Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సమాజంలో మార్పుకు చైతన్యం రగిల్చిన స్వాతంత్య్ర సమరయోధులు - List of Indian independence activists

సమాజంలో మార్పుకు చైతన్యం రగిల్చిన స్వాతంత్య్ర సమరయోధులు: స్వేచ్ఛా భారతం గురించి కలలు కంటూ సామ్రాజ్యవాదంపై యుద్ధంతోపాటు సామాజిక ...

సమాజంలో మార్పుకు చైతన్యం రగిల్చిన స్వాతంత్య్ర సమరయోధులు: స్వేచ్ఛా భారతం గురించి కలలు కంటూ సామ్రాజ్యవాదంపై యుద్ధంతోపాటు సామాజిక దురాచారాల నిర్మూలన కోసం కూడా పోరాడిన భారత స్వాతంత్య్రం సమరయోధులు జనజీవనం మెరుగు దిశగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పర్యావరణం, విద్య, గిరిజనోద్ధరణ తదితర అనేక సామాజిక సమస్యల గురించి ఎవరూ ఆలోచన కూడా చేయని రోజులలో వాటి పరిష్కారం కోసం స్వాతంత్య్ర సమరయోధులు కృషి చేశారు.

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాల సందర్భంగా 'అజాది కా అమృత్ మహోత్సవ్' నిర్వహణ ఎంత ముఖ్యమో సామాజిక సంస్కరణలకు ధ్రువతారలుగా నిలిచిన నాటి స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను తెరపైకి తేవడమూ అంతే ముఖ్యం, అదేవిధంగా యువతను మన వారసత్వం-సంస్కృతితో మమేకం చేయడం కూడా 'ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో అత్యంత ముఖ్యమైన అంశం, తద్వారా 'ఏక్ భారత్, శ్రేష్ భారత్' స్ఫూర్తితో దేశం ముందుకు సాగుతుంది....

మహామన మదన్ మోహన్ మాలవీయ జీవితం దేశభక్తి, సమాజ సేవకే అంకితం: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బి.హెచ్.యు) స్వప్న సాకారానికి నిధి సేకరణ కోసం 'మహామన' మదన్ మోహన్ మాలవీయ పెషావర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణించారు. ఈ మేరకు ప్రతి ప్రదేశం నుంచి విరాళాలు స్వీకరిస్తూ ఆ రోజుల్లో కోటి రూపాయలకుపైగా నిధిని సేకరించారు. ఈ క్రమంలో విరాళాల సేకరణకు హైదరాబాద్ వెళ్లినపుడు అక్కడ నిజాం నవాబు ఆయనపై తన బూటు విసిరి అవమానించారు. కానీ, ఈ అవమానాన్ని ఎంతో సహనంతో భరించిన మాలవీయ సదరు బూటును వేలానికి పెట్టారు...

ఈ సంగతి తెలియగానే ఎంతో సిగ్గుపడి, భూరి విరాళమిచ్చి మాలవీయను సాదరంగా సాగనంపాడు. ''మాలవీయ తన జ్ఞానం, ఆదర్శాలతో దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూ భరతమాత సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. అంతేకాకుండా విద్యారంగంలో అమూల్య కృషితోపాటు స్వాతంత్య్ర ఉద్యమంలోనూ, కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా 1916లో బి.హెచ్.యును స్థాపించిన మహామన, బ్రిటిష్ పాలన ఉచ్ఛదశలో ఉండగా సంస్కృతం సంస్కృతి క్షీణిస్తున్న వేళ దాన్ని ప్రోత్సహించడంతోపాటు విద్యాభివృద్ధికి, దేశంలో హిందీ, వ్యాప్తికి విస్తృతంగా కృషి చేశారు. విద్యా నైపుణ్యానికి కూడా అయిన బి.హెచ్. యు ఆయన చురుకైన మేధస్సుకు ఒక ఉదాహరణ మాత్రమే అంతకు ముందు కూడా ఆయన అనేక విజయాలు సాధించారు.

బ్రిటీష్ పాలనలో ఆంగ్ల, పర్షియన్ భాషల అధిపత్యం కొనసాగుతున్నా ఆయన హిందీ బాష విస్తరణకు శ్రీకారం చుట్టారు. మాతృభాషకు ప్రాచుర్యం కల్పించడానికి అవిశ్రాంతంగా కృషిచేస్తూ పాత్రికేయుడుగా, సంఘ సంస్కర్తగా, న్యాయవాదిగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించడంతోపాటు భరతమాత భారత స్వాతంత సేనుకు జీవితాన్ని అంకితం చేశారు. బాల్యం నుంచీ భయమంటే ఏమిటో ఎరుగని వ్యక్తి... ఇన్ని సుగుణాలు మోహన్ ను మూర్తీభవించిన కారణంగానే ఆయనకు "మహామన" బిరుదు లభించింది.

అలహాబాద్ నగరంలో 1861 డిసెంబరు 25న జన్మించిన మదన్ మోహన్ మాలవీయ భారతదేశంలో 'మహామన' అని పిలుపించుకున్న ఏకైక మహనీయుడు మాలవీయ తన తండ్రి తరహాలో కథకుడు కావాలని చిన్నతనం నుండి తపిస్తూ శ్రీమద్ భగవద్గీతను కూడా ఔపోసన పట్టారు. జాతీయ చైతన్యం, సామాజిక అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అశేష ప్రజానీకం హృదయాలను గెలుచుకుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్న మదన్ మోహన్ మాలవీయ ను 1930నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో సెక్షన్ 144ను ఉల్లంఘించారంటూ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంతేకాకుండా 1909, 1918, 1930, 1932 సంవత్సరాల్లో ఆయన నాలుగు సార్లు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

పాత్రికేయ, న్యాయవాద వృత్తులతోపాటు సంఘ సంస్కరణ, మాతృభాషా ప్రాచుర్యం కోసం ఆయన తన జీవితాంతం కృషి చేశారు. ముఖ్యంగా హిందీ భాష, పాత్రికేయ వృత్తిపై ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే 1907లో "అభ్యుదయ' అనే హిందీ వారపత్రికను మాలవీయ ప్రారంభించారు. తర్వాత 1909లో అలహాబాద్ నుంచి ప్రచురించేలా 'ది లీడర్' ఆంగ్ల వార్తాపత్రికను కూడా స్థాపించారు. 2014 డిసెంబర్ 24న దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' (మరణానంతరం) ప్రధానం చేసింది.

స్వాతంత్య్ర సమరయోధుడు, పర్యావరణ వేత్త కె.ఎం.మున్షీ: అది 1950 జూలై నెల.. అనాటి కేంద్ర వ్యవసాయ ఆహారశాఖ మంత్రి కన్హయలాల్ మాణిక్ లాల్ మున్షీ దేశవ్యాప్తంగా వన మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చొరవతోనే అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా మొక్కలు నాటారు. అంతేకాకాకుండా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా మొక్కలు నాటి, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటినుంచీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జులై తొలివారంలో వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

"దేశంలో కె.ఎం.మున్షీగా ప్రసిద్ధులైన కన్హయలాల్ మున్షీ 1887 డిసెంబర్ 30న గుజరాత్లోని భరూచ్లో జన్మించారు. అరబిందో ఘోష్ వంటి ప్రముఖులవద్ద విద్యాభ్యాసం చేశారు. పరిపక్వతగల రాజకీయ నాయకుడు, విద్యావేత్త, న్యాయవాది, రచయిత అయిన కె.ఎం.మున్షీ బార్టోలీ సత్యాగ్రహంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తో భుజం కలిపి నడిచారు. భారత రాజ్యాంగ రచనలోనూ కె.ఎం. మున్షీ తనవంతు పాత్రము చక్కగా పోషించారు.

రాజ్యాంగ ముసాయిదా కమిటీలో డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ తో కలసి పనిచేసిన ఆయన 'ప్రతి వ్యక్తికీ సమాన రక్షణ' సూత్రాన్ని పొందుపరచడంలో కీలకంగా వ్యవహరించారు, దేవనాగరి లిపితో కూడిన హిందీని భారత ప్రభుత్వ అధికార భాషగా గుర్తించడంలో ఆయన విశేషంగా కృషిచేశారు. సర్దార్ పటేల్ తో సంయుక్తంగా ఆనంద్ 'ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ అగ్రికల్చర్'తోపాటు 'భారతీయ విద్యాభవన్'ను స్థాపించారు. ప్రసిద్ధ సాహితీవేత్తగా గుజరాతీ, ఆంగ్ల, హిందీ భాషలలో ఆయన విశేష విజయాలు సాధించారు.

ఆయన రాజనీతిజ్ఞత, నైపుణ్యం గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గణతంత్ర భారతంలో హైదరాబాద్ విలీనం సమస్య పరిష్కారం నిమిత్తం ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది. అటుపైన హైదరాబాద్ విలీనం తర్వాత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆయన కృషిని ఎంతో కొనియాడారు. అనంతర కాలంలో సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ విషయమై నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో విభేదాలు రావడంతో మున్షీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర పార్టీలోకి వెళ్లినా, కొంతకాలం తర్వాత భారతీయ జనసంఘ్ చేరారు.

దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యకు వేలాడిన వీరుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్: బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1927 డిసెంబర్ 19న కొందరు యువకులను ఉరితీయడానికి తీసుకువెళ్తుండగా "సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారా దిల్ మే హై... మేరా రంగ్ దే బన్సతీ చోలా' వంటి దేశభక్తి గీతాలను వారు అలపించారు. వీరిలో ఓ 30 ఏళ్ల యువకుడు కూడా ఉన్నారు... అతనే పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్. షాజహాన్ పూర్ లో 1897 జూన్ 11న జన్మించిన రామ్ ప్రసాద్ బిస్మిల్ బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ భారతీయ విప్లవకారులలో ఒకరు. బిస్మిల్ తన 11వ ఏటనే స్వాతంత్య్ర్య ఉద్యమంలో పాల్గొని పోరు ప్రారంభించడం విశేషం..

చివరి శ్వాస విడిచేదాకా బ్రిటిష్ వలస శక్తులను ఎదిరించిన సాహన స్వాతంత్య్ర్య సమరయోధుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. విప్లవ నాయకుడైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటివారితో కలసి ఆయన హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. అహింసతో స్వాతంత్యం సాధించడం సాధ్యంకాదని విశ్వసించిన ఆయన, 19 ఏళ్ల ప్రాయంలోనే 'బిస్మిల్' పేరిట ఉర్దూ, హిందీ భాషలలో దేశభక్తి పద్యరచన చేయడం మొదలుపెట్టాడు. విప్లవ పోరాటంలో భాగంగా 1918నాటి మెయిన్ పురి కుట్ర, 1925నాటి కాకోరి కుట్రులలో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

చివరకు కాకోరి కుట్ర కేసు కింద అరెస్టు చేయగా, దీనిపై చట్టపరమైన విచారణ ప్రక్రియ 12 నెలలపాటు సాగింది. ఆ తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఖుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్ కు మరణశిక్ష, వారికి సహకరించిన మరికొందరు విప్లవకారులకు యావజ్జీవ శిక్ష విధించబడ్డాయి. దీంతో 1927 డిసెంబరు 19న గోరఖ్ పుర్ జైలులో అమరుడైనప్పుడు ఆయన వయస్సు కేవలం 30 సంవత్సరాలు.

హిందూ-ముస్లిం ఐక్యత కోసం బిస్మిల్ విస్తృతంగా కృషి చేశారు. ఆయన భౌతిక కాయానికి రప్తి నదీ తీరాన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ ప్రదేశం పేరును 'రాజ్ ఘాట్'గా మార్చారు. కాగా, 'అజాది కా అమృత్ మహాత్సవ్ 'లో భాగంగా స్వాతంత్య్ర్య సమరయోధుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి నేపథ్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

మాతృభూమి కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యు కియాంగ్ నంగ్బా: యు కియాంగ్ నంగ్బా మేఘాలయ నుంచి బ్రిటిష్ పాలకులపై సమర శంఖం పూరించిన ఖాసీ స్వాతంత్య సమరయోధుడు. అస్సాం ప్రాదేశిక విస్తరణలో భాగంగా 19వ శతాబ్దం మద్యన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జైంతియా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ అన్యాయాన్ని సహించలేకపోయిన జైంతియా తెగ యోధులు పలువురు బ్రిటిష్ ప్రభుత్వ దురాక్రమణపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు.

ఈ క్రమంలోనే 1860లో పశ్చిమ జైంతియా హిల్స్ లో బ్రిటిషువారు ప్రజలను అణచివేయడం ప్రారంభించినపుడు వారి తిరుగుబాటుకు నంగ్బా నాయకత్వం వహించారు. బ్రిటిష్ వారు అన్యాయంగా పన్నులు విధించడమే కాకుండా తమ మత సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితుల నడుసు మాతృభూమి రక్షణపట్ల ప్రేరేపితులైన ప్రజలు బ్రిటిష్ సైన్యంపై ప్రారంభించిన సాయుధ తిరుగుబాటును యు కియాంగ్ నంగ్బా ముందుండి నడిపించారు. ఆ మేరకు బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం కోసం స్వయంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, సైనికులతో పోరాటానికి ప్రజలను సిద్ధం చేశారు.

నంగ్బా సంస్థ సభ్యులు గిరిల్లా దాడులలో నిపుణులు కావడంతో ఈ ప్రాంతంలో తిరుగుబాటు అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వం అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. నంగ్బా సంస్థ సభ్యుల పోరాట పటిమతో రకరకాల అగచాట్లపాలైన బ్రిటిష్ పాలకులు ఆయనను అరెస్టు చేయాలన్న కృతనిశ్చయంతో ముమ్మర వేట ప్రారంభించారు. నంగ్బా బృందంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ పాలకులు చివరకు 1862 డిసెంబరులో ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత తిరుగుబాటును అణచివేయడంలో భాగంగా డిసెంబర్ 30న నంగ్బాను బహిరంగంగా ఉరితీశారు.

దేశ స్వాతంత్య్రంతోపాటు భిల్లుల సాధికారత కోసం ఉద్యమానికి నాంది పలికిన గోవింద్ గురు: గోవింద్ గురు 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో బిల్లుల సాధికారత లక్ష్యంగా 'భగత్ ఉద్యమాని'కి నాంది పలికారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన గోవింద్ గురు రాజస్థాన్ రాష్ట్రం దుంగార్ పూర్ సమీపంలోని వేద్సా గ్రామంలో జన్మించారు. తాము 1890లలో ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా మారాల్సిందిగా భిల్లులకు ఉపదేశించారు. గురు స్ఫూర్తితో భిల్లులు బ్రిటిష్ వారి అణచివేత విధానాలను నిరసిస్తూ పోరాడారు. ఆ మేరకు రాచరిక పాలనలోగల బన్స్ వాడా, సాంత్రంపూర్, దుంగర్ పూర్, కుశాల్ గఢ్ లో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరుసలిపారు. అగ్నిదేవుడిని తమ ప్రతీకగా భావిస్తూ ఆయన అనుచరులు నెగళ్లముందు నిలుచుని పూజలు చేసేవారు.

1903లో గురుపిలుపు మేరకు మాన్ గడ్ టేక్రీ నుంచి వచ్చిన భిల్లులు 33 డిమాండ్లను బ్రిటిష్ వారి ముందుంచారు. ఈ డిమాండ్లలో వెట్టిచాకిరీ నిర్మూలన, పన్నుల భారం తగ్గింపు, గురు అనుచరులపై వేధింపులకు స్వస్తి వంటివి ప్రధానమైనవి. అయితే, బ్రిటిష్ వారు ఈ డిమాండ్లను అంగీకరించకపోవడంతో గోవింద్ గురు నాయకత్వాన బిల్లులు పోరాటానికి దిగి మాన్ గఢ్ కొండను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితుల నడమ బ్రిటిష్ కుట్రపూరితంగా వార్షిక దున్నకం పనులకు పావలా వంతున కూలీ చెల్లిస్తామని ప్రతిపాదించగా బిల్లులు నిరాకరించారు.

దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ వారు ఈ ఉద్యమం అణచివేతకు సిద్ధమై 1913 నవంబర్ 15కల్లా మాన్ గఢ్ నుంచి వెళ్లిపోవాలని బిల్లులను హెచ్చరించగా వారు ఖాతరు చేయలేదు. భిల్లులు మాన్ గడ్ హిల్ ను కోటగా మార్చి, కత్తులతోపాటు ఇతరత్రా ఆయుధాలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల నడుమ 1915 నవంబర్ 17న బ్రిటిషర్లు మాన్ గఢ్ హిల్ పై దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా సాగిన పోరులో 1,000 మందికి పైగా గిరిజనులు మరణించారు. అటుపైన బ్రిటిష్ సైనికులు గోవింద్ గురును నిర్బంధించి.

ఆయన తిరుగుబాటు చేయడంపై విచారణ నిర్వహించారు. అనంతరం యావజ్జీవ కారాగార శిక్ష విధించి, హైదరాబాద్ లోని జైలుకు పంపారు. అయితే, ఆయనకుగల జనాదరణ, సత్సవర్తన కారణంగా 1919లో విడుదల చేసినా, తన మద్దతుదారుల వద్దకు వెళ్లడంపై నిషేధం విధించబడింది. ఈ పరిణామాల ఫలితంగా ఆయన గుజరాత్ లోని లింబ్డి సమీపాన గల కాంబోయి లో నివసిస్తూ 1931 అక్టోబర్ 30 న కన్నుమూశారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments