మన వ్యవస్థ ల పై పశ్చిమ దేశాల ఆలోచనా దాడి ని స్వర్ణకమలం సినిమా పాట శివ పూజ కు చివురించిన సిరిసిరి మువ్వ అనే పాటలో శ్రీ సీతారామ శాస్త్రి అద్భుతంగా వర్ణించడం మనం విన్నాం. మన మేధావుల ఆలోచనలను గొప్పగా వర్ణిస్తూ.... తన వేరులే సంకెళ్లయి కదల లేని మొక్కలా, ఆమని కయ్ ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా, అని వ్రాస్తారు. మొక్కకి ఆధార భూతమ్ అయిన వేర్లని సంకేళ్లుగా భావించాము.
మనిషి సంఘ జీవి. వ్యక్తి స్వతంత్రం ఆ సంఘానికి పూరకం కావాలి కాని వేరుగా ఆలోచించకూడదు. వ్యక్తి కి భాష, భూష, తిండి, చదువు, ఇల్లు, వాకిలి ఒకటేమిటి అన్నీ సమాజం ఇస్తున్నది. చివరి వాడి పుట్టుకకు తల్లీ తండ్రిని కూడా సమాజం ఇస్తున్నది. అందుకు వ్యక్తి సమాజానికి కావలసిన వన్నీ ఇవ్వాలి. ఇవి పరస్పర పూరకాలు. అందుకే సమాజం ఒక కుటుంబం లా జీవించాలి. దానికి అందరూ కాంట్రిబ్యూటర్స్, అందరూ అనుభవ దారులు. ఇది ఒకరి స్వతంత్రం మరొకరు హరించడం కాదు. ఒకరి స్వతంత్రానికి మరొకరు సహకరించడం. తద్వారా సమరస జీవనం. అందరూ కలిపి ఒక యూనిట్. అందరి సుఖమూ శాంతి అందరి బాధ్యతల పై ఆధారపడి ఉంటుంది. ఈ బాధ్యతను అడ్డంకి గా అనుకోవడం అంటే మొక్క వేరులను సంకెళ్లు అనుకోవడం అవుతుంది.
పూర్ణమధః పూర్ణమిదం అంటే ఇదే. ఈ సమాజానికి చిన్న యూనిట్ కుటుంబం. ఒకరికి మరొకరు తోడు. రేక్కల్లో శక్తి వున్నవాడు సంపాదించాలి. పిల్లలు చదువుకోవడానికి వాడి సంపాదన అవసరం అన్నట్లు, రెక్కలుడిగిన వారిని ఆదుకోవడానికి కూడా! వృద్ధులు దాన్ని యువకుల పై భారంగా ఆలోచింప కూడదు. యువకులు తమ బాధ్యతగా స్వీకరుంచాలి. వృద్ధులు తమ అనుభవాన్ని, నీతి, రీతి పిల్లలకి ప్రేమతో నేర్పాలి. పిల్లలకు ప్రేమ , ఆత్మీయత పంచాలి. బడిలో నేర్చున్నది జీవనోపాధికి ఆకుంటే, నానమ్మ తాతయ్యాల ఒడిలో నేర్చుకునే జీవిత పాఠాలు బాధ్యతాయుత, సామాజిక జీవనానికి అని గ్రహించాలి.
స్వతంత్రం పేరుతో ఆలోచిస్తే హక్కులు గుర్తుకొస్తాయి. సమాజ ఉన్నతి తో తన ఉన్నతి ఆలోచిస్తే బాధ్యతలు గురుకొస్తాయి.
సంపాదన లేక, పట్టించుకునే వాడు లేక వృద్ధులు బాధ పడ్డా సమాజం సుఖం గా ఉండదు. ఆలనా పాలనా లేని పిల్లలతో సామాజికి శాంతి నిలవదు. సంపాదించే వారి బాధ్యతలు, రెక్కలుడిగిన వారి బాధ్యతలు, చిన్న పిల్లల బాధ్యతలు వెరసి కుటుంబం. ఆకుటుంబ ఉన్నతి, అందరి ఉన్నతి. దీన్ని దాస్కాపీటల్ లోమార్కెస్ కూడా వర్ణించాడు.
From each according to his capacity to each according to his need. ఇది సమాజం మొత్తానికి అయన చెప్పింది. అది మనం మన కుటుంబ వ్యవస్థ ద్వారా మనం ఆచరించి చూపాలి.
అందుకు ఎదిగిన మన పెద్దలు ఎలా ఉండాలి? చర్చించండి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia