Type Here to Get Search Results !

ఈ దేశం ఒక్కటి, ఈ జాతి ఒక్కటి - MegaMinds

నేను గుంటూరు ప్రచారక్ గా ఉన్న సమయంలో మాననీయ శ్రీ భాగయ్య గారు మాకు విభాగ్ ప్రచారక్. వారు గుంటూరు చాలా సార్లు వచ్చేవారు. సేవా భారతి పనులు ఉత్సాహంగా జరిగేవి. సోమేశ్వరి అక్కయ్యగారు 15 మంది కార్యకర్తలను లీడ్ చేసేవారు. హరిజనవాడల్లో బాల సంస్కార కేంద్రాలు 8 జరిగేవి. విజయవాడలో సామాజిక సమరసతా సదస్సు జరిగింది. ఉపేక్షిత బస్తీల నుండి మిగతా స్వయంసేవకుల కుటుంబాలు గుంటూర్ నుండి కూడా వెళ్ళాయి. ఒక వాడాలో రోజు జరిగే ట్యూషన్ సెంటర్ మన వామనకుమార్ అనే కార్యకర్త తో జరిగేవి. విజయ మేరీ అనే అమ్మాయి చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనేది.
ఉపేక్షిత బంధువుల ఇళ్ళలో మేము భోజనాలు చేసేవాళ్ళం. ఒక పండుగ రోజు కార్యకర్తల ఇళ్ళల్లో ఆ ఉపేక్షిత బంధువులు కుటుంబాలతో భోజనాలు చేశారు. అందరూ ఆనందించారు. మా శ్రీ భాగయ్య గారు ఈ విషయాలన్నీ ఏలూరు వాసి శ్రీ SP Rao, IRS,గారికి తెలియ చేశారు. వారు గుంటూరు సంఘ కార్యకర్తలను కలిసి ఆశీర్వదించడానికి వచ్చారు. వారు పేరున్న దళిత నాయకులు. వారు కార్యాలయానికి వచ్చారు. మన కార్య కర్తల ఇళ్లకు వెళ్లారు.
Image result for united india
శ్రీ చలువాది వెంకటేశ్వర్లు గారింట్లో మెడపై గుంటూరు కార్యకర్తల సమావేశం జరిగింది. ఉపేక్షిత వాడల్లో మన కార్యకర్తలువచ్చారు.
వారికి అక్కడ జరిగే సేవా కార్యక్రమాల నివేదిక ఇచ్చాము. వారిని మాట్లాడ మన్నాము.
తాను రిజర్వేషన్ల కు ముందు ఐ అర్ యస్, అని చెబుతూనే, మన సమాజం లో ఉన్న ఒక తప్పుడు భావాన్ని ఎత్తి చూపుతూ, మన దేశంలో ఇలా సమావేశం జరుగుతూనే పతి వాడు, ఈ మాట్లాడే వాడు ఏ కులం వాడు అని ఆలోచనతో ప్రారంభం చేస్తారు. దాన్ని బట్టి వాడి విషయాన్నీ, స్థాయిని ఆలోచిస్తారు. ఈ భావాలు పోయి అందరం భారతీయులం అనె భావం ఎప్పుడు వస్తుందో? అందుకే నేను కూడా ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్, రిజర్వేషన్స్ కి ముందర అని పరిచయం చేసుకున్నాను. నేను కూడా ఈ అడుగు వర్గాల పనిని చేస్తున్నాను. మీ ఇంట్లో సమావేశం పెట్టారు. నాకు కుర్చీ వేసారు. మీరంతా ఎదురుగా చాప పై కూర్చున్నారు. దేశం మీలాంటి వాళ్ళ వల్ల బాగు అవుతుందని నమ్మకం వస్తుంది. అని మరో 5 నిమిషాలు మాట్లాడారు.
ఈ దేశం ఒక్కటి, ఈ జాతి ఒక్కటి, మనందరి జాతీయత ఒక్కటి అని వారు ముగించారు.
,షేర్ చేయండి. వాట్సప్ లో పెట్టండి. అందరం కోరుకునేది పై విషయమే.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.