చైనా భారత్ తో ఎందుకు కలిసి నడవాలి:
లడాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్‌స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యూహాత్మక స్థావరం. ఇది ఇప్పుడు భారత ఆర్మీకి అద్భుత బలం ఇస్తోంది. గతంలో లేహ్ నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి రెండు రోజులు పట్టేది. కానీ కొత్త రహదారి వలన కేవలం ఆరు గంటల్లోనే సైన్యం చేరుతోంది.
13,400 అడుగుల ఎత్తులో నిర్మాణంలో ఉన్న న్యోమా ALG పూర్తవగానే ఫైటర్ జెట్స్ ల్యాండ్ అవుతాయి. ఇప్పటికే దౌలత్ బేగ్ ఓల్డీ, ఫుక్చే, చుషుల్ ఎయిర్‌స్ట్రిప్‌లు బలోపేతం అయ్యాయి. దీంతో ఇండియన్ ఆర్మీ ఎత్తైన ప్రాంతాల్లో 12 నెలలూ బలగాలను నిలుపగలుగుతోంది. ఆయుధాలు, ఇంధనం, ఆహారం, మెడికల్ సపోర్ట్ 365 రోజుల్లోనూ చేరడం సాధ్యమైంది.
అరుణాచల్‌లోని సెలా టనెల్ వలన తవాంగ్ ప్రాంతానికి చలికాలంలో కూడా సైన్యం 24×7 చేరగలుగుతోంది. లదాఖ్‌లో నిర్మాణంలో ఉన్న శింకు లా టనెల్ 15,855 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యున్నత టనెల్‌గా నిలవనుంది.
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) గత ఐదేళ్లలో ₹16,000 కోట్లతో 450 ప్రాజెక్టులు పూర్తి చేసింది. రహదారులు, వంతెనలు, టనెల్లు, ఎయిర్‌ఫీల్డ్స్ ఇవన్నీ కలిపి భారత్ చైనాకు సమాధానం చెప్పే స్థాయికి తీసుకెళ్లాయి. మరియు చైనా కు భారత్ లో జరిగే వ్యాపారం గత పదేళ్లలో దారుణంగా పడిపోయింది, అందుకే చైనా మనతో కలిసి నడవాలనుకొంటోంది.
అమెరికా ఎవరైనా ఎదుగుతుంటే చూస్తూ తట్టుకోలేదు, ఎలాగైనా నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. మొదట జపాన్ తరువాత చైనా ఇప్పుడు భారత్?
ప్రపంచ రాజకీయాలను మనం నిశితంగా గమనిస్తే, ఏదైనా దేశం అమెరికాకి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దగ్గరగా వచ్చిందంటే దానిని అమెరికా వెంటనే ఎలా కట్టడి చేయాలా అని ఆలోచిస్తుంది. అమెరికా విధానం 1970ల నుండి ఇప్పటి వరకు అలానే వుంది.
మొదట జపాన్ ని కోలుకోలేని దెబ్బకొట్టింది. అదెలాగో చూద్దాం.. 1970-80 లలో జపాన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సోనీ, టయోటా, తోషిబా వంటి కంపెనీలు అమెరికన్ కంపెనీలను మించి వ్యాపారాన్ని చేశాయి. ఆటోమొబైల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లలో ఆధిపత్యం సాధించింది. ఈ ఎదుగుదలతో అమెరికా ఆందోళన చెందింది. 1985 లో జపాన్ మరియు జర్మనీ దేశాలు తమ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ దాదాపు 50% పెరిగాయి. UK మరియు ఫ్రాన్స్ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. ప్లాజా అకార్డ్ అనేది డాలర్ విలువను తగ్గించడానికి మరియు ఈ 4 దేశాల మార్కెట్లలో US ఎగుమతులను మరింత పోటీతత్వంతో ఉండేలా చేయడానికి చేసిన ప్రయత్నం. 1985లో ప్లాజా అకార్డ్ ఒప్పందం ద్వారా యెన్ విలువను పెంచేలా బలవంతపెట్టింది అమెరికా. రెండు సంవత్సరాల్లో యెన్ 50% బలపడటంతో జపాన్ ఎగుమతులు కుప్పకూలాయి. ఆర్ధికంగా జపాన్ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ మిగతా మూడు దేశాలు అమెరికాతో జాగ్రత్తగా మసలుకొని బయటపడ్డాయి, మొన్న సమావేశం లో కూడా చూసుంటారు అమెరికా ఏదంటే అదే ఈ దేశాలు..
తరువాత చైనా వంతు వచ్చింది. 1980–2000 మధ్య చైనా GDP రెండంకెల వృద్ధి సాధించింది. WTO లో చేరి “ప్రపంచ కర్మాగారం” గా రూపాంతరం చెందింది. అమెరికా ఆశించినట్టుగా చైనా రాజకీయంగా మారిపోలేదు. బదులుగా, US మూలధనం, సాంకేతికత, మార్కెట్లను వాడుకొని తయారీ, 5G, AI, EVలు, సోలార్ వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించింది. 2014 నాటికి చైనా PPP పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. 2020 నాటికి ఆసియాలో అమెరికా సైనిక ప్రాధాన్యతకు సవాలు విసిరింది. దీనితో అమెరికా వ్యూహం మారింది. వాణిజ్య యుద్ధాలు, టెక్ ఆంక్షలు, ఇండో-పసిఫిక్ పొత్తులు అన్నీ చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా వచ్చాయి. కానీ జపాన్ లాగా చైనా లొంగలేదు. అమెరికా ఎన్నో ఎత్తులు వేసింది కానీ చైనా తట్టుకుని నిలబడింది. రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, బెల్ట్ రోడ్, BRICS, SCO వేదికలతో ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించింది.
ఇప్పుడు భారత్ పై అమెరికా దృష్టి పెట్టింది. ఈ దశాబ్దంలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది. IT, ఫార్మా, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష రంగంలోనే కాకుండా తయారీలో కూడా అగ్రగామిగా నిలుస్తోంది. 2035-40 నాటికి PPP (Purchasing Power Parity) GDPలో అమెరికాను కూడా అధిగమించే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే అమెరికా ఒత్తిళ్లు ప్రారంభించింది. 2019లో భారతదేశానికి ఉన్న GSP వాణిజ్య ప్రయోజనాలను తొలగించింది. రష్యన్ ఆయుధాల కొనుగోలుపై CAATSA ఆంక్షల బెదిరింపు వచ్చింది. చౌకైన రష్యన్ చమురుపై ఒత్తిడి తెస్తోంది. 50 % సుంకాలు విధించింది. రక్షణలో అమెరికన్ ఆయుధాలను కొనమని బలవంతం చేస్తోంది. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఇలాంటి వాటిని భూచిగా చూపుతోంది. అమెరికా సలహాదారుడు నవారే రష్యన్ ఆయిల్ కొని బ్రాహ్మణులు కోట్లు గడిస్తున్నారు అంటూ కులాల మధ్య గొడవలకు ప్రయత్నం చేస్తోంది. అలాగే డీప్ స్టేట్, వోకిజం ఇలా అనేకం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లలో అస్థిరత తీసుకొచ్చి, భారత్ పైకి అక్రమ వలసలని ప్రోత్సహిస్తుంది, డాలర్ ఆధిపత్యం ద్వారా ఒత్తిడి, NGOలు, మీడియా ద్వారా రాజకీయ జోక్యం, ఇలా ఒకటేమిటి అనేకం ఇవన్నీ భవిష్యత్తులో భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్లే.
ఈ పరిస్థితిలో రష్యా మనకు కీలకం. రాయితీ చమురు, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, BRICS-SCO వేదికల ద్వారా అమెరికా నియంత్రణ వెలుపల మన స్థానం బలపడుతోంది. రష్యాతో సంబంధాలు తెగిపోతే, భారత్ కూడా జపాన్ లాగా ఆధారపడే పరిస్థితిలో పడిపోవచ్చు.
జపాన్ అమెరికాను నమ్మి తన భవిష్యత్తును కోల్పోయింది. చైనా తన స్వంత మార్గాన్ని నిర్మించుకొని, రష్యాపై ఆధారపడుతూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. భారత్ ఈ రెండింటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాదు అమెరికాకి చుక్కలు చూపించే ప్రక్రియ కుడా మొదలుపెట్టింది. BRICS, RIC (Russia-Indi-China) బలోపేతం చేస్తుంది. గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించే దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. కాబట్టి మనమంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిద్దాం.. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.