మనం వోటు ఎలా వేయాలి? ఎవరికి వేయాలి? how to vote in general election 2019

2
శాసనసభ కు,లోక్ సభకు ప్రతినిధుల ఎన్నుకునే నిమిత్తమై రాబోయే ఐదు సంవత్సరాల వరకూ రాష్ట్ర పరిపాలనాదికారాన్ని వారికి అప్పగించేందుకు గాను ప్రజలు త్వరలోనే ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. ఆయన ప్రతినిధులు స్వభావాలను బట్టి ప్రజలకి ఎంతగానో, మేలును గానీ, కీడును గానీ చేయడానికి ఐదు సంవత్సరాల గడువు చాలా ఎక్కువే కాగలదు. నియోజకవర్గం లోని ప్రజలకు సమాదానం చెప్పలేకపోయినా, ఎన్నికల సమయంలో ప్రజలపై ఉదారంగా కురిపించిన వాగ్దాలను నిలుపుకోలేకపోయినా, ప్రతినిధులను వెనుకకు పిలిపించే సదుపాయం మన రాజ్యాంగం లో లేదు. అట్టి వైఫల్యం గాని, ప్రజాభిలాషలను వమ్ము చేయడంగాని అరుదుగాదు. అట్టి లోపాలున్నప్పటికీ తమచే ఎన్నోకోబడిన ప్రతినిధుల యొక్క అభిప్రాయాలతోనూ చేష్టలతోనూ తాము ఆమోదం చేయనప్పటికీ అట్టి వారిని మరల వెనుకకు పిలిపించే యంత్రాంగం నియొజకవర్గపు ఓటర్ల కు లేదు.

వెనుకకు పిలిపించే అవకాశం లేనందుకు ఫలితం

ఒక్కసారి ఎన్నికైతే తమయొక్క సుఖప్రదమైన ఈనాడు లాభసాటిగా కూడా ఉండే పదవులలో పూర్తి ఐదేళ్ళపాటు భద్రంగా ఉండవచ్చుననే విషయం తెలుసుకున్న తర్వాత, అభ్యర్థులందరూ అతనిని నిలబెట్టే రాజకీయ పక్షాలు తప్పనిసరిగా అపరిమితమైన వాగ్దానాలు చేస్తారు. తమనే ఎన్నుకుని స్వర్గాన్ని భూమికి దించేందుకు తమకు అవకాశం ఇచ్చినట్లయితే, కొద్దిపాటి చదువులు కలిగిన వారు తెలిసీ తెలియని ఓటర్లను తమ మాటల గారడీతో స్వర్గాన్నే సృష్టిస్తారు. ప్రేమలోనూ యుద్ధం లోనూ ఏ పనైనా చెల్లుతుందంటారు కదా. కాబట్టి ఎన్నికలంటే ఇతర పక్షాలన్నిటితోనూ, ఇతర అభ్యర్థులతోనూ చేయబడే యుద్ధం లాంటిది. ఎన్నికల ప్రచార సమయంలో చేసే వాగ్దానాలను తీర్చడం జరుగదు‌ వాటిని గాలికొదిలేయడమే అలవాటుగా మారింది ప్రస్తుతం. ఇందులో ఏదో అవినీతి, తప్పు ఉన్నట్లుగా కూడా ఎవరూ భావించడం లేదు. అందుకే రాజకీయ నాయకులు ఒకరికొకరు మాటల గారడీతో మనల్ని బురిడీ కొట్టించడము చాలా చూశాము. మనం ఇలా జరగడం ఎన్నో ఎన్నికలలో చూశాము.. ఒక్కోసారి ఇచ్చిన హామీలను మార్చి కూడా కొంతమంది కొంతమేరకు చేయలనుకుంటారు కాని అది అందరిని తృప్తి పరచకపోవచ్చు ఎందుకంటే బిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి అలాంటి సమయంలో.
అందుచేతనే ఓటరు యొక్క బాధ్యత చాలా పెద్దది. ఎందుకంటే ఐదు సుధీర్గ సంవత్సరాలపాటు దేశ రాష్ట్ర భవిష్యత్తు ను తీర్చిదిద్దే బాధ్యత అతని చేతుల్లో ఉందిమరి. ఒకసారి ఏదో ఒక పక్షానికి తన ఓటు వేశాడా, ఇంక తన పొరబాటునుగాని, నిర్ణయాన్ని గాని తద్వారా తనకు కలుగబోయే ఏ విధమైన హానినైనాగానీ, నివారించేందుకు అతనికి అవకాశం లేదు. కాబట్టి ఓటరు గట్టిగా తన ఇంగితజ్ఞానాన్నంతా, అతిముఖ్యమైన ఈ అవసర గడియలో వినియోగించి సరియైన ఎన్నిక చేయాలి.
సగం సగం నిజాలు రెండు
ఒక రెండు విషయాలు పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేసుకుందాము. మన పూర్వ ప్రదాని నెహ్రూ జీ ఓసారి ఓటర్లను ఉద్దేశించి ఇలా అన్నారు పోటీ చేసే అభ్యర్థులను పట్టించుకోకుండా పార్టీ లను చూసి ఓట్లేయాలి అని ఓ ఎలక్షన్ ప్రచారంలో అన్నారు. అలాగే చక్రవర్తి రాజగోపాలాచారి జీ కూడ ఓ సందర్భంలో ఓటర్లకు ఇలా సూచించారు పార్టీ లతో సంబంధం లేకుండా అభ్యర్థి మంచివాడు అర్హుడు అయితే చాలు మీరు ఎన్నుకోండి అన్నారు అవును వీరు చెప్పింది నిజమే. ఏమంటే శాసనసభ లోనూ బయట కూడా ప్రభుత్వ వ్యవహార నిర్వహణ సమయంలో, ప్రజాప్రతినిధి యొక్క సౌశీల్యమే అత్యంత ముఖ్యమైంది. అయితే ఈ రెండు అభిప్రాయాలు పాక్షికంగా సరైనవే, ఎందుకంటే మంచి శీలము సమాజ కార్యంపట్ల సంపూర్ణమైన నిస్వార్థ భక్తిభావము లేనట్టి రాజకీయ పార్టీ పక్షవాతానికి లోనైన చెయ్యిగల శరీరం లాంటిది. అది‌నిరుపయోగమ్ మాత్రమే కాదు. అది చెప్పుకునే గొప్పలూ, ఇచ్చకాలు, వాగ్దానాల వలన ప్రమాదకారి కూడా అవుతుంది. అలాగే వ్యక్తిగతమైన మంచి గుణము గల అభ్యర్థులు, సమాన లక్ష్యం , సమాన కార్యక్రమం, సమాన అనుభందాలు లేకుండా, ఒకరితో ఒకరు పోటీ పడుతూ, తత్పలితంగా సుసంఘటితమైన ఏకత్వం గల రాజకీయ పార్టీ గా కట్టుబడని కారణం చేత, వారంతా వివిధ యంత్రాల విడిభాగాలు దేనికదే చక్కగా ఉంటూనే సమీకృత కార్యాచరణ కు నిరుపయోగములైనట్టుగాన, ఏమీ సాదించలేరు. అందుచేత ఈ రెండు అభిప్రాయాలను జోడించుకొని, జాతీయ కార్యము పట్ల శ్రద్ధా సౌశీల్యాలుగలిగి స్వార్దము కోసం ప్రయత్నం చేయాని, సామర్థ్యం కలిగిన , కలిసి పనిచేయగలిగిన పొందికైన జాతీయ భావాలు గల అభ్యర్థులున్న రాజకీయ పార్టీ ని ఓటర్లు ఎన్నుకోవాలి. ఈ విషయాన్ని ఓటరు గ్రహించకుండా బందు ప్రీతి, కులం, వర్గం, ప్రాంతం ఇలా ఓట్లేస్తే తర్వాత పశ్చాత్తాపం చెందాల్సిఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అయితే అప్పుడు మరి ఓటరు ఏమిచేయాలి? ఏ రాజకీయ పార్టీ కి ఓట్ వేయాలి? ఏ అభ్యర్థి కి ఓట్ వేయాలి మరి?.
ఏ ముసుగులో ఉన్నప్పటికీ నిరంకుశత్వం ను తిరస్కరించాలి
ఇక్కడ కొన్ని కొన్ని దశాబ్దాల క్రితం నుండి ఇప్పటి వరకు కొన్ని విషయాలు గమనిద్దాము. ఎన్నికలలో నిలబడిన కొన్ని‌పార్టీలు కొన్ని సమాజవాదము ఆదర్శంగా చెప్పుకుంటున్నాయి. జర్మనీలో ఈ సమాజవాదమే నాజీ ఇజానికి దారితీసింది. అలాగె ఇటలీలో ఫాసిజమ్ గా పరిణమించింది. వీటి వలన ప్రపంచంలో అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు అవి అందరికీ తెలుసు... కేవలం ఒక‌ఓటరు కాపుసారా పాకెట్ కి.. చీప్ లిక్కర్ కి రెండు వేల నోటుకి అమ్ముడుపోయేలా పార్టీ లు తయారుచేస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో బానిసలుగా కూడా ‌మార్చేశాయి వాటి నుండి మనం ప్రజలను ఓటరులను చైతన్యం తీసుకురావాలి.
ఇంకా మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే మనదేశానికి సంబంధం లేని వాదనలతో పోరాటలతో ఉన్న కమ్యునిష్ట్ పార్టీ ని చూడండి కేరళ లో బెంగాల్ లో ఎన్నో సంవత్సరాల నుండి పరిపాలించి కూడా కనీసం అభివృద్ధి ని చేయలేకపోయాయి. ఒక పక్క మంచి మాటలతో గారడీచేసి గెలిచిన తరువాత వారి సిద్ధాంతాలను మరచిపోతారు.. డబ్బు దండుకోవడములో ముందుంటారు. కేవలం కొద్దిమంది చేతుల్లొనే రాజకీయము నడుస్తూ ఉంటుంది...
ఇవన్నీ హిందూ వ్యతిరేక కూటమిలో‌ భాగాలే అనవచ్చు
ఒకేజాతిగా మనల్ని ఉండకుండా చేయడమే కొన్ని పార్టీ లు గత డెబ్బై ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నవి... మనం గమనించినట్లయితే... హిందూ జీవన విదానము లో జోక్యం కలిపించుకొనే అనేక చట్టాలు చేయడం, గోవు, గుళ్ళ విషయాలలో తీర్పులు ఇవ్వడం.. కోర్టులను జోక్యం చేసుకోవడం సంబంధం లేనివారు కూడా పిల్ వేయడం ఇలా అనేక రకాలుగా కొన్ని పార్టీ లు తయారయ్యాయి. అలాగే టికెట్ లు ఇచ్చేప్పుడు.. ముస్లిం సంతృప్తీకరణ అలాగే ఈ మధ్య రాహుల గాందీ, మన్మోహన్ సింగ్ లు కూడా మొదటి ఫలాలు‌ ముస్లిం లకే చెందాలి అనడం ఇలాంటి వాటిని ప్రజలు ఓటర్లు వ్యతిరేకించాలి. అలాగే పెద్ద పార్టీ లలో అక్కడక్కడా మంచి అభ్యర్థులు ఉంటారు అలాంటి సమయంలో మనం ఓటు వేసినా కూడా పెద్ద ఉపయోగము ఉండదు ఎందుకంటే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాల్సివస్తుంది కాబట్టి ఒక్కోసారి మంచి వ్యక్తి ని‌ ఎన్నుకొన్నా కూడా అతను ఒత్తిడి లో నలిగిపోతాడు కాబట్టి నిరుపయోగం.
మరి సరైన ఎంపిక ఎలా చేయాలి చివరగా
నా వరకు నాకైతే దేశమే ప్రదానం.. హిందూ జీవన విధానం ఈ దేశానికి ప్రదమంగా భావిస్తాను. ఓటర్లందరూ ఓసారీ ఈ బిందువులను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయవలసి ఉంటుంది.
• ఓటరు మనస్పూర్తిగా స్వేచ్ఛగా, ధైర్యం గా మొదట తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి.
• చెప్పుడు మాటలు విని ఓటును వేయోద్దు చిత్తశుద్దితో ఓట్ ను వేయాలి.
• భయానికి లోనైగాని,తడబడి గాని, ఒక వ్యక్తినో, పార్టీ కో అందరూ వేస్తున్నారు మనమూ వేద్దాము అనే స్తితికి ఓటరు రాకూడదు.
• ఓటరు ఎలక్షన్ సమయంలో జాగరూకుడై ఉండాలి భారతదేశానికి మేలుచేసేవాడైఉండాలి.
• మన ధర్మాన్ని, సంస్కృతి ని కాపాడేవాడైఉండాలి
• పక్షపాతం చూపకుండా, అనవసర విషయాలు జోలికి పోకుండా ఈ సమాజం నాది అనే ఆలోచన కలిగిన వ్యక్తి కి,పార్టీ కి వోట్ వేయాలి.
• అహంకారం, అధికార దాహం, ఐశ్వర్యాలతో నిమిత్తం లేకుండా సమాజమే ప్రదానం గా జీవించే వారికి,పార్టీ కి వోట్ వేయాలి.
• ఈ దేశం పట్ల, ధర్మం పట్ల శ్రద్దాభక్తులు కలిగిఉన్న పార్టీ అభ్యర్థి కి వోట్ వేయాలి.
• ప్రజల సమస్యను తెలుసుకుని సేవ చేసే నాయకుడికి పార్టీ కీ వోట్ వేయాలి.
• అలాగే అన్నీ ఫ్రీగా ఇస్తాము అనే వారికి అసలు వేయకూడదు.
• అలాగే కొత్తగా వచ్చిన నోటాకు వోట్ వేయడం కన్నా కూడా ఉన్న వారిలో మంచి పార్టీ అభ్యర్థి కి వోట్ వేయడం మంచిది. నోటాకి వోట్ చేయకపోవడం చాలా మంచిది.
• మన దేశ సరిహద్దు ల్లో శత్రువులకు గట్టి గా బుద్ది చెప్పడానికి సరైన సమయంలో నిర్ణయం తీసుకొనే పార్టీ కి వోట్ వేయాలి.
• స్వదేశీ తత్వాన్ని కలిగి ఉన్న అభ్యర్థి కి పార్టీ కి వోట్ వేయాలి.
• ఇలాంటి ఎన్నొ విషయాలు ఆలొచన చేసి మనం అందరమూ వోట్ ని వినీయోగించుకొన్నట్లయితే అభివృద్ధి చెందిన దేశం గా మనం ప్రకటించుకోవచ్చు త్వరలో.. లేదంటే.. మరలా మనం ఒక 50 ఏళ్ల కు వెనక్కు పోవలసివస్తుంది.
Tags

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Awesome, but it needs 100% literacy to understand the value of vote.

    ReplyDelete
Post a Comment
To Top