Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనమే సరి దిద్దుకోవలసిన మన వ్యవస్థలు-1 - MegaMinds

పూర్వం వ్యవసాయమే పెద్ద పరిశ్రమగా ఉండేిిది. 50 సంవత్సరాలు మనుషులు పని చేసే వారు. తరువాత ఆ పనులు చేయడం కూడా కష్టమే. కాబట్టి ఇంట్లో ఉండేవార...


పూర్వం వ్యవసాయమే పెద్ద పరిశ్రమగా ఉండేిిది. 50 సంవత్సరాలు మనుషులు పని చేసే వారు. తరువాత ఆ పనులు చేయడం కూడా కష్టమే. కాబట్టి ఇంట్లో ఉండేవారు. పిల్లలను చూసుకునేవారు. పుస్తకాలు చదివేవారు. సాయంత్రం అవుతూనే దేవాలయ దర్శనం, అక్కడి పూజార గారిి తో కబుర్లు, ఊర్లో ఉండే ఆయుర్వేద వైద్యుడి తో ఒంట్లో ఉండే వృద్ధాప్యపు రోగాల వైద్యం. రచ్చబండ వద్ద సమావేశం. ఊరి పరిస్థితుల చర్చ. వేరే వూరు వెళ్లివచ్చినవాడి కబుర్లు. రాత్రి త్వరగా ఫలహారం. మళ్ళీ వెన్నెట్లో కొంచం సేపు పచార్లు. వూర్లో ఇబ్బంది పడేవారికి చేదోడు, వాదొడు, మధ్యలో కొంచం వెటకారం మాటలు, చిరు కోపాలు మళ్ళీ ఊరడిింపులు, అంతలోనే ఆనందం. చిన్న చిన్న బహుమతులు. ఓహో ఆ జీవితమే ఆనందమయం. తాతగారి బొజ్జమీద మనవల నిద్రలు. గుర్రు కొట్టి నిద్రపోవడం.
నా చిన్నప్పుడు గ్రామాల్లో విద్యుత్ ఉండేది కాదు. సుఖాలు తక్కువే. సంతోషాలు మాత్రం బాగా ఉండేవి. బాధపడే వారికి ఊరడిింపు ఉండేది. కుటుంబాలలో కలతలు, చిన్న చిన్న పొరపుచ్చాలు సోపతి గాళ్ల తో చెప్పుకోవడం, మళ్ళీ పనిలో పడటం ఉండేవి. కులాలు ఉన్నా కుల రాజకీయా లుండేవి కావు. గ్రామమంతా కుటుంబం గా ఉండేది. ఇప్పుడు గ్రామాలో రాజకీయాల చర్చ, ఒకరిపై మరొకకరి రచ్చ రచ్చ. ఈ రోచ్చంతా కడగాల్సింది మనమే. పై నుండి ఎవడో చేస్తాడని మన దురాశ.
ఇప్పుడు బుర్ర పాడయితే కౌన్సిలింగ్. దానికి ఫీజు. ఇవన్నీ గ్రామాల్లో స్వాభావికంగానే వూర్లో ఉండే పెద్దవారు నిర్వహినుంచే వారు. చిరు కోపాలుండేవి. కొన్ని క్షణాల్లోనే చిరు మందహాసాలు ఉండేవి. ఎవ్వరూ ఎవరికీ శాశ్వత శత్రువులు కాదు. అలాంటి కుటుంబాలలో శరీరం మాలిష్ కి,బుర్ర లో ఉండే బుద్ధి మాలిష్ కి పెద్దలు, పిల్లల సహకారం ఉండేది.
గతం సరే. ఇప్పుడు పెద్దలుండే చోట పిల్లలుండరు, పిల్లలుండే చోట పెద్దలుండరు. సౌకర్యాలు పెరిగాయి. సంతోషాలు కరువయ్యాయి. అందరి ముఖాల్లో ఎదో కోల్పోయామని దిగులు. చదువుకునే పిల్లలనుండి పెద్దవారి వరకు అందరి జీవితాల్లో టెన్షన్. బాగుచేసే వాతావరణం లేదు.
పెద్దవారి వ్యవహారం లో ఎలాంటి మార్పులు వస్తే మళ్ళీ ఆనంద మాయ జీవితం వస్తుంది?

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments