుతో పాటు పలు పుస్తకాలు ప్రచురించారు. చక్కని పాత్రికేయుడు కూడా అయిన ఆయన కొన్ని పుస్తకాలని అరువారం కూడా చేశారు. గుజరాత్ విద్యావీణ్ ను చెరినిని తర్వాత ఆయన 1961లో రుచిత్సాస పనిలే వరకు ఆయన సత్యాగ్రహ వారపత్రిక ఎడిటర్ గా ఉన్నారు. మగన్ భాయ్ దేశాయ్ 1969 ఫిబ్రవరి ఒకరో తేదీన మరణించారు.

దేశ విముక్తి కోసం 'కుకా ఉద్యమం' ప్రారంభించిన సద్గురు రామ్ సింగ్: సిక్కు తత్వవేత్త, సంస్కర్త, స్వాతంత్య యోధుడు అయిన సద్గురు రామ్ సింగ్ 150 సంవత్సరాల క్రితమే దేశమాత సంపూర్ణ విముక్తి కోసం భారత పౌరులను సంఘటితం చేశారు. 21వ శతాబ్దిలో కూడా ఆయన బోధనలకు అంతే ప్రాధాన్యం ఉంది. గోమాత గౌరవానికి, నిరాడంబరమైన వివాహ వేడుకలకు, వితంతు పునర్వివాహానికి, తక్కువ ఖర్చుతో సామూహిక వివాహాలకు ఆయన బలంగా మద్దతు ఇచ్చారు. బ్రిటిష్ పాలనపై తొలి తిరుగుబాటు వహించారు.


పంజాబ్ లోని లూధియానా జిల్లాకు చెందిన ఒక గ్రామంలో రామ్ సింగ్ 1816లో జన్మించారు. నాంధారి తెగకు నాయకత్వం వహించిన ఆయన 1857 తిరుగుబాటు కన్నా ముందే భారతమాత విముక్తి కోసం "కుకా ఉద్యమం" ప్రారంభించారు. బ్రిటన్ లో తయారైన వస్తువులను నిషేధించాలని ఆయన గట్టిగా వాదించారు. సతి దురాచారానికి వ్యతిరేకంగా కూడా శక్తివంతమైన ప్రచారం సాగించిన అయన వితంతువులు ఆత్మగౌరవంతో జీవనం సాగించేందుకు పునర్వివాహం చేయాలని ప్రజలకు అభ్యర్థించారు.

వివాహాలను కొత్తగా ప్రారంభించిన ఆయన కేవలం 1 రూపాయి 25 పైసల వివాహ వేడుకలు నిర్వహించారు. వరకట్న దురాచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఆత్మగౌరవ స్ఫూర్తిని అలవరచేందుకు, దేశంకోసంత్యాగంచేయడానికి ప్రజలు ముందుకు వచ్చేలా చేయడానికి ఆయన ప్రజా మత చైతన్య ప్రచారం నిర్వహించారు. 1885 నవంబర్ 29 ఆయన మరణించారు. భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో రామ్ సింగ్ 200వ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments