భారత జాతీయ ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీపడటం గురించిన ఒక సమగ్ర అవలోకనం: మీడియా చెప్పని నిజాలు, మేము మాత్రమే చెప్పగల వాస్తవాలు.
నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా భారత జాతీయ ప్రయోజనాలను బలహీనపరస్తూ చేసిన దౌత్యం, భూభాగాల విషయంలో రాజీ మరియు చారిత్రకంగా ఉన్న రికార్డుల ఆధారంగా “దౌత్యం” పేరిట జరిగిన “దౌర్భల్యం”, భారత ప్రజల పాలిట శాపంగా ఎలా మారాయో ఈ కథనం లో తెలుసుకుందాం....
స్వాతంత్ర్యం సాధించిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్రమణ: పాకిస్తాన్ బలవంతంగా జమ్మూ & కాశ్మీర్‌లోని 78,000 చ.కి.మీ. భారత భూభాగాన్ని ఆక్రమించింది. సైనికంగా ప్రతిస్పందించాల్సిన సమయంలో, నెహ్రూ యుద్ధాన్ని ఆపి సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లారు. దాని ఫలితంగా ఈ రోజు వరకు పరిష్కారం దొరకలేదు. “బలహీనతను దౌత్యం”గా మసిబూసిన ఉదాహరణ బహుశా ప్రపంచంలో ఎక్కడా చూడవేమో.
కబావ్ లోయ 1949 తరువాత: బ్రిటిష్ వారు బర్మాకు (నేటి మయన్మార్) కబావ్ లోయను అద్దెకు ఇచ్చారు. 1949 వరకు భారతదేశం ఆ అద్దె తీసుకుంటూ వచ్చింది. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించలేదు. “భౌగోళిక సమగ్రత” పేరుతో మౌనంగా సొంత హక్కును వదిలేసింది, అప్పటి నుండి కబావ్ లోయ మనది కాకుండా పోయింది.
టిబెట్ ద్రోహం 1954: నెహ్రూ టిబెట్‌లో భారత హక్కులను పూర్తిగా వదిలి, చైనా ఆక్రమణను అంగీకరించారు. ప్రతిగా భారతదేశానికి ఏదీ లభించలేదు. టిబెట్ లో నడిపిన మన పోస్టల్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ సేవలను కూడా చైనాకు అప్పగించారు. ఈ మౌనం బీజింగ్‌కు ధైర్యాన్నిచ్చింది.
బెరుబరీ ఒప్పందం 1958: నూన్ నెహ్రూ ఒప్పందం కింద పశ్చిమ బెంగాల్‌లోని బెరుబరీ ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్‌కి అప్పగించారు. బెంగాల్ సీఎం బిధాన్ చంద్ర రాయ్ తీవ్రంగా వ్యతిరేకించినా, కాంగ్రెస్ 9వ రాజ్యాంగ సవరణతో ఈ భూమిబదిలీని చట్టబద్ధం చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానాన్ని 1950 దశకంలో నిరాకరించడం: భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఆఫర్ చేయబడినప్పుడు, నెహ్రూ దానిని చైనాకు వదిలేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్ దశాబ్దాల పాటు ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయింది.
పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు 1960లో: సర్జా మజ్రా, రఖ్ హర్దిత్ సింగ్, పాథంకే, ఫిరోజ్‌పూర్ భాగాలను “సరిహద్దు సవరణలు” పేరిట పాకిస్తాన్‌కి అప్పగించారు. మళ్లీ ఒకటే పాట అప్పగించు, తరువాత పశ్చాత్తాపం చెందడం మనవంతు.
అక్సాయ్ చిన్ నిర్లక్ష్యం 1959 లో: నెహ్రూ పార్లమెంట్‌లో అక్సాయ్ చిన్‌ను “ఎడారిగా, నివాసయోగ్యం కానిదిగా" వర్ణించారు. యుద్ధం “వెర్రితనమని” అన్నారు. కానీ అదే ప్రాంతంలో ఈ రోజు చైనా సైనిక స్థావరాలు ఉన్నాయి. 1962లో భారత్ నియంత్రణ కోల్పోయింది.
ఇండస్ జల ఒప్పందం 1960లో: భారతదేశం ఇండస్ నది జలాల్లో 80% భాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చి, భారత రైతులు నీటి కొరతతో బాధపడుతుండగా వారి నీటిపారుదల ప్రాజెక్టులకు 174 మిలియన్ డాలర్లు చెల్లించింది.
సినో-ఇండియా యుద్ధం 1962లో: చైనా దాడి చేసినప్పుడు, నెహ్రూ “నా హృదయం అస్సాంపై ఉంది” అని చెప్పడంలో బిజీగా ఉన్నారు. ఫలితంగా లడఖ్‌లో 38,000 చ.కి.మీ. కోల్పోవడం. ఇప్పటికి కూడా చైనా ఆక్రమణలోనే ఉంది.
సినో-పాక్ ఒప్పందం 1963లో: పాకిస్తాన్ భారత భూభాగంలోని 5,180 చ.కి.మీ. (పాక్ ఆక్రమిత కాశ్మీర్) ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. భారత అధికార ప్రతిస్పందన పూర్తి నిశ్శబ్దంగా నెహ్రూ గారి బట్టతలపై పేలు చూస్తున్న కాంగ్రేస్ నాయకులు.
“లైన్ ఆఫ్ పీస్” ప్రణాళిక 1962–64 లో: స్వరణ్ సింగ్, జుల్ఫికార్ భుట్టోతో చర్చల్లో, పూంచ్, ఉరి, నీలం, కిషన్‌గంగా ప్రాంతాలను పాకిస్తాన్‌కి అప్పగించే ప్రతిపాదన వచ్చింది. మన అదృష్టవశాత్తూ అది అమలు కాలేదు, అయితే అంతే సంగతులు.
రన్ ఆఫ్ కచ్ తీర్పు 1968లో: అంతర్జాతీయ ట్రిబ్యునల్ పాకిస్తాన్‌కి 777 చ.కి.మీ. ప్రాంతం (చాద్ బెట్‌తో సహా) అప్పగించింది. భారత్ సరిహద్దులు మళ్లీ కుదించబడ్డాయి.
సీఐఏ నిధులు 1950–60 దశకంలో: డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్లు ఏమి చూపిస్తున్నాయంటే సీఐఏ కాంగ్రెస్ పార్టీకీ డబ్బు ఇచ్చి, కమ్యూనిస్టులపై ప్రభావం చూపించేందుకు, భారత మీడియాను ప్రభావితం చేయడానికి ఉపయోగించింది. ఇది జాతీయ సార్వభౌమత్వంపై నేరుగా దెబ్బపడింది.
తాష్కెంట్ ఒప్పందం 1965లో: భారత్ యుద్ధంలో గెలిచిన తర్వాత, యుఎస్ఎస్‌ఆర్ ఒత్తిడితో హాజీ పీర్ పాస్ తిరిగి పాకిస్తాన్‌కి ఇచ్చారు. “శాంతి” పేరిట సాధించిన విజయం వృథా అయిపోయింది.
షిమ్లా ఒప్పందం 1972లో: ఇందిరా గాంధీ 5,000 చ. మైళ్ల పాకిస్తాన్ భూభాగాన్ని తిరిగి ఇచ్చి, 93,000 యుద్ధ ఖైదీలను విడుదల చేశారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ఎలాంటి రాయితీ పొందలేదు. 56 మంది భారత సైనికులు పాకిస్తాన్ జైలుల్లోనే మగ్గిపోయారు.
కచ్చతీవు దీవి 1974లో: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. తమిళనాడు అభిప్రాయాన్ని అడగకుండానే. ఈరోజు కూడా భారత మత్స్యకారులు అక్కడ అరెస్టులు, దాడులు ఎదుర్కొంటున్నారు.
కహుటా అణు కేంద్రం 1984లో: భారత సైన్యం పాకిస్తాన్ కహుటా అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉండగా, ఇందిరా గాంధీ చివరి నిమిషంలో ఆ ఆపరేషన్‌ను రద్దు చేశారు. ఫలితంగా నేడు పాకిస్తాన్ అణు బాంబు శక్తిగా మారింది.
భోపాల్ వాయు దుర్ఘటన 1984లో: యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను అరెస్ట్ చేసినా, కొన్ని గంటల్లోనే ప్రభుత్వ ఆదేశాలతో విమానంలో అమెరికాకు పంపించారు. 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం ఇంకా దొరకలేదు.
ఆపరేషన్ బ్రాస్‌టాక్స్ 1986–87: భారత సైన్యం భారీ వ్యాయామ విన్యాసాకు చేపట్టగా, పాకిస్తాన్ భయపడింది. కానీ రాజీవ్ గాంధీ బదులుగా జియా ఉల్ హక్‌తో “క్రికెట్ దౌత్యం” కొనసాగించారు.
1988 అణు దాడి రహిత ఒప్పందం: రాజీవ్ గాంధీ పాకిస్తాన్‌తో పరస్పరం అణు కేంద్రాలపై దాడి చేయకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే సమయంలో బెనజీర్ భుట్టో “కాశ్మీర్ కి ఆజాదీ” కోసం నినదిస్తూ ఉన్నారు.
26/11 ముంబై దాడుల తరువాత 2008లో: భారతదేశంకు అంతర్జాతీయ మద్దతు, సైనిక సిద్ధత ఉన్నప్పటికీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ ప్రతీకార చర్య చేయలేదు. పాకిస్తాన్‌పై ఎటువంటి బాధ్యత మోపలేదు.
శార్మ్ ఎల్ షేక్ సంయుక్త ప్రకటన 2009లో: మన్మోహన్ సింగ్ పాకిస్తాన్‌తో సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదాన్ని “పేదరికం, అభివృద్ధి”తో సమానంగా చూపారు. కాశ్మీర్‌ను “పెండింగ్ ఇష్యూ”గా ప్రస్తావించారు. భారత దౌత్యానికి ఇది దిగువ స్థాయిగా పేర్కొనవచ్చు.
సియాచిన్ నిరాయుధీకరణ చర్చలు 2012లో: రక్షణ మంత్రి ఏ.కే. ఆంటోని సియాచిన్ హిమగిరిపై సైనికులను వెనక్కు తెచ్చే చర్చలు కొనసాగుతున్నాయని అంగీకరించారు ప్రతి రోజూ ప్రాణాలు అర్పిస్తున్న భారత సైనికులకు ఇది అవమానం కాక ఇంకేమిటి.
కబావ్ లోయ నుండి కచ్చతీవు వరకు, అక్సాయ్ చిన్ నుండి హాజీ పీర్ వరకు కాంగ్రెస్ కాలంలో భారత సార్వభౌమత్వం తాత్కాలిక ప్రశంసల కోసం తాకట్టు పెట్టబడింది. ఈ రాజీలు మన భూభాగం, మన ప్రజలు, మన గౌరవాన్ని కోల్పోయేలా చేశాయి. కానీ 2014 తరువాత పరిస్థితులు మారాయి. ఈరోజు భారత్ అన్నింటా దృఢంగా నిలుస్తోంది. ప్రపంచానికి మన గళం వినిపిస్తోంది. యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తోంది. జయ్ హిందురాష్ట్ర. భారత్ మాతా కీ జయ్. -MegaMinds Team.



Ase rahetho apne upar samne vale hamla karthe
ReplyDelete