ప్రపంచ చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభమైంది. శతాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు ఆధిపత్యాన్ని చాటుతూ మానవజాతి గమ్యాన్ని నిర్ణయించాయి. కొన్ని దేశాలు అధోగతి పాలయ్యాయి. కానీ ఇప్పుడు రష్యా, చైనా, భారత్ అనే మూడు మహా నాగరికతలు మళ్లీ పునరుజ్జీవన దిశగా పయనిస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్, నరేంద్ర మోడీ తమ తమ దేశాలను వేల సంవత్సరాల సంస్కృతి, ఆధ్యాత్మికత, చరిత్ర మీద నిలబెట్టిన నాగరికతను ఆవిష్కరిస్తున్నారు. ఇది కొత్త యుగానికి నాంది పలుకుతోంది.
రష్యా – తూర్పు క్రైస్తవ వారసత్వం: రష్యా చరిత్రలో ఆధ్యాత్మికత ఎప్పుడూ ప్రధాన బలం. బయజాంటిన్ క్రైస్తవత, స్లావిక్ మూలాలు రష్యాను ప్రత్యేక నాగరికతగా నిలబెట్టాయి. "మూడవ రోమ్" గా తమ పాత్రను రష్యన్లు ఇప్పటికీ విశ్వసిస్తారు. పాశ్చాత్య దేశాలు క్రైస్తవ మూల సారం వదిలి భౌతికవాదం వైపు వెళ్ళినా, రష్యా తన సాంస్కృతిక గుణాన్ని నిలబెట్టుకుంది. కీవన్ రస్ (10వ శతాబ్దం) కాలంలో బయజాంటిన్ ప్రభావం, క్రైస్తవ మతం రాకతో వాస్తుశిల్పం, సాహిత్యం వికసించాయి. తరువాత మాస్కోవైట్ యుగంలో రష్యా ఏకీకృతమై క్రెమ్లిన్, చర్చిల ఫ్రెస్కోలు, ఐకాన్ పెయింటింగ్ పునరుజ్జీవించాయి. పీటర్ ది గ్రేట్ కాలంలో పాశ్చాత్య యూరప్ ప్రభావం, ఆధ్యాత్మిక విలువలు రష్యా సంస్కృతిని కొత్త దశలోకి నడిపించాయి. నేడు పుతిన్ ఆ వారసత్వాన్ని మేళవిస్తూ రష్యాను ప్రపంచ శక్తిగా మలుస్తున్నారు.
చైనా – కన్ఫ్యూషియన్ పునరుద్ధానం: చైనీయుల ఆలోచనా మూలం కన్ఫ్యూషియన్ తత్వం. మావోయిజం, డెంగ్ జియావోపింగ్ సంస్కరణలు ఆధునికతను తెచ్చినా, జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా తన నాగరికత మూలాలకు చేరింది. “హార్మనీ” అనే కన్ఫ్యూషియన్ భావన ఆధారంగా ఆర్థిక విధానాలు, సాంకేతిక అభివృద్ధి కొనసాగుతున్నాయి. హై–టెక్ పరిశ్రమలు, బెల్ట్ రోడ్, డిజిటల్ కరెన్సీలు చైనాను స్వతంత్ర శక్తిగా మార్చుతున్నాయి.
భారత్ వేద నాగరికతకు పునరుజ్జీవనం: వలసరాజ్యాల పాలనతో పాశ్చాత్య మార్గంలో నడవాల్సి వచ్చిన భారత్, నరేంద్ర మోడీ నాయకత్వంలో తిరిగి తన మూలాలను తిరిగి పొందుతుంది. యోగ, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శక సూత్రాలుగా నిలుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులు ఒకవైపు ఆధునిక సాంకేతికతను ముందుకు తీసుకెళుతుంటే, మరొకవైపు భారత సంస్కృతిని పునరుద్ధరిస్తున్నాయి.
సంస్కృతుల మేళవింపు: రష్యా ఆర్థడాక్స్ క్రైస్తవం, చైనా కన్ఫ్యూషియన్ సూత్రాలు, భారత వేద ధర్మం, సనాతన హిందూ ధర్మం ఈ మూడు నాగరికతలు పాశ్చాత్య భౌతికవాదాన్ని సవాలు చేస్తున్నాయి. స్వంత విలువలపై ఆధారపడి నిర్మితమైన ఈ మార్గమే ప్రపంచానికి మేలు కలిగిస్తాయి.
ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న మహా త్రయం: రష్యా చమురు, సహజ వాయువు, రక్షణ రంగంలో ముందంజలో ఉంది. చైనా తయారీ, సాంకేతికత, గ్లోబల్ ట్రేడ్ లో అగ్రగామి. భారత్ ఐటీ, స్టార్టప్‌లు, అంతరిక్ష రంగంలో వేగంగా ఎదుగుతోంది. 2030 నాటికి ఈ మూడు దేశాలు ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో కీలక భాగాన్ని ఆక్రమిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాశ్చాత్య ఆధిపత్యానికి ముగింపు: వలసరాజ్యాల కాలంలో పాశ్చాత్య దేశాలు వనరుల కోసం మిగతా ప్రపంచాన్ని వాడుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ శకం పూర్తయింది. రష్యా, చైనా, భారత్ తమ స్వంత ఆర్థిక సాంస్కృతిక నమూనాలను ప్రపంచం ముందుంచారు. పాశ్చాత్య విధానం ఇక మార్గదర్శకంగా నిలవలేని స్థితి వచ్చింది. బ్రిక్స్, SCO వంటి వేదికలు కేవలం ఆర్థిక లేదా సైనిక ఒప్పందాలు కాదు; నాగరికతల పునరుద్ధాన వేదికలు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇస్లామిక్ ప్రపంచం కూడా ఈ దేశాల మాట వినక తప్పదు. పాశ్చాత్య ఆధిపత్యం ముగిసింది. గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక యుగం మొదలయ్యింది. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.
Civilization-States, Multipolar World Order, Russia Civilization State, China Civilization State, India Civilization State, Vladimir Putin leadership, Xi Jinping leadership, Narendra Modi leadership, Cultural revival, Spiritual heritage, Confucian values, Vedic civilization, Orthodox Christianity Russia, BRICS role, Geopolitical transformation, End of Western dominance, De-dollarization, Strategic autonomy, Global South rising, Ancient civilizations revival