Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనమే సరిదిద్దుకోవలసిన మన వ్యవస్థలు-3 -megaminds

మనిషి వ్యక్తిగత స్వతంత్రం తోటే సరైన అభివృద్ధి అనే పద్ధతి మనం యూరోప్ నుండి కాఫీ కొట్టాము. కాబట్టి అక్కడి పరిశోధనలు మనం చేయలేదు. అందుకు కు...


మనిషి వ్యక్తిగత స్వతంత్రం తోటే సరైన అభివృద్ధి అనే పద్ధతి మనం యూరోప్ నుండి కాఫీ కొట్టాము. కాబట్టి అక్కడి పరిశోధనలు మనం చేయలేదు. అందుకు కుటుంబం వ్యవస్థ మనకి అడ్డంకి గా కనపడింది. వీటిని విపరీతంగా చిత్రించాము. అత్తా కోడళ్ళ మానసిక హింసలు , శారీరక హింసలు నాటకాలు సినిమాలు వచ్చాయి. వేదికల ఉపన్యాస విషయాలు అయ్యాయి. వ్యవస్థలో అక్కడక్కడా కొన్ని లోపాలు వస్తే, లోపాలకు కారకులైన వారిని సరిచేయడం వదిలేసి వ్యవస్థను మార్చాలనుకున్నాము.
తండ్రి పిల్లాడి చదువును శాసించాడని, దాన్నీ రెచ్చగొట్టాము. బాధ్యతల గురించి మాట్లాడితే స్వాతంత్ర్యానికి భంగం అని గింజుకున్నాము. పదిమండికోసం వ్యక్తిగతంగా సర్దుకోవడంలో ఎవరికోసమయితే సర్దుకుంటున్నామో వారందరూ రాక్షసులు లాగా భావించడం మొదలెట్టాము. ఎదిగిన వాళ్ళ ఎదుగుదలకు కారణం ఆ స్వతంత్రానికి భంగం కాకపోవడం అని ప్రవచించాము. అందుకే పెళ్లి అవుతూనే వేరు కాపురం అనే పద్ధతి వచ్చేసింది. చదువు, సంపాదనే ధ్యేయం అయిపోయాయి. వీటితో పాటు కుటుంబ ఉన్నతి, శాంతి ఆనందదాయక వాతావరణం కూడా ముఖ్యం అనే విషయం వదిలేసాము. పాపం కొంత మంది కవులు చదువు రాణి వాడని దిగులు చెందకు, మనిషి మడిలోన మమత లేని చదువులెందుకు? అని ప్రశ్నించి వదిలేసారు.
జీవితం అంటే యవ్వనం లో సంపాదన, విశ్రుఖల ఆనందం మాత్రమె అయ్యాయి. పెద్దవారి అనుభవం, జీవన పద్ధతుల వివరణ చాందసం అయ్యింది. ఒకతరం ఇలా వ్యవహరించిన మనం మన పిల్లలు మన వార్ధక్యం లో మనకు దూరం కావడం బాధ కలిగించినా, మనం ఇదే చేశామని సర్దుబాటు చేసుకున్నాము. పిల్లలని హాస్టల్ లో వేస్తే వాళ్ళు పెద్దయ్యాక మనల్ని ఓల్డేజి హోమ్ కి పంపిస్తే బాధపడ్డాము.
సౌకర్యాలు అవసరాలయ్యాయి. సంపాదన పెంచడం కోసం ఇంట్లో ఇద్దరి సంపాదన అత్యావశ్యకమయ్యింది. అందులో జీవితం గురించి ఆలోచించడం అంటే సోఫా, డై నింగి టేబుల్, ఫ్రిడ్జ్
కొనుక్కోవడమే అయ్యింది తప్ప జీవన లక్ష్యాలు, సామాజిక బాధ్యతలు, కౌటుంబిక బాధ్యతల విష్యం ఆలోచించడం ఇతరుల విషయాల్లో వేలు పెట్టడంగా వర్ణించబడి, స్వార్థం ఆలోచించడమే నాగరికం అయ్యింది. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, హంసనడక రాకాపాయే, కాకి నడక మర్చిపాయే అని. అందుకే కాకి యెగిరి నడిచిందని.
మా పిల్లలు చెప్పేవారు. ఏదైనా కారణంగా స్కూల్ త్వరగా మూసేస్తే పిల్లలు ఇళ్లకు వెళ్ళడానికి ఏడ్చేవారట. కారణం వాళ్లింట్లో ఎవ్వరూ ఉండరు. వారికి కావలసిన ఆదరణ కొరకు ఉద్యోగాలు చేసి వచ్చిన తల్లిదండ్రులకు ఓపిక ఉండదు. యాంత్రిక జీవనం అయిపొయింది. కమ్యూనిజంలో కూడా ఇలాంటి సహజ ఆనందాలు లోపించిన స్థితి.
కారణంగా తర్వాత తరం చదువు వికాసం కోసం కాక సంపాదన కోసం అయ్యింది. పరిశోధనలు, పరిశ్రమలు ఉండే చదువులు పిల్లలు వదిలిపెట్టారు.
రాబోయే తరం వ్యవసాయం చేయడానికి సిద్ధపడటం లేదు. పైన ఫ్యాన్ కింద కుర్చీ ఉన్నదే కోరుకునేది తప్ప స్వంత వ్యవసాయం, స్వంత పరిశ్రమ మృగ్యం అవుతున్నాయి. సైన్యం, పోలీస్ వంటివి చేయడానికి కూడా ఓపిక లేని స్థితి. ఇవన్నీ నాకంటే మీరు చాలాబాగా వివరించగలరు.
మరి ప్రేమ, ఆత్మీయత, కుటుంబం, వృద్ధుల ఆదరణ, పిల్లల ఆత్మీయత పూర్వక పెంపకం, సమాజం పట్ల మన బాధ్యత లాంటివి ఆలోచించలేని జాతి, ఆ జాతి గొప్పదనాల కోసం జీవించలేదు. కుటుంబానికే బాధ్యత లేని మనం సామాజిక బాధ్యత, దేశ బాధ్యత అంటే ఏమిటో అవసరం లేని నీతులు అవుతున్నాయి.
ఈ దేశము పట్లను, ఈప్రజాల పట్లను, సేవానిరతి కలిగి ఉందును అనే ప్రతిజ్ఞా పాఠం చిలక పలుకుల్లా వల్లించడం తప్ప జీవితం లో లేదు.
లోపాలు సరే, బాగు చేయడం యెట్లా ? పెద్దల బాధ్యత ఏమిటి?

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments