Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు - రవి శంకర్ మహరాజ్, మణిరామ్ దీవాన్, జతీంద్ర మోహన్ సేన్ గుప్త, బల్వంతరాయ్ మెహతా, బుద్ధు భగత్

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు: భారతదేశం అనేక సంవత్సరాలు బానిస భసంకెళ్లలో కృంగిపోయి తీవ్ర ఇబ్బందిని ఎదుర...

దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు: భారతదేశం అనేక సంవత్సరాలు బానిస భసంకెళ్లలో కృంగిపోయి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. స్వాతంత్య్రాన్వేషణలో ఎందరో స్వాతంత్య్ర్య సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారు. అనేక కష్టాలు అనుభవించారు. వారిలో చాలా మంది దేశమాత స్వేచ్ఛా వాయివుల కోసం ఆనందంగా ఉరికంబం ఎక్కారు. తుపాకీ గుండ్లకు బలైపోయారు. భారతమాత బానిస సంకెళ్ళు తెంచే పోరాటంలో పాలు పంచుకున్న వారు అత్యధిక సంఖ్యలో ఉన్నా మనకు తెలిసింది చాలా తక్కువ, స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఎందరో వీరులు ఎలాంటి గుర్తింపు లేకుండా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. అనేక సమయాల్లో స్వాతంత్య్ర్య సమరయోధులు వీరోచిత గాథలు నిర్ధిష్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయాయి.
shyam krishna varma


అలాంటి వీరులకు నివాళులర్పించే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే "ఆజాది కా అమృత మహోత్సవ్" (స్వాతంత్యం యొక్క అమృత మహోత్సవం) అలాంటి వారిలో శ్యామ్ కృష్ణ వర్మ ఒకరు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి పోరాడిన ఆయన భారతదేశ చరిత్రలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. బ్రిటీష్ పేరు ఉచ్చరించడానికి కూడా ప్రజలు భయపడుతున్న రోజుల్లో శ్యామ్ కృష్ణ వర్మ బ్రిటీష్ పాలనను ధిక్కరించారని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రశంసిస్తూ రాశారు.

ఆయన ఫిబ్రవరి 18, 1905లో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించారని, ఈ సొసైటీ భారతదేశానికి పాలనా హోదా, మరియు భారతీయుల మధ్య దేశ ఐక్యత పెంపొందించే విధంగా ప్రచారం చేసేందుకు సహకరించిందని తిలక్ చెప్పారు. ఆయన స్థాపించిన ఈ సొసైటీ భారతీయ విప్లవకారులకు ఆశ్రయం కల్పించిందన్నారు. అలాంటి గొప్ప విప్లవకారుడి అస్థికలు విదేశాల్లో 55 సంవత్సరాల వరకు భద్రపరిచారు. ప్రధాని నరేంద్రమోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 మే 22న తేదీన శ్యామ్ కృష్ణ వర్మ, ఆయన భార్య చితాభస్మాన్ని జెనీవా నుండి తెప్పించారు. 'ఆజాది కా అమృత మహోత్సవ్' సీరీస్లో ఇలాంటి గొప్ప విప్లవకారుల గురించి తెలుసుకోవడం మన బాధ్యత.
buddhu-bhagat


విప్లవకారుడు బుద్ధు భగత్ - కోల్ విప్లవ నిర్మాత: భగత్ ఝార్ఖండ్ లోని రాంచీ జిల్లాలో సిలగైలోని ఓరాన్ కుటుంబంలో జన్మించాడు. అతను గొడ్డలి వంటి ఆయుధాలు ఉపయోగించి బ్రిటీష్ వారి ఫిరంగులకు, తుపాకులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడాదు. 1832లో చేపట్టిన కోల్ తిరుగుబాటుకు సారథ్యం వహించి బ్రిటీష్ కౄర పాలనకు వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఆయన బాల్యం నుండి కత్తిసాము, విలువిద్య సాధన చేసేవాడు. బ్రిటీష్ పాలనను కీర్తించే భూస్వాములు, బ్రోకర్లకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు.

అతనెప్పుడూ ఎక్కడికి వెళ్ళినా తనతోపాటు గొడ్డలిని వెంటపెట్టుకుని వెళ్ళేవాడు. బుద్ద భగత్ సామర్థ్యం చూసి పజలు అతన్ని అవతారపురుషుడుగా ఒక దేవుడిగా పరిగణించేవారు. ఆయన సిల్లి, చోరియా, పిథోరియా, లోహద్దగా, పాలము ప్రాంతాల వద్ద జన సమూహాలను ఏర్పాటు చేశాడు. రాంచీ చోటానాగపూర్ పరిసర ప్రాంతాల ప్రజలపై బుద్ధు భగత్ గొప్ప ప్రభావాన్ని చూపాడు. అతని ఆశయాల కోసం అతని విజ్ఞప్తిపై తమ ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉండేవారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి తమ హక్కులు సాధించుకునే విధంగా ఆయన గిరిజన ప్రజలకు బోధించేవారు, గెరిల్లా యుద్ధంలో గిరిజనులకు శిక్షణనిచ్చారు. దట్టమైన అడవులు, కొండలు ఉపయోగించుకుని అనేకసార్లు గెరిల్లా యుద్ధంలో చిట్రీష్ సైన్యాన్ని ఓడించాడు.

ఆయన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో ఆయన కుటుంబ సభ్యులు, కుమారులు, సోదరులు అందరి నుంచీ ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు లభించేది. బుద్ధ భగత్ సైనిక స్థావరం చోగరి పైభాగంలో దట్టమైన అడవుల మధ్య ఉండేది. అక్కడే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వ్యూహరచనలు సాగించేవారు. అతను బ్రిటీష్ వారికి పెద్ద ముప్పుగా మారాడు, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అతన్ని వట్టించిన వారికి 1000 రూపాయల బహుమతి ప్రకటించింది. ఆ రోజుల్లో ఇది అత్యంత భారీ రివార్డు. బుద్ధ భగత్ అతని సహచరులను పట్టుకోవడానికి బ్రిటీష్ వారు 1952 ఫిబ్రవరి 13న సిలగై గ్రామాన్ని చుట్టుముట్టారు. భారీ ఎత్తున కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుద్ధ భగత్ దేశం కోసం పోరాడుతూ అమరుడయ్యాడు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పంచాయితీరాజ్ నిర్మాత బల్వంతరాయ్ మెహతా: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి. ఆయన భాష్ నగర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఆయన భారత స్వాతంత్ర్య పోరాటంలో అడుగు పెట్టారు. ఆయన బ్రిటీష్ అణచివేత పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లో వలసరాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. బల్వంతరాయ్ మెహతా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ లో తన చదువు పూర్తి చేసినప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం నుంచి డిగ్రీ తీసుకోవడానికి నిరాకరించాడు.
balvantrai-mehta


ఆయన 1921లో బావ్ నగర్ ప్రజా మండల్ ని స్థాపించి స్వాతంత్ర్య పోరాటం మరింత ఊపందుకునేందుకు దోహదపడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1930 నుండి 1952 వరకు సాగిన పౌర అవిధేయత ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అన్యాయమైన పన్నుల విధింపుకు వ్యతిరేకంగా 1928లో సాగిన ప్రసిద్ధమైన డోలీ ఉద్యమంలో బల్వంతరాయ్ ప్రముఖ వ్యక్తిగా నాయకుడిగా అవతరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మొత్తం బ్రిటీష్ పాలనలో బల్వంత్ రాయ్ సుమారు 7 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించారు.

1957లో ఆయన అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దేశ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ నివేదిక సమర్పించారు. దానినే ఈరోజు మనం పంచాయితీరాజ్ గా పిలుస్తున్నాము. బల్వంత్ రాయ్ మెహతా నివేదిక ఆధారంగానే భారతదేశంలో మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. స్థానిక సంస్థలకు ప్రణాళికా మరియు పరిపాలనపై పూర్తి నియంత్రణ ఇవ్వాలని అదే కమిటీ సిఫారసు చేసింది. ఆయన దూరదృష్టితో ఆలోచించడం వల్లే నేడు సమాజంలో అణగారిన వర్గాలు ఇంతకాలం కోల్పోయినవాటిని తిరిగి పొందగలుగుతున్నారు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల పంచాయితీ రాజ్, వ్యవస్థ శక్తివంతమైంది. బల్వంత్ రాయ్ మెహతాను పంచాయితీ రాజ్ వ్యవస్థకు నిర్మాతగా పిలుస్తారు.

జతీంద్ర మోహన్ సేన్ గుప్త స్వాతంత్య్ర ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు, జైల్లో మరణించారు: జతీంద్ర మోహన్ సేన్ గుప్త చిట్టగాంగ్ లో (ప్రస్తుత బంగ్లాదేశ్) సంపన్న కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జత్రా మోహన్ సేన్ గుప్త న్యాయవాదిగా పని చేశారు. అంతే కాదు ఆయన బెంగాల్ శాసన మండలి సభ్యుడు. జతీంద్ర కోల్ కత్తా లోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఉత్తీర్ణుడయ్యాక పై చదువుల కోసం 1904లో ఇంగ్లండ్ వెళ్ళాడు. కానీ దేశానికి సేవ చేయాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది.
jateendranath


మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించగానే జతీంద్ర మోహన్ తన న్యాయవాది వృత్తిని వదిలేసి ఉద్యమంలో పాల్గొన్నారు. దేశంలో కార్మిక అనుకూల వాణి వినిపించి ప్రజల చేత దేశ ప్రియ నేతగా పేరుపొందారు. ఆయన శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. జాతీయవాద విప్లవకారులను జైలు, ఉరి శిక్షల నుండి రక్షించేందుకు ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నించేవారు. 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు ఆయన ఇంగ్లండ్ కూడా వెళ్ళారు. ఆయన బ్రిటీష్ మహిళను వివాహం చేసుకున్నారు. అతని భార్య పేరు ఎడిత్ ఎల్లెన్ గ్రే అయితే వివాహానంతరం ఆమె తన పేరును నెల్లీ సేన్ గుప్తగా మార్చుకుంది.

నెల్లీ సేన్ గుప్త విదేశీయురాలు అయినప్పటికీ భారతదేశాన్ని బ్రిటీష్ వారి నుంచి విడిపించేందుకు తన జీవితాన్నే అంకితం చేసింది. స్వాతంత్య్రం పోరాట సమయంలో నెల్లీ ఇంటింటికీ వెళ్ళి ఖాధీ వస్త్రాలు విక్రయించారు. నెల్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు. జతీంద్ర తన 48 ఏట రాంచీలోని జైలులో మరణించారు.

మణిరామ్ దీవాన్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనేందుకు అస్సాంటీ కంపెనీలో దీవాన్ ఉద్యోగాన్ని వదిలేశారు: మణీరామ్ దీవాన్ అస్సాంకి చెందిన గొప్ప స్వాతంత్య సమరయోధుడు. ఆయన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆయన అనేక మందికి స్పూర్తిదాయకంగా నిలిచారు. 1806లో ఏప్రిల్ 17న జన్మించిన మణిరామ్ దత్తా మణిరామ్ దీవాన్ గా ప్రసిద్ధి చెందారు. ఆయన స్వాతంత్య్ర్య సమరయోధుడే కాదు గొప్ప వ్యాపారవేత్త కూడా ఆయన అస్సాంలో తేయాకు తోటలను ఏర్పటు చేసిన మొదటి వ్యక్తి. 1839లో బ్రిటీష్వారు ఆయన్ని అస్సాం టీ కంపెనీకి దీవాన్ గా నియమించారు. బ్రిటీష్ వారితో విభేదాల కారణంగా 1840లో ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు. తర్వాత తనే సొంత టీ తోటను ప్రారంభించారు.
maniram-dewan-megaminds


ఈ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం మీద ఆయనకు ఆగ్రహం మరింత పెరిగింది. 1850లో బ్రిటీష్ వారికి పూర్తి వ్యతిరేకంగా మారారు. 1857 మే 10వ తేదీన బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారత సైనికులు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన దాన్ని అస్సాంలో అహోం అనే పాత రాజవంశాన్నితిరిగి స్థాపించడానికి ఇది ఒక సువర్ణావకాశంగా భావించారు. దిబ్రూఘర్, గోలాఘాట్ సైనికుల సహాయంతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వెంటనే తిరుగుబాటు చేయమని ఆయన రాజుని కోరాడు. రాజు కందర్వేశర్ సింఘా తనకు నమ్మకమైన వ్యక్తులతో కలిసి పన్నాగం పన్ని బ్రిటీష్ పోరాడేందుకు కావలసిన ఆయుధాల నిల్వను కూడా సేకరించాడు.

