Type Here to Get Search Results !

మనకు కౌరవ సంస్కృతి కొనసాగుతుంది. - 5 -megaminds

సింహలం స్వతంత్రమయి తమిళ, సింహాలీల గొడవలు, బ్రహ్మ దేశం బర్మా నేటి మయన్మార్ మనతో సంబంధం తెగిపోయింది. రాజ రాజేంద్ర చోళుడు జయించిన మలేసియా ముస్లిం దేశం అయి పోయింది. శృంగపురం స్వతంత్రమయ్యి సింగపూర్ అయ్యిది. రావణుడి అస్త్రాలయం ఆస్ట్రేలియా అయ్యింది.
అశోకుడు బౌద్ధం వ్యాపింప చేసిన చైనా, మంగోలియా జపాన్ లు ఎవరి గొడవ వారిది. అన్ని దేశాలనూ నడిపించిన భారత దేశం వేయి సంవత్సరాలు బానిసత్వం నెరపే. చివరకు మిగిలిన చిన్న భాగం మూడు ముక్కలయి పోయింది.
పూజనీయ బాలా సాహెబ్ దేవరస్ గారి మాటల్లో ఈ దేశం అమరంగానే ఉంది కాని కుంచించుక పోతున్నది అని వారు బాధగా చెప్పారు. మనకు ఆ బాధ లేదు.
మూడుపూటలు తిండి ఆలోచించుకుంటే మన రోజు గడిచిపోయే.
మనకు మనమే శత్రువులం. కలిసి ఉండలేము. భాష పరంగా కొట్లాడుతాము. ఉన్న దేశం లో ఉత్తర, దక్షిణాల గొడవ. ప్రాంతాలు అంతరాల హేతువులు. కులం కొట్లాటలకు, రిజర్వేషన్లకు, మన్త్రి పదవులకు మనకుండే పురుషార్థమ్. దేశం ఎలా ఉండాలనే దాని మీద లేదు. దేవుళ్ళకు కులాలు అంటగట్టి వారికే ఆదేవుడనే దుర్దశ. వసుధైక కుటుంబం పోయి, చిన్న కుటుంబ వ్యవస్థ కూడా ఛిద్రమయ ిపోయే. ముసలి తల్లే తండ్రి సంపాదించే కొడుక్కి బరువు. ఎవరి గొడవ వారిదే.
మధ్యలో మతాల అంతరాలు పెరిగిపోయి, వివిధత్వం విరోధిత్వం గా మారి ఆ పగలకే జీవితాలు. అభివృద్ధి కంటే అంతరించి వైపుకు మన సంకుచిత మనస్సు, బుద్ధి పరుగులు తీస్తుంది. అయినా మన స్వంతం వదిలెయ్యం. 11 అక్షౌహిణీలు ఉన్నా, అతిరథ మహారథులున్నా మట్టిగరిచిన కౌరవుల అహంకారం మనలో తగ్గడం లేదు. ఐదుగురే ఉన్న కలిసి ఉండే పిడికిలి పాండవులు. వంద పెంట పురుగులు గా నాశనం వైపు కౌరవులు. కథ మన ముందు ఉంది. మనకు నీతి కంటే అవినీతి ముఖ్యం. మంచి యోజనాల కంటే నాశనం చేసే బుర్రలే మేధావులని ప్రచారం.
భగవంతుడి 9 అవతారాలు ఈ భూమిలోని జరిగిన పుణ్యభూమి, ఆకలితో చేతుళ్లు చాచే స్థితి. ఎంత వున్నా సరిపోదు.
కలెక్టర్ల కొడుకులకీ రిజర్వేషన్లు కావాలి. ఫ్రీ గా ఏమొచ్చిన పొందే ఆతురత. వేలకోట్ల కాదు లక్షల కోట్లున్నా స్వార్థ చింతనే. గ్రామం కుటుంబం గా ఉండటం చూసిన మనమే ఆరాచకపు రాజకీయాలతో పెంపు చేసి అభివృద్ధి అనుకుంటున్నాము.
గీత బోధించిన భూమిలో నిరంతరం అవినీతి రాజ్యమేలుతోంది. మనకు మనమెవ్వరమో తెలియదు. మనలో మనకు ఉండే శత్రుత్వం పై నిరంతర చింతన. కలిసి నడిచేది స్మశానానికే అని చెప్పిన స్థితి. ఎంత బాధ వేస్తుందో.?
ఉన్నత మైన లక్ష్యం లేదు. విలువలుండే జీవితాలు లేవు. జీవన విధానం ప్రపంచానికి నేర్పిన జ్ఞాన భూమి, ప్రతిదానికి పశ్చిమాన్ని చూసే ఆత్మవిశ్వాసం లేనిదిగా మారిపోయింది.
అబ్దుల్ కలాం ఆదర్శంగా చూపుతాం. జీవిటం వారిలా గడపలేము. గ్రూప్ లు చేయాలి, గొడవలు పడాలి, కులాలు కంపు కొట్టించాలి. మతాలు మన రాజకీయాలకు మన దేశం కంటే సంస్కృతి కంటే గొప్ప.
మరి దేశం ఎలా మారాలి. ఏమి చేస్తే బాగుపడతాం. సూచించండి. ఆలోచించండి. ఈ దేశం మనది, ఈ జాతీయత మనది, ఈ జీవన సంస్కృతి మనది. ముగింపు రేపు రాస్తాను.
బాధతో వ్రాసాను. అన్యాదా భావించ వద్దు. నేను ఇలా వ్రాయడం నాకిష్టం ఉండదు. కాని చరిత్ర ఆలోకన నన్ను నెమ్మదిగా వ్రాయనివ్వదు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.