దేశం ఎలా బాగు పడుతుంది-1 - Megaminds

0

నాకు 100 సర్వస్వార్పణ చేసే యువకులనిస్తీ ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తాను అన్నారు వివేకానంద.
Give me your blood I will provide freedam to this country అన్నారు
సుభాష్ చంద్రబోస్.

మీ సమయాన్ని ఇవ్వండి, దేశ పరమ వైభవ స్థితి కి అన్నారు డాక్టర్ కేశవ రావు హెడ్గేవార్.
అందరూ ఈ దేశం కోసం ఆవేదన పడ్డవారే. అలాంటి వారినే ఈ దేశం గుర్తు పెట్టు కుంటుంది. డాక్టర్జీ సంఘానికి వచ్చిన వారిని కనీసం ఒక గంట దేశభక్తులుగా కావడానికి శిక్షణ పొందడానికి సంఘ శాఖ కు రమ్మన్నారు, మరోగంట దేశం బాగు చేయడానికి ఎంచుకున్న పద్ధతిలో పని చేయడానికి ఇమ్మన్నారు. ఇది కనీసం అన్నారు. కాని వారు మాత్రం 24 గంటలు ఇచ్చి ఆదర్శం చూపారు.
ఈ పిలుపు ఇచ్చిన పెద్దయనకు పాపులారిటీ మరీ ఎక్కువగా లేదు. వారి పని యువకుల కు మార్గ దర్శనం అయ్యింది. వారిలా కావాలనే తలపు జీవిత మార్గం అయ్యింది. ఆదర్శం వారివలే కావాలనే ఆకాంక్షను పాటలా పాడుకున్నారు. వారిలాంటి మనస్సు పొందారు. వారిలాంటి పనితనం నేర్చుకున్నారు. వారి సిద్ధాంతాలను ఆపొసన పట్టారు. ప్రవచించారు. సిద్ధాంతీకరించారు. వాటి కోసం బ్రతికారు. తరాలకి మార్గ దర్శుల య్యారు. 6 వ తరం నడిచినా అదే స్ఫూర్తి, అదే ఆవేదన, అదే కార్య కుశలత, అదే ధ్యేయ సమర్పిత జీవితాలు, అదే ప్రచారం.
ఇది ఒక అద్భుతం. ఆధ్యాత్మిక విషయాల్లో ఇవి సామాన్యమే. కాని సామాజిక విషయా ల్లో, మనం తక్కువ చూస్తాము. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అద్భుత ప్రయోగం. పాపులారిటీ లేని డాక్టర్జీ కి ఫాలోయింగ్ ఎంత వుందో నాకంటే మీకే బాగా తెలుస్తుంది.
సంఘం లో చేరితేనే సంఘం సరిగా అర్థం అవుతుంది. అటువంటి పెద్దలను చూసి మన మనసు, బుద్ధి పెంచుకోగలుగుతాము. వారి నుండి ప్రేరణ పొంది వారిలా పని చేయగలం. RSS లో చేరుదాం. పని చాలా ఉంది. కార్యకర్తలు ఇంకా కావాలి. యువకులు శాఖల్లో చేరండి.
మీకు అనిపించింది కామెంట్లో వ్రాయండి.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top