మనం ఎప్పుడూ వినని ఒక తెగ యజిడి. ISIS వాళ్లు పూర్తిగా యజిడీలను నాశనం చేయాలని చూశారు. కానీ వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఉత్తర ఇరాక్‌లోని అత్యంత పురాతన జాతి. మతం పరంగా మైనారిటీ అయిన యజీడీలు, శతాబ్దాలుగా హింసను ఎదుర్కొంటూ సొంత నేలపై బానిసలుగా ఉండిపోయారు. 2014లో ISIS వారిని తుడిచిపెట్టేయాలని ప్రయత్నించింది.
యజీడీ మతం అనేది జొరాస్ట్రియన్ మతం, ఇస్లాం, క్రైస్తవం మతాల మేళవింపు. శతాబ్దాలుగా వారిని క్రైస్తవం, ఇస్లాం సైతానులుగా దూషించాయి. ఈ సైతాన్ లుగా భావించడం వలన ఇస్లాం మతం వారిపై ద్వేషాన్ని పెంచింది. వారిపై జరిగిన మారణహోమాలకు పునాదిగా మారింది. ఈ చరిత్రాత్మక తప్పిదమే ISIS చేసిన మారణ హోమానికి దారితీసింది. 2014 ఆగస్టు, ISIS యజిడీల ప్రధాన కేంద్రం సింజార్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గ్రామాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది పురుషులను చంపేశారు. మహిళలు, బాలికలు బానిసలుగా అమ్మబడ్డారు, మరియు పక్కా అత్యాచారాలకు గురయ్యారు. ఐక్యరాజ్యసమితి పరిశోధకులు దీన్ని అధికారికంగా “మారణహోమంగా” గా గుర్తించారు.
ISIS యజిడీ మహిళలు మరియు పిల్లలను కొనుగోలు, అమ్మకం చేసే బానిస మార్కెట్లు నిర్వహించింది. 9 ఏళ్ల పసిపిల్లల్నీ “భార్యలుగా” అమ్మేశారు. కుటుంబాలు విడిపోయాయి, అనేకమంది మహిళలు సిరియా, ఇరాక్ అంతటా పదుల సార్లు మార్చి మార్చి తిరిగి బానిసలుగా అమ్మబడ్డారు. వేలాది మంది సింజార్ కొండపైకి పారిపోయారు, ఆహారం, నీరు లేకుండా అలమటించారు. అలా ఆకలితో, దాహంతో విలవిలలాడుతున్న యజిడీ కుటుంబాల చిత్రాలు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాయి. అమెరికా వైమానిక దాడులు, కుర్ద్ సైనికుల సహాయంతో ఆ ముట్టడి చివరకు ముగిసింది. కానీ అప్పటికే వేలాది ప్రాణాలు పోయాయి.
ఈ తీవ్రమైన గాయాల తర్వాత కూడా యజిడీలు ధైర్యాన్ని కోల్పోలేదు. తమ భాష, సంగీతం, పవిత్ర సంప్రదాయాలను కాపాడుకునేందుకు వారు పోరాడుతునేవున్నారు. వారి పుట్టిన మాతృభూమి నాశనాన్ని తలచుకుంటూనే యూరప్‌లో శరణార్థులుగా జీవిస్తూ, కొత్త జీవితం మొదలుపెట్టారు.
ISIS యజీదీలను నాశనం చేయాలని ప్రయత్నించింది. కానీ దాని బదులుగా, వారి కథ ధైర్యం మరియు స్థైర్యానికి ప్రతీకగా మారింది. వారిని చరిత్ర నుండి చెరిపేయాలని ప్రయత్నించినా, అన్ని ప్రతికూలతల మధ్య కూడా యజిడీలు తమ సంస్కృతిని ససజీవంగా ఉంచారు.
అయితే యజిడీల దీనగాథ ISISతో ముగియలేదు. 2023 సంవత్సరంలో 2014లో ISIS కిడ్నాప్ చేసిన ఒక యజిడీ మహిళ గాజాలో హమాస్ చేతుల్లో బంధిగా మారింది. ISIS మరియు హమాస్ మధ్య ఉన్న సంబంధం అదే సిద్ధాంతం, అదే తీవ్రవాద దృష్టికోణం. యజీదీ మహిళలను బానిసలుగా మార్చిన ఆ ఆలోచనే, ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతోంది. 2014 లో ISIS బందీలుగా చేసి బానిసలుగా వేలం చేసి మరీ అమ్ముకుంది అక్షరాలా 7000 మందిని అందులో 2599 మంది ఈ రోజు కీ ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలీదు.
ఇకపోతే యూదులు: ఇస్లాం, క్రైస్తవ మతాలకు పుట్టుకకు కారణమే యూదు జాతి అటువంటి వారినే పాలస్తీనా నేలపై లేకుండా ప్రపంచ వ్యాప్తంగా తరిమివేయబడ్డారు ఇస్లాం మత చాందసంతో అలా పారిపోయిన వారికి ఆశ్రమం ఇచ్చింది భారత దేశం. మరలా 1918 లో పాలస్తీనాని ఒట్టమన్ సామ్రాజ్యం నుండి విముక్తి గావించి మొదటి ప్రపంచ యుద్ధం లో వారికి ఇచ్చింది భారత కలవరీ దళాలు. ఆ తరువాత 1948 లో అమెరికా చొరవతో పూర్తిగా వారికి స్వాతంత్ర్యం లభించి ప్రపంచంలో ఉన్న యూదులందరూ అక్కడకు చేరి మరలా వారి వైభవాన్ని పున: ప్రారంభం చేశారు.
అలగే హిందువులపై ఇస్లాం జరిపిన నరమేధం ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నాను, కాశ్మీరీ పండిట్‌ల నరమేధం 1990లో 4 లక్షలకు పైగా హిందువులు తమ ఇళ్లు విడిచి పారిపోవలసి వచ్చింది. వందలాది మందిని క్రూరంగా చంపేశారు.
ఇప్పుడు చెప్పండి ఇస్లాం తన పుట్టుకకు కారణమైన యూదులను, యజిడీ జాతులనే కాదు యావత్ ప్రపంచానికి జ్ఞానానిచ్చిన హిందూ జాతినే తుడిచిపెట్ట చూస్తుంటే మరి ఎందుకు? ఎందుకు? ఈ దేశ మేదావులుగా చలామణి అవుతున్న అర్బన్ నక్సల్స్, సెక్యులర్లు, కమ్యునిష్ట్ లు, మానవ హక్కుల సంఘాల వాళ్లు మౌనాన్ని వహిస్తున్నారు.
ఎందుకు హిందువుల, యజిడీల, యూదుల బాధ వీరికి కనిపించదు? ఎందుకు వీళ్ల కన్నీళ్లు కనిపించవు? ప్రతిసారీ ఈ సమాజాలపై దారుణమైన దాడులు జరిగితే అదే మానవ హక్కుల సంఘాలు మౌనం పాటిస్తారు. లేదా వ్యతిరేక కథనాలు అల్లుతారు ఇజ్రాయెల్ ని తప్పుగా చూపిస్తారు, హిందువులపై నిందలేస్తూ కాషాయ తీవ్రవాదం అంటూ మండిపడతారు. ఒకవేళ బాధితుడు వేరే మతానికి చెందినవాడైతే వెంటనే ప్రెస్ కాన్ఫరెన్సులు, కొవ్వొత్తి ర్యాలీలు, ట్విట్టర్ తుఫాన్లు.
బాధ అంటే బాధే. నష్టం అంటే నష్టమే. అది మెజారిటీకి జరిగినా, మైనారిటీకి జరిగినా తేడా లేదు. ఈ మౌనం నిరపరాధం కాదు, ఇది వారి లెక్కలతో కూడిన మౌనం.
కానీ వారు ఎంచుకున్నప్పుడు మాత్రమే వేగంగా స్పందిస్తారు! నేరస్థుడి పేరు హిందూ అయితే వెంటనే “హిందుత్వ హింస” అంటారు. అలానే యూదులని, యజిడీలను. అల్లర్లలో హిందువులు, యూదులు పాల్గొన్నా, అది రక్షణకై అయినా “హిందూ తీవ్రవాదం” అని అరుస్తారు, గగ్గోలు పెడతారు. కానీ హిందువులు, యూదులు చనిపోతే “మేము ఇంకా వివరాలు సేకరిస్తున్నాం” లేదా మతరంగు పులమకండి ఉగ్రవాదానికి మతం లేదు అంటారు. మానవత్వం ముసుగు ధరించి, వాస్తవికత దాచేస్తారు.
మానవ హక్కులు, కమ్యునిష్ట్ సంస్థలు అంటాయి వారు సమానత్వం, గౌరవం, మానవ జీవితం కోసం నిలుస్తామని. కానీ వారి ప్రవర్తన ఇలా చెప్పకనే చెబుతుంది:
క్రైస్తవ బాధితుడు - ఐక్యత కొట్టొస్తుంది.
కమ్యునిష్ట్ బాధితుడు - చర్య వెంటనే మొదలవుతుంది.
హిందూ, యూదు, యజిడీ బాధితుడు అయితే మాత్రం - మౌనం గా ఉండి వారికి అనుకూలంగా మార్పు చేసి మళ్లీ వీళ్లపైనే తప్పుడు ప్రచారం చేస్తారు. వారికి హిందువులు, యూదులు, యజిడీలు “మనుషులుగా” కాదు, “అణచివేసేవారుగా” మాత్రమే కనిపిస్తారు.
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా మౌనం: హిందువులపై, యూదులపై, యజిడీలపై హింస జరిగినప్పుడు అంతర్జాతీయ మీడియా కవరేజ్ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఉండవు. UN సంస్థల నుండి లేఖలు ఉండవు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, లేదా యూకేలోని లీసెస్టర్‌లో ఆలయాలపై దాడులు జరిగినప్పటికీ ప్రపంచం నిశ్శబ్దంగా చూస్తూ మాకేంతెలీదు, మేమేం చూడలేదు అసలు మా దృష్టికే రాలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు.
దీని అర్థం ఏమిటి ఈ మౌనం కేవలం బాధాకరం కాదు ప్రమాదకరం. ఎందుకంటే ఒక సమాజపు బాధను విస్మరించేప్పుడు, అన్యాయం మళ్లీ మళ్లీ జరుగుతుంది, తీవ్రవాదులు ధైర్యం పొందుతారు, బాధితులు న్యాయంపై నమ్మకం కోల్పోతారు. హిందువులకు, యజిడీలకు, యూదులకు కూడా సమాన మానవ హక్కులు లేకపోతే ఎలా? మనం అడగాల్సిందే ఇవి నిజంగా మానవ హక్కుల సంస్థలా? లేక రాజకీయ హక్కుల సంస్థలా?
ఈ విషయాలను మీకు చెప్పడానికి నా కలాన్ని కన్నీటితో తడిపాను. 251 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసి 20 మందినే పంపిస్తే 231 మంది ఏమయినట్లు, కనీసం వాళ్ల శవాలను కూడా ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పటికీ ఇవ్వకపోతే వాళ్ళ కామానికి బలై మరణించినట్లే, అలాగే యజిడీలను, కాశ్మీరీ హిందువులను కూడా వీళ్లు ఇలానే చేశారు. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ముఖ్య కారణం 9 ఏళ్లక్రితం బందీ కాబడ్డ యజిడీ చెల్లెలి కోసం నిరీక్షించిన అన్న ఆమెని చూసి కన్నీరు, మున్నీరైన సన్నివేశం చూసి, అలాగే హమాస్ లకు బందీలు కాబడ్డ మహిళా తల్లుతండ్రుల మౌన రోదన చూసి భరించలేక నా మౌనాన్ని వీడుతూ మీ ముందుంచాను.
మరి ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే మాట్లాడమే, మౌనాన్ని వీడటమే, ప్రతీ ఘటించడమే చరిత్రే సాక్ష్యంగా చేసుకుని ముల్లుని ముల్లుతోనే తీయాలి. స్వాతంత్ర్య వీరుల త్యాగాలు వృదాగా పోరాదు. హిందువుల బాధను పట్టించుకోని మానవ హక్కులు మానవహితమైనవే కావు.
అన్యాయాన్ని చూసి మౌనం పాటించడం తటస్థత కాదు అది ద్రోహం. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds
Yezidi community, Yezidis history, Yezidi religion, Yezidi genocide, Iraq minorities, Middle East religions, Yezidi beliefs, Yezidi persecution, Yezidi culture, Yezidi faith


