చైనాను హడలెత్తిస్తున్న "బిత్రా" - "Bitra" That’s Shaking China: India’s Silent Strategic Power in the Arabian Sea

megaminds
1


Lakshadweep: India transforms Bitra Island to expand naval reach - చైనాను హడలెత్తిస్తున్న "బిత్రా" 

బిత్రా ద్వీపం ఇది లక్షద్వీప్ లోని 36 ద్వీపాల సమూహంలో ఒక చి‌న్న ద్వీపం. సూర్యుణ్ణి ముద్దాడే బీచ్ లు మరియు పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో లక్షద్వీప్ అంటే 'లక్ష ద్వీపాలు' అని అర్థం. భారతదేశం యొక్క అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడిన ద్వీపసమూహం. బిత్రా ద్వీపం లో ప్రస్తుతం 300 మంది లోపు ప్రజలు నివసిస్తున్నారు.

ఇప్పుడు బిత్రా ద్వీపం దేశం లో ఒక పెద్ద వార్తగా మారింది. భవిష్యత్తులో భారత్ రక్షణ కేంద్రంగా కూడా మారబోతుంది. బిత్రా ఇప్పటివరకు లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంగా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ లో వుంది. భారత నౌకాదళం (Indian Navy), తీర భద్రతా దళాలు (Coast Guard) ద్వీపంలోని రక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ‌ ఇకనుండి పూర్తిగా భారత నౌకాదళం చేతుల్లో ఉండబోతుంది.
వివరాల్లోకెళితే లక్షద్వీప సముద్రంలోని బిత్రా అనే చిన్న ద్వీపాన్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రభుత్వాధీనంలోకి తీసుకోవడం చూస్తే మనకు సాధారణ పరిపాలనా చర్యగా అనిపించొచ్చు. కానీ దీని వెనుక ఉన్న భద్రతా ప్రయోజనాలు, వ్యూహాత్మక దృష్టికోణం, భవిష్యత్ దృఢమైన నౌకాదళ వ్యవస్థకు ఇది మొదటి మెట్టు. చోళుల కాలం, అబ్బక్క, శివాజీ సముద్రాలపై తమ ఆధిపత్యం ప్రదర్శించారు. ముస్లిం, బ్రిటీష్ క్రైస్తవ పాలన అనంతరం మరలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక శక్తివంతమైన నిర్ణయం అని చెప్పుకోవాలి. అనుకున్నది అనుకు‌న్నట్లుగా జరిగితే మరలా భారత్ సముద్రాల పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.

బిత్రా ద్వీపం ఎందుకు ప్రత్యేకం?: బిత్రా ద్వీపం నివాసిత ద్వీపాలలో చాలా చిన్నదే అయినా — భౌగోళిక ప్రాధాన్యత కలిగింది. ఇది అరేబియా సముద్రం – హిందూ మహాసముద్ర మార్గాలపై నిఘా ఉంచడానికి అత్యుత్తమమైన స్థానంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ద్వీపాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక స్ట్రాటజిక్ యాక్సెస్ పాయింట్గా మారుతుంది.

చైనా వ్యూహాలకు చెక్ పెట్టేందుకు బిత్రా ప్రముఖం: చైనా "స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్" వ్యూహం ద్వారా భారత ని మహాసముద్రాల ద్వారా చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. గ్వాదర్ (పాకిస్తాన్), హంబంటోటా (శ్రీలంక), జిబౌటి (ఆఫ్రికా), సిట్వే (మయన్మార్) లాంటి పోర్టుల ద్వారా చైనా తన సముద్ర వ్యాపార మార్గాలను భద్రపరచుకుంటూ, భారత్ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో బిత్రా ద్వీపాన్ని ప్రామాణికంగా అభివృద్ధి చేయడం ద్వారా భారత్ కూడా సమర్థవంతంగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.

వ్యూహాత్మక ప్రయోజనాలు ఏమిటి?: భద్రతా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బిత్రా ద్వీపం ద్వారా భారత్ నౌకాశక్తి నిఘా కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. రాడార్ స్టేషన్‌లు, డ్రోన్ మానిటరింగ్ బేస్‌లు, హెలిప్యాడ్‌లు అభివృద్ధి చేయవచ్చు. అరేబియా సముద్రంలో చైనా నౌకా కదలికలపై పట్టు సాధించవచ్చు. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం చెలాయించాలన్న చైనాకి భారత్ చెక్ పెట్టడమే కాదు. బిత్రా ద్విపంతో హిందూ మహాసముద్రంపై పూర్తిగా పట్టుబిగించనుంది.

నౌకాదళ విభాగాల శిక్షణ, నిఘా వ్యవస్థల కేంద్రంగా కూడా ఉపయోగించవచ్చు. బిత్రా ద్వీపాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భారత నౌకాదళం అరేబియా, హిందూ మహా సముద్రంలోని చైనా, ఇతర విదేశీ కదలికలపై ఛాయాచిత్ర నిఘా పెట్టగలదు. మలబార్ వార్ డ్రిల్స్ వంటి మల్టినేషనల్ నేవీ డ్రిల్స్ లో కీలక బేస్‌లుగా బిత్రాను మలచవచ్చు. సముద్ర మార్గాల్లో నిషేధిత చట్టాల అమలులో ఫోర్స్ మల్టిప్లేయర్ గా నిలిచే అవకాశముంది.

కంప్లీట్ గా ఇప్పుడు నావికాదళం ఈ ద్వీపాన్ని ఉపయోగిస్తే సముద్ర మార్గాలపై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. చైనా వ్యూహాలకు ప్రత్యామ్నాయం బిత్రా.

సముద్రంలో భారత్ మజిలీ మొదలైంది. భవిష్యత్‌లో ఈ ద్వీపం భారత సముద్రాధిపత్యానికి సజీవ చిహ్నంగా నిలిచే రోజులు దగ్గరలోనే‌ ఉన్నవి. -రాజశేఖర్ నన్నపనేని.

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

Bitra Island leverage, India’s island footprint, Lakshadweep pivot, Maritime quiet power, Strategic sleeper node, Arabian Sea outpost, Silent anchor of power, Unseen deterrence, Blue chessboard move, India’s unsung maritime edge, Peripheral power play, Low-noise high-impact strategy, Mini-island macro message, Checkmating China softly, Geography as weapon, Subtle sea dominance, Island chain influence, Bitra’s ripple effect, Under-the-radar muscle



Post a Comment

1 Comments
  1. Very good information
    Jai hind- jai bharath

    ReplyDelete
Post a Comment
To Top