Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

shyama prasad mukherjee biography in telugu - శ్యామప్రసాద్‌ ముఖర్జీ జీవితం

బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇచ్చే ముందు అఖండ భారతావని ముక్కలు చేసి పాకిస్తాన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్‌ పుట్ట...

బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇచ్చే ముందు అఖండ భారతావని ముక్కలు చేసి పాకిస్తాన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చడంలో సఫలీకతు డయ్యారో నాయకుడు. పశ్చిమ బంగ ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్‌లో కలవకుండా ఉందంటే ఆ మహనీయుని పుణ్యమే. తర్వాత కాలంలో జమ్మూ కశ్మీర్‌ విషయంలో ‘ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా’ అని గర్జించి దేశ సమగ్రత కోసం బలిదానమయ్యారా మహానేత. వ్యక్తిగత ప్రతిష్టకన్నా దేశ హితమే ప్రధానమన్నది ఆయన విధానం. అంతిమ శ్వాస వరకూ దేశ సమగ్రత కోసమే తపించి పని చేసిన గొప్ప త్యాగశీలి దేశ సమైక్యతా యజ్ఞంలో సమిధగా ఆహుతై పోయారు. ఖండిత భారత అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశ భక్తుడు డాక్టర్‌ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ.
‘స్వదేశాన్ని, మాత సమాజాన్ని ప్రేమించడం, వేయి సంవత్సరాల బానిసత్వం నుంచి విముక్తి పొందిన కోట్లాది మంది హిందువులను సమైక్య పరిచేందుకు స్వామి వివేకానంద ప్రవచించిన హిందుత్వ సూత్రాలకు అనుగుణంగా, గత వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయడమే మతతత్వమైతే, మతతత్వవాదిని అయినందుకు గర్వపడతాను. హిందూ పదం వింటేనే భయపడి పారిపోయేవారి వల్ల ఈ దేశ భౌగోళిక, సాంస్క తిక వారసత్వం పరిరక్షింపబడటం అసాధ్యం’ అంటూ స్పష్టంగా చాటారు శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ.
పుట్టుకతోనే జాతీయ భావాలు
1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు శ్యామప్రసాద్‌. తండ్రి సర్‌ అశుతోష్‌ ముఖర్జీ గొప్ప విద్యావేత్త, న్యాయ శాస్త్ర నిపుణుడు. అన్నింటికీ మించి స్వధర్మ, స్వదేశ భక్తి నిష్టాగరిష్టుడు. నాటి బెంగాల్‌లో సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో విశిష్ట సేవలు అందించిన అశుతోష్‌ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీకి మొదటి వైస్‌ ఛాన్సలర్‌. అశుతోష్‌ ముఖర్జీ నాటి దేశ పరిస్థితులను గమనించి తన కుమారుడు శ్యామ ప్రసాద్‌ విద్యాభ్యాస విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. శ్యామ ప్రసాద్‌ తన తండ్రి ఆదర్శ గుణాలను బాల్యం నుంచే అంది పుచ్చుకున్నారు. నాకు డబ్బు వద్దు, నేను గొప్ప వ్యక్తిని కావాలని చిన్నప్పుడే ఒక పుస్తకంలో రాసుకున్నారు.
మిత్ర ఇన్‌ స్టిట్యూట్‌లో మెట్రిక్యులేషన్‌ చేసిన శ్యామ ప్రసాద్‌ 1919లో ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివి యూనివర్సిటీ టాపర్‌గా ఉత్తీర్ణులయ్యారు. 1921లో బీఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో కూడా ప్రథముడిగా ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆంగ్ల భాషను వదిలేసి 1923లో బెంగాలీలో ఎంఏ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా స్వభాషాభిమానాన్ని చాటుకున్నారు. అంతటితో విద్యాతష్ణ ఆగిపోలేదు. న్యాయ విద్య పూర్తి చేసి కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ప్రవేశించారు.
1922లో సుధాదేవితో శ్యామప్రసాద్‌ ముఖర్జీ వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. అయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1933లో సుధాదేవి మరణం తర్వాత శ్యామప్రసాద్‌ తన జీవితాన్ని పూర్తిగా సమాజ సేవకే అంకిత మిచ్చారు.
మొదట విద్యారంగంలోకి వచ్చిన శ్యామప్రసాద్‌ ముఖర్జీ అనూహ్యంగా తన తండ్రి వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన కలకత్తా విశ్వ విద్యాలయానికే వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 33 ఏళ్ల చిన్న వయసులో ఈ పదవిని చేపట్టడం మరో రికార్డు. శ్యామప్రసాద్‌ కలకత్తా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్న సమయంలో ప్రఖ్యాత సాహితీవేత్త రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్నాతకోపన్యాసం ఇవ్వడం విశేషం.
స్వాతంత్య్ర, రాజకీయ రంగాల్లోకి..
విద్యారంగంలో ఎన్నో విశిష్ట సేవలు అందించిన శ్యామప్రసాద్‌ దష్టి రాజకీయ క్షేత్రంపై పడింది. భారత స్వాతంత్య్రోద్యమం దిశానిర్దేశం లేకుండా ముందుకు సాగుతున్న సమయం అది. దేశ రాజకీయం బ్రిటిష్‌, కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ల మధ్య మూడు ముక్కలాటగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం పట్టుబడితే, ముస్లింలీగ్‌ తమకు ప్రత్యేక దేశం ఇచ్చాకే స్వాతంత్య్రం ఇవ్వాలనే మెలిక పెట్టింది.
1937లో కలకత్తా యూనివర్సిటీ నియోజక వర్గం నుంచి శ్యామప్రసాద్‌ ముఖర్జీ శాసనసభకు ఎన్నికయ్యారు. 1932 నాటి కమ్యూనల్‌ అవార్డు ద్వారా ఏర్పడిన బెంగాల్‌ అసెంబ్లీలో 250 మంది సభ్యులుంటే అందులో 80 మంది మాత్రమే హిందువులు. ముస్లింలీగ్‌, కషక్‌ ప్రజాపార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. ఈ ప్రభుత్వానికి కషక్‌ ప్రజాపార్టీ నేత ఫజల్‌ ఉల్‌ హక్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ద్విజాతి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన ముస్లింలీగ్‌ అప్పటికే తన నిజరూపాన్ని ఆచరణలో పెట్టింది. బెంగల్‌లో సామాజిక, విద్యా, సాంస్క తిక రంగాల్లో హిందువుల ఉనికిని సహించలేక మతకల్లోలాలకు బీజం వేసింది.
ముస్లింలీగ్‌తో రాజీ కోసం కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాల కారణంగా జాతీయవాదం గాలికి వదిలేయ బడింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీపై శ్యామప్రసాద్‌ ముఖర్జీకి విశ్వాసం కలగలేదు. ఇదే సమయంలో వీర సావర్కర్‌ నేతత్వంలోని హిందూ మహాసభ ఆయన్ని ఆకర్షించింది. హిందూ మహాసభలో చురుకైన పాత్ర పోషించిన శ్యామప్రసాద్‌ తదుపరి కాలంలో దానికి అధ్యక్షునిగా సేవలు అందించారు.
సంఘంతో అనుబంధం
శ్యామ ప్రసాద్‌ ముఖర్జీకి మొదటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌తో మంచి సంబంధాలున్నాయి. 1940లో లాహోర్‌ లో స్థానిక శాఖా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు దేశంలో నెలకొన్న అంధకార వాతావరణంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే ఆశాకిరణంగా కనబడుతోందని ఆయన అన్నారు. తదనంతర కాలంలో సర్‌ సంఘ్‌చాలక్‌ కేశవ బలిరాం హెడ్గేవార్‌ (డాక్టర్జీ)ను కలుసుకున్నారు. సంఘం రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించరాదని డాక్టర్‌జీని ప్రశ్నించారు ముఖర్జీ. సంఘానికి దైనందిన రాజకీయాలపై ఆసక్తి లేదని, దేశ పరమ వైభవ స్థితి కోసం తాము పని చేస్తున్నామని డాక్టర్‌జీ వివరించారు. కలకత్తాలో బాలాసాహెబ్‌ దేవరస్‌జీ సంఘ ప్రచారక్‌గా ఉన్న కాలంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖర్జీ. తదనంతర కాలంలో శ్యామప్రసాద్‌ ముఖర్జీ తలపెట్టిన కార్యక్రమాలకు స్వయం సేవకులు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారు.
బెంగాల్‌ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జాతీయ రాజకీయాలపై దష్టి సారించారు. అదే సమయంలో బెంగాల్‌లో పరిస్థితులు క్షీణించాయి. ముస్లింలీగ్‌ ప్రభుత్వం అండతో హిందువులపై దారుణమైన అత్యాచారాలు, హత్యాకాండ కొనసాగింది. బెంగాల్‌లో ఏర్పడ క్షామ పరిస్థితులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకో లేదు. ప్రజలు ఆకలి కేకలతో చనిపోతుంటే సహాయ కార్యక్రమాల విషయంలో లీగ్‌ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించింది. శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ నేతత్వంలోని బెంగాల్‌ సహాయ సమితి కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయాన్ని అందించింది. సహాయ కార్యక్రమాల్లో మత రాజకీయాలను ఆయన తీవ్రంగా నిరసించారు.
పాకిస్తాన్‌ను విభజించిన ముఖర్జీ
నా శరీరాన్ని ముక్కలు చేసినా సరే.. దేశ విభజనకు అంగీకరించబోనని మహాత్మాగాంధీ చెప్పేవారు. యుద్దమైనా చేస్తాం కానీ దేశాన్ని ముక్కలు కానివ్వబోమని సర్దార్‌ పటేల్‌ ధడంగా పలికేవారు. కానీ జవహర్లాల్‌ నెహ్రూ పదవీకాంక్ష రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీ దేశ విభజన విషయంలో రాజీపడింది. పాకిస్తాన్‌ విషయంలో ముస్లింలీగ్‌ నాయకుడు మహ్మద్‌ అలీ జిన్నాతో రాజీ పడొద్దని శ్యాంప్రసాద్‌ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కాంగ్రెస్‌ నాయకుల చెవికి ఎక్కలేదు. చివరకు అంతా ఉహించినట్లే దేశ విభజన అనివార్యంగా మారింది.
1946లో జరిగిన ఎన్నికల్లో కలకత్తా విశ్వ విద్యాలయ నియోజకవర్గం నుంచి బెంగాల్‌ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శ్యామప్రసాద్‌ ముఖర్జీ. ఆ తర్వాత రాజ్యాంగ సభకు బెంగాల్‌ అసెంబ్లీ ప్రతినిధిగా ఎన్నికయ్యారు. సింధ్‌, పంజాబ్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ముస్లింలీగ్‌ ప్రభుత్వాలు ఏర్పడటంతో కొత్తగా ఏర్పడే పాకిస్తాన్‌ భూభాగాల విషయంలో అందరికీ ఒక అవగాహన వచ్చింది. ముస్లింలీగ్‌ ప్రత్యక్ష చర్య పేరుతో పెద్ద ఎత్తున బీభత్స వాతావరణం సష్టించింది. ఒక్క కలకత్తా నగరంలోనే 10 వేల మంది హిందువులను ఊచకోత కోశారు. కలకత్తా వీధులు శవాలతో నిండిపోయాయి.
కలకత్తా సహా బెంగాల్‌ను పూర్తిగా పాకిస్తాన్‌లో కలపాలని ముస్లింలీగ్‌ వత్తిడి తేవడాన్ని శ్యామప్రసాద్‌ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బెంగాల్‌ విభజన అనే ఆలోచననే సాధారణ బెంగాలీలు భరించలేరు. 1905లో లార్డ్‌ కర్జన్‌ ఈ ప్రయత్నం చేసి వందేమాతరం ఉద్యమంతో చేతులు కాల్చుకున్నాడు. కలకత్తాతో పాటు బెంగల్‌లోని అన్ని ప్రాంతాల్లో గణనీయ సంఖ్యలో హిందువులు ఉన్నారు. దేశ విభజన ఏకపక్షంగా జరగకుండా బెంగాలీలను ఏకం చేస్తూ శ్యామప్రసాద్‌ ముఖర్జీ ప్రారంభించిన ఉద్యమం అటు ముస్లింలీగ్‌, ఇటు కాంగ్రెస్‌ను కూడా భయపెట్టింది. ముఖర్జీ విభజన వాది అంటూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారాయన.
బెంగాల్‌ను పాకిస్తాన్‌లో పూర్తిగా విలీనం చేస్తే భవిష్యత్తులో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు ముఖర్జీ. పెద్దసంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్‌ (బెంగాల్‌) ను తిరిగి భారతదేశంలో కలుపుతారని స్పష్టం చేశారు. బెంగాల్‌లోని హిందూ ఆధిక్య ప్రాంతాలను ఇండియన్‌ యూనియన్‌లోనే కొనసా గించాలనే డిమాండ్‌తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్‌ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చింది. దీంతో బెంగాల్‌లోని ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్‌ (తూర్పు) పరిధిలోకి వెళ్లాయి. అదే విధంగా పంజాబ్‌లోని హిందూ ప్రాంతాలను భారత్‌లోనే కొనసాగించారు.
మొత్తనికి ఇలా బ్రిటిష్‌ వారు ఇండియాను చీల్చి పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్‌ పుట్టక ముందు పాకిస్తాన్‌ను చీల్చేశారు ముఖర్జీ.
తొలి మంత్రి వర్గంలో..
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశ విభజన జరిగి పాకిస్తాన్‌ ఏర్పడింది. మరునాడు 15న స్వతంత్ర భారతదేశం అవతరించింది. నెహ్రూ ప్రధాన మంత్రిగా ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో 14 మంది మంత్రులుండగా అందులో ఏడుగురు కాంగ్రెసేతరులు. వీరిలో డాక్టర్‌ శ్యామప్రసాద్‌ ముఖర్జీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా ఉన్నారు. ముఖర్జీ విద్యాశాఖను కోరుకున్నా పరిశ్రమల శాఖను అప్పగించారు. ఆయన మంత్రిగా ఉన్న రెండేళ్ల కాలంలో రూపొందించిన పారిశ్రామిక విధానాలు, నిర్ణయాలు ప్రశంసలందుకున్నాయి. హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌, చిత్తరంజన్‌ రైల్‌ ఇంజన్‌ కర్మాగారం, సింద్రీ ఎరువుల కర్మాగారం ముఖర్జీ హయాంలో పురుడు పోసుకున్నవే. భారతీయ పరిస్థితులు, వనరులను దష్టిలో పెట్టుకొని మన దేశ ఆర్థిక విధానాలు రూపొందాలని శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ సూచించారు.
హైదరాబాద్‌ సంస్థాన విమోచంలోనూ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీకి పాత్ర ఉంది. దేశ ¬ంమంత్రిగా సర్దార్‌ పటేల్‌ చేపట్టిన స్వదేశీ సంస్థానాల విలీన ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ సమస్యను తక్షణం పరిష్కరించాలని, విలీన బాధ్యతను సంపూర్ణంగా పటేల్‌కు అప్పగించాలని ముఖర్జీ చేసిన సూచనను నెహ్రూ అంగీకరించక తప్పలేదు. ఆ రోజున ముఖర్జీ చొరవ తీసుకోకపోతే సమస్య పరిష్కార బాధ్యత పటేల్‌ నుంచి దూరంగా ఉండేది.
తొలి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న శ్యామప్రసాద్‌ ముఖర్జీకి చాలా అంశాల్లో ప్రధాని నెహ్రూతో విబేధాలుండేవి. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేని వ్యక్తిత్వం ముఖర్జీది.
దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో భాగాలైన తూర్పు బెంగాల్‌, సింధ్‌, బెలూచిస్తాన్‌, పశ్చిమ పంజాబ్‌, వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో హిందువుల మనుగడ ప్రశ్నార్థకమైంది. అక్కడ వేధింపులు, అరాచకాలను తట్టుకోలేక సుమారు 20 లక్షల మంది భారత్‌కు వలస వచ్చారు. విభజన సమయంలో జరిగిన ఒప్పందాలను పాకిస్తాన్‌ ఏమాత్రం గౌరవించలేదు. ఇక్కడ తూర్పు బెంగాల్లోనే 50 వేల మంది హిందువులను హతమార్చారని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. పాకిస్తాన్తో కఠినంగా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రధాని జవహర్లాల్‌ నెహ్రూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేవారు. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి లియాఖత్‌ అలీతో చర్చల విషయంలో శ్యామప్రసాద్‌ ముఖర్జీ నెహ్రూతో విభేదించారు. మంత్రివర్గ సమావేశంలో ఇద్దరికీ వాగ్యుద్దం జరిగింది. చివరకు శరణార్థుల విషయంలో నెహ్రూ ధోరణిని నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి ముఖర్జీ రాజీనామా చేశారు.
భారతీయ జనసంఘ్‌ స్థాపన
శ్యామప్రసాద్‌ ముఖర్జీ కేంద్ర మంత్రి మండలిలో ఉన్న సమయంలోనే మహాత్మా గాంధీ హత్య జరిగింది. హిందూ మహాసభ నాయకునిగా ఉన్న వీరసావర్కర్‌ను ఈ కేసులో అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. స్వాతంత్య్రానంతరం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ సంస్థ కార్యకలాపాల్లో మార్పులు రావాలని శ్యామప్రసాద్‌ ముఖర్జీ చేసిన సూచనను కొందరు నాయకులు తిరస్కరించారు. దీంతో హిందూ మహాసభకు రాజీనామా చేశారాయన. నెహ్రూ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన ముఖర్జీ దేశ రాజకీయాల్లో సరికొత్త జాతీయవాద రాజకీయ పక్షం అవసరం అని భావించారు.
ఆ రోజల్లో నెహ్రూ తర్వాత అంతటి ప్రజాకర్షణ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌సంఘచాలక్‌ మాధవ సదాశివరావు గోల్వాల్కర్‌ (గురూజీ) కి ఉండేది. అయితే సంఘం రాజకీయాలకు దూరం. గాంధీజీ హత్య తర్వాత సంఘంపై నేరాన్ని మోపి నిషేధించారు. సంఘంపై అణచివేత ధోరణిని ఏ రాజకీయ పక్షం కూడా నిరసించలేదు. దీంతో స్వయంసేవకులంతా తమ భావాలతో ఏకీభవించే రాజకీయ పక్షం అవసరం అని భావించారు.
గురూజీతోపాటు సంఘ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత భారతీయ జనసంఘ్‌ను ప్రారంభిం చారు శ్యామప్రసాద్‌ ముఖర్జీ. ఇందులో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, వాజ్‌పేయి, అద్వానీ తదితర ఎందరో జ్యేష్ట స్వయంసేవకులు జనసంఘ్‌లో చేరి ఆ పార్టీని విస్తరించారు. కాలక్రమంలో జనసంఘ్‌ భారతీయ జనతా పార్టీగా మారి కేంద్రంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పరచడం తెలిసిందే.
రాచపుండులా జమ్మూ కశ్మీర్‌
భారతమాతకు కిరీటం కశ్మీరం. స్వాతంత్య్రం తర్వాత భారత్‌, పాకిస్తాన్‌లలో ఎటు చేరాలో తేల్చుకోలేక జాప్యం చేశారు జమ్మూకశ్మీర్‌ పాలకుడు మహారాజా హరిసింగ్‌. కశ్మీర్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలు. ఈ కారణంగా ఆ రాష్ట్రంపై ముస్లింలీగ్‌కు ఎప్పటి నుంచో కన్ను పడింది. కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే వత్తిడి పెరిగింది. పాక్‌ సైన్యం ఆటవికుల ముసుగులో కశ్మీర్‌పై దాడి చేసింది. వెంటనే మహారాజా హరిసింగ్‌ తన రాజ్యాన్ని భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేశారు. భారత సైన్యం పాక్‌ మూకలను తిప్పికొట్టినా ఇప్పటికీ చాలా భూభాగం ఆ దేశం కబ్జాలో ఉండిపోయింది.
జమ్మూ కశ్మీర్‌ విషయంలో ప్రధాని నెహ్రూ మొదటి నుంచీ దాగుడు మూతలు కొనసాగించారు. మహారాజా హరిసింగ్‌ అంటే ఆయనకు గిట్టేది కాదు. కశ్మీర్‌లో తన మిత్రుడు షేక్‌ అబ్దుల్లాకు అధికారం కట్టబెట్టాలనేది నెహ్రూ ఆలోచన. జమ్మూ కశ్మీర్‌ విలీన సందర్భంగా నెహ్రూ అనుసరించిన వైఖరి ఈనాటికీ రావణకాష్టంలా రగులుతుండటం మనకు తెలిసిందే. ఈ పరిస్థతిని స్పష్టంగా ఊహించి వ్యతిరేకించారు డాక్టర్‌ శ్యామప్రసాద్‌ ముఖర్జీ.
జమ్మూ కశ్మీర్‌ విలీనం సందర్భంగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేక ¬దా కట్టబెట్టారు. కశ్మీర్‌కు ప్రధాన మంత్రి, ప్రత్యేక పతాకం, రాజ్యాంగం ఉండేలా ఒప్పందాలు జరిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ప్రత్యేక చట్టాలను రూపొందింది భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 రూపంలో రక్షణ కల్పించారు.
జమ్మూ కశ్మీర్‌లో షేక్‌ అబ్దుల్లా పాలనలో వివక్షాపూరిత పాలన మొదలైంది. అక్కడి చట్టాలు, విధానాలు అన్నీ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. కశ్మీరీలు మిగతా భారతీయ సమాజంతో కలవకుండా ఆర్టికల్‌ 370 అడ్డుపడేది. ఇతర భారతీయులు కశ్మీర్‌లో ఆస్తులు కొనడానికి వీలులేదు. ఇలాంటి విధానాలను నిరసిస్తూ డాక్టర్‌ ప్రేమ్‌నాథ్‌ డోగ్రా జమ్మూ కశ్మీర్‌ ప్రజా పరిషత్‌ను ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ¬దా అవసరం లేదని, భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని ఉద్యమించారు. డోగ్రాను షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టింది. విడుదల అనంతరం ఆయన శ్యామప్రసాద్‌ ముఖర్జీని కలుసుకున్నారు. అప్పటికి ఆయన నెహ్రూ క్యాబినెట్లో ఉన్నారు.
సమైక్యత కోసం బలిదానం
శ్యామప్రసాద్‌ ముఖర్జీ జనసంఘ్‌ స్థాపించిన తర్వాత డాక్టర్‌ ప్రేమనాథ్‌ డోగ్రా మరోసారి కలుసుకొని అక్కడ క్షీణిస్తున్న పరిస్థితులను వివరించారు. ఈ సమస్యపై గట్టిగా ఉద్యమించి ఆర్టికల్‌ 370ని రద్దు చేయించకుంటే కశ్మీర్‌ చేజారుతుందని ముఖర్జీ గ్రహించారు. 1952 జూన్‌లో జరిగిన జనసంఘ్‌ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. జూన్‌ 29న దేశవ్యాప్తంగా కశ్మీర్‌ దివస్‌ నిర్వహించి ర్యాలీలు, సభలు జరిపి దేశ ప్రజలకు అక్కడ పరిస్థితులను వివరించారు. ఈ అంశాన్ని ఆయన పార్లమెంట్‌లో లేవనెత్తారు.
1952 ఆగస్టులో జమ్మూలో ప్రజాపరిషత్‌ సమ్మేళనం చేపట్టింది. ఇందు కోసం అక్కడికి వెళ్లిన శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ ఏదో విదేశానికి వెళుతున్నట్లు అక్కడి ప్రభుత్వం నుంచి పర్మిట్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సిఎం షేక్‌ అబ్దుల్లాను కూడా కలిసిన ముఖర్జీ జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అసవరం లేదని స్పష్టంగా వివరించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులను ప్రధాని నెహ్రూకు వివరించినా ఫలితం లేక పోయింది.
1953 మేలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జమ్మూ యాత్ర తలపెట్టారు. ఈ యాత్రకు జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ముఖర్జీ జమ్మూకశ్మీర్‌ భూభాగంలోకి ప్రవేశించగానే అక్కడి పోలీసులు అరెస్టు చేసి శ్రీనగర్‌ జైలుకు తరలించారు. అనంతరం చిన్న అతిధి గహంలో నిర్బంధించారు. శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ అరెస్టు వార్త తెలిసి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జనం పెద్దసంఖ్యలో జమ్మూ బయలుదేరారు. ‘ఏక్‌ దేశ్‌మే దో ప్రధాన్‌, దో నిశాన్‌, దో విధాన్‌ నహీ చలేగా నహీ చెలేగా’ అంటూ నినదించారు.
బలిదానం
1953 జూన్‌ 23.. శ్రీనగర్లో నిర్బంధంలో ఉన్న శ్యామప్రసాద్‌ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారనే వార్త దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ముఖర్జీ మరణం వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు ఉన్నా సరైన విచారణ జరగలేదు. జమ్మూ కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా కలిపే మహాయజ్ఞంలో సమిధ అయ్యారు డాక్టర్‌ ముఖర్జీ.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి సంపూర్ణంగా భారత దేశంతో అనుసంధానించడమే ఈ మహానేతకు మనం ఇవ్వగలిగిన నివాళి.
Source: Jagriti

1 comment

  1. Previous rulers tiswested and covered from public view the life and documents. Now this government bring out the facts and correct the history of our country.jaihind

    ReplyDelete