August 27, 2025 న అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ని FOX న్యూస్ యాంకర్ భారతదేశం డాలర్‌తో కాకుండా రూపాయితో వాణిజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని మీరు ఆందోళన చెందుతున్నారా? అని అడిగాడు. దాంతో స్కాట్ మొహం ఒక్కసారిగా గంభీరంగా మారి, రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని దాంతో ఎవరూ వ్యాపారం చేయరు అంటూ ఎగతాళి గా సమాధానం చెప్పాడు.ఈ సమాధానం తో అనేకమంది అమాయకులు వంతపాడుతూ రూపాయికి విలువనే లేదు అనే రకంగా వాదిస్తూ వారి లేకి బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. భారతదేశం లో ఇలాంటి మాటలకు కొదవ లేదు. కాకపొతే వాస్తవాలు వేరే ఉన్నాయి అవేంటో చూద్దాం...
అమెరికన్లకు, మన అతి తెలివి మేధావులకు అర్థంకావల్సింది. భారతదేశం ఇప్పటికే BRICS దేశాలతో రూపాయితోనే వ్యాపారం మొదలుపెట్టాము. మనం రష్యా నుండి చమురు కొనుగోలు రూపాయి, రూబుల్, దిరుహమ్, యువాన్ ల తో చెల్లిస్తున్నాము.
అమెరికా 50% సుంకాలు అమలులోకి రావడంతో కొంత గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, భారత దేశం సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిదాడిని ప్రారంభించింది. UK, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, కెనడా, మెక్సికో, రష్యా మరియు ఆస్ట్రేలియాతో సహా 40 కీలక ప్రపంచ మార్కెట్లలో వస్త్ర ఎగుమతులను పెంచడంపై దృష్టి పెట్టింది. ఇంకా అనేకమైన దారులు భారత్ కి తెరుచుకుని ఉన్నవి, ఇంకా పూర్తి స్థాయిలో భారత్ ఆట మొదలెట్టలేదనే చెప్పాలి.
రూపాయి విలువ కనిష్ట పతనం గురించి మనం ఏ మాత్రం చింతించాల్సిన పని లేదు. అమెరికన్లకు, మన భారతీయులకు తెలియని ఒక బంగారం సత్యం దాగి ఉంది. నిజమే… రూపాయి డాలర్‌తో పోల్చితే చాలా బలహీనంగా మారింది. కానీ ఇక్కడే అమెరికన్లు, గ్రహించని విషయం ఒకటుంది. గత 15 ఏళ్లలో భారతీయుల బంగారంపై పెట్టుబడులు మీరు ఊహించని విధంగా ఉన్నవి.
గత 15 సంవత్సరాల్లో భారతీయులు సుమారు 10,000 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నారు. అంటే, ప్రతి సంవత్సరం సగటున 700 టన్నుల బంగారం దేశంలోకి వచ్చింది. ఈ బంగారం విలువ నేటి పరిస్థితిలో 1 ట్రిలియన్ అమెరికా డాలర్లు.
ఈ 15 సంవత్సరాల్లో డాలర్ తో పోల్చితే రూపాయి విలువ 88% పడిపోయింది. కానీ అదే సమయంలో భారతీయులు కొనుగోలు చేసిన బంగారం విలువ 445% పెరిగింది. అంటే, రూపాయి బలహీనమైందనేది ఒకవైపు నిజం అయినా… ఆ రూపాయిని ఉపయోగించి కొనుగోలు చేసిన బంగారం విలువ డాలర్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పెరిగింది.
అమెరికన్లు ఎప్పుడూ రూపాయి విలువ తగ్గిపోతుందని మాత్రమే చూస్తారు. కానీ భారతీయులు పెట్టుబడి పెట్టిన బంగారం రూపాయి డాలర్ కి మించి ఉన్న ఆర్థిక బలాన్ని అందించింది. అంటే, రూపాయి బలహీనమైనా భారతీయులు పెట్టుబడి చేసిన బంగారం వారిని మరింత ధనవంతులను చేసింది. బంగారం పై పెట్టుబడి ఇప్పుడు ఆర్థిక రక్షణ కవచంగా మారింది. డాలర్ బలమైనా, రూపాయి బలహీనమైనా – బంగారం మీద భారతీయుల నమ్మకం వారికి నిజమైన ఆర్థిక శక్తిని ఇచ్చింది.
ఉదాహరణకు: 2010 లో ఒక గ్రాము బంగారం విలువ: Rs.1850/- అలాగే ఒక డాలర్ విలువ: Rs.46.02
మరి 2025 లో ఒక గ్రాము బంగారం విలువ: Rs. 10075/- అలాగే ఒక డాలర్ విలువ: Rs.87.72.
భారత ఆర్ధిక వ్యవస్థకు ఎటువంటి డోకాలేదు. అలాగే మనం అతి త్వరలో ప్రపంచంలోనే ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నాం, మనం చూస్తూ ఉందాం అంతే, వీలైతే మనం కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుందాం. అమెరికా మరియు ట్రంప్ భారత యొక్క శక్తి తెలుసుకొని అతి త్వరలో తన నిర్ణయాన్ని మార్చుకుని ఎటువంటి నిబంధనలు లేకుండా సుంకాలు తగ్గిస్తారు, భారత్ తో కలిసి నడుస్తారు. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds