ఇప్పుడు అమెరికా యొక్క నీతి మాలిన చర్యలను మనం ట్రంప్ తో ఆపరేషన్ సిందూర్ తరువాత విభేదించింట్లు అనిపించినా మన నాయకత్వం 2015 నుండే ఆలోచన చేసింది. మన దేశం లో అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి. అవి ఒక దానికి ఒకటి సంబంధాలు ఉండవు అనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా అనేక సంబంధాలు ఉంటాయి. భారత్ 2015 నుండి BRICS సభ్యత్వ దేశాలలో మన బలమైన వాణిని వినిపిస్తున్నాము. ప్రపంచ మనుగడకు ఏది మేలో అది చేస్తున్నాము.
మనం 2015 నుండి డాలర్ తో కాకుండా రూపాయలతో లేదా దిరమ్, రూబుల్స్ తో వ్యాపారం చేయాలని భావించాము కానీ అది అమలులోకి తీసుకురావడానికి, BRICS దేశాలకు అర్దంకావడానికి దాదాపు పదేళ్లు పట్టింది. భారత్ 2016 లో De-Monetization చేసింది, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినా కొంత ఊపిరిపీల్చుకున్నట్లైంది. అదే తరహాలో ప్రపంచ వ్యాపారాలు, మూలధనం సంబంధించి కూడా మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాము. అదే De-Dollarization దీనిని చడీ చప్పుడు లేకుండా చేసేశాము, చేస్తున్నాము. నేను వారం క్రితం వ్రాసిన వ్యాసంలో భారత్ ప్రజానికం పదిటన్నుల బంగారాన్ని కొన్నది అమెరికా కి ఇది పెద్ద దెబ్బ అంటూ చర్చించాను (వీలైతే అదికూడా చదవండి Click here Gold). అలాగే డీ డాలరైజేషన్ ని BRICS దేశాలు అమలుపరచడం మొదలుపెట్టాయి. అది కూడా ఈ వ్యాసం లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దశాబ్దాలుగా, అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఆధిపత్యం చెలాయిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ శక్తి ప్రదర్శనకు ఆధారం. భారత చరిత్రలో స్వాతంత్య్రం రాక ముందు మన రూపాయికి, డాలర్ కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కాని అది ఇప్పుడు అత్యంత కనిష్ట పతనానినికి చేరింది. ఏ రిజర్వ్ కరెన్సీ శాశ్వతం కాదు. ఎలాగైతే కొన్ని సామ్రాజ్యాలు గొప్పగా వెలుగొంది కూలిపోయాయో, అలానే ద్రవ్య ఆధిపత్యం కూడా కూలిపోతుంది. డాలర్ కి కూడా కోలుకోలేని దెబ్బ తగలబోతుంది. September 1, 2025 నుండి మనం డీ-డాలరైజేషన్ ని చూస్తాము. నిశ్శబ్దంగా చడీ చప్పుడు లేకుండా క్రమంగా జరుగుతున్న అతిపెద్ద గేమ్ De-Dollarization.
బంగారం అమెరికా నిల్వలను మించింది: 1996 తర్వాత తొలిసారిగా, ప్రపంచ కేంద్ర బ్యాంకులు తమ నిల్వలలో అమెరికా నిల్వల కంటే ఎక్కువ బంగారం కలిగి ఉన్నాయి. అమెరికా ( రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం మొదలయిన తరువాత) రష్యా నిల్వలని ఆపేసిన ( ఫ్రీజ్ ) చేసిన కొద్ది నెలలకే, డాలర్ ఆధారిత ఆస్తులపై అనుమానం పెరిగి, బంగారం వైపు తిరిగి మొగ్గుచూపారనే విషయాలు మీరు చదివి ఉండవచ్చు. నిజంగా అదే జరిగింది.
బంగారం కొనుగోలు మనకు మరియు BRICS దేశాల పాలిట వరమయ్యింది. 2022 తరువాత గణాంకాలను ఒకసారి గమనిద్దాం..
▪️2022లో కేంద్ర బ్యాంకులు 182 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి.
▪️2023లో ఆ సంఖ్య 237 టన్నులకు పెరిగింది.
▪️2024లో అది 1,180 టన్నులకు ఎగబాకింది.
▪️2025లో కేవలం బ్రిక్స్ దేశాలు రెండో త్రైమాసికంలోనే 166 టన్నులు కొనుగోలు చేశాయి.
ఈ కొనుగోలు పెరుగుదల ఎదో అనుకోకుండా జరిగింది కాదు. డాలర్ ఆధారిత ఆస్తులపై పెరుగుతున్న అనుమానాలు, ఆంక్షల భయాన్ని ప్రతిబింబిస్తోంది.
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ కూడా తన నిల్వలలను మార్చివేసింది. ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న విదేశీ మారక నిల్వలున్నప్పటికీ, భారత్ అమెరికా నిల్వలలోని వాటాను 2024లో $242 బిలియన్ ల నుండి 2025లో $227 బిలియన్ లకి తగ్గించింది. అదే సమయంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ 40 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. కేవలం మన ఒక్క దేశమే కాదు గ్లోబల్ సౌత్ అంతటా ఇదే ధోరణి. కేంద్ర బ్యాంకులు డాలర్ వాటాను తగ్గిస్తూ, చడీచప్పుడు లేకుండా బంగారం రూపంలోకి మార్చి వేసాయి.
1990ల చివర్లో 70% పైగా ఉన్న డాలర్ వాటా, ఇప్పుడు 60% లోపుకు పడిపోయింది. కొంతమంది అంచనాల ప్రకారం ఇది 46–58% మధ్య ఉంది. అదే సమయంలో, బంగారం ప్రపంచ కేంద్ర బ్యాంకు రిజర్వుల్లో 20% వాటా సాధించింది, ఇది యూరో (16%) కంటే ఎక్కువ.
ఒకప్పుడు అమెరికా ఆస్తుల్లో $1 ట్రిలియన్ ల పైగా కలిగి ఉన్న చైనా, ఇప్పుడు దానిని $756 బిలియన్ లకి తగ్గించింది. గ్లోబల్ సౌత్ దేశాలు మొత్తం సుమారు $9 ట్రిలియన్ డాలర్ ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ, కొత్త కొనుగోళ్లు అమ్మకం కాకుండా తగ్గించడం ద్వారా డాలర్ తో సంబంధాలు తగ్గిస్తున్నాయి.
డీ-డాలరైజేషన్ ఎందుకు జరుగుతోంది? ఈ మార్పుకు అనేక కారణాలు ఉన్నాయి: రష్యా నిల్వలు నిలిపివేయడం, చైనా మీద కూడా ఆంక్షలు విధిస్తారనే భయం కేంద్ర బ్యాంకులను అప్రమత్తం చేసింది. తైవాన్ సమస్య మరో ఆంక్షలకు దారితీస్తుందని భయాలు పెరుగుతున్నాయి. అమెరికాకి పెరుగుతున్న అప్పులు, క్వాంటిటేటివ్ ఈజింగ్, ఆర్థిక అనిశ్చితి అనేక కారణాలతో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. బ్రిక్స్ ఎదుగుదల ప్రపంచ జీడీపీ లో 40% జనాభాలో 46% చమురు ఉత్పత్తిలో 40% వాటా కలిగిన బ్రిక్స్ దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా పరస్పరం వాణిజ్యం చేసుకోగలుగుతున్నాయి.
డీ-డాలరైజేషన్ నేడు నెమ్మదిగా, స్తబ్దుగా జరుగుతోంది. కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి, మార్కెట్లు దెబ్బతినకుండా క్రమంగా డాలర్ బంధం తగ్గిస్తున్నాయి. కానీ చరిత్ర చెబుతున్నది ఏమిటంటే ఒక కీలక సంఘటన (యుద్ధం, ఆంక్షలు, ఆర్థిక సంక్షోభం) వస్తే ఈ మార్పు ఒక్కసారిగా వేగం అందుకుంటుంది.
అమెరికా అప్పుల ఊభిలో కూరుకుపోయింది. నిల్వల కోసం కొత్త కొనుగోలుదారులు దొరకకపోతే, అమెరికా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరింత ధనాన్ని ముద్రించాల్సి వస్తుంది. దీనికి తోడు అమెరికా ని డీప్ స్టేట్, ఓకిజం, ఎల్.జి.బి.టి, ముస్లిం లు, మెక్సికన్ లు అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదంతా అమెరికా స్వయంకృతాపరాధం.
మన ముందున్నది ఒక చారిత్రాత్మక ఆర్థిక పునర్నిర్మాణం. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి, కేంద్ర బ్యాంకులు అమెరికా నిల్వల కన్నా బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్ సహా గ్లోబల్ సౌత్ దేశాలు నిశ్శబ్దంగా తమ రిజర్వులను మార్చుకుంటున్నాయి. బ్రిక్స్, జీ7కి ప్రతిబంధకంగా ఎదుగుతోంది.
డాలర్ ఒక్కసారిగా కనుమరుగవ్వదు, కానీ దాని ఆధిపత్యం క్రమంగా క్షీణించే దశలో నడుస్తోంది. గతంలో ఆ ప్రయత్నం చేసిన దేశాలు చివరకు అమెరికాకు వశమైపోయిన ఉదాహరణలు ఉన్నాయి (వీలైతే అదికూడా చదవండి Click here Japan). అయితే, భారత్ మాత్రం ఈ విషయంలో తన అడుగులు స్పష్టంగా వేస్తోంది. ప్రపంచం ఇప్పుడు ఒక మల్టీ–పోలార్ కరెన్సీ (Multipolar currency) యుగం వైపు పరుగులు తీస్తోంది - అంటే డాలర్‌పై ఆధారపడకుండా పలు దేశాల కరెన్సీలు ప్రపంచ వాణిజ్యంలో సమాన ప్రాధాన్యం పొందే దశ. రాబోయే కొద్ది సంవత్సరాల్లో డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గిపోవడం మనం చూడబోతున్నాం. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.