సెమికండక్టర్ల గురించి పూర్తి సమాచారం ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత, పారిశ్రామిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను అందుకోవడానికి దేశం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దశాబ్దాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, భారత్ సెమీకండక్టర్ రంగంలో క్రమంగా ముందుకు సాగింది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మనం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం అయినప్పటికి వెనుకబడే ఉన్నాం.
1960లలో కొంతమంది భారతీయ కంపెనీలు జర్మేనియం సెమీకండక్టర్ల ఉత్పత్తి వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇది చిన్న స్థాయిలో ఉన్నా, భారతదేశం సెమీకండక్టర్ సాంకేతికతలో అడుగుపెట్టిన తొలి ఘట్టం. ఈ కాలంలోనే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) టెక్నాలజీలో పయనీర్ అయిన ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్స్ ఆసియా యూనిట్ కోసం భారత్‌ను పరిశీలించింది.
ఈ దశలో ముఖ్య పాత్ర పోషించిన సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL). ఇది రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU). BEL జర్మేనియం, సిలికాన్ సాంకేతికతను స్వీకరించి సెమీకండక్టర్ పరికరాల తయారీ ప్రారంభించింది. BELతో పాటు, మరో PSU అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కూడా రక్షణ రంగానికి ముఖ్యమైన మద్దతునిచ్చింది. ఈ ప్రయత్నాల ద్వారా భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తికి బలమైన పునాదులు ఏర్పడ్డాయి.
1980లలో భారత సెమీకండక్టర్ రంగం ఒక కీలక మలుపు తీసుకుంది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ visionary విధానాలు ఈ రంగానికి ఊపునిచ్చాయి. 1984లో స్థాపించబడిన సెమీకండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ (SCL) ఈ కాలంలో ఒక ప్రధాన ఘట్టం. హిటాచీ, AMI, రాక్‌వెల్ వంటి ప్రపంచ దిగ్గజాలతో లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారా భారత్ ఆధునిక సెమీకండక్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందింది.
అదే సమయంలో, నేషనల్ సిలికాన్ ఫెసిలిటీ స్థాపన కోసం ప్రభుత్వం గ్లోబల్ కంపెనీలను ఆహ్వానించింది. అమెరికా, ఈస్ట్ జర్మనీ కంపెనీలు ఆసక్తి చూపగా, చివరకు Metkem Silicon Ltd. (BEL మద్దతుతో) మెట్టూర్, తమిళనాడులో పోలిసిలికాన్ యూనిట్లను ప్రారంభించింది. అయితే, 1989లో చండీగఢ్‌లోని SCL కాంప్లెక్స్లో జరిగిన పెద్ద అగ్నిప్రమాదం భారత్ సెమీకండక్టర్ కలలను దెబ్బతీసింది. తిరిగి ఆ యూనిట్‌ను ప్రారంభించినప్పటికీ, అది ప్రధానంగా ISRO అవసరాలకే చిప్‌లను సరఫరా చేయగలిగింది. 1991లో ఆర్థిక సంస్కరణల తరువాత, చవకైన దిగుమతి సెమీకండక్టర్లు భారత్ మార్కెట్లోకి రావడంతో స్థానిక పరిశ్రమ కష్టాల్లో పడింది. అదనంగా, విద్యుత్ ఖర్చులు, సబ్సిడీల లోపం వంటి సమస్యలు పరిశ్రమను మరింత వెనక్కు నెట్టాయి. ఇంతలో తైవాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టి ప్రపంచ మార్కెట్‌ను తమదిగా చేసుకున్నాయి.
2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చాక దీనిపై వ్యూహాత్మక దృష్టి పెట్టింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో సెమీకండక్టర్ డిజైన్ సబ్జెక్టులు ప్రవేశపెట్టారు. 2021లో ₹76,000 కోట్లతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. కొత్త ఫ్యాబ్ పరిశ్రమలకు 50% సబ్సిడీ ఇవ్వడం, స్టార్టప్‌లకు ₹15 కోట్లు అందించడం వంటి ప్రోత్సాహకాలు అందించారు. 2025 నాటికి దేశంలో మొత్తం ₹1.68 లక్షల కోట్ల పెట్టుబడితో 10 ఫ్యాబ్ ప్రాజెక్టులు ఆంధ్ర, అస్సాం, గుజరాత్, ఒడిశా, పంజాబ్, యూపీ రాష్ట్రాలలో ప్రారంభమవుతున్నాయి. మొహాలి SCCలో 28nm టెక్నాలజీని ఉత్పత్తి చేయడానికి కొత్త సదుపాయాలు ఏర్పడుతున్నాయి. 2023లో దీనికి అదనంగా ₹10,000 కోట్లు కేటాయించారు.
2024లో ప్రధాని మోడీకి ISRO అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి దేశీయ సెమీకండక్టర్ చిప్ – “విక్రమ్” (32-బిట్ ప్రాసెసర్) ను అందజేశారు. ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారవడం విశేషం. ఇది ఒక చిన్న అడుగు అయినప్పటికీ, భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ $600 బిలియన్లకు పైగా ఉంది. ఇందులో తైవాన్ (TSMC) దాదాపు 60% ఆధిపత్యం కలిగి ఉంది. దక్షిణ కొరియా, అమెరికా, చైనా ఇతర ప్రధాన ఉత్పత్తిదారులు. భారత్ ఇంతవరకు దాదాపుగా 100% దిగుమతులపై ఆధారపడి ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థలో లక్షల కోట్ల రూపాయల లోటును సృష్టిస్తోంది.
మన దేశం ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణాలు: దూరదృష్టి లేకపోవడం, పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం లేకపోవడం, పరిశోధన–అభివృద్ధి (R&D) లో నిర్లక్ష్యం లాంటి కారణాల వల్ల 1980లో మనకున్న అవకాశాన్ని కోల్పోయి, చైనాకు ముందువరస ఇవ్వాల్సి వచ్చింది.
భారతదేశం ఇప్పుడు కొత్త దిశలో ముందుకు సాగుతోంది. కానీ ఒక ఫ్యాబ్ పరిశ్రమను ఏర్పాటు చేసి, గ్లోబల్ మార్కెట్‌కు సరిపడే స్థాయిలో ఉత్పత్తి చేయడానికి కనీసం 7–10 సంవత్సరాలు పడుతుంది. అంటే 2032 నాటికి భారత్ 28nm–14nm చిప్స్‌లో పోటీ ఇవ్వగలదు. అప్పుడు మెల్లగా 7nm, 5nm స్థాయికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణం కష్టం కానీ అసాధ్యం కాదు. ప్రస్తుత పెట్టుబడులు, యువ ఇంజనీర్ల శక్తి, ప్రభుత్వ విధానాలు కుదిరితే భారత్ “సెమీకండక్టర్ రివల్యూషన్” లో తప్పకుండా భాగస్వామి అవుతుంది. రాబోయే విద్యా సంవత్సరం లో ఆసక్తి ఉన్న మీ పిల్లల్ని EEE ఇంజినీరింగ్ విద్యవైపు మరల్చండి, భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి.
ఢిల్లీ యశోభూమి ప్రాంగణంలో సెప్టెంబరు 2,3,4 న మూడు రోజుల పాటు జరుగుతున్న #SEMICONIndia2025 లో 48 దేశాల నుండి 350+ exhibitors, 20,750 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 150+ global speakers పాల్గొంటున్నారు. మొదటి రోజు సెప్టెంబర్ 2 న ప్రధాని మోడి గారు మన హైదరాబాదు కుర్రాళ్లు తయారు చేసిన చిప్ ను ఆవిష్కరించారు.
ఈ సమ్మిట్ యొక్క లక్ష్యం భారత్ ని పూర్తి-స్థాయి semiconductor ecosystem—fabs, packaging, & testing. 6G innovation, 85,000 trained professionals, & sustainable manufacturing 2030 నాటికి తయారుచేయాలన్నది లక్ష్యం. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds
Semiconductor, India Semiconductor Mission, SEMICONIndia2025, Chip Design, Chip Manufacturing, Fab Units, OSAT, Silicon Wafer, 3D Packaging, SiC Chips, Micron Gujarat Plant, AMD, Applied Materials, Lam Research, Semiconductor Startups, Design Linked Incentive (DLI), Chips to Startup (C2S), Semiconductor Ecosystem, Semiconductor Market

