Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనమే సరిదిద్దుకోవలసిన మన వ్యవస్థలు-4 - megaminds

ఇలా ఉంటె బాగుంటుందని అనిపిస్తుంది.కాని దానికి మానసిక ఐకమత్యం సాధించాలంటే పెద్దలు ఎలా ఉండాలి అనేది కూడా ప్రశ్నే. బాల్యంలోఉండే పిల్లలకు మన...


ఇలా ఉంటె బాగుంటుందని అనిపిస్తుంది.కాని దానికి మానసిక ఐకమత్యం సాధించాలంటే పెద్దలు ఎలా ఉండాలి అనేది కూడా ప్రశ్నే. బాల్యంలోఉండే పిల్లలకు మనం అన్నీ నేర్పడానికి మనం పడే ఆరాటం , కొంత కాలానికి వాళ్ళ స్నేహితుల్లా మారాల్సి వస్తుంది. వాళ్ళు మన చిన్ననాటి పిల్లలు మాత్రమె కాకుండా ఎన్నో తెలిసికొని ఎదుగు తున్నారని మనం తెలుసుకోవాలి. వారికి మెల్లగా మన కుటుంబ ఆర్ధిక, సామాజిక పరిస్థితులు కొద్ది కొద్దిగా తెలియ చేయాలి. నిర్ణయాల్లో వాళ్ళుో భాగస్వాములు అయ్యే వైపుకు పాజిటివ్ ద్రుష్టి కలుగ చేయాలి.
వారు సంపాదించే స్థాయికి పెరిగాక కొన్ని నిర్ణయాలు వారు తీసుకునే అవకాశం ఇవ్వాలి. మంచి నిర్ణయాలను మెచ్చుకోవాలి
చాలా తప్పు జరుగుతుందనే సమయం లో మాత్రమె నిదానంగా అర్థమయ్యేటట్లుగా ఆ స్థితిలో విజయం ఎలా సాధించాలో మార్గాలు చెప్పగలిగితే చెప్పాలి. ఈ సంతులనం ఉండాలి.
చాలా సార్లు వృద్ధాప్యంలో మనం సాధించిన విషయాలు కాకుండా వారి చిన్న నాటి జ్ఞాపకాలు చెబుతుండాలి. మాటి మాటికి వారు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపడం ఆపేయాలి. మనమడు, మనుమరాళ్ళ ఆనందం విషయం లో శ్రద్ధ వహించాలి.
నా పెన్షన్ డబ్బులు నాకు సరిపోతున్నాయి, నీవు నాకు పెట్టేదేమి లేదని ఎద్దేవా చేయాలనే తలపు రాకూడదు. అప్పుడు ఒకరిపై మరొకరికి ప్రేమలు కలుగుతాయి.
పెద్దలు కొంచం మన కుటుంబమే కాకుండా సమాజం లో చేయగలిగే చిన్న పనులు:
మరో ఐదు ఇతర కుటుంబాలతో స్నేహం , వారి పిల్లలతో కూడా చిన్న పలకరింపు పెంచుకోవాలి.
కుటుంబం లో అందరూ కలిసి భోజనం చేసే సమయాలు నిర్ణయించి సాధించాలి. హిందూ ఉన్నత ఆశయాల చర్చలు పెద్దల మధ్య నిర్వహించాలి. గో ఆధారిత వ్యవసాయం లాంటివి ప్రచారం చేయాలి. తులసి పెంచడం, గోవు పెంచడం లాంటి పనులను సమాజం లో పెంపొందిన్స్హే పనులు చేయాలి. పిల్లల వికాసకేంద్రాలు నిర్వహించాలి. మనకు ఉన్నత లక్ష్యాల సాధన చేస్తున్న మనపై పిల్లలకి గౌరవం, గర్వం కలిగే విధం గా మన ప్రవర్తన ఉండాలి.
కష్టాల్లో ఉండేవారి కస్టాలు వినడం కూడా చేయాలి. కస్టాలు తీర్చలేక పోవచ్చు, కాని విని అనునయించే పని చేయగలగాలి. ఈ రోజుల్లో వినె వాడు కూడా దొరకడం లేదు.
మనం సాధించినట్లుగానే పిల్లల లక్ష్యాలను వారు సాధించుకోవడానికి, వాటిని గొప్పగా అందరికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి.
మన రుచిని అనుసరించి పుస్తక పఠనం, ధ్యానం, పూజా లాంటి ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవాలి. పిల్లల చే చెట్లు నాటించాలి. మనకు అహంకారం, భయం కాకుండా ధైర్యం ఇచ్చే స్థితికి మనం ఎదగాలి. ఇవి మన కుటుంబానికి, మనకు, సమాజానికి ప్రేరణ నిస్తాయి. ఇంకా మీరూ చేప్పండి. ఈ సమాజం అంతటిని తన కుటుంబం.లా చూసే స్థాయికి మనం ఎదగాలి.
వృద్ధాప్యం బాధ పడటానికి కాకుండా బాధలు వినడానికి భరోసా ఇవ్వడానికి ఉపయోగపడాలి. దాని వల్ల పిల్లలకి మనం ఇబ్బంది కాదు, వారి ఆత్మస్థైర్యం పెంచే వాళ్ళం అవుతాము. వారికి మనం భారం కాదు వారి హృదయ బాధలు దించే వారిగా ఎదుగా గలుగుతాము.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments