‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (Reporters Sans Frontier's ఇదొక పారిస్ సంస్థ) భారత్‌పై చూపుతున్న ద్వేషం ఇప్పుడు మరొక్కసారి బయటపడింది. జార్జ్ సోరోస్ నిధులతో నడిచే ఒక వార్తా సంస్థ 'ద న్యూస్ మినిట్’, ఎడిటర్ ధన్యా రాజేంద్రన్‌కి ఒక అవార్డుకు నామినేట్ చేసింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చే కుట్రల్లో భాగంగా ఉన్న జార్జ్ సోరోస్‌కి చెందిన సంస్థే ఈ నామినేషన్ ఇచ్చింది.
కర్ణాటకలోని ధర్మస్థల కేసు గుర్తుందా? ‘ద న్యూస్ మినిట్’ (TNM) ఆ కేసు మీద ఎలాంటి కథనాలు రాసిందో తెలుసు కదా? ధర్మస్థలాన్ని చెడుగా చూపిస్తూ, నిజాలు పట్టించుకోకుండా అనేక నివేదికలు ప్రచురించింది. ఇప్పుడు అదే ప్రచారానికి అవార్డు నామినేషన్ కూడా వచ్చింది.
‘ద న్యూస్ మినిట్’ సహ వ్యవస్థాపకురాలు మరియు ప్రధాన ఎడిటర్ ధన్యా రాజేంద్రన్‌కి, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) సంస్థ ‘ఇంపాక్ట్ ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ 2025’కి నామినేట్ చేసింది.
RSF ఇలా చెప్పింది: “ధన్యా రాజేంద్రన్ మీడియా స్వేచ్ఛ కోసం పెద్ద పోరాటం చేసింది, భారత ప్రభుత్వం ఆమెపై నిషేధాలు విధించడానికి ప్రయత్నిస్తోంది.” RSF ఇంకా TNMను “నమ్మదగిన పత్రిక” అని పొగిడింది. అంటే రాతలు రాసేది వారే, బహుమతులకు నామినేషన్ చేసేది వారే అంటే ఇద్దరూ ఒకే గుంపుకు చెందినవారన్నమాట.
“ధన్యా మరియు ఆమె టీమ్ ధర్మస్థలంపై అసత్యాలు ప్రచారం చేసినందుకు గాను బెదిరింపులు, ఆన్‌లైన్ దాడులు ఎదుర్కొన్నారు.” అంటూ RSF నామినేషన్ చదివితే ధన్యా మాత్రమే ప్రపంచంలో అత్యంత బాధిత జర్నలిస్టు అనిపిస్తుంది. అలాగే ఈ అవార్డును ఇచ్చే సంస్థ కూడా జార్జ్ సోరోస్ నిదులతో నడుస్తుంది. సోరోస్ ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడంలో ప్రసిద్ధుడు.
కర్ణాటక ధర్మస్థలంపై TNM (The News Minute) ప్రచారం: 2025 జూలైలో కర్ణాటక ధర్మస్థల దేవాలయానికి పారిశుధ్య కార్మికుడుగా పని చేసిన మాజీ ఉద్యోగి సి.ఎన్. చెన్నయ్య, “ఇక్కడ కొన్ని వందల శవాలు పాతిపెట్టారు” అని ఆరోపించాడు. అది 1995–2014 మధ్య కాలం లో జరిగిందని చెప్పాడు.
ఏ ఆధారమూ లేకుండా, కేవలం చెన్నయ్య మాటలపై ఆధారపడి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక SIT దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. రెండు వారాల పాటు అడవులు, నదీ తీరాలు, ఘాట్‌లలో తవ్వకాలు జరిగాయి. కానీ ఎక్కడా ఏ శవాలు దొరకలేదు.
తర్వాత చెన్నయ్య కోర్టులోనే ఒప్పుకున్నాడు, “నేను అబద్ధం చెప్పా” అని. అప్పుడు తెలిసింది, ఇది ధర్మస్థలం, దాని ఆలయ ట్రస్ట్, మరియు ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే పేరును చెడగొట్టే కుట్రలో భాగం అని. కానీ ‘ద న్యూస్ మినిట్’ మాత్రం ఈ విషయాన్ని చేతిలోకి తీసుకుని, ఆధారాలు లేకపోయినా డజన్ల కొద్దీ తప్పుడు వార్తలు వ్రాసింది, నివేదికలు ప్రచురించింది. ఆరోపణలు అబద్ధమని తెలిసినా, “ధర్మస్థలంలో శవాలు పాతిపెట్టారు” అంటూ అసత్య కథనాలు రాసింది.
TNM హిందూ వ్యతిరేకత: ధర్మస్థల కేసులో TNM ప్రవర్తన చూసి హిందువుల మీద దాని వ్యతిరేక ధోరణి బహిరంగమైంది. ఇది మొదటి సారి కాదు. TNM చాలా కాలంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని వార్తలు రాస్తుంది.
ఇదే పోర్టల్ ఒకసారి సామూహిక లైంగిక దాడి కేసులో ముస్లిం నిందితుల పేర్లను హిందూ పేర్లతో మార్చి వార్త పెట్టింది. దాని మీద తీవ్ర విమర్శలు రావడంతో, తర్వాత తప్పు అంగీకరించినా, పెద్దగా దాని గురించి చర్చ జరగలేదు. TNM ఎప్పుడూ కూడా హిందూ సంస్థలపై వచ్చిన ఆరోపణలకు పెద్ద ప్రాధాన్యం ఇస్తుంది.
‘ద కేరళ స్టోరీ’ సినిమా గుర్తుందా? మతమార్పిడి చేసి ఐసిస్‌కి పంపిన మహిళల నిజజీవిత సాక్ష్యాలు ఉన్నా, TNM మాత్రం ఆ సినిమాను “దుష్ప్రచారం” అని తేల్చేసింది. అంటే బాధితుల వాణిని పూర్తిగా పట్టించుకోలేదు.
ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ భూములపై అక్రమంగా నిర్మించిన మసీదులు, మదరసాలు గురించి అనేక ఆధారాలు బయటపడ్డాయి. కానీ TNM దానిపై ఒక్క రిపోర్ట్ కూడా రాయలేదు.
ఇంకా, ఎక్కడైనా హిందూ ఆలయం లేదా సంస్థపై ఆరోపణ వస్తే మాత్రం, వెంటనే “ఎక్స్‌క్లూజీవ్ రిపోర్ట్” అంటూ పెద్దగా ప్రచారం చేస్తుంది. ‘లవ్ జిహాద్’ వంటి సున్నితమైన అంశాలపై కూడా TNM మౌనం పాటిస్తుంది. ఎవరైనా రాసినా, “ఇది రైట్ వింగ్ ప్రచారం” అని తేల్చేస్తుంది. ఇలా మతమార్పిడి వల్ల మోసపోయిన మహిళల బాధను కూడా తక్కువ చేసి చూపిస్తుంది.
సోరోస్ డబ్బుతో నడిచే RSF సంస్థ: ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ (RSF) అనే ఈ సంస్థ ముందుగా రవీష్ కుమార్‌కి అవార్డు ఇచ్చింది. అదే కాకుండా మొహమ్మద్ జుబైర్ లాంటి దుష్ప్రచారకులను కూడా సమర్థించింది.
RSFకి జార్జ్ సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, పాశ్చాత్య ప్రభుత్వాలు, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి నిధులు వస్తాయి. ఇది భారత్ వ్యతిరేక ధోరణికి ప్రసిద్ధి చెందింది.
RSF కి ఫండింగ్ ఇచ్చేవారిలో: యూరోపియన్ కమిషన్, ఓక్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (OSF) వంటి సంస్థలు ఉన్నాయి. ఈ OSF అంటేనే సోరోస్‌ది, ఇది భారతదేశంలోని ది వైర్, ఆల్ట్ న్యూస్, ది క్వింట్, స్క్రోల్ వంటి పోర్టల్స్‌కి నిధులు ఇస్తుంది. RSF భారత్‌పై చేసే రిపోర్టుల్లో రాజకీయ పక్షపాతం స్పష్టంగా ఉంటుంది. దాని “ఇండియా ఫాక్ట్ ఫైల్”లో మోదీ మద్దతుదారులను “భక్తులు”, మీడియాను “గోడీ మీడియా” అంటూ ఎగతాళి చేసింది.
ఇది ఎలాంటిది అంటే 2023లో RSF భారత్‌ను ప్రపంచ ప్రెస్ స్వేచ్ఛ సూచీలో 161వ స్థానంలో పెట్టింది (180 దేశాలలో). అంటే భారత్‌కి మించి పాకిస్తాన్‌కి ర్యాంక్ బాగుంది. పాకిస్తాన్ 150వ స్థానంలో ఉంది అని ర్యాంకులు ఇచ్చింది. ఈ ఒక్కటి చాలు, భారత్ పట్ల RSF పక్షపాతం ఎలాంటిదో స్పష్టంగా తెలపడానికి.
సోషల్ మీడియాలో ప్రతిస్పందన: ధన్యా నామినేషన్‌పై సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. వ్యాపారవేత్త మోహన్‌దాస్ Xలో ఇలా రాశాడు: “ఇది భయంకరం. ధర్మస్థలంపై అబద్ధ కథలు రాసినందుకా ఈ నామినేషన్? వామపక్ష వ్యవస్థ ఇలాగే పనిచేస్తుంది. ముందుగా తప్పుడు కథలు తయారు చేస్తారు, తర్వాత ఆ ఎకోసిస్టమ్ వారికే అవార్డులు ఇస్తుంది.” అతను ఇంకా ఇలా రాశాడు: “ధన్యాలో కొంచెం నిజాయితీ, ఆత్మగౌరవం ఉంటే ధర్మస్థలంపై తప్పుడు కథనలు రిపోర్ట్ చేసినందుకు క్షమాపణ చెప్పాలి.”
ధర్మస్థల ఘటన ఫేక్ జర్నలిజం పేరుతో అబద్ధాలు ఎలా సులభంగా వ్యాప్తి చేయవచ్చో. ధన్యా రాజేంద్రన్‌కి RSF ఇచ్చిన నామినేషన్ నిజాయితీకి బహుమతి కాదు, తప్పుడు భావజాలం వ్యాప్తి చేసినందుకు ఇచ్చిన బహుమతి గానే దేశ ప్రజలంతా భావిస్తున్నారు. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds


