ఆర్ ఎస్ ఎస్ ఐదవ సర్ సంఘచాలక్ మా|| కు.సీ. సుదర్శన్ జీ - fifth chief of rss sri sudharshan ji

ఐదవ సర్ సంఘచాలక్ - మా|| కు.సీ. సుదర్శన్ జీ :


శ్రీ సుదర్శన్జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వీరు క్రీస్తుశకం 1929 జూన్ 18న రాయపూర్ నందు జన్మించారు. రాయపూర్, దామో, మండ్లా చంద్రపూర్లలో విద్యాభ్యాసం పూర్తిచేసిన తరువాత జబల్ పూర్ నందు 1954లో (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సమాచార సాంకేతిక విద్యలో బి, ఇ పట్టాను పొందినారు. ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే సంఘ ప్రచారక్ గా వచ్చి దేశసేవలో నిమగ్నమైనారు. 1964లో వారు మధ్య భారత్ (మధ్యప్రదేశ్) ప్రాంత ప్రచారక్ గా బాధ్యతస్వీకరించారు.
1969 నుంచి 1971 వరకు అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ గా, 1976 నుండి అఖిల భారతీయ బౌద్దిక్ ప్రముఖ్గా, సహసర్ కార్యవాహగా బాధ్యతలను నిర్వహించారు. 2000లో వారు పూ11 సర్ సంఘచాలక్గా నియుక్తి అయ్యారు. నాగపూర్లో 2009 మార్చిలో జరిగిన అఖిలభారత ప్రతినిధి సభల సమయంలో శ్రీ సుదర్శన్జీ అనారోగ్యకారణంగా బాధ్యత నుండి తప్పుకొని మోహన్ భాగవత్ ను నూతన సర్ సంఘచాలక్ గా ప్రకటించారు.
శ్రీ మోహన్జీ భాగవత్ ఒక కుశల సంఘటకునిగా పేర్కొన్నారు. అన్ని విషయాలను వినగలిగే ధైర్యం, అధ్యయన శీలత, ప్రసన్నత, మధుర స్వభావము ఇన్ని మెండుగా ఉన్న విశిష్ట కార్యకర్త శ్రీమోహన భాగవత్ అని అభివర్ణించారు. శ్రీ మోహన్జీ భాగవత్ సర్ కార్యవాహ బాధ్యత స్వీకరించినప్పుడు స్వర్గీయ బబువాజీ మోహన్జీ భాగవత్స్ చూడగానే డాక్టర్ హెడ్గేవార్ గుర్తుకు వస్తారు అని అన్నమాటలను శ్రీ సుదర్శన్జీ ప్రస్తావించారు.

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ ల గురించి లింకులు క్రింద ఇవ్వబడినవి


ఆర్ ఎస్ ఎస్ స్థాపకుడి జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ తృతియ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ నాల్గవ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్రసింహజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ప్రస్తుత సర్ సంఘచాలక్ మోహన్ రావు భాగవత్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments