Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గుర్తింపు ఎరుగని నాయకులు - Unsung Heroes of India’s freedom struggle

గుర్తింపు ఎరుగని నాయకులు: దేశంలోని ప్రతి ప్రాంతంలో వివిధ సమయాల్లో అనేక మంది యోధులు జన్మించారు. వారు జాతి నిర్మాణానికి ఎనలేని కృ...

గుర్తింపు ఎరుగని నాయకులు: దేశంలోని ప్రతి ప్రాంతంలో వివిధ సమయాల్లో అనేక మంది యోధులు జన్మించారు. వారు జాతి నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా అమృత్ మహోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. అంతేకాదు ఈ సందర్భంగా మన ఉజ్వలమైన చరిత్రను, సంస్కృతిని, ప్రజల విజయాలను స్మరించుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఇంతకాలం చరిత్ర పుస్తకాలకు ఎక్కని త్యాగధనులను స్మరించుకోవడానికి కూడా ఇదొక మహత్తరమైన సందర్భం. స్వాతంత్య్ర సంబరాలకు సంబంధించిన అమృత్ మహోత్సవ్ అనేది దేశ ప్రజల ఐకమత్యాన్ని కోరుకుంటోంది. అంతేకాదు, దేశ ప్రజల్లో సరికొత్త శక్తిని, చైతన్యాన్ని నింపుతోంది.

మాతృభూమి, సంస్కృతి, స్వేచ్ఛ కోసం శతాబ్దాల తరబడి భారతదేశం పోరాటం చేసింది. బానిస బతుకు కారణంగా ఏర్పడిన ఆవేదన, స్వేచ్ఛకోసం రగిలిన తపన కారణంగా అనేక మంది పోరాట యోధులు నాటి వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. జయాపజయాల మధ్యన నలిగిపోయిన స్వాతంత్య్ర్య సమరయోధులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తమలోని స్వాతంత్య్ర కాంక్షా దీప్తిని సజీవంగా ఉంచారు. దేశానికి పూర్తిస్థాయిలో స్వాతంత్ర్యం తేవాలనే లక్ష్యంతో 1913లో గదర్ పార్టీ ఏర్పడింది. అమెరికా, కెనడాలలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయుల చేత స్థాపించబడిన పార్టీ కాబట్టి దాన్ని పసిఫిక్ తీర హిందీ అసోషియేషన్ అని కూడా అనేవారు, లాలా హర్ దయాళ్ స్ఫూర్తితో సర్దార్ సోహాన్ సింగ్ భక్నా గదర్ పార్టీని ప్రారంభించారు.

ఈ పార్టీ దేశానికి అనేక మంది విప్లవకారులను అందించింది. వారు దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 'నేషన్ ఫస్ట్.. అల్వేస్ ఫస్ట్' అనే నినాద చైతన్యంతో, ఇప్పటికీ స్ఫూర్తిని ఇస్తున్న పలువురు చారిత్రాత్మక వ్యక్తుల గురించి 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' ప్రచారంలో భాగంగా ఈవ్యాసంలో పలువురి జీవితపోరాటాలు అందిస్తున్నాము. అదే సమయంలో ప్రగతి ప్రయాణంలో ముందడుగు వేస్తున్న భారతదేశం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులు అందించిన బాటను అనుసరిస్తూ నూతన చరిత్రను మనం రాయాల్సి వుంది..

బిపిన్ చంద్ర పాల్: దేశ స్వాతంత్య్ర్య పోరాటంలో లాల్ బాల్ పాల్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన త్రిమూర్తుల్లో ఒకరు బిపిన్ చంద్ర పాల్, రచయితగా, ప్రసిద్ధి చెందిన ఉపన్యాసకునిగా పేరు గడించారు. భారతదేశంలో విప్లవాత్మక ఆలోచనల పితామహునిగా ఆయనకు ప్రజల్లో పేరు వచ్చింది. ప్రస్తుత బంగ్లాదేశ్ లోని సిలైట్ జిల్లాలోని పోలి గ్రామంలో 1858 నవంబర్ 7న ఆయన జన్మించారు. విప్లవకారుడైన ఆయన చిన్నప్పటినుంచీ ధైర్యసాహసాలు కనబరుస్తూ పేరు గడించారు. బ్రహ్మ సమాజంతో సంబంధాలు కలిగిన సమయంలో ఆయన కేశవ్ చంద్ర, శివనాధ్ శాస్త్రిలతో సాన్నిహిత్యం కలిగి వుండేవారు. బిపిన్ చంద్ర 1886లో కాంగ్రెస్ లో చేరారు 1905లో బ్రిటీష్ పాలకులు బెంగాల్ ను విభజించినప్పుడు లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ సారథ్యంలో విప్లవకారుల సంఘం ఏర్పడింది. బెంగాల్ విభజనను ఈ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. బ్రిటీష్ వారి వస్తువులను, వారి షాపులను బాయ్కాట్ చేయడం, విదేశీ దుస్తులను తగలబెట్టడం, బ్రిటీష్ పాలకుల ఫ్యాక్టరీలలో బంద్ లను లాకౌట్లను ప్రోత్సహించడం లాంటి విప్లవాత్మక విధానాల్ని వారు ప్రచారం చేశారు.

ఈ ఉద్యమాల సమయంలో నాటి ప్రసిద్ధి చెందిన పలువురు బెంగాలీ నాయకులతో బిపిన్ చంద్ర కు సంబంధాలు ఏర్పడ్డాయి. వారందరూ తీవ్రవాద జాతీయవాదాన్ని ప్రచారం చేసేవారు. అంతేకాదు, దేశంలో విప్లవ కార్యక్రమాలతోనే స్వాతంత్య్ర్యం వస్తుందని వారు బలంగా నమ్మేవారు. సహాయ నికారణ ఉద్యమంలాంటి శాంతియుత ఆందోళనల్ని వారు వ్యతిరేకించేవారు. దేశీయ వస్తువులనే వాదాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని బిపిన్ చంద్రపాల్ ప్రచారం చేసేవారు. స్వదేశీ, పేదరిక నిర్మూలన, విద్యారంగం మొదలైన అంశాలపై ఆయన చాలా కృషి చేయడానికి ఇదే కారణం. 

1907లో బ్రిటీష్ పాలకులు బాలగంగాధర్ తిలక్ ను అరెస్టు చేయగానే బిపిన్ చంద్రపాల్ ఇంగ్లాండు వెళ్లారు.. అక్కడ ఇండియా హౌస్ లో చేరారు. ఆయన పలు వార్తా పత్రికలను ప్రచురించేవారు. వాటిలో ముఖ్యమైనవి పరిదర్ ఏక్ (బెంగాలీ వార పత్రిక, 1886), న్యూ ఇండియా (ఆంగ్ల వార పత్రిక, 1906), వందే మాతరం (బెంగాలీ దినపత్రిక, 1906). ఆయన స్వరాజ్ పేరుతో ఒక మ్యాగజైన్ కూడా తెచ్చేవారు. బిపిన్ చంద్రపాల్ 1932, మే 20న కీర్తిశేషులయ్యారు.


వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే: చాలా మందికి వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే గురించి తెలియదు. ఆయన భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనలో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన ఆయన స్వరాజ్ తోనే దేశంలోని సమస్యలు పరిష్కారమవుతాయని బలంగా నమ్మారు. ఆయన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలోని షిరోదాన్ గ్రామంలో 1845 నవంబర్ 4న జన్మించారు.

1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం విఫలమైన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలతో తిరుగుబాటు కనబరిచేవారు, అడవుల్లో సంచారమంటే ఇష్టపడేవాడు. చదువు పూర్తయిన తర్వాత బాంబేకు మకాం మార్చారు. తర్వాత పుణే లోని మిలిటరీ అకౌంట్స్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్వాతంత్య సమర యోధులతో సంప్రదింపులు చేస్తుండేవారు. జాతీయవాది మహాదేవ్ గోవింద రనడే ఆయనపై విపరీతమైన ప్రభావం చూపారు. వాసుదేవ్ మిలిటరీ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న సమయంలో ఆయన మాతృమూర్తి అస్వస్థులయ్యారు.

అయితే, బ్రిటీష్ పాలకులు ఆయనకు సెలవు మంజూరు చేయలేదు. సెలవు లేకుండానే ఆయన తన గ్రామానికి వెళ్లిపోయారు. ఆయన వెళ్లే సరికి ఆయన మాతృమూర్తి మరణించారు. ఈ ఘటన వాసుదేవ్ పై తీవ్ర ప్రభావం చూపి, బ్రిటీష్ పాలకులపై వ్యతిరేకతను మరింత పెంచింది. గిరిజన సైన్యాన్ని తయారు చేసిన ఆయన 1879లో తిరుగుబాటు ప్రకటించారు. అదే ఏడాది బ్రిటీష్ పాలకులు ఆయన్ను అరెస్టు చేశారు. 1883 ఫిబ్రవరి 17న భారతమాత ముద్దుబిడ్డ, పోరాటయోధుడు వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే కీర్తిశేషులయ్యారు.

రంజిత్ సింగ్: పంజాబ్ సింహం రంజిత్ సింగ్ భారతదేశ చరిత్రలో కీలకమైన వ్యక్తిగా నిలిచారు. ఆయన పంజాబ్ ప్రాంతాన్ని ఐక్యంగా వుంచడమే కాకుండా బ్రిటీష్ పాలకులు తన సామ్రాజ్యం జోలికి రాకుండా చూశారు. ఆయన 1780 నవంబర్ 13న పాకిస్తాన్ లోని గుజ్రన్ వాలాలో జన్మించారు. ఆయన జన్మించిన సమయంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు బుధ్ సింగ్. పది సంవత్సరాల వయస్సులోనే తన తండ్రితో కలిసి తన మొదటి ప్రధానమైన యుద్ధంలో పాల్గొన్నారు.

విజయం సిద్ధించిన తర్వాత బుధ్ సింగ్ పేరు మార్చి రంజిత్ సింగ్ పేరుగా నామకరణం చేశారు చిన్నప్పుడే మసూచి సోకడంతో ఆయన తన ఎడమ కంటిని కోల్పోయారు. దేవుడు నాకు ఒకటే కన్ను ఇచ్చాడు. కాబట్టి, హిందువులను, ముస్లింలను, సిక్కులను, క్రిస్టియన్లను, ధనవంతులను, పేదలను.. ఇలా అందరినీ సమానంగా చూస్తాను అని ఆయన అనేవాడు. రంజిత్ సింగ్ తన 12వ ఏట తండ్రిని కోల్పోయారు.

తండ్రిని వారసత్వంగా సుఖేర్ చకియా మిస్ ఎస్టేట్స్ ను పొందిన ఆయన్ను తల్లి రాజ్ కౌర్ పెంచారు. 20 ఏళ్ల వయస్సు వచ్చేసరికి పంజాబ్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1801 ఏప్రిల్ 12 నాడు ఆయన పంజాబ్ మహారాజుగా పాలన ప్రారంభించారు. ఆ తర్వాత అనేక యుద్ధాలలో పాల్గొన్న ఆయన తూర్పు పంజాబును ఆధీనంలోకి తెచ్చుకొని శక్తివంతమైన సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించారు. అమృత్ సర్ లోని హర్ మందిర్ సాహిబ్ ను స్వర్ణ దేవాలయంగా మార్చారు. నేను రైతును, సైనికుడిని. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. నా చేతిలోని కత్తి ద్వారానే నాకు కావాల్సిన మార్పును తీసుకొస్తుంది అని ఆయన తన ఆస్థాన సభ్యులతో అనేవారు.

కున్వర్ సింగ్: దేశం గర్వించదగ్గ గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఒకరైన బాబు వీర్ కున్వర్ ఎనభై ఏళ్ల వయస్సులో కూడా బ్రిటీష్ పాలకులపై యుద్ధం చేసిన వీరుడు. ఆయన 1857 నాటి భారతదేశ మొదటి స్వాతంత్య్ర్య సమరంలో పాల్గొన్న యోధుడు. అన్యాయమంటే ఏమాత్రం సహించని ఆయన స్వేచ్ఛా ప్రేమికుడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన యోధుడు. ఆయన బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు.

అసమాన ధైర్యంతో పోరాడడమే కాకుండా దేశ ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేశారు. బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాలోని జగదీష్ పూర్ గ్రామంలో 1777 నవంబర్ 13న జన్మించాడు. తండ్రి మరణం తర్వాత తన సంస్థాన పాలన బాధ్యతలు చేపట్టారు. చిన్న వయస్సులోనే గుర్రపు స్వారీ, మల్లయుద్ధం, కత్తియుద్ధంలాంటి విద్యలు నేర్చుకున్నారు. యుద్ధతంత్రంలో నైపుణ్యం సాధించిన ఆయన గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరారు. జగదీష్ పూర్ అడవుల్లో నివసించిన బసూరియా బాబా దగ్గర దేశభక్తి, స్వాతంత్య్ర ఆవశ్యకతలాంటి వాటి గురించి కున్వర్ సింగ్ నేర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన వారణాసి, మధుర, కాన్పూర్, లక్నో లాంటి ప్రాంతాల్లో పర్యటించి బ్రిటీషువారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం పైన తగిన వ్యూహాన్ని రచించారు.

ఆయన ధైర్యసాహసగాధలు బీహార్ ప్రజల జానపద గాధలుగా మారాయంటే ఆయన గొప్పదనం ఎలాంటిదో ఊహించవచ్చు. ఒకసారి ఓ సంఘటనలో ఆయన చేతికి బుల్లెట్ తగిలింది. ఆయన వెంటనే తన చేతిని కట్ చేసి దాన్ని గంగానదిలోకి విసిరేసినట్టు చెబుతారు. ఆయన గొప్ప యుద్ధ వీరుడే కాదు తన జీవితాంతం సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 1857 నాటి తిరుగుబాటు యోధుడైన ఆయన 1858 ఏప్రిల్ 26న కీర్తిశేషులయ్యారు.

కాళోజీ: 'కాళోజీ', 'కాళన్న' అని అందరూ ప్రేమగా పిలుచుకునే కాళోజీ నారాయణరావు స్వాతంత్య్రం సమరయోధునిగా, కవిగా, సామాజిక కార్యకర్తగా దేశానికి సేవలందించారు. ఆయన్ను ప్రజాకవి అని పిలుస్తారు. కర్నాటకలోని రత్తిహల్లి గ్రామంలో 1914 సెప్టెంబర్ 9న ఆయన జన్మించారు. నాటి నిజాం పాలకులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సమర యోధునిగా దేశం కోసం పోరాడారు.

యువశక్తి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేలా స్ఫూర్తినిచ్చారు. ఆయన తన జీవితాంతం సమాజంలోని బడుగు బలహీనవర్గాల అభయున్నతి కోసం పాల్గొన్నారు. కృషి చేశారు. ఆయన చేసిన ప్రతి పనిలోను సమాజంపట్ల ఆయనకు ఉన్న నిబద్దత ప్రతిఫలించేది. తెలంగాణ ప్రాంతంలో పౌరుల హక్కుల కోసం, సామాజిక ఆర్ధిక సమస్యల పైనా జరిగిన పలు ఉద్యమాల్లో ఆయన భాగస్వామి అయ్యారు. రెండు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా సేవలందించారు. ఆంధ్ర సారస్వతి పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా సేవలందించారు. అంతేకాదు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా పని చేశారు.

ఆర్యసమాజ్ కాల్యకలాపాల్లో పాల్గొనేవారు. ప్రసిద్ధ ఉర్దూ కవి ఖలీల్ జిబ్రాన్ కవితలను అనువదించారు. దీనికిగాను ఆయన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ అనువాదకుని అవార్డు పొందారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ అవార్డుతో సన్మానించింది. ఆయన 2002 నవంబర్ 13న కీర్తిశేషులయ్యారు.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments