ఓయ్ మిమ్మల్నే ఈ కథ వినండి! కొన్ని సైన్యాలు తమ సొంత సైనికులను కూడా మరిచిపోతుంటే (పాకిస్తాన్), మన భారత సైన్యం మాత్రం "సోదరభావం" అంటే ఏమిటో చూపించింది. ఇది మంచుతో కప్పబడిన సియాచిన్ సరిహద్దులో జరిగిన హృదయాన్ని తట్టిలేపే నిజమైన కథ ఇది. ఈ మధ్యనే జరిగిన కథ ఇది ఒక జవాన్ ఈ కథను ఇలా వివరించాడు.
సియాచిన్ లో మొదట్లో హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంట్ల కుటుంబం మా సియాచిన్ పోస్ట్ దగ్గర రాత్రిళ్ళు చొరబడి వచ్చేది. మేమూ మా హృదయాన్ని మృదువుగా మార్చుకొని వాటి కోసం బిస్కెట్లు, ఆహారం వదిలేవాళ్లం. కొంతకాలానికి వాటికీ మాపై నమ్మకం వచ్చింది, కొన్నాళ్లకు పగటి పూటే వచ్చేవి.
అందులో ఒక చిన్న పిల్ల కూడా ఉంది. దాదాపు ఏడాది వయసు ఉండొచ్చు. ఆ పిల్ల ఎలుగు తల్లితో కలిసి వచ్చేది. కానీ ఆరు నెలల తర్వాత తల్లి ఎలుగుబంటి కనబడలేదు. మంచులో ఎక్కడో చనిపోయి ఉండవచ్చని భావించాము మేమంతా, ఆ తరువాత తల్లిని కోల్పోయిన ఆ చిన్న ఎలుగుబంటి ఒంటరిగా తిరుగుతూ ఉండేది.
మా పోస్ట్ వద్ద ఉన్న కుక్కలు ఆ చిన్నదాన్ని చూసి మొరుగుతూ తరిమేవి, మేము వెంటనే వాటిని అదుపుచేసేవాళ్లం, ఆ పిల్ల ఎలుగుకు మాతోపాటు కుక్కలకీ దగ్గరయ్యే అవకాశం ఇచ్చాం. అప్పటి నుండి దానికి మాపై నమ్మకం పెరిగింది. దగ్గరికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టింది. మేము దానికి మా కంపెనీ పేరే పెట్టాము. "బహదూర్" (మాది “బహదూర్ కంపెనీ”).
ఒక రోజు బహదూర్ కనిపించడంలేదు. కొంతకాలం తర్వాత ఒక పోస్ట్ నుంచి రేడియో మెసేజ్ వచ్చింది. “బహదూర్ తల ఒక టిన్ డబ్బాలో ఇరుక్కుపోయింది!” ఆ పోస్ట్ మేం ఉన్న స్థావరానికి దాదాపు 800 మీటర్ల దూరంలో మంచుతో కప్పబడి ఉంది. దాదాపు 60 అడుగుల మంచు! నేను నా సహచరులైన ఆరుగురు సైనికులతో బయలుదేరాను. ‘హీరోలా వెళ్లానని కాదు, కానీ ఒక సైనికుడిగా ఇది నా బాధ్యత’ అని జవాన్ వివరించాడు.
అక్కడికి చేరేసరికి బహదూర్ ఒక మంచు పట్టు (cornice) మీద నిలబడి ఉన్నాడు. అది కేవలం పలచని మంచు పొర ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, కూలితే మంచు ప్రళయం! ఆ పిల్ల ఎలుగు రోజులు పాటు ఆకలితో తిరుగుతూ అలసిపోయి ఉండి, తడబడుతున్నాడు.
అక్కడికి చేరడం చాలా ప్రమాదకరం. నేను మరొక సైనికుడికి చెప్పాను. “వెళ్లీ దాని మెడ చుట్టూ తాడు వేసి లాగగలిగేలా సిద్ధంగా ఉండు” అని. ఆ సైనికుడి నడుముకి కూడా సేఫ్టీ తాడు కట్టాం. అతనికి భయం వేసింది. మూడు నిమిషాలు ఇలా గడిచాక నేను అనుకున్నాను లేదు “నేనే వెళ్తా.” అని. నా సహచరులు కూడా ఒకరిని ఒకరు నేనంటే నేనన్నారు. కానీ నేను వాళ్లకు అవకాశం ఇవ్వలేదు.
నేనే మోకాళ్లపై పాకుతూ వెళ్లి, జాగ్రత్తగా బహదూర్‌ను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి లాగాను. తర్వాత మెల్లగా అతని తల నుంచి టిన్ డబ్బాను కోసి తీసేశాం. ఒక ఆపరేషన్ లా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాం, చెవులు లేదా మెడకి ఏ గాయం కాకుండా చూసుకున్నాం. తర్వాత దానికి ఆహారం పెట్టి, తిరిగి మళ్లీ వదిలేశాం. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బహదూర్ వెళ్లలేదు. మూడు గంటల పాటు మా దగ్గరే ఉండిపోయింది.
అప్పటి నుండి బహదూర్ మా కంపెనీ కి సహచరుడు అయ్యాడు. ఎవరైనా "బహదూర్!" అని పిలిస్తే అది ఎక్కడినుంచో బయటికొచ్చి నిలబడేది. ఇప్పటికీ అప్పుడప్పుడు వచ్చి ఆహారం తీసుకుని వెళ్తుంది.
బహదూర్ కథ మనకు ఏమి చెబుతోందంటే మన సైన్యం యొక్క వీరోచితత్వం అంటే కేవలం యుద్ధంలోనే కాదు, దయలోనూ ఉంటుంది. లేదంటే కాశ్మీర్ ఎప్పుడో మన నుండి జారిపోయేది. సైనికులు గత 78 ఏళ్లగా ఎన్నో అవమానాలు, త్యాగాలు, అలాగే కాశ్మీర్ ప్రజల్లో నమ్మకం కలిగించడం వలనే కాశ్మీర్ మనతో వుంది. జయ్ జవాన్, జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds
Indian Army rescue, Bahadur Himalayan bear, Indian Army wildlife rescue, Indian soldiers compassion, Indian Army animal rescue story, Himalayan bear cub saved, Indian Army kindness, Bahadur bear story


