దేశాన్ని విచ్చిన్నం చేయాడానికి విదేశీ శక్తులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాయి. విదేశీ శక్తులకు స్వదేశీ శక్తులు తమ పాలన కోసం రాజకీయ అనిశ్చితి తీసుకురావాలనే ప్రయత్నంలో దేశంలో అల్లర్లు, ఉద్యమాలు, ర్యాలీలు ఇలా అనేక ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా టారిఫ్ లతో మొదలయిన పంచాయితీ నేటి IPS ఆఫీసర్ ఆత్మహత్య వరకు ప్రతి అవకాశాన్ని కాంగ్రేస్, కమ్యునిష్ట్, అలాగే విదేశీ శక్తుల సమర్దనలు, విదేశీ పత్రికలు అన్నీ భారత్ పై విషం చిమ్ముతున్నాయి. ఆ అల్లర్లు, ఉద్యమాలు, గొడవలు ఏంటో ఈ వ్యాసంలో చూద్దాం...
1. 12 అక్టోబర్ 2025న జైపూర్, రాజస్థాన్‌లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) 400-500 మందితో పెద్ద సభ నిర్వహించి ర్యాలీ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ జాఖర్ మరియు ఇతర కాంగ్రెస్ విద్యార్థి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసలు వాళ్లని అరెస్ట్ చేసింది ఎందుకంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఉత్సవం పై దాడి చేసినందుకు అరెస్ట్ అయ్యారు. కానీ ఆర్.ఎస్.ఎస్ ని బ్లేమ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు, అల్లర్లు చేయాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ విఫలమయ్యారు.
2. 11 అక్టోబర్ 2025న యూత్ కాంగ్రెస్ అస్సాం మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహించింది. నల్బారీ మరియు నాగావ్‌లో కలిసి సుమారు 8,000-10,000 మందితో టార్చ్‌లైట్ ప్రాసెషన్‌లు మరియు బైక్ ర్యాలీలతో కూడిన ప్రదర్శనలు నిర్వహించారు. అసలు ర్యాలీకి కారణం ప్రసిద్ధ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ యొక్క మిస్టీరియస్ మరణానికి కారణం చెప్పాలని డిమాండ్ చేస్తూ నిర్వహించబడ్డాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్‌పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ ర్యాలీని అస్సాం ప్రభుత్వం సింపుల్ గా క్లోజ్ చేసింది. నిజం ఏమిటంటే జుబిన్ గార్గ్ సింగపూర్ లో స్క్యూబా డైవింద్ చేస్తూ అదుపుతప్పి దుర్మరణం పాలయ్యాడు.
3. 11 అక్టోబర్ 2025న హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అధ్యక్షుడు రావు నరేంద్ర సింగ్ ఆద్వర్యంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించింది. ఈ ర్యాలీలు, సభలు IPS అధికారి పురాన్ కుమార్ సూసైడ్ కి నిరసన తెలుపుతూ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను దలిత ఆప్ప్రెషన్ కేస్‌గా మలిచింది. హర్యానా రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్‌లో జరుగుతున్న ఆధిపత్య దోరణిని హర్యానా ప్రభుత్వం అణచివేసింది. అలాగే కాంగ్రేస్ గి గట్టి సమాదానం చెప్పింది.
4. 11-12 అక్టోబర్ 2025న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో అనేక ప్రదేశాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించింది. పటేల్ నగర్‌లో 400-500 పాల్గొన్నవారితో పార్టీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) బి.ఆర్. గవాయ్ పై షూ విసిరిన ఘటనను నిరసిస్తూ ఈ ర్యాలీ చేసింది. వాస్తవానికి కాంగ్రేస్ 60 పై బడిన పాలనలో జడ్జిలపై ఎన్నో దాడులు జరిగాయి. కానీ దీనినే హైలెట్ చేస్తూ అదే కాంగ్రెస్, ఆప్ లు దీనిని సనాతన ధర్మానికి లింక్ చేస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీలు చేయడం శోచనీయం. జడ్జి గారు దానిని వ్యక్తిగత దాడిగానే పరిగణించి కిశోర్ గారిని మన్నించారు, న్యాయవ్యవస్థ కు జరిగిన అవమానం గా వారు పరిగణించలేదు.
5. అదే ఢిల్లీ లో 11 అక్టోబర్ 2025న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) దేశ వ్యాప్తంగా CJI పై దాడి ఘటనను IPS అధికారి పురాన్ కుమార్ సూసైడ్ ను నిరసిస్తూ పిలుపిచ్చింది. ఢిల్లీలో రాజేంద్ర పాల్ గౌతం మరియు లక్నోలో అజయ్ రాయ్ వంటి నాయకుల నేతృత్వంలో, పార్టీ రెండు ఈవెంట్‌లను దళితులకు జరిగిన అన్యాయంగా ప్రొజెక్ట్ చేస్తూ ఈ ర్యాలీలు నిర్వహించింది. అయినప్పటికీ ఎక్కడా గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేసింది. అలాగే అక్టోబర్ 8 న పట్నా, కురుక్‌షేత్ర, మరియు గురుగ్రామ్ లో వందలాది మందితో నిరసనలు చేసింది. ఈ అంశం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనల ప్రయత్నం చేసింది, కానీ ప్రజలకు వాస్తవాలు తెలియడం మూలాన ఎక్కడా అల్లర్లు కాలేదు.
6. 10 అక్టోబర్ 2025న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB), AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ర్యాలీని నిర్వహించింది. 200-300 మంది పాల్గొన్న డెమాన్‌స్ట్రేషన్, ఇటీవల పాస్ అయిన వక్ఫ్ అమెండ్‌మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఈ గ్రూప్‌లు ముస్లిం కమ్యూనిటీ ప్రాపర్టీలు మరియు హక్కులపై పోరాటం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి కానీ ప్రభుత్వం ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడింది.
7. 10 అక్టోబర్ 2025న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజుభాయ్ కర్పడా, గుజరాత్‌లో బోటాడ్‌లో ఆగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (APMC) బయట 8,000-10,000 మందితో పెద్ద ర్యాలీ ని రైతుల పేరుతో నిర్వహించారు, రాష్ట్రంలో ఆగ్రికల్చరల్ మార్కెటింగ్ మరియు రైతుల వెల్ఫేర్‌కు సంబంధించిన లాంగ్‌స్టాండింగ్ ఇష్యూలను కావాలని ప్రచారం చేసింది. వాస్తవాలు వేరేలా ఉన్నాయి. అలాగే ఈ పదివేల మంది రైతులు కాదని చూసిన వారందరికీ తెలుసు గనుక ఏ ఒక్కరూ పెద్దగా స్పందించలేదు.
8. 09 & 10 అక్టోబర్ 2025న లెఫ్ట్-లీనింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఢిల్లీ యూనివర్సిటీ లో ప్రో-పాలస్తీనా ర్యాలీని నిర్వహించింది. 100-150 మంది విద్యార్థులు పాల్గొన్నారు, ఇతర విద్యార్థులతో గొడవలకు దారితీసింది. ఢిల్లీ పోలీస్ గొడవలు చేసిన వారిని గుర్తింంచి అరెస్ట్ చేసింది. విశ్వవిద్యాలయం 8 మందిని డిటెయిన్ చేసింది. ముంబైలో అజాద్ మైదాన్ వద్ద కూడా ప్రో పాలిస్తీనా అంటూ పాలిస్తానాకు మద్దతు తెలిపారు. మలప్పురం లో ఇదే రోజుల్లో ప్రో పాలిస్తీనా అంటూ ర్యాలీలు, సభలు నిర్వహించారు.
9. 09 అక్టోబర్ 2025న యునైటెడ్ లెఫ్ట్ పార్టీల కోలిషన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సభ నిర్వహించింది. 1,000-2,000 వ్యక్తుల పాల్గొన్నారు, పాలస్తీనాకు మద్ధతుగా ర్యాలీలు నిర్వహించింది. ( ఇటువంటి వ్యాసాల కోసం MegaMindsIndia వెబ్‌సైట్ ని సందర్శించండి. )
10. 08 అక్టోబర్ 2025న అస్సాం యొక్క ఆరు టీ-ట్రైబ్ కమ్యూనిటీలు, ATTSA మరియు AASAA లీడ్ చేసిన, తిన్సుకియాలో సభలు, ర్యాలీలు చేశారు. హుకాన్ పుఖురి ప్లేగ్రౌండ్ వద్ద సుమారు 2-3 లక్ష మంది పాల్గొన్నారు, స్కెడ్యూల్డ్ ట్రైబ్ (ST) స్టేటస్, ల్యాండ్ ఓనర్‌షిప్ హక్కులు, మరియు ప్లాంటేషన్ వర్కర్‌ల జీతాల పెంపును డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని చేశారు. 3 లక్షల మంది పాల్గొన్న వారిని బిశ్వా శర్మ కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేశారు.
11. 08 అక్టోబర్ 2025న ప్రాయగ్రాజ్, ఉత్తరప్రదేశ్‌లో, డాక్టర్ అశిష్ మిత్తల్ నేతృత్వంలో ర్యాలీలి నిర్వహించబడ్డాయి. 40-50 మంది మాత్రమే పాల్గొన్నారు, లడాఖ్ యాక్టివిస్ట్ సోనం వాంగ్‌చుక్ విడుదలను డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు జరిగాయి.
12. 08 అక్టోబర్ 2025న NSUI ఢిల్లీ మరియు పలు నగరాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించింది. రాయ్ బరేలీలో ఒక మర్డర్‌పై నిజాలు తేలలంటూ ఈ ర్యాలిలు చేస్తే రెండు గ్రూప్‌ల మధ్య గొడవలు జరిగాయి. చివరకు దీనికి దళిత్ కార్డ్ వాడేసింది. చిన్న చిన్న గ్రూప్ లతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరిగాయి. దీనిపై పెద్ద ప్రచారం జరగలేదు.
13. 08 అక్టోబర్ 2025 న సిగ్నిఫికెంట్ షో ఆఫ్ పాలిటికల్ ఫోర్స్‌లో, CPI(M) తమిళనాడు, చెన్నైలో ప్రో-గాజా ర్యాలీని నిర్వహించింది. ఈవెంట్ చీఫ్ మినిస్టర్ ఎం.కె. స్టాలిన్ మరియు 5,000-7,000 సపోర్టర్‌లతో హాజరయ్యారు. స్టాలిన్ భారత్‌కు పాలస్తీనాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్‌ను అందించాలని, సెంట్రల్ గవర్నమెంట్‌ను యుద్ధాన్ని ఆపడానికి సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వమే ఈ ర్యాలీ నిర్వహించడం మూలాన ఎటువంటి అల్లర్లు జరగలేదు.
14. 07 అక్టోబర్ 2025న హైదరాబాద్‌లో ధర్నా చౌక్ వద్ద ప్రో పాలస్తీనా మద్ధతు సభ నిర్వహించబడింది. IPSP మరియు BDS గ్రూప్‌లచే నిర్వహించారు, ఈవెంట్ 500-700 మంది పాల్గొన్నారు. ఈ నిరసన ఆందోళగా మారి పోలిసులు కేంద్ర బలగాలు అదుపుచేశాయి.
15. 07 అక్టోబర్ 2025ఢిల్లీలో టార్గెటెడ్ గా ర్యాలీలు, 50-100 AAP వర్కర్‌లు CJI చెప్పు విసిరిన ఘటనకు నిరసనగా 72-సంవత్సరాల లాయర్ హౌస్‌ను చుట్టుముట్టారు.
16. 07 అక్టోబర్ 2025న NSUI మధ్యప్రదేశ్, భోపాల్‌లో 800-1,000 నర్సింగ్ స్టూడెంట్స్ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. స్టూడెంట్స్ 13 నర్సింగ్ కాలేజీలు డీరికగ్నైజ్డ్ చేయడం మూలాన ఈ ర్యాలీ నిర్వహించారు. మీకు తెలుసు నర్సింగ్ కాలేజీల పరిస్థితి. అలాగే జైపూర్ రాజస్తాన్ లో ఇటువంటి నర్సింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ని తెలిపే నిరసనలు.
17. 06 అక్టోబర్ 2025న చత్తీస్‌గఢ్, రాయగఢ్‌లో, హస్దెవ్ అరన్యా బచావో సంఘర్ష్ సమితి 800-1,000 మందితో ర్యాలీని నిర్వహించింది. గారే పాల్మా 1 కోల్ బ్లాక్‌ను జిందల్ కంపెనీకు అలాకేట్ చేయడానికి వ్యతిరేకంగా మరియు, ఫారెస్ట్ రీజియన్‌లో ఆన్‌గోయింగ్ ఎన్విరాన్‌మెంటల్ మరియు డిస్‌ప్లేస్‌మెంట్ కన్‌సర్న్‌లకు వ్యతిరేకంగా ఇది నిర్వహించారు. వాస్తవాలు అల్లర్లు, గొడవలు సృష్టించడం.
18. 05 అక్టోబర్ 2025 న దేశ వ్యాప్తంగా జరిగినా గాజా సపోర్ట్ ర్యాలీలలో భాగంగా హైదరాబాద్‌లో ధర్నా చౌక్ వద్ద గాజా సపోర్ట్ ధర్నా నిర్వహించబడింది. BDS ఇండియా ఇది ఆర్గనైజ్డ్ చేసింది. ఈ ఈవెంట్ లో 500-600 పాల్గొన్నారు. ఢిల్లీ, ముంబై, మరియు కోల్‌కతా వంటి ఇతర మేజర్ ఇండియన్ సిటీల్లో పెద్ద ఎత్తున జరిగాయి.
19. 05 అక్టోబర్ 2025న హైదరాబాద్‌లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) వద్ద, ముస్లిం స్టూడెంట్స్ “I Love Mohammad” క్యాంపెయిన్ కింద 100-150 మందితో ర్యాలీ నిర్వహించారు. పాల్గొన్నవారు క్యాంపెయిన్ సపోర్ట్‌లో స్లోగన్‌లు ఎత్తుతూ కనిపించారు, క్యాంపస్‌పై రెలిజియస్ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ, అల్లర్లు చేయాలనే దోరణితో సాగింది. పోలీస్ కేంద్ర బలగాలు అదుపుచేశాయి.
20. 05 అక్టోబర్ 2025న సిందేగాలో క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులు 1,000-2,000 మందితో సభ నిర్వహించారు. కారణం ఇటీవల చర్చ్ మరియు క్రిస్టియన్ రెలిజియస్ లీడర్‌పై దాడులకు వ్యతిరేకంగా, అథారిటీల నుండి ప్రొటెక్షన్ మరియు జస్టిస్‌ను డిమాండ్ చేశారు.
21. 05 అక్టోబర్ 2025న BDS ఇండియా మరియు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మేజర్ ర్యాలీని నిర్వహించాయి. ఈ ఈవెంట్ లో 2,000 మంది పాల్గొన్నారు, పాలస్తీనా కోసం కోఆర్డినేటెడ్ గా పెద్ద ఎత్తున ఇదే రోజు అనేక ర్యాలీలు జరిగాయి.
22. సెప్టెంబరు 11 నుండి ఇలా సోనమ్ వాంగ్ చుక్ కి మద్దతుగా, గాజా కీ మద్ధతుగా, CJI కి మద్ధతుగా, నర్సింగ్ కాలేజీల విషయంలో, IPS ఆఫీసర్ విషయంలో, I Love Mohammad, Waaf Board, ఇలా అనేకానేక కారణాలతో బీహార్ సరిహద్దు రాష్ట్రాల వెంబడి అనేక ర్యాలీలు నిర్వహించి, సభలు పెట్టి ప్రతిదాన్ని ఒక నేషనల్ ఇష్యూలుగా చిత్రీకరించారు.
ఈ ర్యాలీల ముఖ్య ఉద్దేశ్యం దేశం లో రాజకీయ అనిశ్చితి తీసుకువచ్చి, ప్రభుత్వాలను అస్తిరపరచడం. ఏది ఏమయినప్పటికీ భారత ZenG ని మాత్రం మెచ్చుకోవాల్సిందే ఢిల్లీ, HCU విశ్వవిద్యాలయాలలో జాతీయవాద విద్యార్థి సంఘాలను గెలిపించుకున్నాయి. అలాగే మరోకవైపు దేశ వ్యాప్తంగా అడ్డంకులు సృష్టించినప్పటికీ RSS తన శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దసరా ఉత్సవాలను, రూట్ మార్చ్ లను చేస్తూ దేశ ప్రజల్లో పంచ పరివర్తనకు శ్రీకారం చుట్టింది. అలాగే దేశ ప్రజలూ వీరిని స్వాగతించారు, సంఘటిత జాతీయ శక్తి ముందు విదేశీ శక్తులకు వంతపాడిన దేశ ద్రోహుల ఆటలు ఈ ఆరు నెలలుగా అడ్డుకట్టపడుతూనే ఉన్నాయి. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds


