Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్ ఎస్ ఎస్ నాల్గవ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్రసింహజీ - fourth chief of rss rajju bayya life

నాల్గవ సర్ సంఘచాలక్ - ప్రొ. రాజేంద్రసింహజీ : తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ అనారోగ్యం పాలైన కారణంగా వారు 1994 మార్చి 11న శ్...

నాల్గవ సర్ సంఘచాలక్ - ప్రొ. రాజేంద్రసింహజీ :

తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ అనారోగ్యం పాలైన కారణంగా వారు 1994 మార్చి 11న శ్రీ రాజేంద్రసింహజీని తన తర్వాతి సర్ సంఘచాలక్ గా నియుక్తి చేసారు. సంఘ చరిత్రలో మొట్టమొదటగా సర్ సంఘచాలక్ జీవించి వుండగా అతని వారసుని ప్రకటించడం జరిగింది. అందరిచే రజూభయ్యాగా పిలువబడే ప్రొఫెసర్ రాజేంద్రసింహజీ ఆరోజు నుండి నాల్గవ సర్ సంఘచాలక్ అయ్యారు. శ్రీరజూభయ్యా క్రీ.శ. 1922లో జన్మించారు. వారి తండ్రి కుంవర్ బలవీర్ సింహ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరుగా పనిచేసారు. రజభయ్యా ప్రాథమిక విద్యాభ్యాసం నైనిటాల్లో జరిగింది. మెట్రిక్ పరీక్ష ఉన్నావ్ గ్రామం నందు ఉత్తీర్ణులయ్యారు.
ఆ తరువాత విద్యాభ్యాసం ప్రయాగ విశ్వవిద్యాలయంలో పూర్తి అయింది. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ప్రయాగ విశ్వవిద్యాలయం నుండి ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణులై యం.యస్.సి. పట్టా పొందారు. ఆ వెనువెంటనే అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుని (ప్రొఫెసర్)గా నియుక్తి అయ్యారు. ఉత్తర ప్రదేశ్లో సంఘకార్యం పెరుగుదల అవసరాన్ని దృష్టియందు వుంచుకొని 1966లో వారు స్వచ్చందంగా భౌతికశాస్త్ర అధ్యక్షస్థానానికి రాజీనామా చేసి సంఘప్రచారక్ అయ్యారు. 1978లో వారు సర్ కార్యవాహగా బాధ్యత స్వీకరించి 1987 వరకు ఇదే బాధ్యతలో కొనసాగారు. అనారోగ్య కారణాల వలన 1987లో ఆ బాధ్యత వదలిపెట్టి నూతన సర్ కార్యవాహ శ్రీహె.వె.శేషాద్రిగారికి సహకారిగా, సహసర్ కార్యవాహ బాధ్యతలో కొనసాగారు.
1994, మార్చి 11న జరిగిన అఖిల భారత ప్రతినిధి సభల సందర్భంగా శ్రీ రజుభలూ నాల్గవ సర్ సంఘచాలక్గా నియుక్తి అయ్యారు. విదేశాలకు వెళ్ళి అక్కడ సంఘ కార్యాన్ని పరిశీలించిన మొదటి సర్ సంఘచాలక్ శ్రీ రాజేంద్రసింహజీ, ఈ పనిమీద ఇంగ్లాండ్, మారిషస్, కీన్యా, దక్షిణ ఆఫ్రికా మొదలగు దేశాలలో వారు పర్యటించారు.

1999, ఫిబ్రవరి నెలలో శ్రీ రాజేంద్రసింహటి పూనా పర్యటనకు వచ్చినపుడు వున్నట్లుండి జారి క్రింద పడటంతో సడుము ఎముక విరిగింది. ఈ కారణంగా ఆ సంవత్సరం లక్నోలో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ బైఠకులలో వారు పాల్గొనలేక పోయారు. ఆ తరువాత వారు పూర్తిగా కోలుకోలేకపోవడం, దానితోపాటు మాట్లాడటంలో ఇబ్బంది కలగడంతో వారు తన బాధ్యత నుండి విముక్తి కావాలని భావించారు. 2000 మార్చి 30న నాగపూర్ లో జరిగిన అఖిలభారత ప్రతినిధి సభలో తన వారసునిగా కు. సీ. సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా నియుక్తి చేసారు. శ్రీ రాజేంద్రసింహజీ 2003 జూలై 14న పూనాలో స్వర్గస్థులైనారు.

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ ల గురించి లింకులు క్రింద ఇవ్వబడినవి

ఆర్ ఎస్ ఎస్ స్థాపకుడి జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ తృతియ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ఐదవ సర్ సంఘచాలక్ కు.సీ. సుదర్శన్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ప్రస్తుత సర్ సంఘచాలక్ మోహన్ రావు భాగవత్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments