దక్షిణ ఆసియా ఇప్పుడొక సూపర్ పవర్ ఆట స్థలం గా మారిపోయింది. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా, చైనా ఈ మూడు దేశాలు బంగాళాఖాతం చుట్టూ తమ గూఢచారులతో పావులను కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇటీవల అంతర్జాతీయ రాజకీయ కేంద్రంగా మారింది. అక్కడ జరిగిన ఒక మరణం ప్రపంచ గూఢచార వర్గాలను షాక్‌కు గురిచేసింది.
ఢాకా మిస్టరీ ఆగస్ట్ 31, 2025న ప్రారంభమైంది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ వెస్టిన్ హోటల్ రూమ్ 808లో మృతదేహంగా కనబడ్డాడు. బాంగ్లా హసీనా ప్రభుత్వంను కూల్చేయడానికి జాక్సన్ ముఖ్యపాత్ర పోషించాడనే అనుమానం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం “సహజ మరణం” అని చెప్పినా, సోషల్ మీడియాలో ఆ సంఘటనను చుట్టుముట్టిన ఊహాగానాలు మాత్రం ఆగలేదు. CIA ఆపరేషన్‌నా? లేక ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందస్తు చర్యనా? అన్నదానిపై చర్చలు ఊపందుకున్నాయి.
ఇదే సమయానికి, మోదీ పుతిన్ SCO సమ్మిట్‌లో జరిగిన 45 నిమిషాల “కార్ కాన్వర్సేషన్” ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పుతిన్ మోదీని తన లిమోజిన్‌లో తీసుకుని, రహస్యంగా ఏం మాట్లాడారన్నది ఇప్పటివరకు మిస్టరీగా ఉంది. కొందరు విశ్లేషకులు పుతిన్ మోదీకి CIA కుట్రపై హెచ్చరిక ఇచ్చాడని చెబుతున్నారు. ఆ చర్చల తర్వాతే భారత రష్యా గూఢచారి సహకారం మళ్లీ వేగం పుంజుకోవడం యాదృచ్ఛికం కాదు.
ఇంతలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ఆట మొదలెట్టాడు. కెనడాలో జరిగిన G7 సమ్మిట్‌లో మోదీతో ఫోటోషూట్ ప్లాన్ చేసి వైట్ హౌస్ కి రమ్మని ఆహ్వానం పంపాడు, అలాగే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను కూడా ఆహ్వానించాడు. వాళ్లిద్దరిని కలిపి ఒక్క ఫోటోతో “నేనే ఇండియా–పాక్ యుద్ధం ఆపిన శాంతిదూత”గా ప్రపంచానికి చూపించాలని ట్రంప్ ప్లాన్. కానీ మోదీ ఆ ట్రాప్‌ను గుర్తించి, క్రొయేషియా టూర్ పేరుతో తప్పించుకున్నారు. ట్రంప్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.
తర్వాత ట్రంప్ కోపం చల్లారలేదు. భారత్‌పై 50% ఎగుమతి సుంకాలు విధించగా, మోదీ మాత్రం వెనకడుగు వేయలేదు. “మేడ్ ఇన్ ఇండియా”తో ఆత్మనిర్భర భారత్ మార్గంలో ముందుకు సాగారు. రష్యా, చైనా, SCO బ్లాక్‌లతో సంబంధాలు బలోపేతం చేశారు. ఈ చర్యలు అమెరికా “డీప్ స్టేట్”లో ఆగ్రహం రేపాయి. అంతర్జాతీయ విశ్లేషకులు దీనినే “Op 37” అని పిలిచే రహస్య కుట్రలకు మూలం అంటున్నారు.
బంగ్లాదేశ్ ఈ మొత్తం ఆటలో కీలక మైదానం అయ్యింది. చైనా పెట్టుబడులు, అమెరికా ప్రెజెన్స్, పాకిస్తాన్ ISI చలనం, భారత గూఢచారి కదలికలు, అన్నీ అక్కడే కలిశాయి. సెయింట్ మార్టిన్ ఐలాండ్‌పై అమెరికా శిక్షణ శిబిరాలు, హసీనా ప్రభుత్వ పతనం, యూనస్ గవర్నమెంట్ రాక ఇవన్నీ ఒకే స్ట్రాటజిక్ లో భాగమని అనుమానాలు. ఢాకా ఇప్పుడు ఒక లిటిల్ కోల్డ్ వార్ సెంటర్‌గా మారిందనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు.
ఇక పాకిస్తాన్ ISI కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు రెహ్యులర్ గా తన సహజ వృత్తి అయిన నకిలీ కరెన్సీ, చిన్న ఆయుధాల అక్రమ రవాణా ద్వారా భారత సరిహద్దులను అస్థిరపరచే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యి పెరిగుతున్నాయి కూడా. దీనికి ప్రతిగా భారత R&AW మరియు IB యంత్రాంగం సరిహద్దు భద్రతను కఠినం చేసింది. ఇండియా ఇప్పుడు “హైబ్రిడ్ థ్రెట్స్”ను గుర్తించి, సాంకేతిక నిఘా వ్యవస్థలతో ముందుగానే ప్రతిస్పందిస్తోంది.
ఈ మొత్తం డ్రామాలో ప్రధానంగా నిలిచేది మోదీ వ్యక్తిత్వం. విదేశీ కుట్రలు, ట్రేడ్ ప్రెషర్స్, గూఢచారి మిస్టరీలు ఇవన్నీ ఉన్నా, ఆయన ధైర్యం మాత్రం తగ్గలేదు. “యుద్ధాలు ఇప్పుడు బుల్లెట్ గుళ్లతో, మిసైళ్లతో కాకుండా సమాచారంతో ప్రారంభమవుతున్నాయి” అన్నది ఢాకా సంఘటన చూపించిన నిజం. ప్రపంచం శాంతి కోసం మాట్లాడుతున్నా, వెనుక అగ్ని గూఢచార సంస్థలే రాజేస్తున్నాయి.
ఇప్పుడసలు ప్రశ్న ఏంటంటే టెరెన్స్ జాక్సన్ మరణం యాదృచ్ఛికమా? లేక దక్షిణ ఆసియాలో కొత్త గూఢచారి యుద్ధం మొదలైందా? పుతిన్, ట్రంప్, మోదీ, యూనస్, హసీనా ఈ ఐదు పేర్లు ఇప్పుడు ఒకే మిస్టరీలో కలిసిపోయాయి. నిజం బయటకు రావడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, దక్షిణ ఆసియాను నిశ్శబ్దంగా మంటలతో తగలబెట్టటానికి కుట్రలు జరుగుతున్నాయి!!! అనే అనుమానం కలుగుతోంది. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds


