Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వ్యక్తిగత నియమాలు- సామూహిక లక్ష్యాలు. (భారత యుద్ధం ఆధారంగా) - megaminds

మాననీయ సోమయ్యగారి ఉపన్యాసాలు చాలానే విన్నాను. వారు దేశభక్తునికి కావలసిన లక్షణాలు చెప్పారు. సంఘటనా శాస్త్రం వివరించారు. బహుజన సమాజం గూర్చి ...

మాననీయ సోమయ్యగారి ఉపన్యాసాలు చాలానే విన్నాను. వారు దేశభక్తునికి కావలసిన లక్షణాలు చెప్పారు. సంఘటనా శాస్త్రం వివరించారు. బహుజన సమాజం గూర్చి చెప్పారు. సామాజిక సమరసత చెప్పారు. చాలా ఉదాహరణలు , ఉద్రేకం పెంచే భాషా ఉండేది కాదు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేవారు. పనిలో మెళకువలు చెప్పేవారు. అలాంటి సోమయ్య గారు భీమ వరం శిక్షా వర్గ లో భారతం ఉదా హరణగా వ్యక్తిగత నియమాలు,లక్ష్యాలు, సామూహిక లక్ష్యాలు మాట్లాడారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచుతాను.
భారత యుద్ధమే వేదిక. భీష్ముడు కౌరవుల సైిన్యాధ్యక్షులు. దుష్ట ద్యుమ్నుడు పాండవుల సేనాని. ఇద్దరికీ హస్తి మసికాంతరం. సైన్యం కూడా కౌరవులది 11 అక్షౌహినిలు, పాండవులవి 7 అక్షౌహినిలు. అర్జునిడితో సరిపోయే విలుకాళ్ళు ఆ సమూహంలోభీష్ముడు,ద్రోణుడు,అశ్వత్తామా, కర్ణుడు ఇంతమంది. మరి పాండవులే గెల్చారు. కారణాలు ఏమైనా చెప్పవచ్చు. అందులో ఒక కారణం కౌరవులు వ్యక్తిగత నియమాలకు, లక్ష్యాలకు ఇచ్చిన ప్రాధాన్యత సామూహిక లక్ష్యాలకు ఇవ్వాలేదు. పాండవులు వ్యక్తి గత నియమాలను సామూహిక లక్ష్యం కొరకు సర్దు కున్నారు.
వివరంగా చూద్దాము. భీష్ముడు మొదటి సేనాని. కర్ణుడిని అర్థ రథుడు అన్నాడు. కనుడు భ్హీష్ముడు చని పోయేదాక యుద్ధం లోకి రాలేదు. అంటే 18 రోజుల యుద్ధం లో 10 రోజులు bycot చేసాడు. దుర్యోధనుని గెలుపు కంటే తన అహంకారాన్ని దెబ్బగొట్టాడనే వాదన ముఖ్యం అయ్యింది. దుర్యోధనుని గెలుపు ముఖ్యమా లేక తన అహంకారం ముఖ్యమా అంటే రెండవ దానికే విలువ నిచ్చాడు.
భీష్ముడు శిఖండి ముందుంటే యుద్ధం చేయనని ప్రతిజ్ఞ. అందువళ్ళే అతను నేలకొరిగాడు. యుద్ధం లో కౌరవులు గెలవడం కంటే తన నియమ పాలన ముఖ్యం. సామూహిక విజయం పై దృష్టి లేదు. పైగా ఆ విషయం తనే పాండవులకు చెప్పాడు.
ద్రోణాచార్యుడి పుత్ర వాత్సల్యం ముందు సామూహిక విజయం పై ద్రుష్టి లేదు. పుత్రుడు మరణించాడని విషయం ధర్మరాజు నోటిలో వినగానే దనుభానాలు వదిలి కూలబడిపోయాడు. అందుకే అతడూ మరణించాడు. దుష్టద్యుమ్నుడి కరవాలానికి తల తెగింది. కౌరవులు యుద్ధంలో నాశనం కావడానికి కారణం అయ్యాడు.
దుర్యోధనుడు కూడా భీష్మచార్యుడు చనిపోయాకే కర్ణుడు వస్తానంటే ఒప్పుకున్నాడు. అంటే భీష్ముడు చావు తనూ కోరుకున్నాడు. అప్పుడే కదా కర్ణుడు యుద్ధం లో పాండవులను నిర్జించగలిగేది.
కాబట్టి వారి వ్యక్తిగత అహంకారాలే సామూహిక విజయం కంటే గొప్ప అని కౌరవుల్లో నాయకులు ప్రవర్తించారు. ఓడిపోయారు. లక్ష్యం పై దృష్టి లేని కారణం అని చెప్పుకోవచ్చు.
మరి అటువైపు సైన్యం విషయాలు రేపు పెడతాను. చర్చించండి. షేర్ చేయండి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments