మన సంస్కృతిలో ప్రవేశించిన ఒక దురాచారం అస్పృశ్యత. శంకరు డి మానిషీ పంచకం చెప్పుకున్నా, రామానుజా చార్యూలు భక్తులంతా ఒకే కులం అన్నా ఊర్లల్లో ఈ దురాచారం సాగుతూనే ఉంది. బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవన లక్ష్యం అదే అన్నా, పూజ్య గాంధీజీ వారు హరి జనులు అని అన్నా, పూజనీయ బాలాసాహెబ్ దేవరస్, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మూడవ సరసంఘ చాలక్, అంటరాని తనం పాపం కాదంటే ప్రపంచం లో పాపమే లేదు అని గర్జించినా ఈ దురాచారం దూరం కావడం లేదు. ఓకే దేవాలయం, ఒకే జలాశయం, ఒకే స్మశానం అనే పేరుతో మనం గ్రామాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి మనం పెట్టిన పేరు సామాజిక సమరసత. ఇందులో పాల్గొన్నా మన సామాజిక సమయం సద్వినియోగం అవుతుంది.
దేశాన్ని విడగొట్టడమే కార్యంగా కమ్యూనిస్టులు ఈ విషయం అవకాశంగా విభేదాలు సృష్టిస్తున్నారు. వేరే మతాల వాళ్ళు ఈ సోడ్లు చూపి మా దగ్గర సమానత్వం అంటూ మతాన్తరీకరణ లు చేసి హిందూ సమాజం బలహీనం చేయడానికి ప్రయత్నాలు జరుఫుతున్నారు. అక్కడా సమానత్వం లేదని తెలిసికొన్న మన సోదరులు అయోమయం లో పడుతున్నారు.
రాజ కీయాలకు వోట్ బ్యాంకుల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూసేవారు కొందరు. దళిత ఉద్యమాల పేరుతో విదేశీయుల ఊతంతో గో మాంస ఉత్సవాలు, మహిషాసుర ఉత్సవాలు, నరకాసుర ఉత్సవాలు అని మన మధ్య పగలు పెంచే పని కూడా మనం చూస్తున్నాము..
ఈ అగ్ని ని మనం పూనుకొని అర్పివేయాలి. 125 కోట్ల భారతీయులను విడగొట్టడం కాకుండా కలిపే యజ్ఞం లో మనమూ సమిథ లు అవ్వాలి. అందుకోసం మన సామాజిక సమయం ఉపయోగపడాలి.
ఇది మన దేశం. మనమే బాగు చేసుకోవాలి, రాబోయే తరానికి ఈ సమస్యలు లేని భారతాన్ని అందించాలంటే సాధకులం మనమే. తప్పును దూషిస్తూ కూర్చుంటే తప్పు మారదు. వదిలేసి పారిపోయినా మార్పు జరుగదు. మార్పుకు మనమే సాధకులం. గరిష్ట ఓపికతో, అందరినీ కలుపుకునే హృదయం తో ముందడుగు వేయాలి. సంఘం పిలుపునిస్తున్నది, సామాజిక సమరసత మనమే నిర్మాణం చేయాలి. రుచి ఉండేవాళ్ళు పాల్గొనవచ్చు.
అయితే ఒక జీవితం ఒక లక్ష్యంగా పని చేస్తే మనకు పని లోతులు అర్థం అవుతాయి. ఏదైనా సాధించగలుగుతాము. మేలకువలు తెలుస్తాయి. సహకరించే వారు దొరుకుతారు. విజిగీశ ప్రవృత్తి పెరిగి మనం సాధించ గలుగుతాం.
మనకు సమయం లేదనే భావన వల్ల రాక్షసుల వీరంగం నడుస్తున్నది. దేశం మనది ఆనుకుంటే, మన పనికి మన సమయం ఉంటుంది. తప్పక దొరుకుతుంది. మన డైరీ లో మనమూ సామాజిక సమయం కేటాయి్ద్దాం.
Men may come and men may go..
But our hindu nation goes on for ever.
రాబోయే తరం మనల్ని తిట్టుకోవద్దు.
మీ అభిప్రాయాలు వ్రాయండి. మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia