Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత స్వాతంత్య్రం కోసం విప్లవ జ్వాలను రగిల్చిన వీరులు - List of Famous Revolutionaries leaders of India’s Freedom Struggle

భారత స్వాతంత్య్రం కోసం విప్లవ జ్వాలను రగిల్చిన వీరులు: భారత స్వాతంత్య్ర్య పోరాటం ఎంతో విశిష్టమైనది.. ఇది ఏ కొందరో నాయకత్వం వహిం...


భారత స్వాతంత్య్రం కోసం విప్లవ జ్వాలను రగిల్చిన వీరులు: భారత స్వాతంత్య్ర్య పోరాటం ఎంతో విశిష్టమైనది.. ఇది ఏ కొందరో నాయకత్వం వహించిన ఉద్యమం కాదు. కుల, మత, ప్రాంత, లింగభేదాలకు అతీతంగా ప్రజలందరూ ఏకమై ఈ గడ్డమీది నుంచి విదేశీ అణచివేతదారులను తరిమికొట్టడానికి చేయికలిపి సాగించిన ఓ సామూహిక మహోద్యమం. స్వాతంత్యం వచ్చి ఏడు దశాబ్దాలకు పైగా దాటినా ఆనాటి ధైర్యసాహసాలు, నిస్వార్థం, దృఢ సంకల్పం మనకు ఇంకా స్ఫూర్తినిస్తూ మనం గర్వించేలా చేస్తున్నాయి. ఆనాడు అందరి ప్రగాఢ వాంఛ దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడం మాత్రమే. వారి త్యాగాలు, వారు పడిన కష్టనష్టాలు మాటల్లో చెప్పడం అసాధ్యం. తమ సర్వస్వం ధారబోసి 1947లో స్వాతంత్య్రం తెచ్చిపెట్టినందుకు భారతదేశం వారికి సదా రుణపడి ఉంటుంది.

ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ అసమాన త్యాగంతో రగిలించిన విప్లవ జ్యోతి ప్రజానీకాన్ని చైతన్యపరచడమే కాకుండా బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిలించివేసింది. మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వం త్యాగం చేసిన చాలామంది యోధుల పరాక్రమాన్ని భారత స్వాతంత్య పోరాటం ప్రతిబింబిస్తుంది. అయితే, అందులో పాల్గొన్న మహిళా విప్లవకారుల పాత్రను విస్మరిస్తే భారత స్వాతంత్య పోరాట గాథ అసంపూర్ణమే అవుతుంది. తమ సమకాలీనులతో పోలిస్తే వారు ఎవరికీ ఎంతమాత్రం తీసిపోరు. అలాంటి సిసలైన వీరత్వ అమరగాథను పునశ్చరణ చేసుకోవడంలో భాగంగానే స్వాతంత్ర అమృత మహోత్సవాలు (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) నిర్వహించుకుంటున్నాం.

అలాగే నవతరంలో దేశభక్తి స్ఫూర్తిని మరింతగా నింపడం సహా మన మూల విలువలు, నుసంపన్న సంస్కృతిని ప్రతిబింబించే నవభారతంతో వారిని అనుసంధానించడమే 'ఆజాదీ నా అమృత్ మహోత్సవ్' లక్ష్యం. దేశం నిరంతరం స్వావలంబన దిశగా పయనిస్తోంది. ఆ మేరకు స్వాతంత్య 75వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రారంభించిన ''అమృత్ మహోత్సవ్' స్వావలంబన వైపు ఒక ముఖ్యమైన ముందడుగు, ఈ వేడుకలను 2023 ఆగస్టు 15 వరకూ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్వాతంత్య్రం అమృత్ మహోత్సవాల క్రమంలో కొందరు. వీరులను మేం పరిచయం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్యం సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించడమేగాక, అంతకుముందు.., ఆతర్వాత కూడా దేశ సర్వతోముఖాభివృద్ధికి ఈ ధీరులు విశేషంగా కృషి చేశారు.

పండితుడు, వినయ సంపన్నుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్: ఒక సందర్భంలో ఉపాధ్యాయుడు ఒకరు ఓ విద్యార్థి సమాధాన పత్రాన్ని పరిశీలిస్తూ "పరిశీలకుడికన్నా పరిశీలింపబడే విద్యార్ధి మెరుగ్గా ఉన్నాడు" అని వ్యాఖ్యానించాడు. ఆ విద్యార్థి మరెవరో కాదు... విద్యాభ్యాస సమయంలో సదా తెలివైన విద్యార్ధిగా ప్రశంసలు అందుకున్న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆ రోజుల్లో ఇంట్లో లేదా పాఠశాలలో రాజేంద్రబాబులా చదువుకోవాలనే మాట వినని బీహార్ విద్యార్ధి లేడంటే అతిశయోక్తి కాదు.

ఆయనకు గల పదునైన మేధస్సు గురించి ఆ కాలానికి చెందినవారు ఘంటాపథంగా మీరు తన జీవితంలోని ప్రతి సంఘటననూ ఆయన ఇట్టే జ్ఞాపకం చేసుకోగలరని వారు చెబుతారు. ఆయన ఎలాంటి దినచర్య పుస్తకం (డైరీ)తో నిమిత్తం లేకుండానే తన 1,900 పేజీల జీవిత చరిత్రను రాశారు. ఆయా సంఘటనలు కేవలం ముందు రోజు జరిగినవే అనిపించే రీతిలో ఆయన తన జీవిత చరిత్రలోని అధ్యాయాలను పేర్చుకుంటూ వచ్చారు. బీహార్ రాష్ట్రం ఛాప్రా జిల్లాలోని జిడీ అనే ఓ చిన్న గ్రామంలో 1884 డిసెంబరు 3న జన్మించిన రాజేంద్ర ప్రసాద్, విద్యాభ్యాసం అనంతరం న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అయితే, గోపాలకృష్ణ గోఖలే ఆలోచనలు రాజేంద్ర ప్రసాద్ ను ఎంతో ప్రభావితం చేయగా ఆయన భారత స్వాతంత్య్ర్య పోరాటంలో భాగస్వామి అయ్యారు.

మహాత్మాగాంధీ "ఉప్పు సత్యాగ్రహం" ప్రారంభించినప్పుడు అనేక మంది సత్యాగ్రహులతోపాటు రాజేంద్ర ప్రసాద్ కూడా అందులో పాలుపంచుకున్నారు. అటుపైన 'క్విట్ ఇండియా' ఉద్యమంలోనూ భాగస్వామి అయ్యారు. ఆ తర్వాత 1947లో దేశానికి స్వాతంత్యం వచ్చినప్పుడు భారతదేశానికి రాజ్యాంగం రూపొందించేందుకు, ఉద్దేశించిన రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు దానికి రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ విధంగా రూపొందిన రాజ్యాంగానికి ఆమోదం అనంతరం భారత రాష్ట్రపతి అయ్యారు. ఈ పదవీ బాధ్యతలలో 1950 జనవరి 26 నుంచి 1962 మే 14 వరకూ. కొనసాగారు. వరుసగా రెండు పర్యాయాలు పదవిలో కొనసాగిన ఆయన ఒక్కరే. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాజేంద్రప్రసాద్ 1951 మే 11న సోమనాథ్ ఆలయ పునరారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, అప్పటికీ అనేకసార్లు దాడులకు గురైన సోమనాథ్ ఆలయాన్ని ఆ తర్వాత పునర్నిర్మించారు. ఆయనను ప్రభుత్వం 1962లో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'తో సత్కరించింది.

ప్రతిభ గల న్యాయవాది, అధికారి, రాజనీతిజ్ఞుడు సి. రాజగోపాలాచారి: స్వామీ వివేకానంద ఓసారి ఒక హాస్టల్కి వెళ్లారు. అక్కడ ఆయన ఒక విద్యార్థిని "విష్ణుమూర్తి నీలమేఘ శ్యాముడుగా ఎందుకు అభివర్ణించబడ్డారు?" అని ప్రశ్నించారు. దీనికి ఆ విద్యార్థి " "ఆయన స్వభావం ఆకాశం, సముద్రాలకన్నా అనంతమైనదని చెప్పడానికే" అని జవాబిచ్చాడు. ఆ సమాధానంతో స్వామి వివేకానందను అమితంగా ఆకట్టుకున్న విద్యార్థి మరెవరో కాదు... సి. రాజగోపాలాచారి లేదా రాజాజిగా లోక ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి.

ఆనాటి మద్రాసు (ఇప్పుడు తమిళూరు) రాష్ట్రంలోని సేలం జిల్లా తోరపల్లి గ్రామంలో 1878 డిసెంబర్ 10న రాజగోపాలాచారి జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ప్రతిభగల న్యాయవాదిగా, నైపుణ్యంగల అధికారిగా, సుప్రసిద్ధ దౌత్యవేత్త-రాజనీతిజ్ఞుడుగా ప్రశంసలు అందుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న సమయంలో మహాత్మా గాంధీ వ్యక్తిత్వం, ఆయన ప్రబోధించిన సత్యం-అహింస సిద్ధాంతాలతో రాజాజీ ఎంతో ప్రభావితమయ్యారు. గాంధీజీ 1930లో 'దండి యాత్ర' నిర్వహించినప్పుడు ఉప్పు చట్టం ఉల్లంఘనలో పాల్గొన్నారు.

అలాగే, కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ జీవితాంతం పోరాడాడు. రాజగోపాలాచారి. భారతదేశంలో జన్మించిన తొలి గవర్నర్ జనరల్ కావడం విశేషం. అంతకుముందు ఈ పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారంతా బ్రిటిష్ వారే, దక్షిణ భారతదేశంలో హిందీ భాషావ్యాప్తికి ఆయన గణనీయంగా కృషి చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక 1950లో జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వంలో రాజగోపాలాచారి. దేశీయాంగ శాఖ మంత్రిగా పని చేశారు. అటుపైన 1953లో మద్రాసు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

కానీ, నెహ్రూతో సైద్ధాంతిక విభేదాల వల్ల కాంగ్రెస్ మంచి విడిపోయి స్వయంగా కొత్త పార్టీని. ప్రారంభించారు. దానికి 'కాంగ్రెస్ వ్యతిరేక స్వతంత్ర పార్టీ'గా నామకరణం చేశారు. సమాజానికి చేసిన విశేష సేవలకుగాను 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'తో' ప్రభుత్వం ఆయనను సత్కరించింది. జైలులో ఉన్న సమయంలో ఆయన 'జైలులో ధ్యానం" అనే పుస్తకం రాశాడు. ఆ తర్వాత తమిళంలో 'రామాయణం' కూడా రాశారు. రాజాజీ 1971 డిసెంబర్ 25న కన్నుమూశారు.

జాతీయ ఐక్యతకు ప్రతీక మహిళా సాధికారతకు మార్గదర్శకుడు సుబ్రమణియం భారతి: ఒకసారి ఓ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధిని "నువ్వు కాలమేఘుడివని విన్నాను. ఓ పద్యం కురిపించు మరి" అని అడిగారు. అందుకా విద్యార్ధి- 'గురువుగారూ, కాలమేఘం తనంతట తానుగా జల్లు కురిపిస్తుంది తప్ప ఎవరో ఒకరి ఆజ్ఞతో కాదుగా" అన్నాడు. గురువును అలాంటి జవాబిచ్చిన విద్యార్థి మరెవరో కాదు... సుబ్రమణియం భారతి.

సుబ్రమణియం భారతి 1882 డిసెంబరు 11న జన్మించారు. ఆయన రచనలతో ప్రభావితులైన దక్షిణాది ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాతంత్య్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆయన మహిళా సాధికారతకు మార్గదర్శకుడు మాత్రమేగాక జాతీయ సమైక్యతకు ప్రతీక. తమిళులు ఆయనను 'మహాకవి భారతియార్' ప్రేమతో. పిలుచుకుంటారు. ఆనాడు ఆయన రాసిన దేశభక్తి పద్యాలు ప్రజానీకానికి ఎనలేని ప్రేరణనిచ్చాయి. ఎట్టాయపురం రాజు తన ఆస్థానంలో 'భారతి' బిరుదుతో సత్కరించేనాటికి ఆయన వయసు 11 ఏళ్లు మాత్రమే, ఆ తర్వాత ఆయన సుబ్రమణియం భారతిగా ప్రసిద్ధులయ్యారు. 

ఆయన భావాల్లోని మాధుర్యం, వినూత్న శైలితోపాటు పద్య రచనలో మహాకవి భారతియార్ ప్రయోగించే. సరళమైన పదజాలం, స్థానిక నుడికారాలతో కూడిన పాటలు తమిళ సాహిత్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చాయి, పోరాట యోధుడైన ఆయన సంఘ సంస్కర్తగా, పాత్రికేయుడుగా స్వాతంత్య్ర్య సమరంలో పాలుపంచుకున్నారు, అలాగే పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారు.

స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదితను ఆయన తన గురువుగా భావించారు. ఆమెతో పరిచయం అనంతరం మహిళా స్వేచ్ఛ, సాధికారత కల్పనకు బలమైన మద్దతుదారుగా నిలిచారు. మాతృభాష తమిళంతోపాటు ఆంగ్లం, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, తెలుగు సహా పలు భాషలపై ఆయనకు మంచి పట్టు ఉంది. 'చక్రవర్తిని' పత్రికా సంపాదకుడుగా ఉన్నపుడు. మహిళా సాధికారతే ఆ పత్రిక లక్ష్యంగా ప్రకటించిన సుబ్రమణియం భారతి 1921 సెప్టెంబర్ 11న కన్నుమూశారు..

గొప్ప దేశభక్తుడు హిందీ భాషా ప్రోత్సాహకుడు దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్: దేశంలో హిందీ భాషాభివృద్ధికి, ప్రాచుర్యానికి దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ విశేష కృషి చేశారు. అంతేకాకుండా, భారతదేశమంతటా పర్యటించి గుజరాతీ, మరాఠీ, హిందీ భాషలలో తన యాత్రా కథనాలను గ్రంథస్తం చేసిన గొప్ప దేశభక్తుడు. ఆయన యాత్రా కథనాలు ఎంత చక్కగా ఉంటాయంటే- పాఠకులు తామే ఆ ప్రదేశంలో పర్యటిస్తున్నట్లుగా అనుభూతి చెందుతారు.

మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడైన దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ ను 'అందరూ 'జాకా కాలేల్కర్' అని పిలుస్తారు. ఆయనలో ఒక రచయిత, విద్యావేత్త, పాత్రికేయుడు, పండితుడు, సంఘ సంస్కర్త, చరిత్రకారుడు కూడా కనిపిస్తారు. కాకా కాలేల్కర్ 1885 డిసెంబరు 1న జన్మించారు. పరాయి పాలకుల అణచివేత నుంచి దేశ విముక్తి కోసం సాగిన స్వాతంత్య్ర్య పోరాటంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఒక విద్యావేత్తగా అహ్మదాబాద్ లో "గుజరాత్ విద్యాపీఠా'న్ని స్థాపించి, దానికి ఉప కులపతిగా సారథ్యం వహించారు.

మొదట్లో గుజరాతీలో మాత్రమే రచనలు చేసిన కాకా కాలేల్కర్ ఆ తర్వాత పూర్తిగా హిందీలోకి మారిపోయారు. అంతేకాకుండా, ఆ భాష అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. మైథిలీ శరణ్ గుప్తా, హజారీ ప్రసాద్ ద్వివేది, సేథ్ గోవిందదాస్ వంటి ప్రముఖులతో కలసి హిందీకి అధికార భాష హోదా సాధించడంలో కీలకపాత్ర పోషించారు. వారందరి కృషి ఫలితంగా దేవనాగరి లిపిలో రాయబడే హిందీ భాష 1949 సెప్టెంబరు 14న గణతంత్ర భారత అధికార భాషగా ఆమోదించబడింది.

ఇక 1950 దశకంలో కాకా కాలేల్కర్ అధ్యక్షతన తొలి వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటైంది. అయితే, ఇది అనేక ఒడుదొడుకులకు గురవుతూ వచ్చిన నేపథ్యంలో పలు దశాబ్దాల తర్వాత 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం 123వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో దీనిపై ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అటుపైన 2018 ఆగస్టులో దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో చివరకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా దక్కింది. కాగా, 1965లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కాకా కాలేల్కర్ 1981 ఆగష్టు 21న తుదిశ్వాస విడిచారు.

24 ఏళ్ల ప్రాయంలోనే ఉరికొయ్యను వరించిన సాహస విప్లవకారుడు రాజ్ నారాయణ్ మిశ్రా: విప్లవ శంఖం పూరించిన రాజ్ నారాయణ్ మిశ్రా బ్రిటిష్ విధానికి సింహస్వప్నంగా మారారు. ఒక విప్లవకారుడిగా బ్రిటిషర్లకు దాస్యాన్ని ఎంతమాత్రం సహించబోనని ప్రతినబూని, దేశమాత స్వేచ్ఛ కోసం ఆత్మత్యాగం చేశారు. రాజ్ నారాయణ్ విప్లవ పోరాట పద్ధతులతో నిద్రపట్టని బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను నిర్బంధించి 1944 డిసెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఉరి తీసింది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసిన చివరి ఉరిశిక్ష ఇదే.

రాజ్ నారాయణ్ మిశ్రాను ఉరి తీసిన సందర్భంగా చివరి కోరిక ఏమిటని అడిగినపుడు ఆయన రెండే రెండున్నాయని చెప్పారు. ఒకటి.. తన మెడకు తానే ఉరి వేసుకోవడం కాగా, రెండోది... తన మృతదేహాన్ని విప్లవకారులైన తన సహచరులకు అప్పగించాలని కోరారు. రాజ్ నారాయణ్ మిశ్రా లఖింపూర్ భేరీలోని మిజాలీ తాలూరా భికంపూర్ గ్రామంలో 1920 జగష్టు 26వ జన్మించారు. ఐదుగురు సోదరులలో చిన్నవాడైన ఆయన, కేవలం 22 ఏళ్ల వయసులోనే సాయుధ పోరాటంతో బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టి ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా 1942లో ఆయుధాల దోపిడీకి వెళ్లినపుడు జరిగిన కాల్పుల్లో లకింపూర్ డిప్యూటీ కమిషనర్ మరణించారు. దీంతో మిశ్రా తన గ్రామం వదిలి వెళ్లిపోగా, బ్రిటిష్ పాలకులు ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు. చివరకు ఆయన 1943 అక్టోబరులో మీరట్ లో గల గాంధీ ఆశ్రమంలో అరెస్టయ్యారు. ఆ తర్వాత 1944 జూన్ 27న కోర్టు మరణశిక్ష విధించింది. కానీ, దీనిపై ఆయన ఏమాత్రం చలించలేదు. చివరకు తన 24వ ఏట 1944 డిసెంబరు 9వ తేదీన ఉరితీసిన సమయంలోనూ ఈ భరతమాత అసమాన పుత్రుని పెదవులు. "విప్లవం వర్ధిల్లాలి' అని నినదించాయి.

గారో హిల్స్ యోధుడు టోగన్ నెంగ్మింజా సంగ్మా: బ్రిటిష్ పాలకులు 1872లో గారో పర్వతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినపుడు టోగన్ నెంగ్మింజా సంగ్మా ఎంతో సాహసంతో పోరాడి వారిని చాలా రోజులపాటు నిలువరించారు. భారతదేశం గర్వించదగిన ఓ గొప్ప విప్లవ యోధుడుగా యుద్ధభూమిలో బలిదానం చేసిన ఎందరో స్వాతంత్య్ర్య సమరయోధులకు ఆయన ఎనలేని ప్రేరణ, షిల్లాంగ్ లోని విలియమ్ నగర్ సమీపంలోగల సమందా గ్రామంలో ఆయన జన్మించారు. ఆ సమయంలో గ్రామం చుట్టూ పర్వతాలు, దట్టమైన అడవులు ఉండేవి.

భారత స్వాతంత్యం కోసం 1857లో తొలి పోరాటం తర్వాత బ్రిటిష్ పాలకులు దేశం మొత్తాన్నీ స్వాధీనం చేసుకునేందుకు కుట్రపన్ని వేగంగా ముందుకు కదులుతున్న సమయమది. వారి ఆక్రమణ పర్వంలో మేఘాలయతోపాటు గారో పర్వతాలు కూడా ఉన్నాయి. కానీ, దేశభక్తుడైన సంగ్మాకు ఇదెంతమాత్రం నచ్చలేదు. ఆ మేరకు "బ్రిటిష్ వారు మా భూభాగం పాలించేందుకు అనుమతించం.. మా ప్రజలను బానిసలుగా మార్చే ప్రయత్నాలను సహించబోం" అని బాహాటంగానే ప్రకటించారు. అంతటితో సరిపెట్టకుండా తక్షణం తన పోరాటానికి శ్రీకారం చుట్టి, యువ సైన్యాన్ని, కూడగట్టారు. మాతృభూమి రక్షణ కోసం యువత త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పర్యటించడం ప్రారంభించి, జనంలో దేశభక్తి భావాన్ని నిలువెల్లా నింపారు. అయితే, ఆధునిక ఆయుధాలున్న బ్రిటిష్ వారితో పోరాటానికి సంగ్మాతోపాటు ఆయన సహచరులందరి వద్దగలవి కత్తి, డాలు, ఈటె, విల్లు, బాబాలు వగైరా సంప్రదాయక ఆయుధాలే. అయినప్పటికీ, స్వాత్రంత్రేచ్ఛతో రగిలిపోతున్న సంగ్మా, ఆయన సహచరులు బ్రిటిష్ శిబిరంపై సాహనంతో దాడి చేసి, దానికి నిప్పంటించారు. ఇలాంటి దాడిని ఊహించని బ్రిటిష్ వారు నిత్తరపోయారు.

దీంతో కుట్రపన్ని సంగ్మాను చర్చలకు పిలిచి, సమావేశం జరిగే చోటకు రాగానే తుపాకీతో కాల్చి చంపారు, స్వాతంత్య్ర్య సమరయోధుడైన ఈ భరతమాత ముద్దుబిడ్డ అమరుడైనప్పటికీ ఆయన సహచరులు పోరాటం కొనసాగించారు.. కానీ, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు.. బ్రిటిష్ వారు గారో హిల్స్ మొత్తాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నేటికి గారో ప్రాంతంలోని ప్రజలు టోగన్ నెంగ్మింజా సంగ్మా త్యాగాలను స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని "స్వతంత్ర సైనిక దినోత్సవం"గా నిర్వహించుకుంటున్నారు.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments