Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

‘భిన్నత్వంలో ఏకత్వం' అనే మంత్రంతో భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించింది - సుమంత్ మెహతా, సుశీల చైన్ ట్రెహాన్, అమరేంద్రనాథ్ చటర్జీ, అలేఖ్ పాత్ర జీవిత విశేషాలు

‘భిన్నత్వంలో ఏకత్వం' అనే మంత్రంతో భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించింది: భారతదేశ సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యం అనేది భాష, ఆహ...


‘భిన్నత్వంలో ఏకత్వం' అనే మంత్రంతో భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించింది: భారతదేశ సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యం అనేది భాష, ఆహారం, దుస్తుల రూపంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ వైవిధ్యాన్నే భారతదేశ బలహీతనగా చరిత్ర పరిగణించింది. కానీ స్వాతంత్య్రం కోసం జరిగిన అన్వేషణలో మనం భిన్నత్వంలో ఏకత్వమే మా బలం అని ప్రపంచానికి నిరూపించి చూపించాము. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో, గుజరాత్ అయినా, బెంగాల్ అయినా, దక్షిణ ప్రాంతమైనా, ఉత్తర ప్రాంతమైనా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఐక్యమై 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అనే నమ్మకాన్ని ప్రదర్శించారు. ఇది ప్రజల్లో సామాజిక స్పృహను పెంచి, భిన్నత్వంలో ఏకత్వం అనేది స్వాతంత్య సమరయోధులకు మంత్రంగా మారింది.

మనం గొప్ప పోరాటాలు, త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాము. అలాంటి స్వాతంత్య్ర్య సమరయోధులకు నివాళులర్పించి, వారి ఘన చరిత్రము దేశ పౌరులకు తెలియజేసి విజ్ఞానాన్ని పెంచే ఉద్దేశ్యంతోనే 'ఆజాదీ అమృత్ మహోత్సవ్' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. 75 ఏళ్ళ క్రితం భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించింది. భారతదేశం స్వాతంత్య్ర ఉద్యమాన్ని అహింసతో నడిపించి రక్తపాతం లేకుండా కూడా స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రారంభమైన 'ఆజాద్ కా అమృత్ మహోత్సవ్' కింద దేశ వ్యాప్తంగా 25 వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సీరిస్ లో భాగంగా ఈసారి జూలై మాసం ఒకటవ తేదీన జన్మించిన నలుగురి జీవిత విశేషాలు తెలుసుకుందాం, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన సుమంత్ మెహతా, సుశీల చైన్ ట్రెహాన్, అమరేంద్రనాథ్ చటర్జీ, అలేఖ్ పాత్ర వంటి సమరయోధుల గురించి తెలుసుకోండి..

లండన్ నుంచి తిరిగివచ్చి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వైద్యుడు సుమంత్ మెహతా: సుమంత్ మెహతా, తన భార్యను స్పూర్తిగా తీసుకుని భారతదేశ స్వాతంత్య్ర్య పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఒక వైద్యుడు. పేదల ప్రజల సంక్షేమంకోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన వైద్య విద్య ఇంగ్లండ్ లో పూర్తి చేశారు. పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్ళే ముందే ఆయన వివాహం జరిగింది.

ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చాక బరోడా రాజ్ దగ్గర ముఖ్య వైద్యాధికారిగా సుమంత్ మెహతా సతీమణి శారద మెహతా వార్తాపత్రికలకు, మ్యాగజైన్లకు వ్యాసాలు రాసేవారు. అనువాదాలు, బాల సాహిత్యానికి సంబంధించి చిన్న చిన్న కథలు రాసేవారు. అయినప్పటికీ ఆమె ఈ పనులతో సంతృప్తి చెందేవారు కాదు, ఇంతకు మించి దేశానికి ఏదో చేయాలనే కాంక్ష ఆమెలో మెండుగా ఉండేది. భార్యలో ఈ రకమైన అంకితభావాన్ని ప్రేరణగా తీసుకుని స్వాతంత్ర్యోద్యమంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఆయన తన భార్యతో మహాత్మాగాంధీని కలుసుకుని స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

తన యూరప్ పర్యటనలో ఉద్ఘాటించేవారు. ఆయన మేడమ్ కాసు, శ్యామ్ జీ కృష్ణ వర్మ, వీరేంద్రనాథ్ చటర్జీ వంటి విప్లవకారుల్ని కలుసుకున్నారు. వీరేంద్రనాథ చటర్జీ ఆయన మీద శాశ్వత ముద్రవేశారు. అధ్యాత్మిక భావనలతో ఉన్న రామకృష్ణ పరమహంస, వివేకానంద రచనలు కూడా ఆయన మీద తీవ్ర ప్రభావాన్నిచూపాయి. సుమంత్ భార్య అయిన శారదా మెహతా సాధారణమైన స్త్రీ కాదు. ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా, కుమార్తెగా, అలాగే సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా, గొప్ప స్వాతంత్య్ర్య సమరయోధురాలిగా ఆమె అనేక పాత్రలు పోషించింది.

రాబోయే జన్మలో తాను ఆమె కడుపున జన్మించాలని కోరుకుంటున్నానని మహాత్మాగాంధీ ఆమెను ఉద్దేశించి అన్నారు. సుమంత్ మెహతా 1928లో జరిగిన బార్దోలి సత్యాగ్రహంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహం సమయంలో సారాబౌన్ ఆక్రమానికి సంబంధించిన రోజువారి పరిపాలనా పనులు ఆయన పరుగులుతీస్తూ విజయవంతంగా నిర్వహించిన తీరు వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీని అమితంగా ఆకట్టుకున్నాయి. తర్వాత ఆయన భారత స్వాతంత్య్ర్య ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అనేక సార్లు పాల్గొన్నందుకు ఆయన్ని పోలీసులు అరెస్టు చేసి గుజరాత్ లోని జలాల్పూర్ జైళ్ళో నిర్బందించారు.

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కారణంగా ఆయన సబర్మతి, విసాపూర్, వాసికి జైళ్ళలో సుమారు 5 సంవత్సరాల పాటు గడపవలసి వచ్చింది. పర్యావరణవేత్త, ప్రకృతి ఆరాధకుడు కావడంతో ఆయన దేశీ, ఆయుర్వేద చికిత్సను కూడా ఉద్ఘాటించారు. సమంత్ మెహతా కలోల్ సమీపంలో సెర్తా గ్రామంలో 1936లో ఒక అక్రమం స్థాపించి, రైతులు, కార్మికులు, గిరిజనుల అభ్యున్నతి, సంక్షేపం కోసం జీవితాంతం పని చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ అధికారం కోసం, బిరుదులు కోసం పెనుగులాడకుండా. ఆయన, ఆయన భార్య శారద ఇద్దరూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే మార్గాన్నే ఎంచుకుని తమ జీవితాలు వాటికే అంకితం చేశారు

అలేఖ్ పాత్ర 18ఏళ్ళ వయసులోనే స్వాతంత్యోద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఆయన ఒరిస్సాలోని వివిధ ప్రాంతాలలో జరిగిన పౌర హక్కులు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా సామాన్య ప్రజలను ప్రోత్సహించారు. అలేఖ్ పాత్ర ఒరిస్సాలోని పూరిలో 1923 జూలై 1న జన్మించారు. ఆయన చిన్నవాటి నుండే దేశభక్తి స్పూర్తి కలిగి ఉండడంతో 18 ఏళ్ళ చిరుప్రాయంలోనే స్వాతంత్య్రం పోరాటంలో పాల్గొనడం ప్రారంభించాడు. స్వేచ్ఛా పోరాటంలో భాగంగా తన స్నేహితులతో కలిసి నిమ్మపాడ పోలీస్ స్టేషన్ కు నివ్వు పెట్టాడని చెబుతారు.

ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులని అడ్డుకునేందుకు కాల్పులు జరపగా వారి సన్నిహితుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించారు. అలేఖ్ పాత్రను పోలీసులు అరెస్టు చేసి పూరీ జైలులో నిర్బంధించారు. అక్కడ ఆయన్ని చిత్ర హింసలకు గురి చేశారు. కానీ అతను ఎంతో దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఎంత హింసించి తన మార్గాన్ని మార్చుకోవాలనుకోలేదు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన తన స్థావరాన్ని కలకత్తాకు తరలించి బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా అజ్ఞాతంలో ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించాడు. అక్కడ అతను ఒక వ్యక్తి కోసం గృహ సేవకుడిగా పని చేశాడు. అయినప్పటికీ తని అండర్ గ్రౌండ్ కార్యకలాపాలు ఆగిపోనివ్వలేదు.

అయితే, అతను కోల్ కతాలో ఎంతో కాలం ఉండలేకపోయాడు. ఆచార్య హరిహర్, గోపబందు దాస్ లతో కలిసి స్వాతంత్య్ర్య పోరాటంలో బహిరంగంగా పాల్గొనాలని కోరుకున్నారు. అదే సమయంలో అతని సహచరులు కూడా అతను అండర్ గ్రౌండ్ లో ఉంటూ పని చేయడం కాకుండా, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్య్రం పోరాటంలో బహిరంగంగా పాల్గొనాలని కోరుకున్నారు. దాంతో ఆయన కోల్ కతా నుంచి పూరీకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే కోల్ కతా నుంచి పూరీకి తిరిగి వస్తుండగా అతన్ని పోలీసులు అరెస్టు చేసి మళ్ళీ జైలుకి పంపారు. జైల్లో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ సూచనలు పాటించారు. నూలు వడికి, ఖాదీ చేసి సొంతంగా తన బట్టలు, తయారు చేసుకున్నాడు. శుభ్రతను ప్రచారం చేయడం కోసం మరుగుదొడ్లను శుభ్రం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక హోమ్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సర్వోదయ విధులు నిర్వహణ కోసం స్వరాజ్ లో శిక్షణ పొందేందుకు వార్థా వెళ్ళడు.

అక్కడి నుండి ఒరిస్సాకు తిరిగి వచ్చిన తరువాత సాంఘిక సంస్కరణ కోసం పని చేయడం ప్రారంభించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన అనేక అవార్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సన్మానాలు పొందారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆయన ప్రజల కోసం సంక్షేమ పనులు కొనసాగిస్తూ నిరంతరం వారి కోసం చురుగ్గా పని చేసేవారు. ఆయన 76 సంవత్సరాల వయసులో 1999, నవంబర్ 17న మరణించారు.

                                 Amarendranath-Chatterjee

అమరేంద్రనాథ్ చటర్జీ దేశ స్వాతంత్య్రం కోసం విప్లవ మార్గాన్ని అనుసరించారు: అమరేంద్రనాథ్ చటర్జీ యుగాంతర్ అనే విప్లక సంస్థకు చెందిన అగ్రనాయకుల్లో ఒకరు. యుగాంతర్ అనేది ఉద్యమాన్ని అమలు చేయడానికి కావలసిన నిధుల సేకరణ బాధ్యతలు కలిగి ఉన్న ప్రసిద్ధ విప్లవకారుల సంస్థ. ఇతని విప్లవ కార్యకలాపాలు ప్రధానంగా బీహార్, ఒరిస్సా, యునైటెడ్ ప్రావిన్సులకు కేంద్రీకృతమై ఉండేది. అతను చదువుకునే రోజుల్లో తన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న ఎందరో వ్యక్తులను కలుసుకున్నారు. వీరంతా దేశం నుంచి బ్రిటీష్ వారిని తరిమికొట్టడానికి విప్లవాత్మక పద్ధతిని అవలంభించడమే సరైన మార్గంగా విశ్వసించారు. వీరిలో ఉపేంద్రనాథ్ బెనర్జీ, హృషికేశ్ కంజీలాల్ ప్రముఖులు.

బ్రిటీష్ బానిసత్వం మంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని బలంగా కోరుకున్న ప్రముఖులలో అమరేంద్రనాథ్ ఒకరు. ఆయన విప్లవ పంథాలోనే అది సాధ్యం అని భావించారు. అందుకే ఆయన యుగంతర్ బృందంలో చేరాడు. వివిధ శాఖల ద్వారా, వివిధ ప్రాంతాలలో ఉండే యువకులను ఒక చోట సమావేశపరచి బ్రిటీష్ వారితో పోరాడగలిగేలా వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేయడమే ఈ గ్రూప్ ప్రధాన కార్యకలాపం. అంతేకాదు. ఈ సంస్థ రహస్యంగా బాంబులు తయారు చేసి, దుష్టులైన బ్రిటీష్ అధికారులను చంపేందుకు కావలసిన ఆయుధాల పంపిణీ, శిక్షణను అందజేయడం వంటివి కూడా చేస్తుంది.

విప్లవం ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విముక్తి చేయాలని కోరుకున్న భారత స్వాతంత్య్ర పోరాట యోధుల జాబితాలో అమరేంద్ర నాథ్ ఛటర్జీ పేరు చేర్చబడింది.

ఈ సంస్థలో క్రీయాశీల సభ్యులు బ్రిటీష్ వారికి తొత్తులుగా పనిచేసే భారతీయ అధికారులను, దేశ ద్రోహులుగా భావించి వారిని కూడా చంపేవారు. అమరేంద్రనాద్ చటర్జీ 1880 జూలై 1న పశ్చిమ బెంగాల్ హూగ్లీ లోని ఉత్తరపద గ్రామంలో ఉపేంద్రనాథ్ చటర్జీ ఇంట్లో జన్మించారు. ప్రారంభంలో అతను విప్లవాత్మక కార్యకలాపాల విషయంలో జాతీంద్రనాధ్ ముఖర్జీ పక్షాన నిలిచారు. తరువాత 1907లో ఆయన అరబిందో ఘోష్ ను కలుసుకుని, బ్రిటీష్ బానిసత్వం నుంచి దేశ విముక్తి కోసం పూర్తిగా అంకితమయ్యారు. విప్లవకారులకు నిధుల సేకరణలో సహాయం చేయడానికి అతన్ని అరబిందో బాగా ప్రోత్సహించేవారని చెబుతారు. ఆయన 1915లో అండర్ గ్రౌండ్ కి వెళ్ళి 5 సంవత్సరాల పాటు ఉంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారువేషంలో ప్రాయాణించేవారని చెబుతారు.

అతన్ని పట్టించిన వారికి 10,000 రూపాయలు బహుమతి కూడా బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా బెంగాల్ మొదటి మహిళా రాజకీయ ఖైదీ అయిన నానిబాలా దేవి అమరేంద్రకు దూరపు బంధువు. ఆమె అతని ద్వారా ప్రేరణ పొంది విప్లవాత్మక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె చందన్ నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆనరేంద్రనాథ్ చటర్జీకి, యుగాంతర్ సంస్థకు చెందిన ఇతర విప్లవకారులు జాదు గోపాల్ ముఖర్జీ, శివ్ భూషణ్ దత్ మొదలైన వారికి ఆశ్రయం కల్పించింది. 1923లో అనురేంద్రనాధ్ కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. తర్వాత ఇతరత్రా మార్గాల ద్వారా తన క్రియాశీలత పెంచుకుని ఉత్సాహంగా పని చేశాను. భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తరువాత కూడా ఆయన చురుగ్గా పని చేశారు. ఆయన 1957, సెప్టెంబర్ 4న 77 ఏళ్ళ వయసులో పశ్చిమ బెంగాల్ లో మరణించారు. అమరేంద్రనాధ్ చటర్జీ శిలా విగ్రహాన్ని అతని స్వస్థలమైన ఉత్తరపద ప్రధాన రహదారిలో ప్రతిష్టించారు.

సుశీల చైన్ ట్రెహాన్ తుది శ్వాస వరకు దేశ సేవలోనే: సుశీల చైన్ ట్రెహాన్ స్వాతంత్ర్యోద్యమకారులైన ఇతర మహిళలతో కలిసి దేశ స్వాతంత్యం కోసం తీవ్రంగా పోరాటం చేశారు. దేశ స్వాతంత్యం కోసం పోరాడుతున్న సమయంలో ఆమె పోలీసుల చేతిలో చిత్రహింసలు అనుభవించారు. పంజాబ్ లో ఆడ పిల్లలకు. చదువు నిషిద్ధంగా పరిగణించే ఆ రోజుల్లో ఆమె ఆడపిల్లల్ని విద్యావంతుల్ని చేయాలంటూ ప్రచారం చేపట్టారు. సుశీల పంజాబ్ లోని పఠాన్ కోట్ లో జూలై 1వ తేదీ 1923న జన్మించారు. నలుగురు తోబుట్టువుల్లో సుశీల చిన్నది. ఆమె తండ్రి మధురదాస్ ట్రెహాన్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్, ఆయన పఠాన్ కోట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరుగా పని చేశారు.

'అదే సమయంలో ఆయన ఆర్య సమాజ్ లో ప్రముఖ సభ్యుడిగా కూడా ఉన్నారు. సుశీల వయసు పెరుగుతున్నకొద్దీ భారతదేశ స్వాతంత్యం మీద అనుబంధాన్ని పెంచుకుంది. ఆమె తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ సమయంలో ఆమెకు ఒక పుస్తకం దొరికింది. అది చదివాక ఆమె భారతదేశ స్వాతంత్యం గురించిన ఆలోచనలు ఆమెను. చాలా ఉద్వేగభరితంగా మార్చాయి. భగత్ సింగ్ జీవితానికి సంబంధించిన ధైర్యసాహసాలతో కూడుకున్న కథల నుంచి ఆమె ఎంతగానో ప్రేరణ పొందింది.susheel chain tehraan


ఆమెకు 18 ఏళ్ళ వయసున్నప్పుడు శకుంతల అజాద్ అనే స్వాతంత్య్ర్య సమరయోధురాలిని కలిసింది. ఆ తర్వాత ఆమె దేశ స్వాతంత్యం కోసం పోరాటం సాగించేందుకు ఇల్లు విడిచిపెట్టి వచ్చేసింది. తర్వాత రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని అజ్ఞాతంలో ఉంటూ స్వాతంత్యం కోసం వ్యూహాన్ని రూపొందించడం ప్రారంభించింది. ఈ పోరాటంలో భాగంగా ఆమె పోలీసుల చేత బారీ దెబ్బలు తినవలసి వచ్చింది. దేశ స్వాతంత్య్ర్యం కోసం పోరాటం చేయాలని నిశ్చయించుకున్న ఆమె సంకల్పాన్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితులూ విచ్ఛిన్నం చేయలేకపోయాయి.

స్త్రీలలో విద్యాస్పూర్తిని మేల్కొల్పి, వారిని స్వావలంబన దిశగా నడిపించేందుకు ఆమె సుదూర గ్రామాలకు సైకిల్ పై చాలా దూరం ప్రయాణించాల్సివచ్చేది. అక్కడ ఉండే మహిళలకు వంటపని, కుట్టుపని, పరిశుభ్రత వంటి విషయాలపట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించేది. ఆ సమయంలో అమ్మాయిలు సైకిల్ తొక్కడం ఆ ప్రాంతంలో నిషిద్ధంగా పరిగణించేవారు. అయినా సుశీల ఆ ఆలోచన విడిచిపెట్టేది కాదు.

దేశానికి.. స్వాతంత్య్ర్యం వచ్చిన తరువాత కూడా ఆమె పిల్లల చదువు ప్రాముఖ్యతను, ప్రచారం చేస్తూనే ఉండేది. ప్రత్యేకంగా బాలికల కోసం మూడు స్కూళ్ళను, ఒక కో-ఎడ్యుకేషన్ స్కూల్ ని ప్రారంభించింది. దేశం వలస శక్తుల నుండి విముక్తి పొందిన తర్వాత ఇంకా మానసిక, సామాజిక రుగ్మతల నుంచి. విముక్తి పొందవలసిన అవసరం ఉందని ఆమెకు బాగా అర్థం అయ్యింది. అందుకే ఆమె దేశ అభివృద్ధి కోసం స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి 2011 సెప్టెంబర్ 28న తుది శ్వాస విడిచేవరకు తన పని కొనసాగిస్తూనే ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments