Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సుశీలా దీదీ, బూర్గుల రామకృష్ణారావు, సచ్చిదానంద్ హీరానంద్, విశ్వనాథ్ దాస్ స్వాతంత్య్ర సమరయోధుల అమరగాధలు

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం అధికారం హక్కుల కోసం జరిగే పోరాటాలకు మించి ఉన్నతమైనది. ఒకవైపు వలసవాదుల మనస్తత్వం, మరోవైపు మనం జీవించి ...

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం అధికారం హక్కుల కోసం జరిగే పోరాటాలకు మించి ఉన్నతమైనది. ఒకవైపు వలసవాదుల మనస్తత్వం, మరోవైపు మనం జీవించి ఎదుటివారినీ జీవించనివ్వాలనే ఆలోచన, ఒకపక్క జాతి ఆధిపత్యం, భౌతికవాద ఉన్మాదం, మరోపక్క ఆధ్యాత్మికత, మానవత్యాలపై నమ్మకం. ఇలాంటి యుద్ధంలో భారత్ విజేతగా నిలిచింది. భారతదేశ సంప్రదాయం విజయం సాధించింది. మానవత్వం, ఆధ్యాత్మికత, సమానత్వపు శక్తి భారతదేశ స్వాతంత్య్ర్య పోరాటంలో కూడా నిమగ్నమై ఉన్నాయి.

భారతదేశ స్వాతంత్య్ర్యం కోసం తమ జీవితాన్ని, యవ్వనాన్ని ధారపోసి ప్రాణాలకు తెగించి పోరాడి సజీవంగా ఉన్న, మరణించిన ప్రతీ ఒక్కరినీ తిరిగి గుర్తుచేసుకునేందుకు, స్మరించుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. అదే సమయంలో దేశం కోసం వారు కన్న కలలను సాకారం చేసే విధంగా కొన్ని తీర్మానాలు రూపొందించేందుకు కూడా ఇది చక్కటి అవకాశంగా భావించాలి. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కాలం మనకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. అది మార్చి 3వ తేదీ 1930లో ప్రారంభమైంది. అలాగే మహాత్మాగాంధీ మార్చి 12, 1950న దండి యాత్ర ప్రారంభమైంది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం 91 సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసృతి ఆక్రమం నుంచి అమృత మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జెండా ఊపి పాదయాత్ర చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుశీల దీదీ, సచ్చిదానంద్  హీరానంద్ వాత్స్యాయన్ ఆగ్నేయ, బూర్గుల రామకృష్ణారావు, విశ్వనాధ్ దాస్ మొదలైనవారి వారి జీవిత విశేషాలు ఈ వ్యాసంలో..
Sushila Didi


ఉద్యమకారుల కోసం నగలను అమ్మిన సుశీల: సుశీలా దీదీ కాకోరి ఘటనలో చిక్కుకున్న విప్లవకారులను రక్షించేందుకు తన పెళ్ళి కోసం దాచిన బంగారాన్ని అమ్మిన దేశభక్తి కలిగిన మహిళ ఒకసారి దేశ బంధు చిత్తరంజన్ దాస్ లాహోర్ వచ్చారు. ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సుశీలా బీదీ రచించిన పంజాబీ పాట జగ్ జగ్. గగన్ లెఫ్రోచే ఝండా భారత్ దా... పాడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మాత్రమే కాదు, ఈ పాట వింటూ భారతకోకిల సరోజినీ నాయుడు కూడా చలించిపోయారు. ఆ సమయంలో ఈ పాట స్వాతంత్ర్యోద్యమకారులు అందరికీ అభిమాన గీతంగా మారిపోయింది.

సుశీల దీదీ చిన్నతనంలోనే ఆమె తల్లి మరణించారు, తర్వాత ఆమె అనేక విప్లవ సంస్థల్లో చురుగ్గా పాల్గొంటూనే తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేశారు. సుశీల దీదీ 1905, మార్చి 5వ పంజాబ్లోని దత్తో చుహాద్ ప్రాంతంలో జన్మించారు (ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది). ఆమెకు దేశభక్తి చాలా ఎక్కువ. కాకోరి ఘటనలో చిక్కుకున్న విప్లవకారులను రక్షించేందుకు ఆమె తన పెళ్ళి కోసం దాచిన పది తులాల బంగారాన్ని అమ్మి డబ్బును వారికి ఇచ్చింది. ఈ బంగారం సుశీల దీదీ అమ్మగారు కూతురు పెళ్ళి కోసమని దాచిపెట్టారు.

సుశీలా దీదీ చదువుతున్న పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ ఆమెను దుర్గాబాబి కు పరిచయం చేశారు, వారి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగి అది బంధుత్వానికి దారితీసింది. వారిరువురు వదిన మరదళ్ళుగా మారారు. దాంతో సుశీల మోహన్ గా మారి తర్వాత విప్లవకారులందరికీ సుశీల దీదీ అయ్యారు. భగత్ సింగ్ సుశీలా దీదీని అక్కగా గౌరవించేవారు. ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను వ్యతిరేగించారు. బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ తప్పించుకుని కలకత్తాలోని దుర్గాబాబి దగ్గరికి వచ్చాడు. అప్పుడు సుశీల దీదీ భగత్ సింగ్ ని తన సొంత ఇంట్లో దాచిపెట్టింది. బ్రిటీష్ ప్రభుత్వం దాన్ని గుర్తించలేకపోయింది.

1933 సంవత్సరంలో సుశీల దీదీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను కూడా స్వాతంత్య్ర్య సమరయోధుడే. పేరు శ్యామ్ మోహన్. అతను న్యాయవాది. 1942 ఉద్యమంలో భార్యాభర్తలిద్దరూ జైలుపాలయ్యారు. ఈ సమయంలో దీదీ  లాహోర్లో ఉంటే శ్యామ్ మోహన్ ఢిల్లీ జైళ్ళో ఉన్నారు. ఎన్ని హింసలు అనుభవించినా ఆమె తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎప్పుడూ విడిచిపెట్టలేదు.
Burgula Ramakrishna Rao


హైదరాబాద్ నిజాం పాలనకు, బ్రిటీష్ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా పోరాడిన బూర్గుల రామకృష్ణారావు: బూర్గుల రామకృష్ణారావు గొప్ప స్వాతంత్య్ర్య సమరయోధుడు. హైదరాబాద్ కు ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి. నిజాం నియంతృత్వ, అన్యాయపు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. నిజాంతో పోరాటమే కాకుండా స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో, ఇంకా అనేక ఇతర నాయకులతో కలిసి హైదరాబాద్ ని స్వతంత్ర భారతదేశంలో భాగంగా తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బూర్గుల రామకృష్ణారావు న్యాయవాదిగా తన వృత్తిని హైదరాబాద్లో ప్రారంభించారు. ఆయన పూణెలోని ఫెర్గుషన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముంబై విశ్వవిద్యాలయం ద్వారా 1923 లో న్యాయవాదిగా పట్టబద్రులయ్యారు. 1924లో హైదరాబాద్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అదే సమయంలో ఆయన భారత స్వాతంత్య్రం ఉద్యమంలో కూడా పాల్గొనేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన పదే పదే జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక హింసలకు గురయ్యారు.

బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ సోషల్ కాన్ఫరెన్స్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ సంస్కరణ కమిటీకి, ఇంకా హైదరాబాద్ రాజకీయ కాన్ఫరెన్స్ కి సభ్యుడిగా ఉన్నారు. ఆయన 1937లో పీపుల్స్ కన్వెన్షన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు, 1938లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యుడిగా, మూడేళ్ళ పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రావు బహుభాషావేత్త, హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి.

1952 మార్చి 6 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ కు తన సేవలందించారు. తర్వాత 1956 నవంబర్ 22 నుంచి, 1960 జూలై 1వ తేదీ వరకు కేరళ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 1960 జూలై 1 నుంచి 1962 ఏప్రిల్ 15 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు. 1999 ఆగస్టు 31న మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారు బూర్గుల రామకృష్ణారావు జీవితచరిత్రను విడుదల చేశారు. ఈ కార్యక్రమం. హైదరాబాద్ రాజవర్లో నిర్వహించారు. భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం 2000వ సంవత్సరం మార్చి 13న పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.

దేశ స్వేచ్ఛ కోసం బాంబుల తయారీ నేర్చుకున్న యోధుడు సచ్చిదానంద్ హీరానంద్ వాత్స్యాయన్ ' ఆగ్యేయ':  భారతదేశ స్వాతంత్య్ర్య పోరాటం సమయంలో సచ్చిదానంద్ హిరానంద్ నారాయన్, ఆగ్నేయా అనే పేర్లు పలుమార్లు జైలు జీవితం గడిపిన ఒక విప్లవకారుడివే. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన 1930 నుంచి 1936 వరకు దేశంలోని వివిధ జైళ్ళలో ఖైదీగా ఉన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత జైలు నుంచి విడుదల అయినప్పటికీ నిర్భందంలోనే ఉన్నారు. హిందీ సాహితీవేత్త అయిన సచ్చిదానంద్.
Sachchidananda Hirananda Vatsyayan


హీరానంద్ వాత్స్యాయన్ ఆగ్యేయ 1911వ సంవత్సరం మార్చి 7న ఉత్తరప్రదేశ్లోని కుశీనగర్లో జన్మించారు. ఆయన తండ్రికి పాఠశాల విధ్యా విధానంపై విశ్వాసం లేకపోవడం వల్ల సచ్చిదానంద్. ప్రాధమిక విద్యాధ్యనం అంతా ఇంటివద్ద సాగింది. లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్ సైన్స్ లో బిఎస్ సి పట్టా పుచ్చుకున్నారు. తర్వాత ఎం.ఎ ఇంగ్లీష్ చదివారు. చదువుకునే రోజుల్లో ఆయన భగత్ సింగ్ ని కలిశారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ విప్లవకారులు చంద్రశేఖర్ ఆజాద్ తోపాటు మిగతా సభ్యులైన సుఖ్ దేవ్, భగవతి చరణ్ వోహ్రాను అలాగే నవ జవాన్ భారత్ సభాను తొలిసారిగా కలిశారు.

ఒకపక్క చదువు కొనసాగిస్తూనే మధ్యలో విప్లవోద్యమంలో చేరాడు. ఇదే సమయంలో బాంబులు తయారు చేస్తూ పట్టుబడ్డారు. కానీ తప్పించుకున్నారు. తర్వాత అరెస్టు అయి దాదాపు మరణ శిక్ష పడేంత తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆగ్నేయ రచయిత, కొన్నిసార్లు విప్లవకారుడిగా కొన్నిసార్లు ఆర్మీలో సైనికుడిలా ఉండేవాడు. ఆగ్నేయ రచనా జీవితంపై జైలు ప్రభావం ఎక్కువగా ఉండేది. అతని జీవితమంతా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఆందోళనకారులు పటిష్టంగా, దృఢంగా తమని తాము ఎలా పెంపొందించుకోవాలనేది. ఆయన దాసిన కోత్రీకి బాత్ కధ చదివితే అర్థమవుతుంది. అగ్యేయ జైల్లో ఉండగా ఆయన కవితా సంకలనాలు భగ్న దూత్, ఇతియాలం విడుదల చేశారు. అతని కవితా సంపుటిలో విప్లవకారుల స్వరం దృఢంగా, స్పష్టంగా వినిపిస్తుంది.

ఆగ్యేయ సుప్రసిద్ధ రచనలు: 'భగ్న దూత్', 'చింత', 'ఇతియలం', 'హరి ఘోస్ పర్ క్లన్న భర్', 'బవ్ రా అహోరీ', 'అంగన్ కే పార్ ద్వార్', 'పూర్వా', 'కిత్నీ నౌన్ మే కిత్నీ బార్, "క్యోం కీ మై ఉసే జాన్తా హూ', 'శేఖర్", "ఏక్ జీవని, నదీ కే ద్వీప్', 'అప్నే అప్నే అజ్నబీ'.

సచ్చిదానంద్ హిరానంద్ వాత్స్యాయన్ ని ఆగ్నేయ అనే పేరుని మున్షీ ప్రేమ్ చంద్ పెట్టారట. ఆయన ప్రేమ్ చంద్ కి కొన్ని వ్యాసాలు పంపారట. రచయిత పేరూ లేకపోవడంతో ఆయన రచయిత పేరు సూచించమని అడిగినా పట్టించుకోక పోవడంతో ఫ్రేమ్ చంద్ వాటిని ఆగ్నేయ అనే కలం పేరుతో ప్రచురించారు. అప్పటి నుంచి పచ్చిదానంద్ హిరానంద్ వాత్స్యాయన్ పేరులో ఆగ్నేయ కూడా చేరింది. అప్పటి నుంచి ఆయన రచనలన్నీ ఆగ్నేయ అనే కలం పేరుతోనే ప్రచురితం అయ్యేవి.

ఆగ్నేయ సుప్రసిద్ధ హిందీ కవి, కథా రచయిత, నవలా రచయిత అంతేకాదు అనేక రచయితల రచనల్ని హిందీ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసిన అనువాదకుడు. దేశ స్వాతంత్ర్యానంతరం అతను జర్నలిస్ట్ గా ఉంటూ పూర్తిగా సాహితీ ప్రపంచంలో గడిపేరు, ఆగ్నేయ రచనా, పాత్రికీయ రంగాలలో గణనీయమైన కృషి చేశారు. ఆగ్రాకు చెందిన సైనిక్ అనే వారపత్రికతో తన జర్నలిస్ట్ జీవితం ప్రారంభించారు. అనేక భారతీయ అవార్డులు ఆయన్ని వరించాయి. అంతర్జాతీయ గోల్డెన్ రీత్ అవార్డుతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్ అవార్డు కూడా అందుకున్నారు. ఆగ్యేయ 1987 ఏప్రిల్ 4న మరణించారు.

జీవితాన్ని దేశసేవకు అంకితం చేసిన యోధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వనాథ్ దాస్: పండిత్ విశ్వనాధ్ దాస్ తన జీవితాన్నంతా దేశ సేవకే అంకితం చేశారు. ఆయన పై మహాత్మాగాంధీ ప్రభావం చాలా ఉంది. ఆ ప్రభావంతోనే ఆయన తన న్యాయవాది వృత్తిని విడిచిపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. సాతంత్ర్యోద్యమానికి తన వంతు సహకారాన్ని అందించే నిమిత్తం కాంగ్రెస్లో చేరి దేశానికి సేవ చేయడం ప్రారంభించారు.
pandit biswanath das


విశ్వనాధ్ దాస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న గంజం జిల్లాలో 1889 మార్చి 8న జన్మించారు. బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టే ప్రయత్నంలో ఆయన పౌర ఉల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలుపాలయ్యారు. 1920లో మద్రాసు ప్రెసిడెన్సీలో రైతు సంఘాన్ని స్థాపించి 1920 నుంచి 1929 వరకు మద్రాసు కౌన్సిల్ కోసం పనిచేశారు. స్వతంత్ర ఒరిస్సా రాష్ట్ర స్థాపన కోసం విశ్వనాథ్ దాస్ మహాత్మాగాంధీని ఒప్పించారు. ఆయన కృష్ణచంద్ర గజపతి నారాయణ్ దేవ్, ఇతర సహచరులతో కలిసి ఒడియా మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఈయన కృషి చూసి మహాత్మాగాంధీ ఒడిశా ప్రత్యేక రాష్ట్రం కావాలని బ్రిటీషుకి ప్రతిపాదించారు. ఫలితంగా ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. 1936లో బ్రిటీష్ ఇండియా రాష్ట్రంగా ఉన్న అప్పటి ఒరిస్సాకు విశ్వనాధ్ దాస్ - శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1937 నుంచి 1939 వరకు ప్రీమియర్ (ప్రధాన మంత్రి)గా ఆ రాష్ట్రానికి సేవలందించారు. తర్వాత ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. 1947 నుంచి 1951 వరకు ఆయన భారత రాజ్యంగ పరిధిలో ఉన్న ఒరిస్సా అసెంబ్లీకి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆల్ ఇండియా కాంగ్రేస్ కమిటీ సభ్యుడిగా చాలా కాలం పని చేశారు. ఉత్కల్ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీకి ఆయన మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments