Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్ ఎస్ ఎస్ తృతియ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ - third chief of rss balasaheb deoras

తృతీయ సర్ సంఘచాలక్ - మా|| బాలాసాహెబ్ దేవరస్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ పూర్తి పేరు మధుకర దత్...

తృతీయ సర్ సంఘచాలక్ - మా|| బాలాసాహెబ్ దేవరస్:


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ పూర్తి పేరు మధుకర దత్తాత్రేయ దేవరస్. క్రీ.శ. 1915, డిశంబర్ 11న మార్గశిర శుద్ధ పంచమినాడు వారు జన్మించారు. వారి విద్యాభ్యాసం పూర్తిగా నాగపూర్ లోనే జరిగింది. నాగపూర్లో ప్రసిద్ధిగాంచిన న్యూఇంగ్లీష్ హైస్కూల్ లో మెట్రిక్ చదివి అక్కడే వున్న మోరిస్ కళాశాల (ప్రస్తుతం పేరు నాగపూర్ కళాశాల) నుండి బి.ఎ, పట్టా పుచ్చుకొని ఆ తర్వాత న్యాయశాస్త్రం (ఎల్.ఎల్.బి) పరీక్షలో ఉత్తీర్ణులయ్యా రు.

అయితే వారు న్యాయవాద వృత్తిని చేపట్ట లేదు. వారు పూర్తి సమయాన్నిసంఘకార్యం కొరకే వినియోగించాలని నిశ్చయించుకున్నారు. డాక్టర్జీ వారిని మొదట బెంగాల్ ప్రాంతంలో సంఘకార్యం ప్రారంభించడానికి పంపారు. అయితే వారిని కొద్దిరోజులలోనే నాగపూర్ కు పిలిచి నాగపూర్ సంఘకార్య బాధ్యతను అప్పగించారు. నాగపూర్ నగర కార్యవాహగా, సహసర్ కార్యవాహ, 1965 నుండి సర్ కార్యవాహగా, 1973లో శ్రీ గురూజీ స్వర్గస్తులైన తరువాత సర్ సంఘచాలక్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. సర్ సంఘచాలక్ అయినపుడు వారి వయసు 58 సంవత్సరాలు.

అప్పటికే వారు మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. అయినప్పటికీ వారు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా డాక్టర్జీ ద్వారా ఆరంభింపబడి, గురూజీ ద్వారా విస్తరింపబడిన సంఘకార్యాన్ని మరింతగా పెంచారు. సేవా కార్యం కోసం ఒక కొత్తగా సేవా విభాగాన్ని ప్రారంభింపజేశారు. నేడు సంఘ స్వయంసేవకుల ద్వారా నడుపబడుచున్న సేవా కార్యక్రమాలు లక్షా యాభైవేలకు పైగా వున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం సేవాభారతి పేరుతో నడుపబడుతున్నాయి. బాలసంస్కార కేంద్రం, వసతి గృహం, గ్రామీణ పాఠశాల, చికిత్సాకేంద్రం, అనాథాశ్రమం, కుష్ఠురోగ నివారణ కేంద్రం మొదలు అనేక ప్రకల్పాలు సేవాభారతి ద్వారా నడుస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్, వనవాసీ కల్యాణాశ్రమం మొదలగు సంస్థల ద్వారా కూడ ఈ విధమైన సేవా కార్యక్రమాలు ఒక లక్షకు పైగా నడుస్తున్నాయి.

ఈ దేశాన్ని సమృద్ధిగా, సంఘటితంగా ఉంచేందుకు హిందూ సంఘటన అనేది ప్రధాన అవసరం. అయితే అందుకోసం సామాజిక సమరసత అనేది అనివార్యమైనది. అస్పృశ్యత అనేది ఈ సమాజానికి ఓ పెద్ద శాపం. “ అంటరానితనం పాపం కాకపోతే, ప్రపంచంలో మరేది పాపం కాదు.” అని ఆయన ఎలుగెత్తారు. ఈ విషయాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం కోసం బాలాసాహెబ్ విశేషమైన కృషి చేశారు. నిత్యశాఖ ద్వారా సామాన్య జనంలో సంస్కారం నింపుతూ, మన లక్ష్యాన్ని అందుకోవడం కోసం అట్టడుగు వర్గాలు, ఉపేక్షిత బంధువుల మధ్య భారీస్థాయిలో సేవాకార్యక్రమాలను ప్రారంభించారు. దీనితో ప్రజలలో సంఘానికి ఓ కొత్త గుర్తింపు వచ్చింది. అదే విధంగా మిగిలిన సమాజమూ సంఘంతో కలిసింది.

అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఆ సమయంలో ప్రభుత్వం సంఘాన్ని నిషేధించింది. ఆమె పరిపాలనను, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీలపై నిషేధాన్ని విధించలేదు. కానీ సంఘాన్ని నష్టపరచాలనే దుర్బుద్ధితో ఆమె సంఘంపై నిషేధాన్ని విధించింది. సంఘానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం జరిగింది. వేలాదిమంది కార్యకర్తలు మీసా అనే నల్లచట్టం క్రింద జైళ్ళలో బంధింపబడినారు. ఆమె అందరి స్వాతంత్ర్యాన్ని హరించింది.

ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించాలని జరుగుతున్న ఆందోళనలో సంఘం కూడా పాలుపంచుకొని విజయవంతం చేసి చూపించింది. ఇంత గొప్ప కార్యం బాలాసాహెబ్ జీ నేతృత్వంలో జరిగింది. బాలాసాహెబ్ జీ ఆరోగ్యం 1992 నుండి క్షీణించనారంభించింది. పర్యటన చేయడం వారికి సాధ్యం కావటంలేదు. మాట్లాడటం కూడా కష్టంగావుండేది.

అలా ఆ సమయంలో సర్ సంఘచాలక్ బాధ్యత నుండి తప్పుకోవాలని స్వయంగా నిర్ణయించుకొన్నారు. 1994లో తన స్థానంలో శ్రీ రజ్జూ భయ్యాను సర్ సంఘచాలక్ గా నియుక్తి చేశారు. పనిచేయలేకపోతున్నానని గమనించిన వెంటనే బాధ్యతనుండి తొలగిపోయే ఉత్తమ పద్దతిని బాలాసాహెబ్ జీ ప్రారంభించారు. 1996, జూన్ 17న పూనాలో వారు స్వర్గస్థులైనారు.

ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ ల గురించి లింకులు క్రింద ఇవ్వబడినవి


ఆర్ ఎస్ ఎస్ స్థాపకుడి జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ నాల్గవ సర్ సంఘచాలక్ ప్రొ. రాజేంద్రసింహజీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ఐదవ సర్ సంఘచాలక్ కు.సీ. సుదర్శన్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా
ఆర్ ఎస్ ఎస్ ప్రస్తుత సర్ సంఘచాలక్ మోహన్ రావు భాగవత్ జీ జీవిత విషయాలు క్లుప్తంగా



ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments