Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గ్రామాల్లో ఒకప్పుడు గోవు సంపద - megaminds

  గ్రామాల్లో ఒకప్పుడు గోవు సంపద. ఎన్ని ఎకరాల భూమి తో పాటు ఎంత పశు సంపద అనేది కూడా లెక్కల్లో ఉండేది. రైతు పెద్ద పెట్టుబడి దారుడు, వ్యవసాయ...

 Image result for COW INDIA
గ్రామాల్లో ఒకప్పుడు గోవు సంపద. ఎన్ని ఎకరాల భూమి తో పాటు ఎంత పశు సంపద అనేది కూడా లెక్కల్లో ఉండేది. రైతు పెద్ద పెట్టుబడి దారుడు, వ్యవసాయం పెద్ద పరిశ్రమ. కష్ట పడటం చూసి
శ్రీ శ్రీ
పొలాలన్ని హలాన దున్ని,
ఇలా తలం లో హేమం పిండగ
భూమినుండి బంగారం పండించే రైతు ఈ రోజు 3వ తరగతి మనిషి. రైతులంటే పిల్లనివ్వడం కూడా జరగని పరిస్థితి. కారణం సౌకర్యాల వృద్ధి పెరగడం వల్ల కష్ట పడటం అలవాట్లు తప్పాయి. ఉద్యోగాలు ఇచ్చే రైతు కంటే బంట్రోతు ఉద్యోగం చేసే వాడు కూడా రైతు లను చీదరించుకునే పరిస్థితి. కారణం రైతులకు కావలసిన ప్రతి వస్తువు కొరకు పట్టణాల పై ఆధార పడాల్సి వచ్చింది.
శరీర కష్టం స్ఫురింపచేసే
రంపం కొడవలి గొడ్డలి నాగలి
అని శ్రీ శ్రీ అంటే అవి పనికి మాలిన వస్తువులు అయిపోయాయి. పని చేసే వాడి కరువు గ్రామాల్లో ప్రతిచోటా కనిపిస్తుంది.
రైతు గో ఆధారిత పాలు, వెన్న, నెయ్యి ముఖ్య ఆదాయంగా ఉండేది. పశువుల మూత్రము, పేడ కల గలుపు ఎరువు అయ్యేది. ఎరువులు పరిశ్రమల్లో తయారై, పశువుల పేడ ఛి ఛి అంటరానిదయ్యింది.
నాగరికత గ్రామలకు చేరి భూమితో సంబంధం పరిశుభ్రత కు అవరోధం అయ్యింది
దేన్నింఛి తింటున్నామో అది అనాగరికం అయిపోయింది. యంత్రాలు రాగానే పశువులు భారం అయినాయి. కోతకు ఇస్తే డబ్బులొస్తే ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కొని పనికి రానివన్నీ హయి గా చోడోచ్చు. వినొచ్చు.
శ్రామిక మాటల, పాటల కమ్యూనిస్టులు ఇప్పుడు సుఖాలకు మరిగి దేశం, జాతిని తిట్టడానికి పరిమితం అయ్యారు.
నాకు కవిగా శ్రీశ్రీ ఆరాధ్యుడు. కమ్యూనిస్టుల సిద్ధాంతం ప్రవచించి దాని మకిలం తో పాటు కనపడకుండా పోయాడు.
గ్రామాని మనుషులు చేరాలంటే పశువులు ముందు చేరాలి. అందు కో గోవు కావాలి ఎద్దు కావాలి, బర్రె కావాలి దున్నపోతు కావాలి. గోర్రీ కావాలి, పోతు కావాలీ. మేక కావాలి, చింబోతు కావాలి. అవి గ్రామం చేరితే రైతు చేరుతాడు. పశువుల పేడే కాదు గో మూత్రం మంచి మందు అయ్యి అమ్ముకునే వస్తువయ్యింది. మళ్ళీ పాలకోవలు బిల్లలుగా చేసే పరిశ్రమ వస్తుంది.
రైతు గ్రామానికి వెళ్తే గోరేటి ఎంకన్న పాడే అన్నివృత్తులు గ్రామం చేరుతాయి. అందుకే మోడీ పశు వధ ఆపడం కోసం చట్టం చేశాడేమో. మళ్ళీ గ్రామ స్వరాజ్యం వస్తుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments