భారత రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న 15 మంది స్వాతంత్ర్య వీర నారీమణులు -The women behind the making of the Indian Constitution

megaminds
0

భారత రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న 15 మంది స్వాతంత్ర్య వీర నారీమణులు: భారత స్వాతంత్య్రం నుంచి గణతంత్రం దాకా దేశ పయనంలో సదా గుర్తుండిపోయే మైలురాళ్ల వంటి అనేక ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. అటువంటి వాటిలో భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించబడిన తేదీ 1950 జనవరి 26 కూడా ఒకటి. అయితే, ఈ చారిత్రక ప్రయాణంలో ముఖ్యమైన భాగాలుగా పరిగణించదగిన తేదీలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ విస్మరణకు గురయ్యాయి. అటువంటి వాటిలో 1949 నవంబరు 26వ తేదీ ఒకటి.

రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కఠోర పరిశ్రమ తర్వాత ఈ తేదీనాడే రాజ్యాంగం ఆమోదించబడింది. ఆ విధంగా జనవరి 26వ తేదీకి గల ప్రాముఖ్యానికి పునాది నవంబరు 26వ తేదీయే. ఎన్ డి యే ప్రభుత్వం తొలిసారిగా 2018 తేదీన రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ప్రారంభించాకే ఈ చరిత్రాత్మక తేదీకి గల ప్రాముఖ్యం గుర్తించబడింది. ప్రస్తుత అమృత మహోత్సవాల కార్యక్రమ పరంపరలో భాగంగా భారత రాజ్యాంగ ఆవిర్భావంలో ప్రముఖ పాత్ర పోషించిన కొందరు ముఖ్యమైన మహిళల జీవితాలను పరిశీలిద్దాం. రాజ్యాంగ పరిషత్ లో భాగస్వాములుగా వారి అవిశ్రాంత కృషి ఇందుకు దోహదపడింది..

"ప్రభుత్వ తొలి ధర్మం 'భారతదేశానికి ప్రాధాన్యం'.. 'ప్రథమ ధర్మ (పవిత్ర) ' రాజ్యాంగం ఈ రాజ్యాంగం ద్వారానే దేశం ముందడుగు వేస్తుంది... ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే అలా నడపబడాలి. ప్రాథమికంగా ఈ భావజాలం ప్రాతిపదికగానే భారతదేశం ఎదిగింది. వేలాది ఏళ్లుగా ఈ దేశం అంతర్గత శక్తిని సంతరించుకుంది. ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనగల మన శక్తి సామర్ధ్యాలకు మూలం ఇదే. రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం వల్ల జనవరి 26వ తేదీకి ప్రాముఖ్యమేమీ తగ్గదు.

ప్రస్తుత భవిష్యత్తు తరాలు దేశం గురించి తెలుసుకుని, నవ భారత నిర్మాణంలో పాలుపంచుకునేలా చేయడమే దీని వాస్తవ ఉద్దేశం. భారత రాజ్యాంగం రూపొందుతున్న సమయంలో ప్రపంచంలోగల అనేక దేశాల్లో మహిళలకు ప్రాధమిక హక్కులు కూడా లేవు. కానీ, స్వతంత్ర భారతం కోసం రాజ్యాంగ రచన కర్తవ్యం అప్పగించబడిన రాజ్యాంగ పరిషత్ లో 15 మంది మహిళలు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఆ విధంగా భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రముఖులకు ఈ స్వాతంత్య్ర్య అమృత మహోత్సవాల వ్యాసంలో వందన సమర్పణ చేస్తున్నది.

భారత రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న 15 మంది మహిళలు:

• దాక్షాయణి వేలాయుధన్
• అమ్మ స్వామినాథన్
• బేగం బజాజ్ రసూల్
• దుర్గాబాయి దేశ్ ముఖ్
• హన్నా జీవరాజ్ మెహతా
• కమలా చౌదరి
• లీలా రాయ్
• మాలత్ చౌదరి
• పూర్ణిమా బెనర్జీ
• రాజకుమారి అమృత్ కౌర్
• రేణుకా రే
• సరోజినీ నాయుడు
• సుచేతా కృపలానీ
• విజయలక్ష్మి పండిట్
• యాని మస్కరీ‌న్

స్వాతంత్ర్య అమృత మహోత్సవాల ఈ వ్యాసం లో కొద్దిమందిని స్మరించుకుందాం..

ఢిల్లీ 'ఎయిమ్స్'ను నిర్మించిన యువరాణి రాజ్ కుమారి అమృత్ కౌర్: కపుర్తల రాజు హరామ్ సింగ్ కుమార్తె రాజకుమారి అమ్మత్ కౌర్ 1887 ఫిబ్రవరి 2వ తేదీన జన్మించారు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నత విద్యాభ్యాసం చేసి, 1918లో భారతదేశానికి తిరిగి వచ్చాక ఆమె రాజకీయరంగ ప్రవేశంపై ఆసక్తి వ్యక్తం చేశారు. ఆమె ఆలోచనను. తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా చివరకు కుమార్తె ఇష్టాన్ని కాదనలేకపోయారు. దీంతో కొంతకాలం తర్వాత ఆమె భారత జాతీయ ఉద్యమంలో అడుగుపెట్టారు.

తదుపరి సంవత్సరాల్లో 16 ఏళ్లపాటు మహాత్మా గాంధీ కార్యదర్శిగానూ, ఆయనకు అత్యంత సన్నిహితులలో ఒకరుగానూ ఉన్నారు. మహాత్మా గాంధీకి రాజ్ కుమారి అమృత్ గట్టి మద్దతుదారుగా "ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఆమె చురుగ్గా పాల్గొని రెండు సందర్భాల్లోనూ అరెస్టయ్యారు. అంతేకాకుండా అనాడు దేశంలో పాటిస్తున్న దుష్ట సంప్రదాయాలపై నిర్ణయాత్మక పోరాటం చేశారు. పిల్లలును మరింత దృఢంగా తీర్చిదిద్దటానికి పాఠశాలల్లో క్రీడలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని ఆమె పట్టుబట్టారు. ఈ క్రమంలోనే "భారత జాతీయ క్రీడా సంస్థ' (నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా) స్థాపనలో తోడ్పాటు అందించారు. బుర్ఖా, బాల్య వివాహాలు, దేవదాసీ వ్యవస్థ వంటి దుష్ట సంప్రదాయాలను ఆమె వ్యతిరేకించారు.

భారత రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసినపుడు అందులో సభ్యురాలుగా రాజకుమారి అమృత్ కౌర్ కీలక పాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్ర్యం వచ్చాక ఆరోగ్య శాఖ మంత్రిగా 10 ఏళ్లపాటు సేవలందించారు. ఈ కాలంలో న్యూజిలాండ్, జర్మనీ, అమెరికా తదితర దేశాల నుంచి ఆర్ధిక సహాయంతో న్యూఢిల్లీలో 'ఆల్ ఇండియా ఇన్స్ ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాపనకు ఎనలేని కృషి చేశారు. ఇక్కడ పనిచేసే నర్సులు తమ సెలవు కాలాన్ని సిమ్లాలో గడిపేందుకు వీలుగా అక్కడి తన పూర్వికుల ఇంటిని ఆమె 'ఎయిమ్స్'కు విరాళంగా ఇచ్చేశారు.

మహిళల హక్కుల కోసం రాజ్యాంగ పరిషత్ లో గళమెత్తారు అమ్ము స్వామినాథన్: అమ్ము స్వామినాథన్ 1946లో రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికయ్యారు. కేరళలోని పార్షెట్ లో 1894 ఏప్రిల్ 22న జన్మించిన ఆమె.. భారత రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్న అతికొద్ది మంది మహిళల్లో ఒకరు. రాజ్యాంగ పరిషత్ సమావేశాలన్నిటికీ తప్పక హాజరై ప్రతి చర్చలోనూ చురుగ్గా పాల్గొన్నారు.

'మహిళల హక్కులు- సమానత్వం, లింగపరమైన న్యాయం కోసం తన గళాన్ని గట్టిగా వినిపించారు. మహిళలకు, చట్టపరంగా సమాన హక్కులు సాధించడంలో డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ నిర్విరామ కృషికి ఆమె తనవంతు తోడ్పాటు అందించారు. మహిళల హక్కులు, రాజ్యాంగ పరిషత్ తీర్మానంపై చర్చ సందర్భంగా అమ్ము స్వామినాథన్. సమానత్వం సహా భారతదేశం తన మహిళలకు లింగపరంగా న్యాయం, సమాన హక్కులు ఇవ్వలేదని బయటి ప్రపంచంలోని ప్రజలు అంటున్నారు. భారతీయులు తమ రాజ్యాంగాన్ని స్వయంగా రూపొందించుకున్న సందర్భంగా దేశంలోని ఇతర పౌరులు ప్రతి ఒక్కరితో సమానంగా మహిళలకు హక్కులు కల్పించారని ఇప్పుడు మనం గర్వంగా చెప్పగలం అని వ్యాఖ్యానించారు.

భారత స్వాతంత్య్ర్య ఉద్యమంలో అమ్ము అమూల్యమైన సేవలందించారు. ఈ పోరాటంలో మహాత్మా గాంధీకి అనుయాయిగా భారతదేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుండి విముక్తం చేసే పోరాటంలో ఎల్లప్పుడూ ముందు వరుసన నిలిచారు. అనంతరం ఆమె 1952లో లోక్ సభకు ఎన్నికై రెండేళ్ల తర్వాత రాజ్యసభ సభ్యురాలయ్యారు. ఎన్నడూ పాఠశాల గడప ఎక్మని ఆమె, మహిళలకు విద్య ప్రాముఖ్యాన్ని చక్కగా అవగతం చేసుకున్నారు. అందుకే ఆమె మహిళా విద్యారంగంలో తన కృషిని కొనసాగించగలిగారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (1960-65) తోపాటు సెన్సార్ బోర్డ్ అధిపతిగా కూడా సేవలందించిన అమ్ము స్వామినాథన్ 1978 జూలై 4న కన్నుమూశారు.

రాజ్యాంగ పరిషత్ లో కీలకపాత్ర పోషించిన లీలారాయ్: మహిళలు రాజకీయాల్లోకి వచ్చేలా స్ఫూర్తి నింపిన లీలారాయ్. అస్సాంలో 1900 అక్టోబర్ 2న జన్మించిన లీలా రాయ్ భారత స్వాతంత్య్ర్య సమరంలో వీర యోధురాలుగానేగాక సుభాష్ చంద్రబోస్ తో సన్నిహితంగా పని చేశారు. బాల్యం నుంచే ప్రతిభగల లీలా రాయ్ 1923లో ఢాకా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పట్టా పొందారు. స్వాతంత్య్ర సమర యోధుల ప్రభావం నేపథ్యంలో ఈ పోరాటంలో మహిళలు వెనుకబడరాదని భావించారు.

మహిళలను ఆకర్షించేందుకు ఆమె చేసిన కృషికి ఇది నిదర్శనం. సాయుధ విప్లవాన్ని విశ్వసించిన ఆమె, బాంబుల తయారీ పరిజ్ఞానం సంపాదించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమెను బ్రిటిష్ పాలకులు ఆరేళ్లు జైల్లో పెట్టారు. బెంగాల్ నుంచి రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికైన తొలి మహిళగానే కాకుండా మహిళా సాధికారత కోసం ఆమె కృషి చిరస్మరణీయం. అయితే, దేశ విభజనను నిరసిస్తూ రాజ్యాంగ పరిషత్ కు ఆమె రాజీనామా చేశారు.

తర్వాత సమాజ సేవ, బాలికల విద్యా హక్కు కార్యకలాపాల్లో నిమగ్నమై ధాకాలో బాలికల కోసం పాఠశాల ప్రారంభించారు. వివిధ రకాల మెలకువలు నేర్చుకునేలా బాలికలను ప్రోత్సహించడం సహా వారికి వృత్తి శిక్షణ ఇచ్చేందుకు కృషి చేశారు. బాలికలు స్వీయ రక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మహిళల కోసం అనేక పాఠశాలలు, సంస్థలను స్థాపించారు. లీలా రాయ్ తన జీవితాంతం సామాజిక రాజకీయ కార్యక్రమాలలో మమేకమయ్యారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో పలుమార్లు జైలుకు వెళ్లారు కమలా చౌదరి: సమరంలో రచయిత్రుల పాత్ర ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా స్త్రీ-వాద రచయిత్రి, రాజకీయ ఉద్యమకారిణి కమలా చౌదరి పేరును ఎవరైనా ఎలా మరువగలరు? లక్నోలోని ఓ సంపన్న కుటుంబంలో 1908 |ఫిబ్రవరి 22న జన్మించిన కమలా చౌదరి తన శక్తిమంతమైన రచనలతో ప్రముఖ సాహితీవేత్తలందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళలపై అణచివేతను ఆమె రచనలు ప్రతిబింబిస్తాయి. అందుకు తగినట్లుగానే ఆమె కమలా చౌదరి నిరంతరం వారి హక్కులకోసం పోరాడారు.

మహిళా జీవన మహిళా వాద రచయిత్రి ప్రమాణాల మెరుగు దిశగా అంతేగాక స్వాతంత్య్ర సామాజిక - రాజకీయ - ఉద్యమంలోనూ ఆమె సాంస్కృతిక స్థాయులలో తీవ్రంగా కృషి చేయడమేగాక చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్య్ర్య సమరంలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. మహాత్మా గాంధీతో సన్నిహితంగా మెలుగుతూ 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలోనూ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా మహాత్మా గాంధీ అహింసా మార్గంవైపు ఇచ్చిన పిలుపుతో ప్రభావితమై మహిళలను ఏకోన్ముఖులను చేయడం కోసం చరఖా కమిటీలను ఏర్పాటు చేశారు.

అలాగే అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగానూ ఉన్నారు. రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్ కు దేశవ్యాప్తంగా ఎంపికైన 15 మంది మహిళల్లో కమలా చౌదరి ఒకరు, ఆ తర్వాత కూడా జీవితాంతం సాహిత్య, రాజకీయ రంగాల ద్వారా మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన ఆమె 1970 అక్టోబర్ 15న తుదిశ్వాస విడిచారు.

గాంధీజీ "తూఫానీ" అని సంబోధించిన స్వాతంత్య్ర సమర యోధురాలు మాలతీ చౌదరి: స్వా తంత్య ఉద్యమంతోపాటు భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యురాలుగా మాలతీ చౌదరి భారత స్వాతంత్య్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు సహా నిరుపేద వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ లోని తూర్పు బెంగాల్ లో 1904 జూలై 26వ మాలతీ చౌదరి జన్మించారు. 

తన 16వ ఏట మాలతి చౌదరి విద్యాభ్యాసం కోసం 1921లో గాంధీ పిలుపు మేరకు ఉప్పు బెంగాల్లో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తన భర్త సబాకృష్ణ చౌదరితోపాటు జైలుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఒరిస్సా (నేటి ఒడిశా) ముఖ్యమంత్రి అయ్యారు. మాలతీ చౌదరి చర్యల్లోని తీవ్రతను గమనించిన గాంధీజీ ఆమెకు "తూఫానీ" అని పేరు పెట్టాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆమెను ప్రేమగా 'మా' అని పిలిచేవారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆమె అనేక సార్లు జైలు పాలయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాక ఆమె 'కాంగ్రెస్ సోషలిస్ట్ కర్మ సంఘ్'ను స్థాపించారు.

ఒరిస్సాలో బలహీనవర్గాల అభ్యున్నతి కోసం 'బాజీరావ్ హాస్టల్' కూడా ఏర్పాటు చేశారు. మాలతి 1946లో రాజ్యాంగ పరిషల్ కీలక సభ్యురాలిగా ఎంపికయ్యారు. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా ఆమె సామాజిక జీవనంలో చురుగ్గా ఉంటూ వచ్చారు. ఇప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. నూలతి తన 93వ ఏట 1998 మార్చి 18న కన్నుమూశారు.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top