Page Nav

HIDE
GRID_STYLE

Latest Posts

latest

ఒకే జాతి ఒకే వారసత్వం - megaminds

ఇంగ్లిష్ జాతి వాళ్లకి వారసత్వం సంపద గా భారతీయులు ఉండరు. ఫ్రెంచ్ వాళ్ళ కు ఆంగ్లేయుల వారసత్వం ఉండదు. ఒక దేశానికి, ఒక జాతికి ఒకే వారసత్వం ఉంట...

ఇంగ్లిష్ జాతి వాళ్లకి వారసత్వం సంపద గా భారతీయులు ఉండరు. ఫ్రెంచ్ వాళ్ళ కు ఆంగ్లేయుల వారసత్వం ఉండదు. ఒక దేశానికి, ఒక జాతికి ఒకే వారసత్వం ఉంటుంది. కాని మన ప్రతిజ్ఞ లో మనం - సుసంపన్నమైన, బహువిధములైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం అని చదువుతాము. ఇంగ్లిష్ లో and I am proud of its rich and varied heritage, అంటాము. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? వారసత్వం అంటే మన వాళ్ళ నుండి మనకు సంక్రమించినదే. మనవాళ్ళు ఒక్కటిగానే ఉంటారు. కాని బహు విధాలుగా ఎందుకుంటుంది? ఈ సందేహం మనకు ఎందుకు రాదు?
ఇంగ్లిష్ వాడు మనకు చొప్పించిన విద్య మాత్రమె మనం ప్రమాణం గా స్వీకరించి, మనదనే దాన్ని తృణ ప్రాయం చేసాము. ఆర్యులు, ద్రావిదులు రెండు జాతులంటే, మనమూ చెవులూపాము. రవీంద్రనాథ్ ఠాగూర్ దక్షిణాపాధాన్ని ద్రావిడ భూమి అని జనగన మన లో చెప్పినా, ఈ రెండు జాతుల సిద్ధాంతం మనకు వంటపట్టింది. ఇది తప్పు అని అరిచిగీపెట్టినా మనకు ఎక్కదు. పైగా ఆర్యులు ఎక్కడినుండూ వచ్చి ఇక్కడి వాళ్ళను తరిమేశారు అంటే గంగిరెద్దుల్లా తలలూపాము. హిందూ అనే పదం మీది కాదు, ఆరబ్బులు పెట్టారంటే, మనం ఒప్పేసుకున్నాము. ఇప్పుడు మరో సిద్ధాంతం అమెరికా ప్రయోగ శాలలో తయారయ్యింది. అది మూల వాసులు. ఈ దేశాన్ని విడగొట్టడానికి జరిగే అన్ని ప్రయోగాలను మనమే ప్రచారం చేసి, మనమేవరమో మనకు తెలియని స్థితి కి చేరుకున్నాము.
మనదేశం పేరు తెలుగులో భారత దేశం, ఇంగ్లిష్ లో ఇండియా అని నామ వాచకం(proper noun)కూడా తర్జుమా చేసే న్యూనతా భావానికి లోను అయ్యాము. ముందు ఆర్యులు, గ్రీకు వారు హూణులు, కుషాణులు, లొడీలు ఖిల్జీలు, మొగలులు ఎందరో వచ్చారు. తరువాత మేము వ్సచ్చామని, ఇంగ్లిష్ వాడు అంటే నిజమే కాదా అనుకున్నాము. ఇది సత్రం స్వంత దారులు ఎవరూ లేరని వాడు చెబితే అదే చదువుకున్నాం. ఆ చదువులో ఐఏఎస్ లం కూడా అయ్యాము. అంత మాంది వారసత్వ సంపద కాబట్టి బహువిధాలైన వారదత్వం అంటే అదే మనం కూడా నమ్మి చెప్పుకుంటున్నాము.
వేల సంవత్సరాలు కాదు, యుగ యుగాలుగా ఒక జాతి ఈ దేశంలో ఉంది అది భారత జాతి. ఈ దేశస్థులు భారతీయులు అని ఇతిహాసాలకు పూర్వ సాహిత్యం పురాణాల్లో ఉందని సంఘం చెబితే, ఇంగ్లిష్ వాడు పుక్కిట పురాణం అంటే మనం కూడా అదే ఆన్నాము. భగవద్గీత లో భగవానుడు అర్జునిడిని భారతా అని సంబోధిస్తాడు. అది ఈ జాతి పరంగా వాడిన మాట కాని వాళ్ళ నాన్న అతనికి పెట్టిన పేరుకాదు కదా అని మనకు సంశయం రాదు.
అలెగ్జాండర్ విదేశీయుడు,ఆకృమణ దారుడు హూణులు కుషాణులు అదే
ఘోరి, బాబర్, నవాబు లు ఆక్రమణ దారులే
ఇంగ్లిష్, ఫ్రెంచ్, డచ్ వారు ఆక్రమణ దారులే
అనాదిగా ఇక్కడుండే జాతికి వారు పరాయి వారె. ఇక్కడుండే జాతీయలందరికీ పై వాళ్ళు విదేశీయులు, విజాతీయులు, ద్రోహులు. దండయాత్రలు చేసిన విద్రోహకారులు. ఇది నిబ్బరంగా చేప్పాలి. తప్ప నసగ కూడదు.
భారత దేశం లో అనేక మతాలు ఉన్నాయి. అందులో మొదటినుండి ఉండే మతాలే కాకుండా విదేశీ రాజులతో ఇస్లాము, క్రైస్తవం చేరాయి. అంతే కాని ఇక్కడి వారి జాతీయత, పూర్వీకుల పరంపర మారలేదు. అన్ని మతాల ను సమాదరణ ఈ జాతి లక్షణం. కాని మతం వేరు కాబట్టి మనం వేరే జాతి కాదు. అందరం ఒకే జాతి.
మన దేశం కాకుండా ఇతర దేశాల్లో కూడా మతాన్ని బట్టి జాతి లేదు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ వారు అందరూ క్రిస్టియన్లే అయినా రెండు వేరే జాతులు దేశాలను బట్టి వేరు వేరు. ముస్లిం మతం 13 దేశాల్లో ఉన్నా ఈ దేశపు జాతి ఆదేశానిదే. ఏ దేశం హీరో లు ఆ దేశం వారే. ఇరాన్ దేశ హీరో ఇరాక్ దేశ హీరో కాలెడు. జాతి దేశాన్ని బట్టి. మతాన్ని బట్టి కాదు. ఈ కంపు బ్రిటిష్ వాడు మొదలు పెట్టినా గాంధీ గారు వంత పాడి హిందూ, ముస్లిం భాయి భాయి అని రెండు వేరు జాతులు చేశారు. హిందువులయినా, ముస్లింలు అయినా ఈ దేశ జాతీయత ఒక్కటే అది భారత జాతీయత. సింధు ఆది నదుల పుణ్య భూమి కాబట్టి దీన్ని హిందూ దేశం అని కూడా అన్నారు. ఈ దేశ జాతీయత ఒక్కటే, అది భారత/హిందూ జాతి.
మన దేశ వారసత్వ సంపద ఒకే జాతి గొప్పవారిది. కాని రకరకాల జాతుల కలాగాా పులగం కాదు. మన జాతి ఒక్కటి మన వారసత్వ సంపద ఒక్కటి. వేరు వేరు లేదు. అలా మాట్లాడి మన భూభాగలను కోల్పోయాము. మనకు ఇప్పటి కైనా తెలివి వచ్చి, మనం 125 కోట్ల మందిమి ఒకే జాతి
భారత జాతి. మానందరిది ఒకే వారసత్వ సంపద. ఏ మతం వారికైనా ఈ జాతి హీరో లే హీరోలు. విద్రోహ కారులు జాతి మొత్తానికి శత్రువులే.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..