Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనిషి పని ఎందుకు చేస్తాడు-1 - megaminds

ఇది ఒక బిట్ ప్రశ్నల జవాబు కాదు. మీరు కూడా ఎన్నో జవాబులు వ్రాసారు కదా! ప్రపంచం లో అన్నీ సూత్రీకరించడం సాధ్యం కాదు, కాని అందరూ అలా చేద్దామనే...

ఇది ఒక బిట్ ప్రశ్నల జవాబు కాదు. మీరు కూడా ఎన్నో జవాబులు వ్రాసారు కదా! ప్రపంచం లో అన్నీ సూత్రీకరించడం సాధ్యం కాదు, కాని అందరూ అలా చేద్దామనే అనుకుంటారు. సూత్రీకరణలు అన్నీ అందరూ ఒప్పుకోరు. కాని సూత్రీకరిస్తేనే గుర్తు ఉంటుంది. ఆపిల్ పండు నెత్తిన పడితే న్యూటన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. శాస్త్ర శోధన కి అది ఎంతో ఉపయోగపడింది.
అలాగే సామాజిక విషయాలను కూడా కొందరు సూత్రీకరించారు. మనిషి కోరికల పుట్ట. వాటిని తీర్చు కోవడానికి డబ్బు కావాలి. డబ్బు కోసం మనిషి కష్టపడతాడాని కార్ల్ మార్క్స్ సూత్రీకరించాడు. దాస్ కాపిటల్ అనే పుస్తకం వ్రాశాడు. లెనిన్ దాన్ని చదివి సమానత్వ సాధనకు ఈ సిద్ధాంతాన్ని వాడుకొని మనిషి కొరికలయిన తిండి, సంసార సుఖం, పిల్లల బెడద కూడా ప్రభుత్వమే అని చెప్పి, పని చేయండి పొట్టకు కావలసిన రేషన్ తీసుకోండి. సంసార సుఖాలు మీ ఇష్టం. ఎవరితోనైనా ఉండండి, పిల్లలు ప్రభుత్వం ఆస్తి, బాధ్యత అని చెప్పి కోరికలు తీర్చాము కదా బాగా పని చేస్తారని ఊహించాడు.
రష్యా లో విప్లవం తెచ్చి రాజ్యాధికారం పార్టీ పేరుతో తను త్తీసుకొని ప్రయోగం చేస్తే, ప్రజలు ఈ జంతువుల్లాగా బతకడం ఇష్ట పడలేదని అర్థం అయ్యింది. చొరవ, ప్రతిభ కోల్పోయిన సమాజాన్ని చూసి ఆ దేశాధ్యక్షుడు గోర్బచెవ్ బాధపడుతూ పెరిస్త్రోయికా, గ్లాస్నోస్త్ పుస్తకాలు వ్రాసి ఆ ప్రయోగ విఫలాలని వర్ణించాడు. మనిషి ఆర్ధిక జీవి అనే సూత్రం పాక్షిక సత్యం తప్ప సూత్రీకరించే విషయం కాదని తెలిసింది.
మనిషి కోరికలను శారీరక కొరికలుగా మాత్రమె చూడబడ్డాయి. అవే సర్వస్వము కావని మనకు అర్థం అయింది. పోయిన శతాబ్దం లో ఒక ఊపు ఊపిన కమ్యూనిజం గ్రంధాలయాలకి సీమితం అయ్యింది.
ప్రయోగం జరిగిన చైనా లో ఏమి జరిగిందో మనం చూసాము. పక్క పక్కనే ఒకే సిద్ధాంతం ఆలోచించే రెండు దేశాల మధ్య కూడా సహయోగం లేదు. ఇంకా ఆ చెట్టుకు మన దేశం లో కొన్ని గబ్బిలాలు వేలాడుతున్నాయి. ఆర్ధిక సూత్రాలు మాట్లాడడం వదిలేది, ప్రపంచ కార్మికులను ఏకం చేయడం ఏమిటి వాళ్ళ పార్టీ సభ్యలను కూడా ఏకం చేయలేక ఎన్ని మూక్కలయ్యాయో నాకంటే మీకే బాగా తెలుసు. జాతి భావం నశిస్తేనే, ప్రాపంచిక భావం తేగలుగుతామని జాతీయ భావాన్ని నాశనం చేయడమే జీవిత ధ్యేయంగా సమాజాన్ని , జాతిని విడగొట్టి ఆనందిస్తున్నారు.
అయ్యో మొదటి మార్క్స్ గారి సూత్రీకరణ, దాని ఉపయోగించిన ప్రక్రియ విఫలం అయ్యాయి. మనిషి ఆర్ధిక జీవి అన్న మార్క్స్ దాస్ కాపిటల్ ని డబ్బులకోసమే వ్రాసాడని అనలేము. ఈ సిద్ధాంతం లో తను ఇమడ లేదా? లేక తను మనిషి కాదనుకున్నాడా ? చెప్పడం కష్టం.
Please share for reaching all our friends.
Namassulatho mee narasimha Murthy.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments