అఖండ భారత్ ఒక కల్పన కాదు ఇది దేశ ప్రజల ఆకాంక్షవేదకాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన స్వరూపం ఇది. భృహస్పతి ఆగమశాస్త్రంలోనూ, విష్ణుపురాణంలోనూ కాళిదాసు, ఆచార్య చాణుక్యుని రచనలలోనూ మన దేశపు ఎల్లల గురించి స్పష్టంగా వర్ణించబడి ఉంది. అప్పటి మన దేశం వైశాల్యం సుమారు 70 లక్షల 40 వేల 700 చ.కి.మీటర్లు.
హిందూదేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. దండయాత్రలను ఎదిరించటమే గాక, ఆ ఆక్రామకులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉన్నది. కాగా క్రీ.శ. 712లో బాగ్దాద్లోని అరబ్ పాలకుల ద్వారా పంపబడిన మొహమ్మద్ బిన్ కాసిం దండయాత్రతో మొదలుకొని కొన్ని శతాబ్దులపాటు హిందువులు జీవన్మరణ సమస్యగా దాపురించిన అనేక దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అనుక్షణమూ పోరాడుతూ గడపవలసి వచ్చింది. క్రీ.శ.712 నాటి అరబ్బుల దండయాత్ర నుండి క్రీ.శ 1707లో ఔరంగజేబ్ మరణం వరకూ గల కాలఖండం ఒక సుదీర్ఘమైన పీడకల. ఐరోపాలో 'నూరు సంవత్సరాల యుద్ధం'గా వర్ణింపబడిన యుద్ధమొకటి ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల మధ్య సంభవించింది. కాగా ఇక్కడ హిందూస్థానంలో హిందువులు ఆక్రామకులుగా వచ్చిన మహమ్మదీయులతో వేయి సంవత్సరాలపాటు యుద్ధం సాగించవలసి వచ్చింది. ముస్లింల ఈ దండయాత్రలలో చెప్పనలవి కాని బాధలకు, అంతకు ముందెన్నడూ వినియండని దుస్సహమైన అవమానాలకు ఇక్కడి ప్రజలను గురిచేశారు. ఒకరి తర్వాత ఒకరుగా గుంపులు గుంపులుగా రాక్షసమూకలుగా వచ్చిన ఆక్రామకులు ఈ దేశాన్ని మృత్యుసాగరంలోకి త్రోసివేయ యత్నించారు. తమ సేనలలోని యువకులను రెచ్చగొట్టారు. ఇలా దుష్కృత్యాలు సాగిపోతున్న సమయంలో హిందువులు ఎంతో నిబ్బరంగా వాటిని ఎదుర్కొన్నారు.
ఆ తరువాత బ్రిటీష్ వారు తమ ప్రాబల్యాన్ని పెంచుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో దోచుకోనారంబించారు. లక్షలాది మంది దేశ భక్తులు తమ ప్రాణాలను భారత మాత నివేదించగా భారత మాత ను ఇష్టా రాజ్యంగా పాకిస్తాన్, హిందుస్తాన్ గా విభజిస్తూ ఆగష్టు 15 స్వాతంత్య్రం లభించింది. విభజనను స్వాగతిస్తూ కొంతమంది నాయకులు సంబరాలు చేసుకున్నారు. అమాయక దేశ ప్రజలు స్వాతంత్య్రం లభించింది అనుకున్నారు.
“అయిందేదో అయిపోయింది, సమసిపోయిన సమస్యలను త్రవ్వి పైకెత్తటంవల్ల ప్రయోజనమేమిటి ? దేశ విభజన ఇక 'తిరుగులేనిది' అని కొందరు అంటారు. ఎప్పటికైనా ఇది సాధ్యపడుతుందా ? మాతృదేవత ముక్కలు ముక్కలు అయిన దృశ్యం అనుక్షణం కంటికెదురుగా కనపడుతుంటే ఏ కుమారుడు అది మరచిపోయి గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాడు? మరచి పోవటమా? మాతృదేవత యొక్క అఖండ స్వరూపాన్ని తిరిగి దర్శించేవరకు నిజమైన కుమారుడెవడూ విశ్రాంతి తీసుకోడు. దేశ విభజన తిరుగులేనిదైతే త్రిప్పి వేయడానికి మనం ఉన్నాం. వాస్తవానికి ఈ ప్రపంచంలో తిరుగు లేనిది' లేనే లేదు. నిశ్చిత విషయాలుగానీ, అనిశ్చిత విషయాలుగానీ కేవలం మనిషిలోని ఇచ్ఛనుబట్టి మాత్రమే జరుగుతాయి. తాను స్వీకరించిన కార్యం పవిత్రమైంది, శ్రేష్ఠమైంది అని గుర్తించినపుడు మానవునిలోని ఇచ్చ మొక్కవోని సమర్పణా భావంతో ఉక్కుముక్కలె గట్టిపడుతుంది.
"హిందువులు, ముస్లిములు అన్నదమ్ములు. దేశవిభజన అంటే ఆస్తిని అన్నదమ్ములు పంచుకోవటమేగదా? దీనిలో ఏముంది" అంటూ దేశ విభజనను కొందరు సమర్థిస్తారు. అయితే కన్నతల్లి తమ ఉమ్మడి సొత్తు అని ఆమెను ఖండ ఖండాలుగా నరికే సంతానం గురించి మనం ఎప్పు డైనా విన్నామా? ఎంతటి ఘోరపతన స్థితి ఇది! ఇది ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి కాకుండా పోయింది. చివరకు మాతృభూమి కేవలం ఒక పంపిణీ వస్తువుగా, ఒక భోగభూమిగా, ఒక సత్రంగా మారిపోయింది. ఇట్టి నీచమైన ఆలోచనల కారణంగానే తల్లిని ముక్కలు చేసుకొన్నాం. లక్షలాది సోదరుల నెత్తురు వరదలై పారింది. దేశ విభజన వలన కలిగిన విషఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాం.
ఆఫ్ఘనిస్తాన్ పేరుతో దేశం మొదటి విభజన: బ్రిటీషర్ల దోపిడీ సమయంలో తమ ప్రాబల్యం గాంధార, ఉపగణస్థాన్ ప్రాంతంలో తగ్గిపోవడం తో అక్కడ ముస్లిం రాజ్యం ఏర్పడి 1739 న ఆఫ్ఘనిస్తాన్ దేశం ఏర్పడింది. ఇస్లాం మతం పుట్టిన తరువాత ముస్లిం దురాక్రమణ కారులు తాము ఆక్రమించిన ప్రతిచోట ప్రజల సంస్కృతిని, దేవాలయాలను, ఇతర శ్రద్ధా కేంద్రాలను నాశనం చేసి ప్రజలందరిని బలవంతంగా ముస్లింలుగా మార్చారు. ఆ విధంగా ముస్లింల ఆధిపత్యంతో క్రీ॥శ॥ 1739లో అఖండ భారత్ దేశంనుండి గాంధార రాజ్యాన్ని చీల్చుతూ ఆఫ్ఘనిస్తాన్ పేరుతో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచారు. అఖండ భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ పోగా మిగిలిన భూభాగం 70,40,700 - 6,52,100 = 63,88,600 చ.కి.మీటర్లు.
శ్రీలంక - మయాన్మార్ పేర్ల తో దేశాలుగా రెండు, మూడు సార్లు విభజన: మనదేశంలో బ్రిటీష్ పాలన ప్రారంభమైన తరువాత "విభజించి పాలించు" అన్న కుటిల నీతిలో భాగంగా 1912లో శ్రీలంకను, 1937 లో బర్మా (బ్రహ్మదేశం) ను, భారతదేశం నుండి విడదీసింది. అఖండ భారత్ లో శ్రీలంక, బర్మా (మయాన్మార్) పోగా మిగిలిన భూభాగం 63,88,600-7,42,200 = 56,46,400 చ.కి.మీటర్లు.
నాలుగోసారి ఏకంగా భారతదేశాన్ని ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ పేర్ల తో దేశాలుగా విభజన: 1947 ఆగష్టు 14వ తేదిన బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఇండియా-పాకిస్తాన్ లు గా చీల్చి అదే రోజున పాకిస్తాన్ (సింధుదేశం) కు స్వాతంత్రాన్ని ప్రకటించింది. ఆ మర్నాడు ఆగష్టు 15న ఖండిత భారతదేశానికి స్వాతంత్రం లభించింది. అదే సమయంలో నేపాల్, భూటాన్ కు కూడా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అప్పటికి టిబెట్, భారతీయ సంస్కృతితో, స్వతంత్ర దేశంగా మనదేశ రక్షణలో ఉంది. ఆగష్టు 15 నాటికి భారత్ దేశ వైశాల్యం (టిబెట్ ను కలుపుకొని) 56,46,400-11,32,200 = 45,14,200 చ.కి.మీటర్లు
కొన్ని వందల వేల సంవత్సరాలుగా టిబెట్ (త్రివిష్టపము) బౌద్ధ మతం అధికార మతంగాను హిందూ సంస్కృతి జీవన విధానంగాను, భారతదేశ రక్షణలో తటస్థ దేశంగా ఉంది. భారతదేశ ఉదాసీన, నిర్లక్ష్య వైఖరిని ఆసరా చేసుకుని చైనా, టిబెట్ ప్రాంతం మొత్తాన్ని 1960 నాటికి ఆక్రమించుకుని తన దేశంలో కలుపుకున్నది. తరువాత కాలంలో భారత ప్రభుత్వం కూడా ఆ విలీనాన్ని అంగీకరించి ధృవీకరించింది. భారతదేశం నుంచి టిబెట్ పోగా మిగిలిన భూబాగం 45,14,200-12,21,000= 32,93,200 చ.కి.మీటర్లు
1947లో స్వాతంత్రం ప్రకటించిన 2 నెలలకే పాకిస్థాన్ జమ్మూకాశ్మీర్ లోనికి చొచ్చుకుని వచ్చి 78,000 చ.కి.మీ. భూభాగాన్ని ఆక్రమించుకుని తన స్వాధీనంలో ఉంచుకున్నది. 1962లో చైనా భారదేశంపై దురాక్రమణ జరిపి జమ్మూకాశ్మీర్ లోని లడక్ ప్రాంతంలో 37,550 చ.కి.మీ. భూభాగాన్ని ఆక్రమించింది. ఆక్రమిత కాశ్మీర్, లడక్ భూభాగాలను మినహాయిస్తే ప్రస్తుతం వాస్తవంగా మనదేశ వైశాల్యం: 32,93,200-1,15,550 = 31,77,650 చ.కి.మీటర్లు
భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ మొఘలుస్తాన్ ఏర్పాటుకు కుట్రపన్నారు. ఆ కుట్రలో భాగంగా రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ బీహార్ పశ్చిమ్ బెంగాల్, అస్సాంలలో తమ జనాభాను విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ నుండి వచ్చిన రెండుకోట్లమంది ముస్లిం చొరబాటుదారులు ఈ ప్రాంతాలలోనే స్థిరపడడం గమనార్హం. ఈ కుట్రను పూజ్య గోల్వాల్కర్ గురూజీ మరియు సర్దార్ పటేల్ లు తిప్పికొట్టారు.
స్వాతంత్య్ర అనంతరం మన నాయకుల అవాకులు చవాకులు: స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే గడ్డిపరకైనా మొలవదు అనే మనస్తత్వం మన భూభాగాలపై దురాక్రమణగాని, అట్టి బెదిరింపుగాని జరిగినపుడల్లా పోనీలే దాన్ని వదిలివేద్దాం అని తేలిగ్గా మాట్లాడే నాయకులకు మన దేశంలో కొదువలేదు. చైనీయులు లద్ధాక్ లోని కొంత భాగాన్ని ఆక్రమించి కూర్చుంటే “పోనిద్దూ ! అక్కడ ఒక్క గడ్డిపరకైనా మొలవదు" అని అన్నారు. నేఫా (ఇప్పటి అరుణాచల ప్రదేశ్) గురించి ఒక కుటిల ప్రచారం జరిగింది. నేఫా నివాస యోగ్యము కాదని, పాముల పుట్ట అనీ, అక్కడి జలగలు మన సైనికాధికారుల గొంతుల్లోకి కూడా దూరి వారి రక్తం పీల్చివేస్తాయనీ, ప్రచారం జరిగింది. ప్రజల్లో దేశభక్తి కల్గించ వలసిన వార్తాపత్రికలు కూడా దీనికి ప్రాముఖ్యం ఇచ్చాయి. దానివల్ల ప్రజల్లో మన భూభాగాల పట్ల విరక్తి పుడుతుంది.
'కచ్ బాడవ' (గుజరాత్) లో విషయంలో కూడా ఇట్లాగే జరిగింది. అక్కడి కీలక స్థానాలపై దురాక్రమణ జరిగినపుడు ఆందోళనకరమైన వార్తలతో పాటు, ఆ ప్రాంతాన్ని గురించిన తుచ్చమైన వర్ణనలు గూడా మన పత్రికల్లో కనుపించ సాగాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన కరపత్రంలో కూడా కచ్ భూభాగం గడ్డి పరకైనా మొలవని మరుభూమి అని, సంవత్సరంలో ఎక్కువ కాలం సముద్రపు నీటిలో మునిగి ఉంటుందని, కాబట్టి నిరుపయోగమని, ఎప్పుడూ ఈగలు ముసిరి ఉంటాయనీ, కనీసం కొన్ని ఈగలైనా మ్రింగకుండా, అక్కడ గుక్కెడు నీళ్లు త్రాగటం కూడా కష్టమని ఇంకా ఎన్నో మాటలు అంటూండే వారు అప్పటి అధికారంలో ఉన్న నాయకులు.
సామాన్య ప్రజానీకం కిమ్మనకుండా, శత్రువులు ఆయా భూభాగాలను కబళించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి బహుశః ఇది ఒక పన్నాగమేమోనని పై రెండు ఉదంతాలను పోల్చి చూచినపుడు అనిపిస్తుంది. ముందుచూపు లేని కారణంగా అట్టి వార్తలు బహుళ ప్రచారమై ఉండవచ్చు. అది మరీ ప్రమాదం. ఎందుకంటే, ఎవడైనా ముందుచూపు తోనే ఆపని చేస్తే, అతనిది వక్రబుద్ధి అని మాత్రమే అనవచ్చు. కానీ సహజంగా చేస్తే, ఆతని హృదయాంతరాళాల్లో మాతృభూమి పట్ల మమత నశించిపోయిందని అవగతమవుతుంది.
వేలాది మైళ్ళు చైనా ఆక్రమించుకుంటే మన నాయకులు అది చైనా సరిహద్దు తగాదా అని సర్ది చెప్పారు. వట్టి మంచుగుట్టల్లో పదిమైళ్ళు అటైనా ఇటైనా పోయేదేమీలేదని మన నాయకులు అనేవారు. అంటే వేలకొలది మైళ్ళు పోయేది ఇటు, ఒక్క మైలుగూడా పోనిది అటు అని అర్థం. పైగా ఆ సరిహద్దు రేఖ 'నికరంగా ఇది అని చెప్పలేం' అని మన నాయకులే అనేవారు.
మన హ్రదయంలో అఖండ భారత్ ని పదిలంగా ఉంచుకోవాలి: లక్ష్యాన్ని ఉజ్జ్వలంగా ఉంచుకోవాలి. మాతృభూమి సమగ్రతను సంరక్షించడం కోసం ప్రజలు ఎంతగానో పాటుపడాలి. కానీ వారికి స్ఫూర్తిని ప్రసాదించే సమగ్ర మార్గ దర్శనం కొరవడటం శోచనీయం. దురాక్రమణ జరిగితే చాలు. భూభాగాన్ని ధారాదత్తం చేసే మనస్తత్వం అప్పటి మన నాయకులది. దురాక్రమణ జరిగిందన్న విషయమే మనం మరచి పోతున్నాం. పవిత్ర కైలాస శిఖరం, మానస సరోవరాలను దర్శించే అవకాశం కూడా మనకు లేకుండా పోయిందని, హిందు అన్న పేరు మనకు, మన దేశానికీ రావడానికి కారణమైన సింధునదిలో స్నానం చేయలేమని ఇది అవమానమని ఎంత మంది భావిస్తున్నారు? ఒకనాడు హిందూరావ ప్రసార కేంద్రమైన తక్షశిల మనకేది? హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుణ్ణి సంరక్షించేందుకు ఉగ్రనార సింహుడవతరించిన మూలస్థానం (ముల్తాన్) ఈనాడు మళ్ళీ రాకాసి మూకల ఇనుప పాదాలక్రింద అణగారి పోతోంది. వీటి జ్ఞాపకాల వల్ల మన నెత్తురు ఉడుకెత్తడం లేదా?
ఆ రోజు వేలాది మంది సన్యాసులు తమ ప్రాణాలొడ్డి పోరాడిన బెంగాల్ మరలా అదే స్థితిలో ఉంది. ముష్కరుల హింస భరించలేక హిందువులు గ్రామాలు, గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారు. అలాగే ఆదిశంకరులు నడయాడిన నేల కేరళ రావణ కాష్టంలా మండుతూనే వుంది ప్రతి సంవత్సరం 250 మంది పైబడి హిందూ యువకులు హత్యకు గురవుతున్నారు, ఆడపిల్లలు లవ్ జీహాద్ కి బలవుతున్నారు. ఇవన్నీ చూస్తూ ముద్దెలా దిగుతుంది! ఒక్కసారైనా వీటి గురించి ఆలోచించవా? నేటికీ పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటువాదంతో కొంతమంది మంటలు రాజేస్తూనే వున్నారు. వాటిని ఆర్పాల్సిన బాధ్యత నీది కాదా?
బాహ్య పరిస్థితుల వల్ల మన చూపు మసక బారకుండా, మనస్సు మొద్దు బారకుండా మనలను, తరువాతి తరాల వారిని కాపాడు కోవాలి. ఈనాడేర్పడ్డ రాజకీయ సరిహద్దులే మన సమగ్ర మాతృభూమి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి అని నమ్ముతూ, వాటినే పదే పదే భావించటం ద్వారా మన అంతరాత్మను చంపుకుంటున్నాం. మన మగతనానికి, తెలివి తేటలకు ఇది సవాలు! ఒక్కొక్క సారి రాజకీయ ఒత్తిడుల వల్ల, యుద్ధాల లోని జయాపజయాల వల్ల దేశ రాజకీయ సరిహద్దులు కొంత మార్పు చెందుతుంటాయి. అంత మాత్రాన రాజకీయంగా మనం కోల్పోయిన భూభాగాలు, మన మాతృభూమి లోని భాగాలు కానేకావని దాని అర్థం కాదు.
1947 వరకూ మనదేశం యావత్తూ, ఆంగ్లేయుల స్వాధీనంలో ఉండలేదా? అంతకు ముందు మన దేశంలో కొంత భూభాగం ముస్లిముల ఆధీనంలో శతాబ్దాల పాటు ఉండలేదా? అటువంటప్పుడు, ఆయా సమయా లన్నిటిలో, ఈదేశం మనది కానేకాదని అర్థమా? మరి, పరుల పాలనలో ఉన్న ఆయా భాగాలను విముక్తం చేయటానికి మనం పోరాడ లేదా ? త్యాగాలు చేయ లేదా? మన ఈ భూమిలోని ప్రతికణము, ఆత్మబలిదాన మొనర్చిన అసంఖ్యాక వీర వరుల యొక్క హుతాత్ముల యొక్క పునీత రక్తంచేత పవిత్రం కాలేదా? సంరక్షింపబడలేదా? ఈనాడు, దురాక్రమణకారులకు, వారు ముస్లిములు కావచ్చు, చైనీయులు కావచ్చు మనం కోల్పోయిన భూభాగాలు మనవి కావు, వాళ్ళదే హక్కు అని మనమంటే వాటిని తిరిగిపొందాలనే ఇచ్చనే కోల్పోయామని అర్థం. అవమానాలనే సన్మానాలుగా భావించే మేరకు మనం దిగజారిపోయి మగతనాన్ని మంటగలిపాం అని అర్థం.
ఈ జాతీయ ఆకాంక్ష నశించి పోకుండా జాగ్రత్త పడటం అన్నింటి కంటే ముఖ్యమైన విషయం. పోరాడాలనే వాంఛ, మాతృభూమి యొక్క సమగ్రతా స్వాతంత్య్రాలను సంరక్షించేందుకు సర్వస్వార్పణ చేయాలనే ఇచ్ఛ నశించిపోతే అది మనజాతి యొక్క గౌరవ స్వాతంత్య్రాలకు గొడ్డలి పెట్టు.
మాతృభూమి పట్ల ప్రగాఢ చైతన్య పూరితము, అచంచలము, ఉజ్జ్వలము ఐన భక్తి యే, ఏ దేశవాసులకైనా సరే, స్వతంత్రము, సమృద్ధము వైభవోపేతమైన జాతీయ జీవనానికి ఆధారం. మాతృభూమి పట్ల పరమోదాత్తమైన భక్తి భావనకు, మనం వారసులం. ప్రతి హిందువు హృదయంలోనూ, నివురుగప్పుకొని ఉన్న యుగ యుగాల నాటి మాతృభక్తి రగుల్కొని పవిత్రజ్వాలలై, మన మాతృభూమిపై జరిగిన ఒకనాటి దురాక్రమణలన్నిటినీ దహించి వేయాలి. అప్పుడే అఖండ భారతమాతను పునః ప్రతిష్ఠించాలని, మనం కన్న కలలు నిజమవుతాయి.
అఖండ భారత్ ఆత్మ ప్రతిధ్వనించిన అద్భుత వేళ: ఇండోనేషియా కూడా ఒకప్పుడు హిందూ దేశం లో భాగంగానే ఉండేది. సముద్రాలను దాటి, భూభాగాలను మించి, హృదయాల లోతుల్లో వెలిగే ఒక జ్యోతి ఉంది. అది సనాతన భారతీయ సంస్కృతి. ఈరోజు ముస్లిం దేశమైన ఇండోనేషియాలోని ఒక ఆలయంలో, ఆ జ్యోతి మళ్లీ సజీవమైంది. అక్కడి వేదికపై, రామాయణం కేవలం ఒక కథగా కాక, ఒక దివ్య అనుభూతిగా ప్రత్యక్షమైంది. ప్రతి కళాకారుడి కన్నులలో రామ భక్తి, ప్రతి హావభావంలో ధర్మ గౌరవం, ప్రతి నృత్య చలనంలో భారతీయ విలువల అక్షయత ప్రతిఫలించింది. వారి ప్రదర్శనలో వినిపించింది. సుదూర ద్వీపాలపై కూడా ప్రతిధ్వనించే అఖండ భారత్ స్వరం.
ఇది మనకు గుర్తు చేస్తుంది, భారతం కేవలం ఒక దేశం కాదు, అది యుగయుగాలుగా ప్రవహించే ఒక ఆధ్యాత్మిక నది, ఎన్ని సరిహద్దులు, ఎన్ని మతాలు ఉన్నా, ఆ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. సనాతన ధర్మం కేవలం పుట్టిన చోటే కాదు, అది చేరిన ప్రతి మనసులో పూస్తుంది, ఫలిస్తుంది. ఈ దృశ్యం చెబుతోంది భారతీయ ఆత్మను కట్టిపడేయలేరు, అఖండ భారత్ జ్యోతిని ఆర్పలేరు, రామ నామం ప్రపంచమంతా ప్రతిధ్వనించడాన్ని ఎవరూ నిలువరించలేరు. భారత్ మాతా కీ జయ్. -రాజశేఖర్ నన్నపనేని, మెగామైండ్స్.