హిందూ సమాజానికి ఛత్రపతి శివాజీ స్పూర్తి కావాలి - Chhatrapati Shivaji Maharaj

megaminds
0

శివాజీ జీవిత చరిత్ర

శివాజీ గురించి మనం తెలుసుకునే ముందు అంతకు పూర్వం ఎలా ఉండేదో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రతాప రుద్రుడు 1323లో చనిపోయిన తర్వాత మన తెలంగాణ ప్రాంతం ముస్లింల హస్తగతం అయింది. అలాగే కొంతమంది ముసునూరు నాయకుల పాలనలో కూడా కొనసాగింది. కర్ణాటకలో ఇదే సమయంలో హరిహర రాయలు, బుక్కరాయలను తిరిగి హిందూ ధర్మం లోకి విద్యారణ్య స్వాముల వారు తీసుకొచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. 200 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం ఎదురులేకుండా పరిపాలన సాగింది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైంది. మేవాడ్ రాజ్యం మహారాణా ప్రతాప్ మరణం 1597 తర్వాత శక్తిహీనమైంది. భారతదేశమంతా ఒక ఆత్మ విస్మృతిలో మొగలుల పాలనలో, నిజాముల పాలనలో, తుగ్లక్ ల పాలనలో బానిస బ్రతుకులను బ్రతుకుతున్నారు హిందువులందరు. హిందూ అనే శబ్దం పలకాలంటేనే భయపడే పరిస్థితి. మరోపక్క సిక్కు మత గురువులందరిని మొగలలు మతం మారండి అంటూ నానా హింసలు చేస్తూ హత్యలు గావించారు.

అదేవిధంగా హిందూ ధర్మం లోని కొన్ని లోపాల కారణంగా హిందూ స్త్రీలను ముస్లిములు తాకినట్లయితే తిరిగి స్వీకరించే వారు కాదు. అలాగే ముస్లింలతో కలిసి కూర్చున్నా కూడా వారిని సమాజానికి దూరంగా వెలివేసేవారు. ఆ సమయంలో దేశమంతా ఇలా అనేక అసమానతలు సామాజిక రుగ్మతలు హెచ్చు మీరు పోయాయి. మొగలులు ఇదే అదునుగా భావించి మన గుడులలో, బావులలో ఆవుల తలలు నరికి ఆ రక్తాన్ని చెరువుల్లో, బావుల్లో కలిపేవారు. గుడుల్లో నరికిన తలలు పడేసేవారు.

ఇదంతా చూస్తున్న ఓ 13 ఏళ్ల బాలిక నా దేశం, నా ధర్మం ఇలా కుంటుబడిపోయింది. వీటికి అడ్డుకట్ట వేసేవారు లేరా అని భావించింది. వీటన్నిటిని అడ్డుకట్ట వేసే వీరుణ్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. అలాగే అనుకు‌‌‌‌న్న విధంగానే వీరుణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ ఆ వీరుడు కూడా బీజాపూర్ కొలువులో పనిచేయడం ఆమెకు నచ్చలేదు. ఈ దుర్మార్గలను ఎదురించే గొప్ప వీరుణ్ని కనాలని ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు నోచింది శివయ్య అనుగ్రహంతో వైశాఖ శుక్ల పక్ష తదియనాడు 19-2-1627న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు శివ అని నామకరణం చేసింది ఆ తల్లి ఎవరో కాదు జిజియా బాయి, తండ్రి షాహ్ జి.

తల్లి ఒడి తొలి బడిగా శివాజీకి రామాయణ, మహాభారతలని కథలుగా వినిపించి ఎంతో గొప్ప వీరుడుగా, కొండదేవ్ శిక్షణలో ఒక పరాక్రమవంతుడిగా శివాజీని మలచింది. యోధుడిగా ధైర్యవంతుడిగా రామాయణ, మహాభారత కథలు శివాజీని తయారు చేశాయి. కొండదేవ్ దగ్గర రాజకీయం, యుద్ధతంత్రం నేర్చుకున్నాడు. అదే కాలంలో భక్తి ప్రభోదాలు చేసేటువంటి భక్త తుకారం దగ్గర భక్తి మార్గం ద్వారా సమరసతా, సద్భావన హిందూ ధర్మం లోని లోపాలను సరిదిద్దాల్సిన విషయాలను తెలుసుకున్నాడు. అప్పటికే దేశం అంతా అనేక సార్లు ప్రయాణించి, హనుమ విగ్రహాలను ప్రతిష్టించి ఒక పెద్ద ఎత్తున దేశంలో హిందూ చైతన్యం తీసుకువచ్చే పని చేసిన సమర్థ రామదాసు దగ్గర ఆధ్యాత్మికత, హైందవ ధర్మ పరిరక్షణే తన జీవిత పరమార్ధంగా భావించిన శివాజీ. సమర్ద రామదాసు దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు శివాజీ.

12 ఏళ్ళ వయసులో తండ్రి షాజీతో కలిసి బీజాపూర్ సుల్తాన్ దగ్గరకు వెళ్లి తలవంచనని, సలాం కొట్టానని వెనుతిరిగినాడు శివాజీ. తనతో పాటే మావళీల పిల్లలను కూడా శిక్షణనిచ్చి 16 సంవత్సరాల వయసులోనే తోరణి అనే చిన్న దుర్గాన్ని జయించాడు శివాజీ. ఇలా తాను అనేక కోటలు చిన్న వయసులో జయించాడు కేవలం 15 - 20 మంది మావళీల మిత్రులతో కలిసి ఒక పెద్ద యుద్ధాన్ని మొదలుపెట్టి 240 పైబడి కోటలను జయించి సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరిచి జేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు అంటే 6-6-1674 గురువారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజు గా, హైందవీ రాజ్ గా పేరు ప్రఖ్యాతలు గాంచాడు.

ఔరంగజేబుకి నిద్ర కరువైంది, శివాజీ ఔరంగజేబుకి కలలో రావడం ప్రారంభించాడు. హైందవి స్వరాజ్యం కు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనకు గండి పడింది. మేవాడ్ రాజైన రానా రాజే సింగ్ సిసోడియ వంశం వారసుడిగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇతను కూడా శివాజీ అండ చూసుకొని జిజియా పన్ను కట్టనని తెగేసి చెప్పాడు దెబ్బకి కుదేలయ్యాడు ఔరంగజేబుకి.

మార్వార్ రాజు జస్వంత్ సింగ్ కూడా 1638లో నే పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఇతను అత్యంత పరాక్రమశాలి ఇతన్ని ఔరంగజేబు తన మాయమాటలతో నమ్మబలికి పెద్ద పదవి ఇచ్చి జస్వంత్ సింగ్ ని తన వద్ద పెట్టుకున్నాడు. అయితే జస్వంత్ సింగ్ కి ఒక గొప్ప సైన్యాధిపతి దుర్గాదాస్ రాథోడ్ ఉండేవాడు. అతన్ని కావాలని ఆఫ్ఘనిస్తాన్ లో జరిగే అల్లర్లను అంటే తిరుగుబాటుదారులపైకి పంపి జస్వంత్ సింగ్ కి విషమిచ్చి చంపాడు ఔరంగజేబు. ఇది తెలిసిన దుర్గాదాస్ రాథోడ్, జశ్వత్ సింగ్ కుటుంబాన్ని, మహారాణిని తీసుకొని జోద్ పూర్ వెళ్లి జస్వంత్ సింగ్ కొడుకైన అజిత్ సింగ్ ని రాజును చేసి దుర్గాదాస్ రాథోడ్ 25 సంవత్సరాల పాటు ఆ రాజ్యాన్ని కాపాడుతూ మొగలను పై పోరాడాడు. ఇప్పటికీ రాజస్థాన్ స్త్రీలు కంటే దుర్గాదాస్ వంటి కొడుకుని కనాలి అని భావిస్తారు. కానీ దుర్గాదాస్ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు దేశమంతా తన కీర్తి ప్రతిష్టలు ప్రచారం కాలేదు తనో సైన్యాదిపతిగా మిగిలిపోయాడు.

శివాజీ సమకాలీనులైన గురుతేగ్ బహుదూర్ ని చాందిని చౌక్ దగ్గర బహిరంగంగా తలనరికించాడు ఔరంగజేబు. ఆ తర్వాత తన కొడుకు గురు గోవింద్ సింగ్ పదో గురువుగా ఎందరో వీరులు తయారు చేశాడు. ఖాల్సా పంతా ని ప్రారంభించి మొగలుల్ తో యుద్ధాలు చేసి మొగలు సైన్యాల్ని అనేకసార్లు ఓడించాడు. ఇది భరించలేనటువంటి ఔరంగజేబ్ తన నలుగురు కొడుకుల్ని సజీవ దహనం చేశాడు. చివరకు ఇద్దరు పటాన్లు నమ్మబలికి మాధవ దాస్ అనే ఆశ్రమంలో ఉంటున్న గురు గోవింద్ సింగ్ ని కలిసి చంపబోయారు, అక్కడే ఉన్న ఇద్దరు గురు గోవింద్ సింగ్ శిష్యులు ఆ పఠాన్ లని నరికి చంపేశారు. గాయాలతో కొన్ని రోజులకి గురు గోవింద్ సింగ్ మరణించాడు. మరణించే ముందు గురు గోవింద్ యొక్క సందేశాన్ని మాధవ దాసుకి చెప్పి, మాధవ దాసుని బందా సింగ్ బైరాగిగా మార్చి, ఉత్తరం వైపు వెళ్లి తన గురువు సందేశాన్ని అందించమని చెప్పడం జరిగింది. బందా సింగ్ బైరాగి తన గురువు సందేశాన్ని తీసుకొని ఉత్తరం వైపుగా వెళ్లి మొత్తం మొగల్ సైన్యాల్ని నాశనం గావించి తను చివరకు వీరమరణం పొందాడు.

అలాగే బుందేల ఖండ్ లో ఓర్చా రాజు జఝార్ సింగ్ అనే రాజపుత్ర రాజు పాలించేవాడు. అతనిపై షాజహాన్ దాడి చేసి తన ఇద్దరు కొడుకుల్ని తలనరికి చంపించాడు. ఆ తరువాత జఝార్ సింగ్ దగ్గర పనిచేసే క్షత్రియుడైనటువంటి చంపత్ రాయ్ ప్రజలను కూడగట్టి మొగలులపై గెరిల్లా దాడులు చేస్తూ రాజ్యాన్ని ముందుకు నడిపాడు. చంపత్ రాయ్ కొడుకు అయినటువంటి రాజా ఛత్రసాల్ కూడా పరాక్రమశాలి మొగల్ సైన్యాలను అనేకసార్లు ఓడించాడు. శివాజీ గురించి తెలుసుకొని శివాజీని కలిసి తనను కూడా శివాజీ సైన్యంలో చేర్చుకోమని అర్థించాడు. కానీ శివాజీ కుమారా ఛత్రసాల్ నా సైన్యంలో చేరితే నా సైన్యంలో ఒకడివి అవుతావు అలా కాకుండా బుందేల ఖండ్ వెళ్లి అక్కడ పని చెయ్యి నేను నీకు సహాయం చేస్తాను, అని చెప్పి పంపితే రాజ ఛత్రసాల్ ప్రజల్లో మార్పు తీసుకువచ్చి ప్రజలను కూడగట్టి బుందేల ఖండ్ నుండి మొగల్ సైన్యాన్ని తరిమికొట్టాడు. సంత్ ప్రాణనాథ్ యొక్క గొప్ప శిష్యుడు ఛత్రసాల్. సనాతన ధర్మాన్ని సుస్తితికి పాటుబడిన వ్యక్తి ప్రాణనాథ్. రాజా ఛత్రసాల్ కి క్షాత్ర ప్రభోదం చేసిన మహా పురుషుడు ప్రాణనాథ్. ప్రజలకు ధర్మవీరాన్ని ప్రబోధించి ఛత్రసాల్ సైన్యంలో చేరమని చెప్పేవాడు. రణరంగంలో ఛత్రసాల్ సైన్యాలకు ఉత్తేజాన్ని కలిగించేవాడు. సమర్థ రామదాసు వలె హైందవి వీరులను ధర్మరక్షణకు ప్రోత్సహించిన, మార్గదర్శనం చేసిన మహనీయుడు సంత్ ప్రాణనాథ్.

ఔరంగజేబు మరాఠా దెబ్బకు మారాఠా వైపు కన్నెత్తి చూడకుండా అస్సాం వైపు మరలాడు అస్సాంలో మీర్జాముల్ అనే సేనాదిపతిని పంపి అక్కడ దండయాత్ర చేసి రాజధాని గౌహతిని ఆక్రమించుకున్నాడు. అస్సాం రాజు జయ ధ్వజ సింగ్ గౌహతిని మొగలలకు అప్పగించి ఆ దుఃఖంతో, ఆ బాధతో మరణిస్తూ తమ్ముడైనటువంటి చక్ర ధ్వజడికి రాజ్యాధికారం ఇచ్చి మరణిస్తాడు. చక్రద్వజుడు ఔరంగ్ ని ఎదిరించి తన సైన్యం ఎప్పటికీ ఊడిగం చేయదు అంటూ లాచిత్ బడఫుకాన్ ని సైన్యాధిపతిగా నియమించి గౌహతిపై దండెత్తి మరల గౌహతిని ఔరంగ్ జేబు నుండి విముక్తి చేస్తాడు. ఊహించినట్లుగానే పెద్ద సంఖ్యలో ఔరంగ్ జేబు రామ్ సింగ్ అనే సైనాధిపతిని గౌహతిపై అస్సాంపై పంపుతాడు లాచిత్ సేనలు రామ్ సింగ్ సేనలను నీళ్లపై యుద్ధం చేసి తరిమి కొడతాయి. ఆ తర్వాత లాచిత్ బడ్ ఫుకన్ అనారోగ్యంతో మరణిస్తాడు.

మన తెలుగు రాష్ట్రాల్లో నిజాం దగ్గర మాదన్న మంత్రిగా ఉంటూ శివాజీతో స్నేహంగా ఉండాలని సూచిస్తాడు. రామదాసు తన ఖజానా నుండి భద్రాచలంలో రామునికి గుడి కట్టిస్తాడు. దాశరధి కరుణా పయోనిది అంటూ అనేక పాటలు రాసి సమాజంలో భక్తి చేతన్యంను రగిలిస్తాడు. ఆంధ్రలో ఇదే సమయంలో వేమన సమాజాన్ని జాగృతంగా భావిస్తాడు.

ప్రతాపరుద్రుడు తర్వాత నాయకర్ల వంశపాలన మొదలవుతుంది మదురై కేంద్రంగా ఇది కొనసాగింది. తిరుమల నాయకర్ అనే రాజు మదురై రాజుగా ఉంటూ మదురై ను కేంద్రంగా చేసుకొని పాలనను చేసేవాడు. మొగలులు, తుగ్లక్ లను తనకున్న చాకచక్యంతో, మేధోసంపత్తితో తన రాజ్యంపై దండెత్తకుండా చూసుకునేవాడు, కానీ యుద్ధాలు చేయలేదు.

ఔరంగజేబు మాయమాటలను నమ్మి‌‌ మీర్జాపూర్ రాజు రాజా జయసింహ దండెత్తి వస్తే ఒక లేక వ్రాసి నిరాయుధుడుగా వెళ్ళి జయసింహ ని తనవైపు తిప్పుకుంటాడు. అంతకుముందు అఫ్జల్ ఖాన్ వస్తే ఆయుధుడిగా ఆడిన మాటను తప్పిన అఫ్జల్ ఖాన్ తనను వంచనతో హత్య చేయబోగా ఛత్రపతి శివాజీ అతడిని పులిగోళ్లతో గుచ్చి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వలే చంపుతాడు. అఫ్జల్ ఖాన్ చనిపోయిన తరువాత కూడా శరీరాన్ని వారికిచ్చేశాడు శివాజీ.

ఔరంగజేబు సుల్తానులపై శివాజీ పోరాటం సాగించిన కాలంలో ఎవరికి వారు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఒక సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కలలు కనలేదు. శివాజీ అలా కాకుండా తల్లి జిజియాబాయి పెంపకంలో, గురువు సమర్థ రామదాసు మార్గదర్శనంలో ఒక సువిశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, హైందవి స్వరాజ్యాన్ని స్థాపించాడు. అందుకు మనమంతా శివాజీ పట్టాభిషిక్తుడైన జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

తన పాలనలో అంటే 1643 నుంచి 1680 వరకు 34 సంవత్సరాలు పాటు రాజ్యాధికారం చేస్తాడు. అలాగే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆరు సంవత్సరాలు శివాజీ తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. హిందూ సామ్రాజ్యాన్ని ఒక ఆదర్శంగా (మోడల్) తీర్చిదిద్ది పరిపాలించాడు శివాజీ. శివాజీ రాజ్యంలో గోవుల, బ్రాహ్మణుల హత్యలు తగ్గాయి. మతాంతరీకరణలు ఆగాయి, పునరాగమనాలు మొదలయ్యాయి. రోడ్ల విస్తరణ, భవన నిర్మాణాలు, స్వదేశీ, నౌకాదళం, వ్యాపారం, స్త్రీల పట్ల మర్యాద, సమాజంలో సమరసత, న్యాయబద్ధమైనటువంటి పరిపాలన ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా శివాజీ హైందవి స్వరాజ్యాన్ని తీర్చిదిద్దాడు. రామరాజ్యం అంటాం కదా అలా శివాజీ స్వరాజ్యం మొత్తం రామ రాజ్యంలా మారిపోయింది. అందుకే శివాజీ మనందరికీ ఆదర్శం.

అలాగే మనం దేశం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేసిన వారిని గమనిస్తే వారంతా చాలా చిన్న వయసులోనే ఎన్నో అద్బుతాలు సృష్టించారు. ఇప్పటికీ భారతదేశం వారి అడుగుజాడల్లోనే ముందుకెళుతుంది. ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించి 32 ఏళ్ల వయసులోనే పరమపదించారు. రాణా ప్రతాప్ పర్వతాల మధ్య నివసిస్తూ అనేక యుద్ధాలు జేసి 56 ఏళ్ల వయసులోనే పరమపదించారు. శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచి 50 ఏళ్ల వయసులో పరమపదించారు. స్వామివివేకానంద భారతీయులంతా భారతమాతను పూజించాలి అని ప్రవచించి 39 సంవత్సరాల వయసులోనే పరమపదించారు. అలాగే డాక్టర్ జీ కూడా అత్యంత పిన్న వయసులో సంఘాన్ని స్థాపించి 51 సంవత్సరాల వయసులో పరమపదించారు. ఈ మహనీయులంతా చిన్న వయసులోనే అద్బుతాలు చేశారు.

అలాగే ఆదిశంకరులు, వివేకానంద స్వామి, శివాజీలోని స్వాభిమానం, దేశభక్తి, సాహస ప్రవృత్తి లక్షణాలతో పుట్టిన ఆజన్మ దేశభక్తులయినటువంటి డాక్టర్ హెడ్గేవార్ గారు ప్రవచించిన సంఘసిద్దాంతం, శివాజీ అతి చిన్న వయసులో తన స్నేహితులతో కలసి తోరణ దుర్గాన్ని జయించినట్లుగా మరియు 'హిందూ సంఘటన' అనే మహాకార్యాన్ని జాతికి అందించి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించారు. డాక్టర్జీ తీసుకొన్న నిర్ణయం నేడు ప్రపంచంలోనే హిందుత్వాన్ని బలమైన శక్తిగా నిలిపింది. హిందూ సంఘటన తద్వారా భారతదేశ పునర్వెభవ సాధన అనేది డాక్టర్జీ స్వప్పం. అది సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ దిశగా నేడు భారతావని అడుగులు వేస్తోంది. చారిత్రాత్మకమైన ఈ దివ్యదృశ్యాన్ని మన కళ్లతో చూసే అదృష్టం లభించడం, భారతదేశాన్ని తిరిగి విశ్వ గురువుగా దర్శించే భాగ్యం పొందడం ఆనంద దాయకం. ఈ పనిలో మనమంతా భాగస్వాములమవుదాం దేశం కోసం పనిచేద్దాం. -రాజశేఖర్ నన్నపనేని.

 

Hindu Samrajya Divas 2025, Shivaji Maharaj Coronation Day, RSS Hindu Samrajya Divas 2025, Shivaji Maharaj Legacy 2025, హిందూ సామ్రాజ్య దినోత్సవం, శివాజీ జీవిత చరిత్ర

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top