Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనమే సరిదిద్దుకోవలసిన మన వ్యవస్థలు-2 - MegaMinds

అలా ఉండే ఆనందవ్యవస్థ మారిపోవడానికి కారణాలు విశ్లేషిస్తే బాగు చేసు కోవడానికి మార్గాలు దొరుకుతాయి. పోయిన శతాబ్దం లో వ్యక్తిగత స్వాతంత్రం ...


అలా ఉండే ఆనందవ్యవస్థ మారిపోవడానికి కారణాలు విశ్లేషిస్తే బాగు చేసు కోవడానికి మార్గాలు దొరుకుతాయి.
పోయిన శతాబ్దం లో వ్యక్తిగత స్వాతంత్రం అనే విషయం పై ఒక చోట, అది పక్కన పెట్టి సమాజం కేంద్రిత పద్ధతుల పై వ్యవస్థలు వచ్చాయి. రెండు యూరోప్ లో వచ్చాయి. యూరోప్ చాల అభివృద్ధి చెందినది అనే భావం ఆత్మవిస్మృతి లో మరియు ఆత్మా న్యూనతా భావం తో ఉండే మన మేధావి వర్గం మీద విపరీతంగా పని చేసాయి. రెండు ప్రయోగాలు మన దేశం లో విస్తృత ప్రచారాన్ని పొందాయి. మన మేధావులు వేల సంవత్సరాల మన ప్రయోగాత్మక పద్ధతులలో లోపాలు ఎత్తి చూపి, మంచి ని మరచిపోయి ఈ దిగుమతి సరుకు గూర్చి విపరీత ప్రచారాలువచ్చేసారు. పనికట్టుకొని మన పద్దతులను అంతం చేసే పనిని అభివృద్ధి పేరుతో మహత్కార్యం చేస్తున్నామని ఆనంద పడ్డారు.
వాళ్ళు ప్రచారం చేసిన వ్యవస్థలు ప్రణాళికలు కాలం గడుస్తున్న కొద్దీ సరయినవి కావు అని వాళ్ళు మొత్తుకున్నా, మనం బానిసలుగా ఉన్న కాల ఖండం లో వారు సాధించిన పాశ్రామిక ప్రగతి అనే అంశం మాత్రమె మనకు చూపి దానికి కారణం వారి సామాజిక వ్యవస్థలే అని నమ్మబలికారు.
ఇప్పుడు మన సమాజం మనం కోల్పోయిన మన వ్యవస్థను వెతుక్కుంటున్నాయి. వారు విజృంభిచి ప్రచారాలు చేస్తున్న తరుణం లో మనం మన వ్యవస్థ ఉత్తమం అని చెప్పిన వారిని ఈ సూడో మేధావులు తిరోగమన వాదులని, మత చాందాసులు అని వారు సృష్టించిన తప్పుడు నిర్వచనాలతో దూషించారు. తప్ప నిజానిజాలను నిగ్గు తేల్చాడానికి వారి బానిస బుర్రలు, అనుకరణ పద్ధతులు ఒప్పుకోలేదు.
సామాజిక కేంద్రిత నియంతృత్వమ్ అయిన కమ్యూనిజం దాని విఫలాలు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. కాబట్టి వ్యక్తి కేంద్రిత సిద్ధాంతం గూర్చి చెప్పుకుందాము. వ్యక్తిగత స్వాతంత్రానికి కుటుంబం అడ్డంకి అనే వైపుకు దారితీసి వ్యక్తి తనకు నచ్చినట్లుగా నడుచుకోవడం అంటే కుటుంబ బంధాల నుండి తప్పించుకోవడం మొదలయ్యింది. ఇంకా మొగుడూ పెళ్ళాం ఒక యూనిట్ గా మన దేశం లో సాగుతుంది కాని ఈ పెట్టుబడి దారు వ్యవస్థ, వ్యక్తిగత స్వతంత్రము ఆలోచించిన దేశాల్లో కుటుంబమని లేదు. అన్నీ వ్యక్తిగతమే.
కుటుంబం అంటే తాత, నానమ్మ, కొడుకు, కోడలు, మనవడు మనవ రాళ్ళు ఉండే సంస్కృతి ని వదిలి మనం స్వార్థాన్ని అభివృద్ధి గా ఆలోచించే వ్యవస్థ వచ్చి, ఈ ఇబ్బందులు పడుతున్నాము.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments