Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కర్ణుడు - వ్యక్తి గత నియమాలు - megaminds

ఈ విషయం నేను పూర్తి చేస్తాను. రేపు శ్రీ సోమయ్య గారి పాండవుల విషయం వ్రాస్తాను. ప్రతీ మనిషికి వ్యక్తిగత మైన నియమాలున్నా సామూహిక నియమాలకు, లక...

ఈ విషయం నేను పూర్తి చేస్తాను. రేపు శ్రీ సోమయ్య గారి పాండవుల విషయం వ్రాస్తాను. ప్రతీ మనిషికి వ్యక్తిగత మైన నియమాలున్నా సామూహిక నియమాలకు, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
దుర్యోధనుడి సైన్యం లో కర్ణుడి పై ఉన్న నమ్మకం ఎవరి మీదా లేదతనికి. అంత నమ్మకం పెట్టుకున్న దుర్యోధనుని కి తనకు బ్రహ్మాస్త్రం వరకు తెలుసునని చెప్పాడు కాని గురువు పరశురాముని శాపం ఉంది అనే సంగతి చెప్పలేదు. రథం కుంగిపోతుందనే శాపం భూదేవి శాపం సంగతి చెప్పలేదు. తన గోవు లాగే నిరాశ్రయుడి లా చనిపోతావని విప్రుడి శాపం ఉందని చెప్పలేదు.
అంతకు ముందు కూడా దుర్యోధనుడి అవసరం అయిన సమయాల్లో కర్ణుడు ఉంది కూడా రక్షించ లేక పోయాడు. అరణ్య పర్వం లో గంధర్వులు దాడి లో కర్ణుడు వెంట ఉన్నాడు. పాండవులే రక్షించాల్సి వచ్చింది. ఉత్తర గోగ్రహణం లో అర్జునుడు గోవులను తిరుగతోలుకు పోయినప్పుడు కూడా ఒంటరి అర్జునుడి నిలివరించ లేక పోయాడు. అయినా కురుక్షేత్ర సంగ్రామం గెలుస్థాననే నమ్మకానికి కారణం కర్ణుడు తన వెంట
ఉన్నాడనే నమ్మకమే, దుర్యోధనుని కి.
అటు వంటి స్నేహితుడికి అండగా ఉండే తను తన కన్నతల్లి కుంతి అడిగితే అర్జునుని తప్ప మిగతా నలుగురిని అవకాశం వచ్చినా చంపనని మాట ఇచ్చి, నిలబెట్టుకొని, దుర్యోధనుని కి ఓటమికి చేరువ చేసాడు.
ఇంద్రుడు కర్ణుని సహజ కవచ కుండలాలు తను దాన కర్ణుడని పించు కోవాలనే వ్యక్తిగత కోరిక సామూహిక విజయాన్ని ప్రక్కన పెట్టి మరోసారి ఆలోచించుకోకుండా ఇచ్చేసాడు. ఇది అతని వ్యక్తిగత గొప్పతనాన్ని పెంచింది. కాని, దుర్యోధనుని గెలుపుకు ఆటంకం అవుతుందనే ఆలోచించలేదు.
ఇన్ని సార్లు దుర్యోధనుని విజయానికి తూట్లు పొడిచిన కర్ణుడు 18 రోజుల 18 అక్షౌహిణీలు సైన్యం పాల్గొన్న యుద్ధం లో భీష్ముడు అవమాన పరిచాడని 10 రోజులు యుద్ధం లోకి కాలు పెట్టలేదు. సైన్యం మూడొంతులు పోయాక, భీష్ముడు పడిపోయిన తరువాతే వచ్చాడు.
దుర్యోధనుని గెలుపు కంటే అతని వ్యక్తిగతమైన అహంకారం కోసం నిలబడి సామూహిక లక్ష్యాన్ని మూలకు తోసేసాడు.
షేర్ చేయండి. చర్చించండి. నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments