Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఎమర్జెన్సీ చీకటిరోజులకు 47 సంవత్సరాలు - 1975's emergency 'dark chapter' in India's history

                                      ఎమర్జెన్సీ చీకటిరోజులకు 47 సంవత్సరాలు: ప్రజాస్వామ్య విలువల ఔన్నత్యాన్ని గుర్తుచేసే రోజు, 47 సంవత్సరాల...

                                     emergency 47 years

ఎమర్జెన్సీ చీకటిరోజులకు 47 సంవత్సరాలు: ప్రజాస్వామ్య విలువల ఔన్నత్యాన్ని గుర్తుచేసే రోజు, 47 సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగిన ఒక సంఘటన ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను దేశానికి చాటిచెప్పింది. భారత పార్లమెంటరీ చరిత్రలో ఈ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకం ఎవరినీ కించపరచడానికి ఉద్దేశించినది కాదు. కానీ భారతదేశ ప్రజాస్వామ్య బలాన్ని, శక్తినీ గుర్తు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 1975వ సంవత్సరం జూన్ 25వ తేదీ అర్థరాత్రి , జూన్ 26 ఉదయం మధ్య కాలంలో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యం పట్ల మనకున్న నిబద్ధతను బలోపేతం చేయడానికీ, తద్వారా భారతీయ సంస్కృతి, వారసత్వ సంకల్పంతో ఎప్పటికీ సజీవంగా ముందుకు సాగాలని చరిత్రలోని ఈ పేజీ మనకు బోధిస్తుంది.

21 వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహమ్మారి కోవిడ్ ని భారతదేశం ఎంతో సమర్ధవంతంగా  ఎదుర్కొంది. ఈ మహమ్మారి నుండి జీవితాలను రక్షించుకోవడానికి విధించిన లాక్డౌన్ పరిస్థితిని నేటి యువత తమ జీవితాంతం గుర్తుంచుకుంటారు. అయితే భారతదేశ ప్రజాస్వామ్యం కూడా ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన లాక్డౌన్ లో  ఉందని మన యువత గ్రహిస్తారా? ఏది ఏమైనప్పటికీ సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడడం, దేశం ఏదైనా యుద్ధంలో పాల్గొనడం వంటి కారణాలు ఏమీ లేకపోయినా అసలు అలాంటి వాటితో ఎలాంటి సంబంధం లేకుండానే ఈ పరిస్థితి చోటుచేసుకుంది.

సాధారణ ప్రజల కనీసం హక్కులు కూడా నిరాకరించడం జరిగింది. స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశం పూర్తి ఆధునిక ప్రజాస్వామ్య రూపంలో పూర్తి గణతంత్ర రాజ్యంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పాలనపై నియంత్రణ చేపట్టింది. అయితే ఈ సమయంలో భారతదేశం ప్రజాస్వామ్య భవిష్యత్తు, ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అనేక ప్రశ్నలను ఎదుర్కొంది. వివిధ కారణాల వల్ల గత ప్రభుత్వ విధానాలు ఈ సమాధానాన్ని ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభంలో జాతీయతతో సంబంధం ఉన్న అనేక సంస్థలు ఇటువంటి పరిమితులను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత 1951-52లో పార్లమెంటులో మొదటి రాజ్యాంగ సవరణ ప్రతేశపెట్టారు. భావప్రకటన స్వేచ్ఛను పరిమితం చేయాలనే అంశంపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భావప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాత 1975 నుంచి 1977 వరకు దేశంలో అత్యవసర పరిస్థితిని ద్వారా అధికారాన్ని కొంతమంది చేతుల్లో కేంద్రీకరించే ప్రయత్నం జరిగింది.
 
ప్రజాస్వామ్యం పట్ల అవగాహన చాలా అవసరం: సంస్కృతి, వ్యవస్థ రెండూ కలగలిసినదే ప్రజాస్వామ్యం. ఇటువంటి పరిస్థితిలో ఈ విషయంపై నిరంతర అవగాహన కలిగి ఉంచడం చాలా అవసరం. అందుకే ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తుంచుకోవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అందుకే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ఏ భారతీయుడూ 1975 జాన్ 25 రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేదు. దేశాన్ని ఒక రకమైన జైలు గదిగా మార్చినప్పుడు వ్యతిరేక స్వరం వినిపించకుండా నిశ్శబ్దం చేసే ప్రయత్నం జరిగింది. జయప్రకాష్ నారాయణ్ణి సహా పలువురు ప్రముఖ జాతీయ నాయకులు జైలుపాలయ్యారు. న్యాయవ్యవస్థ కూడా భయంకరమైన ఎమర్జెన్సీనీ నివారించలేకపోయింది. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. చాలా మంది పోలీసు అధికారులను వివిధ వార్తాపత్రికల కార్యాలయాల్లో సంపాదకులుగా నియమించారు.

అయితే భారతదేశానికి ఉన్న గొప్ప బలం దాని ప్రజాస్వామ్యం, దాని ప్రజల శక్తి అని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. విమర్శలు వచ్చినప్పుడల్లా ఈ ఉన్నత వర్గానికి చెందిన కొందరు ప్రజలు తమ శక్తియుక్తులు ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ప్రతిపక్షం రాజకీయ వర్గాలకు, లేదా రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాలేదు. అది జైలు గదులకే పరిమితం కాలేదు. కనుమరుగైన ప్రజాస్వామ్యం కోసం వాంచించే ప్రజల గుండెల్లో ఆగ్రహావేశాలు వెళ్లి విరిశాయి.

ఉదాహరణకు మీరు ఎల్లప్పుడూ ఆహారం అందుబాటులో ఉంటే మీరు ఆకలిని గమనించదు. అది మీకు లభించనప్పుడే ఆకలితో ఉన్న వ్యక్తి బాధ మీకు అర్థమవుతుంది. అదే విధంగా ప్రజాస్వామ్యపు హక్కులను మీ నుంచి ఎవరైనా తీసుకున్నప్పుడు రోజువారీ జీవితంలో ప్రభావాన్ని గుర్తించగలుగుతారు. హక్కులు కోల్పోయినప్పుడు కలిగే నష్టపు అనుభూతి చెందుతారు.

ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని ప్రతీ పౌరుడూ తమ నుండి ఏదో తీసుకున్నట్లుగా భావించడం ప్రారంభించాడు. ఏ రకమైన సామాజిక వ్యవస్థను నడపాలన్నా రాజ్యాంగం కూడా అవసరం. నిబంధనలు, చట్టాలు, నియమాలు అన్నీ అవసరం హక్కులు, బాధ్యతపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్యం మన సంస్కృతి మన వారసత్వం. ఆ వారసత్వంతోనే మనం పెరిగాము అని ఏ పౌరుడైనా ఈ దేశంలో గర్వంగా చెప్పగలడు. అదే భారతదేశానికి ఉన్న సౌందర్యం, ఎమర్జెన్సీ సమయంలో అది లేకపోవడాన్ని భారత ప్రజలు చాలా నిశితంగా గమనించారు. పలితంగా 1977 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ స్వలాభం కోసం కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాల్గొన్నారు. ప్రజలు తమ హక్కులు, అవసరాలతో సంబంధం లేకుండా కేవలం ప్రజాస్వామ్యం కోసం మాత్రమే ఓటు వేశారు. సంపన్నుల నుంచి పేదల వరకు అందరూ ఏకతాటిపై ఓటేశారు.

స్వాతంత్య్రపు నూతనోత్తేజం: ఎమర్జెన్సీ వేదనను అనుభవించిన వారు వారి అనుభవాలను ఇప్పుడు వార్తాపత్రికల్లో కథనాలుగా రాయవచ్చు. ట్విట్టర్లో ట్వీట్ చేయవచ్చు. లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు మీకు ఉంది. ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? వాస్తవానికి. ఇప్పుడు దేశ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎమర్జెన్సీ బాధితులే.. మన రాజ్యాంగాన్ని, వ్యవస్థను పునరుద్ధరించడంతో దేశంపై మరోసారి ఎమర్జెన్సీ విధించడం అనేది ఎప్పటికీ జరగదు. ఈ శక్తి ఎమర్జెన్సీ ఆంక్షలు.. మధ్య నిరసన స్వరాల నుండి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో 47 ఏళ్ళ ఈ సంఘటనను గుర్తుచేసుకుని, ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ భారత ప్రజాస్వామ్య రక్షకులను స్మరించుకోవడం అవసరం. తద్వారా తరువాతి తరం వారికి చరిత్రలోని ఆ పుటా, ప్రజాస్వామ్య విలువలు తెలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గత ఎనిమివేళ్ళుగా దేశంలో బలమైన ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రదర్శించింది. అన్నిటికంటే వారికి దేశమే ముఖ్యం అనేది వారి విధానాల్లో, విధేయతలో ప్రతిభింబిస్తుంది.

ఒకవైపు దేశంలో రాష్ట్ర భాగస్వామ్యాన్ని పెంచేందుకు సమాఖ్య నిర్మాణాలు పటిష్టం కాగా, పేద సామాన్య పౌరులకు సంబంధించిన వందలాది పథకాలను దేశాభివృద్ధిలో భాగంగా ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చారు. నేడు అన్ని ప్రజాస్వామ్య యునిట్లు సహకారం, సమన్వయం, సమతుల్యత కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడుతున్నాయి. న్యాయవ్యవస్థ అవసరాలు ఎక్కడ చూసినా పూర్తి స్వాతంత్య్ర్యంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అది పక్కనబెడితే ఇక మీడియా స్వేచ్ఛగా తన పని తాను చేసుకుపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు సామాజిక ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో బాబా సాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం ముందుకు సాగుతోంది. భారతదేశ ప్రజాస్వామ్య మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. భవిష్యత్తులో దేశ ప్రజాస్వామ్య విలువలతో ఆడుకోవడం ద్వారా ఎమర్జెన్సీని ఎవరూ సాహసించలేరు.

రాజ్యాంగ సవరణ వల్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇప్పుడు సాధ్యపడదు: అత్యవవసర పరిస్థితి సమయంలో రాజ్యంగ నిబంధనల్లో అనేక మార్పులు చేశారు. వాటిని తిరిగి మొరార్జీ దేశాయ్ పరిపాలనలో సరిదిద్దారు. 44వ సవరణ సరిదిద్దారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రవేశపెట్టిన 42వ సవరణ ప్రకారం సుప్రీం కోర్టు అధికారాలు తగ్గించి నామమాత్రం చేశారు. ఇతర నిబంధనలు కూడా ప్రజాస్వామ్య విలువలు ఉల్లంఘించి మార్పులు చేసినవే. రాజ్యంగంలోని 20, 21 ఆర్టికల్లో పేర్కొన్న ప్రాథమిక హక్కుల హామీని ఎమర్జెన్సీ సమయంలో కూడా ఉల్లంఘించకూడదని అదే సవరణలో పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని కింద మంత్రివర్గం వ్రాతపూర్వక సిఫార్సు మేరకు రాష్ట్రపతి అత్యవవసర పరిస్థితిని మాత్రమే ప్రకటించగలడు కానీ ఎమర్జెన్సీ కాలాన్ని ఆరు నెలలకు మించి పొడిగించడం సాధ్యంకాదు. ఈ విధంగా మొరార్జీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. 1975లో నెలకొన్న అత్యవసర పరిస్థితి దేశంలో మళ్ళీ ఎప్పుడూ పునరావృతం కాలేదు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments