భారతదేశంలోని వీసా నిబంధనలు మరియు ఫారినర్స్ యాక్ట్, 1946 ఉల్లంఘన చేస్తూ నైజీరియా పాస్టర్ క్రిస్ ఓయఖిలోమేకు చెందిన బెలీవర్స్ లవ్‌వర్డ్ ట్రస్ట్ మరియు క్రైస్ట్ ఎంబసీ సంస్థలతో అనుబంధంగా ఉన్న విదేశీయులు మన హైదరాబాద్ వస్తున్నారు. క్రింద చిత్రాలలో మీరు వెబ్‌సైట్ మరియు ఓయాఖీలోమే, అలాగే పాంప్లెట్ యాడ్ ని కూడా చూడవచ్చు.
పుణేకు చెందిన బెలీవర్స్ లవ్‌వర్డ్ ట్రస్ట్ అనే సంస్థ, క్రైస్ట్ ఎంబసీకి అనుబంధంగా ఉండి, దేశవ్యాప్తంగా "లీడర్‌షిప్" మరియు "మీడియా కార్యక్రమాలు" పేరిట అక్రమ సువార్త ప్రచారం మరియు నిధుల సేకరణలో నిమగ్నమై ఉంది.
“లీడర్‌షిప్ కాన్ఫరెన్స్” పేరిట వీసా ఉల్లంఘనలు చేస్తూ 2025 నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని లాల్ బహాదూర్ స్టేడియంలో జరగబోయే నాలుగు రోజుల “క్రిస్టియన్ లీడర్స్ అండ్ హయ్యర్ లైఫ్ కాన్ఫరెన్స్”లో పాస్టర్ క్రిస్ ఓయఖిలోమే పాల్గొననున్నారు, ఇది Christian Leaders Conference Hyderabad 2025 పేరుతో రిజిస్ట్రేషన్ లు కూడా మొదలయ్యాయి. అలాగే ఈ కార్యక్రమాన్ని “క్రిస్టియన్ మినిస్టర్లు మరియు లీడర్ల కోసం” అని పేర్కొంటూ ₹2,000 రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు వెబ్‌సైట్ ద్వారా విరాళాలను సేకరిస్తున్నారు
వాస్తవానికి ఇది “లీడర్‌షిప్ ప్రోగ్రామ్” పేరుతో ముసుగు వేసుకున్న సువార్త ప్రచార కార్యక్రమము, నైజీరియా పౌరులు ఇలాంటి మతప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం భారత వీసా నియమావళిని ఉల్లంఘించడమే. పేరుపొందిన సంస్థలు మరియు వ్యక్తులు బెలీవర్స్ లవ్‌వర్డ్ ట్రస్ట్ 2017లో పుణేలో (నమోదు సంఖ్య E-0007891) నమోదు అయింది.
దాని అధ్యక్షురాలిగా విదేశీ పౌరురాలు గ్లోరీ చివెటాల్ మోకెమే (Glory Chiwetal Mokeme) ఉన్నారు. ఈ ట్రస్ట్ ఎన్‌జీవో దర్పన్ పోర్టల్లో నమోదై ఉన్నప్పటికీ, దాని ట్రస్టీలు లేదా కార్యవర్గ సభ్యుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదు.
ఇంకా, లవ్‌వర్డ్ ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, 2014లో పుణేలో నమోదు చేసిన ప్రైవేట్ సంస్థగా ఉంది. దీనిలో ఓసే ఓయఖిలోమే (Ose Oyakhilome), చివెటాల్ మోకెమే (ఇద్దరూ విదేశీయులు) డైరెక్టర్లుగా, అలాగే భారత పౌరుడు ఐజాక్ అగర్వాల్ శ్యామ్ కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.
ఈ రెండు సంస్థలు మీడియా లేదా సేవా సంస్థల రూపంలో ముసుగు వేసుకున్నప్పటికీ, వాస్తవానికి మతప్రచారం మరియు నిధుల సేకరణకే వేదికలుగా పనిచేస్తున్నాయి. సంస్థ వెబ్‌సైట్‌లో “భారతదేశం మరియు ఆసియాలో యేసు క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడం మా లక్ష్యం” అని స్పష్టంగా పేర్కొంది.
గ్లోబల్ క్రైస్ట్ ఎంబసీ నెట్‌వర్క్‌తో అనుబంధం: నైజీరియా, లాగోస్‌లోని ప్రధాన కార్యాలయంతో ఉన్న బెలీవర్స్ లవ్‌వర్డ్ ఇన్‌క్ వ్యవస్థాపకుడు పాస్టర్ క్రిస్ ఓయఖిలోమే, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ టెలివిజన్ సువార్త ప్రచారకుడు. ఓసే ఓయఖిలోమే క్రైస్ట్ ఎంబసీ లవ్‌వర్డ్ USA చర్చిల ప్రధాన పాస్టర్‌గా మరియు లవ్‌వర్డ్ నెట్‌వర్క్స్ USA డైరెక్టర్‌గా ఉన్నారు, మరోవైపు చివెటాల్ మోకెమే, భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న పాస్టర్ చుక్స్ మోకెమే భార్య కూడా. ఈ కుటుంబం నెట్‌వర్క్ మరియు వ్యాపార సంస్థల కలయిక ద్వారా భారతదేశంలో అనేక చట్టబద్ధ రూపాలలో మతప్రచారం, నిధుల సేకరణ, మరియు ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి: వ్యాపార వీసాతో భారతదేశానికి వచ్చి మతప్రచారం చేసిన అమెరికన్ పౌరుడు జేమ్స్ వాట్సన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియా పౌరులు ఏ వీసా కేటగిరీపై భారత్‌లో ఉన్నారో మరియు వారి కార్యకలాపాలు చట్టబద్ధమా కాదా అనే విషయాన్ని హైదరాబాదు వస్తే వారు తేలిపోతుంది. దీనిపై హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం వుంది.
చట్టపరమైన విచారణ మరియు FCRA దర్యాప్తు చేయాల్సిన అవసరం వుంది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరియు ఇతర విచారణ సంస్థలతో కలిసి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) ఉల్లంఘనలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం వుంది.
భారత చట్టాలను మరియు వీసా నిబంధనలను వ్యాపార లేదా సేవా పేర్లతో దుర్వినియోగం చేస్తున్న విదేశీ మిషనరీ నెట్‌వర్క్‌లను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా అనేకమంది ఇలానే వచ్చి ప్రచారంలో పాల్గొని ఇబ్బందులకు గురయ్యారు. అలాగే ఈసారి వారు బిజినెస్ వీసాలపై వచ్చి మతపరమైన కార్యకలాపాలలో పాల్గొన్నట్లయితే మళ్లీ అదే జరుగుతుంది.
చివరగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని వారు పక్కింటిని కూడా నాశనం చేస్తాడంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇప్పటికే నైజీరియాలో క్రైస్తవులపై ముస్లింల దాడులు జరుగుతున్నాయి. అలాగే గత పన్నేండేళ్లలో సుమారు 50 వేల మందిని ముస్లిం లు చంపివేశారు. అక్కడ వాళ్లకు జరిగే అన్యాయాలను ఎదుర్కోకుండా భారత్ వచ్చి ఇక్కడేదో మార్చేస్తాము. అనే ధోరణి ఎలా ఉందంటే తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్నికి పరమాన్నం పెడతా అన్నట్లు వుంది. అక్కడ నైజీరియా లో మీ ముడ్డి మీరు కడుక్కుంటే చాలని మాముడ్లు కడగాల్సిన పనిలేదని భారత జాతీయవాదులు సోషల్ మీడియాలో విసుర్లు విసురుతున్నారు. పొరపాటున బిజినెస్ వీసా అని తెలితే ఇక భారత్ లో ఎప్పటికీ ఇలాంటి మీటింగ్ లు కండక్ట్ చేసే అవకాశమే ఉండకపోవచ్చు. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds


