Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నేటికి మనలో ఆ కౌరవ సంస్కృతి వెల్లి విరుస్తుంది. - megaminds

మనకు వ్యక్తిగత మయిన విషయాలే చాలా ముఖ్యం. దేశం కొరకు అవకాశం ఉంటె ఆలోచిద్దాం. లేదా తప్పు ఎవరి మీదో నెట్టడం యెట్లా అనేదే ఆలోచిస్తాం. ఎవరైనా చ...

మనకు వ్యక్తిగత మయిన విషయాలే చాలా ముఖ్యం. దేశం కొరకు అవకాశం ఉంటె ఆలోచిద్దాం. లేదా తప్పు ఎవరి మీదో నెట్టడం యెట్లా అనేదే ఆలోచిస్తాం. ఎవరైనా చెప్పినా వాడిని ఎంత అమాయకుడు, లేదా పిచ్చి వాడికింద జమ కడతాం. స్వంత విశయాలగూర్చి ఆలోచించడం చాలా అవసర మైన పని.
అనాది గా ఇది హిందూ దేశం. అనేక మంది రాజులు పారిపాలించినా దేశ సంస్కృతి అందరిని కలిపింది.
ఈ ప్రపంచం లో మన సంస్కృతి అనేక ఆటు పోట్లను తట్టుకొని నిలబడింది. గ్రీకు, రోము, ఈజిప్తు సంస్కృతులు లైబ్రరీ కి సుమితం అయినా మన సంస్కృతి సజీవంగా ఉంది. ఇది ఛిర పురాతనం నిత్య నూతనం.
కాళిదాసు ఈ దేశ వైశాల్యం గూర్చి ఓ పోలిక చెప్పాడు. హిమాలయాలు ఈ దేశ విస్తీర్ణాన్ని కొలుస్తున్నట్లుగా తన రెండు చేతులను పెద్దగా మీటర్ బద్ధగా తూర్పు పడమరాల సముద్రం వరకు చాపి ఇంత విశాల దేశమా! అని ఆశ్చర్య పోయాడని వ్రాశాడు.(సంస్కృత శ్లోకం నేను రాయలేదు, చాలా మందికి వస్తుంది).
పశ్చిమాన ఉపగణ స్థానం నేడు ఆఫ్గాం స్థాన్ అయిపోయింది. దుర్యోధనుడి తల్లి గాంధారి ప్రదేశం కాందహార్ ఈ రోజు ఆఫ్గానిస్తాన్ లో ఉంది.
సింధు ప్రాంతం సైందవుడి రాజ్యం, బాలూచిస్తాన్, పశ్చిమ పంజాబ్( సగం పంజాబ్ - పాంచాలి ద్రౌపది ప్రదేశం) ఈ రోజు పైశాశిక రాజ్యం పాకిస్థాన్ అయ్యి, ప్రతీ రోజు మనల్ని ఇబ్బంది పెడుతుంది.దానికి మన దేశం లో సపోర్టర్స్ ఉన్నారు.
కాశ్మీర్ రావణ కాష్టంలా 70 సంవత్సరాలుగా కాలుతూనే ఉంది. హిందువులను బలవంతంగా బయటకు తోసి సైన్యాన్ని ఇబ్బంది పెట్టె పౌరులను మనం ఉపేక్షిస్తున్నాము.
ప్రక్కలో బల్లెంలా సగం వంగ ప్రాంతం (బెంగాల్) బంగ్లాదేశ్ అయ్యి ఇటు కలకత్తా ను, అస్సాం ను వనికిస్తుంది.
చైనా కు మనకు మధ్యలో ఉండే త్రివిష్టపమ్(టిబెట్) ను ఆక్రమించి మన హిమాలయ సానువుల్లో ప్రవేశించి మన తో కయ్యానికి కాలు దువ్వు తోంది.
ఇంతకంటే ఈ రోజు వ్రాయను. రేపు మళ్ళీ మిగతా విషయాలు వ్రాస్తాను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments