Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం - జాతీయతా నిర్మాణం - megaminds

ఈ దేశం లో ఏ విషయం చెప్పినా మతానికి అన్వయించి చెప్పితేనే అర్థం అవుతుంది అని వివేకానందులు చెబుతారు. ధర్మం అనే మాటను వారు రిలీజియన్ అని ఇంగ్ల...

ఈ దేశం లో ఏ విషయం చెప్పినా మతానికి అన్వయించి చెప్పితేనే అర్థం అవుతుంది అని వివేకానందులు చెబుతారు. ధర్మం అనే మాటను వారు రిలీజియన్ అని ఇంగ్లిష్ లో వాడటం వల్ల
మనవాళ్ళు దాన్ని మతం అని వ్రాసారు. అయినా ఈ విదేశీ మతాలు భారత దేశం లో వేళ్లూనుకున్నాక ధర్మం, మతం సమానార్థకాలు అయ్యాయి.
విశాలమైన దేశం లో వివిధత్వం సామాన్యం. ఆ వివిధత్వం లోని అంతర్వాహిని జాతీయ తత్వం (రాష్ట్రీయత) కాపాడేందుకు ఋషులు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ధర్మ సంబంధ కార్యమే ఉత్తమ యినదిగా ఈ దేశ ప్రజలందరూ భావిస్తారు. అయితే అవి కేవలం ఆధ్యాత్మిక సంస్థల్లో నడవటం పరి పాటి.
శంకర, రామానుజ, మధ్వాచార్య పీఠాలు
వివిధ దేవాలయ మండలులు, ఇలా తరాలకొద్దీ నడిచే వ్యవస్థలు ఉంటాయి. సత్ గుణ సంపన్నులను, సదాచార వంతులను ఉత్తరాధికారులుగా చేసి వాటిని నిరంతరం కొనసాగే విధంగా నిర్మాణం చేస్తుంటారు. సంవత్సరం లో కొన్ని కార్యక్రమాల ద్వారా వారి కార్యం పూర్తి చేస్తుంటారు.
పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ ఈ పనిని సామాజికంగా చేశారు. సమాజం లో సామాన్య వ్యక్తిలో దేశ భక్తి నిర్మాణం, అలాంటి వ్యక్తుల మధ్య ఒక కుటుంబమ్ లాగా కలసిపని చేయడం వారికి దేశ కార్యమే భగవంతుడి కార్యంగా సాధన చేసే తరాలను నిర్మాణం చేశారు.
ఇది కార్యకర్తలను, వారి ద్వారా సమాజ కార్యం అనే ఆధ్యాత్మికత జోడించని కార్యం. ఈ దేశం లో ముఠాలు మాత్రమె కాదు. బాబాల పేరుతో, వ్రతాల పేర్లతో, సాంప్రదాయాల పేర్లతో ఆధ్యాత్మికతను జోడించి సంఘం నిర్మాణం చేయడం చాలా సులువు. అందులో పరమాత్ముడి కృప దొరుకుతుందనే చిన్నపాటి స్వార్థం కూడా జోడించబడటం మనం గమనిస్తుంటాము.
ఇవేవీ లేకుండా సామాజిక సంఘటన దానిద్వారా దేశ పరమ వైభవం లక్ష్యంగా నీకంటూ(స్వార్థానికి) ఏమీ లేదు. పని చేస్తూ ఉండటమే అనే కర్మయోగం అలవాటు చేయడం అంత సులువు కాదు. దాన్ని పూజనీయ కేశవుడు నిజం చేశారు. మన సమాజ హితమే మన స్వార్థం అనే విషయం తానాచరించి, అందరినీ చేయమని, ఆపని నేర్పి, సంఘటనా శక్తి గా మార్చడం, ఆ శక్తి దేశానికి ఉపయోగించాలనే పద్ధతిని తర తరాలకు అందించే కార్యకర్తల సమూహాన్ని నిరంతరం తయారు చేసుకునే వ్యవస్థని వారు కేవలం 15 సంవత్సరాల కృషి లో తీర్చి దిద్దరంటే , ఆ వ్యవస్థ మొక్కవోని ఆ సాధన తరతరాలు కొనసాగిస్తూ ఉండే సంఘటనా శక్తిని నిర్మిచే విదంగా రూపొందించారంటే వారి తపస్సు శక్తి ఇంత ఆని మనం లెక్కించగలమా?
అటువంటి ఈ దేశ కార్యం లో మనమూ సమిధలు అవుతున్నామనే తృప్తి లో మహాదానందం పొందే అదృష్ట వంతులై నందుకు మనం పొందే ఆనందానికి అంతేక్కడ?
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments