Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

7 రకాల ప్రచారాల భరతం పట్టండి - How The Communist-Anti National Propaganda Machines Work An Analysis

ఎన్నో ఏళ్ళగా వ్యవస్థీకృతంగా భారత దేశాన్ని అభివృద్ది చెందకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత పదేళ్ళలో అభివృద్ది వైపు దేశం పరు...


ఎన్నో ఏళ్ళగా వ్యవస్థీకృతంగా భారత దేశాన్ని అభివృద్ది చెందకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత పదేళ్ళలో అభివృద్ది వైపు దేశం పరుగులుపెడుతుంటే మరీ అవినీతి, విజాతీయ, కమ్యునిష్ట్, జిహాదీ శక్తులు ఏకమవుతున్నాయి. ఈ సమయంలో ఎన్నో రకాలుగా ప్రజల్లో ప్రభుత్వంపై అలాగే దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మరింతగా  దుష్ప్రచారం జరుగుతుంది. పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఒక్కడే కానీ నేడు ఎన్నో రూపాలు ధరించి సమాజంపై విషంచిమ్ముతున్నారు, వీటిని మనం గుర్తించాలి, దేశప్రజలంతా కలసి తిపికొట్టాలి. ఏ ఏ విధాలుగా దేశం ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారో వారి సాధనాలు ఏంటో చూద్దాం...

ప్రత్యర్థుల శ్రేణుల మదిలో సందేహాలను నింపడం: హిందుత్వ ను బహిరంగంగా సమర్థిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కనుక ఈ పార్టీ మరియు నాయకత్వం పై ప్రజల్లో, అలాగే బి.జె.పి కార్యకర్తల్లో కూడా అనుమానం రేకెత్తించేలా మాట్లాడటం. ఉదాహరణకు గో హత్యను నిషేదించాలని అంటారు, కానీ గోవధ శాలలు  నిర్వహించేవారు బి.జె.పి వారే అనే ప్రచారం. అలాగే హిందుత్వం పట్ల బి.జె.పి కి నిబద్ధత లేదు అంటూ హిందువుల్లో అసహనం కలిగే విధంగా ప్రచారం చేయడం. మీరు ఇలాంటివి చాలా చూడవచ్చు. కానీ హిందువుల మైన మనం ఈ విషయాన్ని గుర్తించాలి ఒకప్పుడు పాశ్చాత్య దేశాల నుండి ఎవరైనా వస్తే సమాధులు చూయించేవారు కానీ నేడు గంగా, నర్మదా హారతులు, మహకాలేశ్వర్ దర్శనం ఇలా మనం చూడొచ్చు.

తేన పూసిన కత్తివలే, మెత్తగా మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేయడం: ఇందిరా గాంధీ హయాంలో కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్‌లు ముఖ్యంగా భారతీయ ఆయుధ పరిశ్రమ అభివృద్ధి చెందనివ్వలేదు. కానీ రష్యా మనకు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా భారతదేశానికి గొప్ప స్నేహితుడిగా ప్రచారం చేశారు, ఇందిరా గాంధీ సమయంలో రష్యా 85% మనకు ఆయుధాలు సరఫరా చేసింది. అప్పుడు అద్బుతమైన పరిపాలన అంటూ వెనుకేసుకొచ్చిన వారు నేడు స్వదేశంలో తయారయ్యే ఆయుధాలపై నమ్మకం లేదంటున్నారు. 39వ మరియు 42వ రాజ్యాంగ సవరణలను ఆమోదించి ప్రతిపక్షాలను జైల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వారు గాంధీలు. భారత ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలేవీ బీజేపీ లేదా మోదీ తీసుకోలేదు. అయితే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయోధ్య రామమందిరం గుడి విషయంలో అసలు ఎండకు ఎండి వానకు తడిసిన నాడు రాముడు లేడు అంటూ కేసులేసినవారు. గుడి కట్టిన తరువాత వర్షం నీరు వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గుడి గోపురం పూర్తి కాకపోయే సరికి వచ్చిన నీటిని ఇలా అబద్దపు ప్రచారంతో ప్రజల్ని హిందువుల్ని పక్కదోవ పట్టిస్తున్నారు.

మీడియా సంస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారు: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ పత్రికా స్వేచ్ఛను తన చేతుల్లోకి తీసుకుంది అప్పటి నుండి ఇప్పటి వరకు మీడియా మొత్తం ఈ శక్తుల చేతుల్లోనే వుంది. మళ్ళీ వీరే ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేస్తుందంటూ గొంతు చించుకుని ప్రజల్ని పత్రికల్నీ రెచ్చగొడుతుంది. ఈ కమ్యునిష్ట్ లకి అసలు రష్యా, చైనా, వియాత్నాం లలో పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడరు. వందలాది మంది జర్నలిస్ట్ లను హత్యలకు గురించేశాయి ఈ దేశాలు.

వినోద సంస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారు: బాలీవుడ్‌లో మొదటి నుంచి కొన్ని జిహాదీ శక్తులు ఉన్నాయి. కానీ ఎమర్జెన్సీ అనంతర బాలీవుడ్ కఠినమైన జిహాదీ-వామపక్ష భావజాలాన్ని సమర్థిస్తూ పూర్తిగా జిహాదీగా మారింది. ఇది కేవలం జిహాదీ అండర్ వరల్డ్‌ ద్వారా మరెవరూ బాలీవుడ్‌లో అడుగు పెట్టలేరని భావించి ఉండవచ్చు. కానీ నేడు టాలీవుడ్ హీరోలు బాలివుడ్, హాలీవుడ్ స్థాయికి చేరేసరికి జీర్ణించుకో లేకపోతున్నారు.

భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి "మేధో వర్గం" అని పిలవబడే వర్గాన్నితయారు చేశారు: మేధావులు చాలా మంది ఉన్నారు, ప్రతి సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని, వారికి అర్థమయ్యే చక్కని భాషలో సమాచారాన్ని వారి మెదళ్ళకి ఎక్కిస్తారు. ధృవ రాతి ఒక గొప్ప ఉదాహరణ. ఇక మనవాళ్ళల్లో నాగేశ్వర్, తెలికపల్లి రవి, తులసి చందు ఇలాంటి వారు బోలెడు మంది.

విద్యా సంస్థలని లక్ష్యంగా చేసుకుని పనిచేయడం: దేశంలో అనేక విద్యాసంస్థల్లో ఈ శక్తులు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ, డిల్లీ యునివర్సిటీ, జె.ఎన్.యు లు వేదికగా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వివిధ అంశాలపై మాట్లాడుతూ దేశమో అసహనం పెరిగిపోతుంది అంటూ వాపోతారు. ఉదాహరణ కు రోహిత్ వేముల విషయం అతని మానసిక స్థితి సరిగా లేక చేసుకున్న ఆత్మహత్యని హత్య గా చిత్రీకరించి శవాలపై పేలాలు ఏలుకున్నారు. ఎస్ సి విధ్యార్థి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఈమద్యనే అతను ఎస్సి కాదంటూ కోర్ట్ తీర్పిచ్చింది మరి ఈ విషయం ఎక్కడా పెద్ద నామ మాత్రపు ప్రచారం కూడా లేదు. అలాగే డిల్లీ విశ్వ విద్యాలయ్యాల్లో వింత పోకడలు మనం చూస్తూనే ఉన్నాం.

మంచి ని పంచే వెబ్ సైట్ లు, వార్తా పత్రికలు, యు టుబ్ చానళ్ళ పై రిపోర్ట్ లు కొట్టించడం: ఈ మద్యనే స్ట్రింగ్ వినోద్ చానల్, అలాగే మన మెగామైండ్స్ యుటుబ్ చానల్ పై తప్పుడు ఆరోపణలతో యుట్యుబ్ నుండి చానళ్ళ ను రిమూవ్ చేయించారు. ఇంకా ఇలాంటుఇ ఎన్నో చానళ్ళు ఉన్నాయ్. అలాగే పత్రికలను కూడా యాడ్ లు రాకుండా చేయడం. ఆన్ లైన్ వెబ్ సైట్ లకి నెగటివిటి నీ పెంచడం, సామాజిక మాధ్యమాల పేజీలకి రిపోర్ట్ లు కొట్టి రీచ్ తగ్గించడం చేస్తున్నారు.

ఇలా ఎన్నో రకాలుగా ప్రజలపై, ప్రభుత్వాలపై, కార్యకర్తలపై ఈ కమ్యునిష్ట్ , జీహాదీ గ్యాంగ్ లు చేయని ప్రయత్నం లేదు. మనం ముందే అనుకున్నాం ఆ కాలంలో రక్తబీజుల్డు ఒక్కడే నేడు ఎన్నో రకాలుగా పుట్టుకొస్తున్నారు. మీకందరికీ అవగాహన కోసం ఈ బిందువులు వ్రాయడం జరిగింది. అలాగే ఎవరైనా సడన్ గా హైలెట్ అవుతుంటే వారిని గమనించండి అలాంటి వారిని మీ ద్వారా హైలెట్ కాకుండా చూసుకోండి మనం మంచిని మాత్రమే శేర్ చేద్దాం అలాగే, మన గురించి నెగటివ్ గా వచ్చిన వార్తలు మీరు వేరొకరికి పంపకండి, దానిని అక్కడే సమాధి చేయండి పాజిటివ్ వార్తలను మాత్రమే చదవండి, ఫార్వార్డ్ చేయండి. జై హింద్. -రాజశేఖర్ నన్నపనేని.

No comments