Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జౌహర్ అంటే ఏమిటి? మనదేశంలో ఎప్పుడు ప్రారంభం అయ్యింది? What is the story of Jauhar?

భారత దేశంలో పూర్వం మన రాజుల మధ్యన యుద్ధాలు జరిగినప్పుడు రాజుల భార్యలను, పిల్లలను అలాగే రాజ్యంలోని మహిళలను ఇబ్బందులకు గురిచేసేవార...


భారత దేశంలో పూర్వం మన రాజుల మధ్యన యుద్ధాలు జరిగినప్పుడు రాజుల భార్యలను, పిల్లలను అలాగే రాజ్యంలోని మహిళలను ఇబ్బందులకు గురిచేసేవారు కాదు, అలాగే శారీరకంగా అనుభవించేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఇతర దేశస్తులు మనపై దండయాత్రలు చేసి మన రాజులను ఓడించడంతో పాటు రాజ్యంలోని మహిళలని, పిల్లల్ని ఎత్తుకెళ్ళి బానిసలుగా చేసుకునేవారు లేదా వేలంలో అమ్ముకునే వారు. ఇలా బానిసలుగా బ్రతకడం ఇష్టంలేక అలాగే ఈ దుర్మార్గుల చేతిలో నలిగిపోవడం కన్నా చనిపోవడం ఉత్తమంగా భావించారు మన స్త్రీలు. అదే కొంతకాలానికి జౌహర్ గా మారింది.

ఇలాంటి సందర్భాన్ని మీకు అక్బర్ కాలంలో జరిగిన ఉదంతాన్ని వివరిస్తాను...  

మొగల్ సైన్యాలు చిత్తోడ్ దుర్గాన్ని అశేష సైనికబలంతో ముట్టడించగా యుద్ధ రంగానికి సమీపంలో అక్బరుకూ మాన్ సింగ్ కూ నడుమ జరుగుచున్న సంభాషణ యిది!

“ఇప్పుడు జరుగబోయేది తుది సమరం. రసపుత్రవీరులంతా కఫన్లు తలలకు కట్టుకుని యుద్ధభూమిలోకి దూకుతారు”

"కఫన్ అంటే?”

“ఎర్రటి జేబురుమాలు! దాన్ని సాధారణంగా శవాలపై కప్పుతారు. యుద్ధభూమిలో వీరస్వర్గం పొందడమే వారి లక్ష్యం! ఇక వారి స్త్రీలు మన చేతికి చిక్కకుండా గంధపుచెక్కలు కుప్పగావేసి మండించి ఆ చితిలో సామూహికంగా దూకి ఆత్మార్పణ చేసుకుంటారు. ఇప్పుడదే జరుగుతోంది!”

చిత్తోడుర్గంలో మంగళవాయిద్యాలు వినబడ్డాయి.

“ఏమిటవి?” అడిగాడు అక్బర్.

“జోహారు ప్రారంభమైంది! సంగీతవాయిద్యాల ధ్వనుల మధ్య పవిత్ర మంత్రోచ్చాటన నడుమ పెండ్లికి పోయినట్లుగా రసపుత్రాంగనలు తమ మాన సంరక్షణార్థం అగ్నికీలకు ఆహుతి అవుతున్నారు!”

"మూర్ఖులు!" అక్బర్ హిందూ స్త్రీల శీలసంరక్షణ విధానాన్ని అపహాస్యం గావించాడు.

ప్రక్కనే ఉన్న భగవాన్ దాస్ కు మనస్సులో బాధవేసింది.

"హుజూర్! కఫన్లు కట్టుకొచ్చిన రసపుత్రవీరుడు సాక్షాత్తు ప్రళయకాల రుద్రుడే అవుతాడు. మీరు యుద్ధభూమికి కొంతదూరంలో ఉండడం మంచిది.” అంటాడు... మాన్ సింగ్.

జౌహర్ అయ్యే స్త్రీలు తమ భర్తలు యుద్ధంలో వీరమరణం పొంది, స్వర్గానికి వెళతారని నమ్మీ తామూ అగ్నికీలల్లో దూకి పరదేశీయులకి దొరకకుండా ముందుగా ఆత్మబలిదానానికి సిద్ధపడేదే జౌహర్. ఈ ముస్లిం మూకలు మనదేశంపై దండయాత్రలు చేస్తూ, మనల్ని పాలించడం మొదలయ్యక లక్షలాది హిందుమహిళలు బలిదానమయ్యారు. అది మరీ పెరిగి ఉద్రుతమయిన తరువాత సతీసహగమనం గా కూడా మారింది.

రాణీ పద్మావతి కూడా 75 వేలమంది మహిళలతో జౌహర్ చేసింది. ఈ జౌహర్ భారత్ లో 1000 ఏళ్ళ పైబడి సాగింది. లక్షలాది మంది మహిళలు అగ్నికీలలకి ఆహుతయ్యారు. అలాగే ఈ బ్రిటీషర్స్ కాలంలో కూడా సాగింది. కొన్ని చోట్ల అగ్నికే ఆహుతి కాకుండా బావుల్లో దూకి జల జౌహర్ లు కూడా అయ్యారు మన తల్లులు. అవి ప్రత్యేకంగా భారతదేశం స్వాతంత్ర్యం పొందే సమయంలో అధికంగా జరిగాయి.

1946లో, ముస్లింలు జిన్నాకు అనుకూలంగా ఓటు వేశారు మరియు భారతదేశ విభజన జరిగింది. విభజనను అమలు చేసి హిందువులను నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ముందే రూపొందించిన పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. హిందూ-సిక్కు మహిళలను ఎత్తుకెళ్లే వ్యవస్థీకృత అత్యాచార ముఠాలు పంజాబ్ & బెంగాల్ అంతటా జరిగాయి. భారతదేశాన్ని విభజించే ప్రణాళిక జూన్ 3, 1947న ప్రకటించబడింది. వెంటనే, దాదాపు కోటి మంది ప్రజలు ఇరువైపులా వెళ్లడం ప్రారంభించడంతో ప్రజల మార్పిడి జరిగింది. గ్రామాలు విడిచిపెట్టబడ్డాయి, పంటలు కుళ్ళిపోయాయి మరియు కొత్త సరిహద్దుల ద్వారా కుటుంబాలు వేరు చేయబడ్డాయి.

ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల వారిని వధించి, అత్యాచారం చేయడం వల్ల మారణహోమం జరిగింది. వేలాది మంది మహిళలు బహిరంగంగా అత్యాచారానికి గురై అవమానానికి గురయ్యారు. ముస్లింలు హిందూ మహిళల రొమ్ములపై వారి ముస్లిం మత చిహ్నాలని పచ్చబొట్టులుగా వేశారు. బలవంతపు మత మార్పిడులను నివారించడానికి, చాలా మంది మహిళలు వారి కుటుంబాలు తమను తాము కాల్చుకుని లేదా బావులు మరియు నదులలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు, తద్వారా జల జౌహర్‌కు పాల్పడ్డారు. ఒక కుటుంబం లేదా ఇరుగుపొరుగు ఒక సమూహంగా బావుల్లోకి దూకి లేదా తమను తాము నిప్పంటించుకుని బలిదానమయ్యారు.

పట్టుకోవడం, అత్యాచారం, అపహరణ మరియు బలవంతపు మార్పిడి ఇదీ ముస్లిం ల వికృత క్రీడ. బుటాలియా అనే ఓ సిక్కు సోదరి ఈ దుర్మార్గలని చూడలేక తనూ చచ్చిపోదామని భావించి ఒక భావిలో దూకింది, అయితే అప్పటికే బావిలో చాలా మృతదేహాలు ఉన్నాయి, ఆమె మునిగిపోలేదు. ఆ శవాలను చూసిన బుటాలియా ఒక్కసారిగా పెద్ద కేక పెట్టి అరవసాగింది ఎన్నో రోజులపాటు ఆ బావిలో కుళ్ళిన శవాల మధ్య జీవశ్చవంలా బ్రతికింది ఒకరోజు ఓ గ్రామస్తుడు అది చూసి ఆమెను బయటకు తీశాడు. 1947 మార్చి 10న బేవాల్ గ్రామంలో (రావల్పిండి జిల్లాలో) చాలా మంది మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారు. వారు తమ పరుపులను, మంచాలను కుప్పలో వేసి నిప్పంటించారు. అది మరియు దానిపై దూకారు. 1947 మార్చి 15న, పాకిస్తాన్‌లోని రావల్పిండిలో 90 మందికి పైగా సిక్కు మహిళలు ఒకే బావిలో దూకారు, ఆ ప్రాంతంలోని హిందువులు ముస్లిం ల దాడికి గురయ్యారు. ఈ సంఘటన ఏప్రిల్ 15, 1947 ఆంగ్ల వార్తాపత్రిక ది స్టేట్స్‌మన్ ఎడిషన్‌లో కూడా నివేదించబడింది.

అలాగే ఆగష్టు 26, 1947న దాడికి గురైన శిబిరంలో ఉన్న ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, తన కుమార్తెను ఒక వ్యక్తి మూడుసార్లు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని, అయితే ఆమె స్పృహ కోల్పోయినప్పటికీ ప్రాణాలతో బయటపడింది. చాలా మంది మహిళలు తమ మెడ చుట్టూ విషపు సైనెడ్ లు వేసుకున్నారు, తద్వారా ముస్లిం లు పొరపాటున మన దగ్గరకు వస్తున్నారు అని తెలిస్తే చాలు ఆత్మహత్య చేసుకునేవారు.

స్వాతంత్ర్యం సిద్ధించే సమయంలో మహిళలు అత్యాచారం, వికృతీకరణ మరియు హింసలకు గురయ్యారు. అదే విధంగా మన ఆడపడుచుల మీద నేడు లవ్ జీహాద్ చేస్తున్నారు.  కాబట్టి మనమంతా జాగరూకతతో ఉండి మన  ఆడపడుచుల్ని కాపాడుకునే బాధ్యత మనదే.. జై హింద్. - రాజశేఖర్ నన్నపనేని.

No comments