కానీ ఆ విషయం బ్రిటీష్ ప్రభుత్వానికి తెలిసిపోయింది. రాజుని, మణిరామ్ ను ఇతర నాయకులను అదుపులోకి తీసుకుని జోర్హాట్ జైల్లో ఉంచారు. ఈ పూర్తి వ్యవహారంలో మణిరామ్ కుట్ర ఉందని గ్రహించిన బ్రిటీష్ ప్రభుత్వం ప్యాలీ బరువా అనే మరో స్వాతంత్య్ర్య సమరయోధుడితో పాటు 1858 ఫిబ్రవరి 26న జోర్హాట్ జైల్లో మణిరామ్ ని ఉరి తీశారు. 1863లో మణిరామ్ జీవితం ఆధారంగా సినిమా తీశారు. అందులో భూపెన్ హజారికా బుకు హూమ్-హూమ్ కరే అనే పాట పాడారు.

స్వాతంత్య్ర సమరయోధుడు - సామాజిక సేవా కార్యకర్త రవి శంకర్ మహరాజ్: మహరాజ్ స్వాతంత్య సమరయోధుడు మాత్రమే కాదు సామాజిక సంస్కరణల కోసం తన జీవితమంతా పోరాటం సాగించారు. రవిశంకర్ మహరాజ్ ని రవిశంకర్ వ్యాస్ అని కూడా పిలుస్తారు. మహాత్మాగాంధీ, వల్లభాయ్ పటేల్ తో సన్నిహితంగా ఉండేవారు. దేశం కోసం దేశమాత స్వేచ్ఛ కోసం తన జీవితాన్నే అంకితం చేశారు. ఆయన 1884లో గుజరాత్ రాష్ట్రంలోని బేధా జిల్లాలో ఒక పల్లెటూరిలో ఫిబ్రవరి 25న జన్మించారు.
gandhiyan-ravi-shankar-maharaj


ఆయన తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసే నిమిత్తం 6వ తరగతిలోనే చదువు మానివేయవలసి వచ్చింది. ఆయన. 1915లో గాంధీని కలిశారు. స్వాతంత్రోద్యమంలో ఆయన అనుసరిస్తున్న విధానాలు ఆకర్షితుడయ్యాడు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్నప్పుడు జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన బార్డోలి సత్యాగ్రహ పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. 1947 ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తరువాత రవిశంకర్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆయన ప్రజా సంక్షేమానికి తనను తాను అంకితం చేసుకున్నారు. గుజరాత్ ప్రజల కోసం ముఖ్యంగా వెనుకబడిన తరగతి, దళితుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేశారు.

వినోభాబావే చేపట్టిన భూదాన్ ఉద్య మంలో కూడా భాగస్వాములయ్యారు. బందిపోట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. 1975లో దేశంలో విధించిన ఎదుర్జన్సీని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన రోజుకు ఒకే ఒక్కపూట భోజనం చేసేవారు. ఆయన విరాళాల రూపంలో కోట్ల రూపాయలు, స్థలాలు అందుకున్నారు. కానీ, తన కోసం అంటూ ఏమీ మిగుల్చుకోలేదు. ఆయన్ని అంతా కోటీశ్వర బిచ్చగాడు అని పిలిచేవారు. 1985 జులై 1న తన వందో ఏట గుజరాత్ లో మరణించారు. భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం 1984లో రవిశంకర్ మహరాజ్ పేరిట పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది. ఆయన తన జీవితమంతా దేశ సేవలోనే గడిపారు.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

1 comment