సైనిక జట్టులోని పిల్లవాడిని చితకబాదిన ఉపాద్యాయుడెవరో తెలుసా? - megamind - short stories in telugu


కాశీకి నలభై మైళ్ల దూరంలో చునార్ అనే ఊరు ఉన్నది. అక్కడ ఒక పురాతనమైన కోట ఉన్నది. ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించే కాలం అది. అందుకని ఆ కోటలో వారి సిపాయీల పటాలాన్ని ఉంచారు. ఊరి పాఠశాలలో క్రొత్తగా ఒక యువకుడు ఉపాధ్యాయుడుగా చేరాడు.

అతనికి పుస్తకాలంటే చాలా ఇష్టం. తన తీరిక కాలాన్నంతా పుస్తకాలు చదవడానికి వినియోగించేవాడు. అందుకని అతడిని పుస్తకాల పురుగు అంటుండేవారు. అటువంటి పురుగు కూడా సమయం వస్తే తిరగబడుతుంది అని నిరూపించింది ఒక సంఘటన. బడి పిల్లలకు, సైనికులకు పుట్ బాల్ ఆటల పోటీలు జరిగాయి. బడి పిల్లలు ఉత్సాహంగా ఆడారు. దానితో సైనిక జట్టు ఓడిపోయింది, గెలిచిన సంతోషంతో విద్యార్థులు జయ... జయ నినాదాలు చేశారు. వాళ్ల కేకలు అరుపులతో అక్కడి ప్రదేశం దద్దరిల్లిపోయింది.

ఇది అవమానం అని అనుకున్నారు సైనిక జట్టువాళ్లు. అందులో ఒక సైనికుడు కోపం పట్టలేక బడి పిల్లల జట్టులోని పిల్లవాడిని కొట్టాడు. బడి పిల్లలు ఏమి చేయలేకపోయారు. పుస్తకాల పురుగైన ఉపాధ్యాయుడు అక్కడే ఉన్నాడు. తెల్లవారి దౌర్జన్యం చూచిన అతడికి కోపం వచ్చింది. కొట్టిన తెల్లవాడు అల్లరి చేసిన తనతోటి తెల్లవాడిని కొట్టి ఉండేవాడు? అని అనిపించింది అతనికి అతడు ఆవేశంతో దగ్గరలో పాతి ఉన్న కర్రను ఊడ పెరికాడు.

సైనిక జట్టులోని పిల్లవాడిని చితక గొట్టాడు. దానితో బడి పిల్లలు కూడా చేతులు చేసుకున్నారు. తెల్లవాళ్లు జీవితాంతం మరచిపోలేనంతగా తన్నులు తిన్నారు. సమయం వస్తే చాలు సత్తా చూపించ వచ్చు అన్న దానిని నిజం చేసిన ఆ యువకుడు మున్సి ప్రేమచంద్ అసలు పేరు నవాబ్ దాదా ధనపాల్. ఎన్నో పుస్తకాలు వ్రాసి ఎనలేని కీర్తిని సంపాదించాడు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments