Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మాతృభూమి స్వాతంత్య్ర సాధనే వారికి అత్యంత ముఖ్యమైన లక్ష్యం - The passion for the motherland was paramount to them

మాతృభూమి స్వాతంత్య్ర సాధనే వారికి అత్యంత ముఖ్యమైన లక్ష్యం: భారతదేశ స్వాతంత్య్ర పోరాటమనేది కేవలం స్వేచ్ఛకోసం జరిగిన ఉద్యమం మాత్ర...

మాతృభూమి స్వాతంత్య్ర సాధనే వారికి అత్యంత ముఖ్యమైన లక్ష్యం: భారతదేశ స్వాతంత్య్ర పోరాటమనేది కేవలం స్వేచ్ఛకోసం జరిగిన ఉద్యమం మాత్రమే కాదు. అది మానవాళి. చరిత్రలోనే బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా వేలాది నుంచి యోధులు చేసిన పోరాటం, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ పౌరులందరూ ఐకమత్యంగా నిలిచి దేశ ప్రయోజనాలే ముఖ్యమనుకొని కదం తొక్కారు. దేశానికి స్వాతంత్య్ర్యంవచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మత మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, ధైర్యసాహసాలను స్మరించుకోవడం మన కర్త్యవ్యం.

భారతదేశ చరిత్రలో అక్టోబర్ 16కు ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది. ఎందుకంటే ఇదే రోజున బెంగాల్ ను విభజించాలని బ్రిటీష్ పాలకులు నిర్ణయించారు. ఈ విభజనను బాంగ్-ఛాంగాగా అని కూడా పిలుస్తారు. ఈ విభజన నిర్ణయం తీసుకోవడం వెనక బ్రిటీష్ పాలకుడు లార్జ్ కర్జన్ ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. బ్రిటన్ పాలనపై రాను రాను పెరుగుతున్న రాజకీయాందోళనల్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు బ్రిటీష్ పాలకులు తమ విభజించు పాలించు విధానం ప్రకారం దేశంలోని వివిధ వర్గాల ప్రజల మధ్యన గొడవల్ని సృష్టించడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత మొదలైంది. బెంగాల్ విభజన, తద్వారా జరిగిన ఘటనలు దేశప్రజల్ని లక్ష్యం చేశాయి. అంతే కాదు అది భారతదేశ స్వాతంత్య్ర్య పోరాటంలో కీటక పాత్ర పోషించి ఆగస్టు 15, 1947న దేశ స్వాతంత్య్రానికి కారణమైంది. ఏవిధంగానైతే బెంగాల్ విభజన అనేది దేశాన్ని ఐక్యం చేసింది, ప్రజల్లో స్వదేశీ స్ఫూర్తిని రగిల్చింది. దేశం కోసం జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల గాధలను ఈ అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకే వ్యాసంలో ఆరుగురి జీవిత చరిత్రలు అందిస్తున్నాము చదువుదాం స్పూర్తిని పొందుదాం.

సామాజిక సేవా కార్యకర్త నిర్మలా దేశ్ పాండే: నిర్మలా దేశ్ పాండే ప్రసిద్ధి చెందిన గాంధీ సిద్ధాంతాల కార్యకర్త, ఆలోచనాపరురాలు, రచయిత, రాజ్యసభ సభ్యురాలు మాత్రమే కాదు, ఆమె వినోబా భావే భూదానోద్యమంలో పాల్గొని దేశానికి సేవలందించారు. 23 సంవత్సరాల వయస్సులో భూదాన ఉద్యమంలో చేరిన ఆమె వినోభా భావేతో కలిసి దేశవ్యాప్తంగా 40 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఆమె నాగపూర్ లో విమలా, పురుషోత్తం యశ్వంత్ దేశా పాండే దంపతులకు జన్మించారు. మత సామరస్యతను ప్రోత్సహించడానికి మహిళలకు, గిరిజనులకు, అణగారిన వర్గాలకు సేవలందించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు.

సామాజిక న్యాయ సాధనకోసం, లౌకికవాదంకోసం, మత సామరస్యతను సాధించడం కోసం ఆమె పని చేశారు. ఆమె తన జీవితాంతం శాంతి, అహింసా సిద్ధాంతాలను బోధించారు. మహాత్మాగాంధీ మార్గాన్ని అనుసరించి జీవించారు. అదే సమయంలో ప్రజలు కూడా మహాత్మాగాంధీ ఆశయాలను అనుసరించాలని తపించేవారు. రచనలు చేయడంలో ప్రత్యేకమైన పుస్తకాలను రాశారు. అవివాహిత అయిన నిర్మలా దేశపాండే రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు.. ఆమె పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కూడా.

బ్రిటీషర్లపై ఆధిపత్యం సాధించిన కిట్టూర్ రాణి చెన్నమ్మ: కర్నాటక ప్రాంత కిట్టూర్ రాణి చెన్నమ్మ, కిట్టూరు రాజాస్థాన పాలకురాలు. భారతదేశ మొదటి స్వాతంత్య్ర పోరాటానికంటే 33 సంవత్సరాల ముందే బిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత, అందుకే చరిత్రకారులు ఆమె భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఉదయతార అని కీర్తించారు. బ్రిటన్లకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి తరం పాలకుల్లో ఆమె ఒకరు, కర్నాటక రాష్ట్రం బెలగావి జిల్లాలోని కాకతి అనే కుగ్రామంలో 1778 అక్టోబర్ 23న ఆమె జన్మించారు. దేశాయి రాజవంశానికి చెందిన రాజు మల్ల సర్జాను ఆమె వివాహమాడడంతో కిట్టూర్ రాణి అయ్యారు.

ఆమె భర్త 1824లో మరణించారు. అదే ఏడాది ఆమె కుమారుడు కూడా కాలం చేశారు. భర్త, కుమారుడు మరణించిన తర్వాత శివలింగప్పను దత్తత తీసుకున్న ఆమె అతన్ని రాజ్యానికి వారసున్ని చేశారు. రాణి చెన్నమ్మ నిర్ణయాన్ని బ్రిటన్ పాలకులు సహించలేకపోయారు. వారు శివలింగప్పను బహిష్కరించారు. ఎలాగైనా సరే కిట్జూర్ రాజాస్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రణాళిక వేశారు. దాంతో కిట్టూర్ రాణి చెన్నమ్మకు, బ్రిటన్ పాలకులకు మధ్యన యుద్ధం అనివార్యమైంది. ఈ యుద్ధంలో ఆమె ఎంతో ధైర్యసాహసాలతో పోరాటం చేశారు చివరకు ఓటమిపాలయ్యారు. బ్రిటన్ పాలకుల చెరలో బంధింపబడిన ఆమె జైలులోవుండగానే 1829 ఫిబ్రవరి 21న మరణించారు.

పరిపూర్ణతకు, నిరాడంబరతకు చిహ్నంగా ఆచార్య నరేంద్ర దేవ: దేశ స్వాతంత్య్ర సమరయోధుల్లో ప్రముఖులైన ఆచార్య నరేంద్ర దేవ పండితునిగా, విద్యావేత్తగా, సామాజికరంగ నేతగా, సాహిత్యాభిలాషిగా పేరు సంపాదించుకున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ లో 31 అక్టోబర్ 1889లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి పేరు బలదేవ్ ప్రసాద్, తల్లిపేరు శ్రీమతి జవహర్ దేవి, కాశీ విద్యాపీఠంలో చేరిన తర్వాత ఆయన పేరులో ఆచార్య భాగమైంది. దేశానికి స్వాతంత్యం సాధించడమే లక్ష్యంగా పోరాటంలో భాగమయ్యారు.

మహాత్ముడు ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలోను చురుగ్గా పాల్గొన్న ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. ఆచార్య నైపుణ్యంగల అసలు సిసలైన సత్యాగ్రహి అందుకే ఆయన్ను రత్నంలాంటి వ్యక్తి అని గాంధీజీ మెచ్చుకునేవారు. సామాజిక మార్పులకోసం. కృషి చేసిన ఆయన గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగమయ్యారు. అలహాబాద్ లో వున్న సమయంలో తనను బాలగంగాధర్ తిలక్, లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ లతోపాటు పలువురు నాయకులు ప్రభావితం చేశారు. వందేమాతరం, ఆర్య వార్తాపత్రికల్ని క్రమం తప్పకుండా చదివేవారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఆచార్య నరేంద్ర దేవ తన సామాజిక సేవలను కొనసాగించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 1948 మార్చిలో సోషలిస్ట్ పార్టీని ప్రారంభించారు. పోరాటం, త్యాగం, బాధలు, మానవాళికి సేవా కార్యక్రమాలతో ఆయన జీవితం కొనసాగింది. 1956 ఫిబ్రవరి 19న ఆయన కీర్తిశేషులయ్యారు.


బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన జతిన్ దాస్ భారతదేశ యువ దధీచిగా పేరు గడించిన యోధుడు: స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుడు జతిన్ దాస్ తన అపరిమితమైన ధైర్యసాహసాలతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ఒకసారి కాదు. రెండుసార్లు కాదు అనేకసార్లు ఆయన తన పోరాట పటిమను చూపారు.. ఆయన ప్రాణత్యాగం చేసిన సమయంలో మాట్లాడిన సుభాష్ చంద్రబోస్ ఆయన గురించి ఇలా అన్నారు. వజ్రాయుధం కోసం మహర్షి దధీచి తన ఎముకలను దానం చేసినట్టుగానే జతిన్ కూడా ఈ దేశం కోసం తన దేహాన్ని అందించారు. ఆయన ఆధునిక భారతదేశ దధీచి అంటూ సుభాష్ చంద్రబోస్ కీర్తించారు.

1904 అక్టోబర్ 27న కలకత్తాలో జతిన్ దాస్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బంకిమ్ బిహార్ దాస్, సుహాసినీ దేవి. మహాత్మాగాంధీ ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని పలుసార్లు జైలుపాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు ప్రసిద్ధ విప్లవకారుడు సచీంద్రనాథ్ సన్యాల్ తో పరిచయం ఏర్పడింది. తద్వారా ఆయన హిందూస్తాన్ రిపబ్లికన్ అసోషియేషన్ అనే విప్లవ సంస్థలో సభ్యులయ్యారు. ఈ సంస్థలో పని చేస్తున్న సమయంలోనే జతిన్ దాస్ బాంబులను తయారుచేయడం నేర్చుకున్నారు. 1928 లో నిర్వహించిన కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన సుభాష్ చంద్రబోస్ సహాయకునిగా వ్యవహరించారు. తర్వాత భగత్ సింగ్ విజ్ఞప్తి మేరకు బాంబులు తయారీకోసం అగ్రాడు వెళ్లారు.

1929 ఏప్రిల్ 8న సెంట్రల్ అసెంబ్లీలో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ విసిరిన బాంబులను జతిన్ దాసే తయారుచేశారు. లాహోర్ కుట్రకేసులో విచారణ ఎదుర్కొన్న జతిన్ దాస్ ఆ కేసులో జైలుపాలయ్యాడు. జైలులో రాజకీయ ఖైదీలుపడుతున్న కష్టాలను గమనించి వారిని కూడా యూరప్ ఖైదీల్లాగానే చూడాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్ ను నెగ్గించుకోవడం కోసం ఆయన నిరాహారదీక్షకు కూర్చున్నాడు. ఆయన దీక్ష 65 రోజులపాటు కొనసాగింది. ఆయన్ను నిరాహారదీక్షనుంచి విరమింపచేయడానికి బ్రిటీష్ పాలకులు చేయని ప్రయత్నం లేదు. ఎక్కడా లొంగని జతిన్ దాస్ 65 రోజుల నిరాహార దీక్ష తర్వాత 13 సెప్టెంబర్ 1929న పాతిక సంవత్సరాల వయస్సులో ప్రాణత్యాగం చేశారు.

బ్రిటీషర్ల పర్యవేక్షణలో ఉండగానే ఖజానాను కొల్లగొట్టిన అసఫుల్లాఖాన్: ఉత్తరప్రదేశ్ లోని మహజాన్ పూర్ లో 1900 సంవత్సరం అక్టోబర్ 22న అసపుల్లాఖాన్ జన్మించారు. కకోరి ఘటనలో కీలక పాత్ర పోషించిన ఆయన అప్పటికే ప్రసిద్ధి చెందిన ఉర్దూ కవి. ఆయన రామ్ ప్రసాద్ బిస్మిల్ కు ప్రాణస్నేహితుడు, కేవలం 27 సంవత్సరాల వయస్సులోనే దేశంకోసం ఉరికంబం ఎక్కిన త్యాగధనుడు అసపుల్లాఖాన్, మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయనిరాకరణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. చౌరీ చౌరా సంఘటనతో భిన్నుడైన మహాత్మాగాంధీ 1922 ఫిబ్రవరి 4న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించారు.

గాంధీజీ నిర్ణయం అసపుల్లాఖాన్ తోపాటు పలువురు విప్లవకారులకు రుచించలేదు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పోలీసులకు మధ్యన చౌరీ చౌరా వద్ద ఘర్షణ చెలరేగి ఆ ఘటనలో 22 పోలీసులు ముగ్గురు పౌరులు మరణించారు. మూడు సంవత్సరాల తర్వాత 1925 ఆగస్టు 8 విప్లవకారులందరూ కలిసి చంద్రశేఖర్ అజాద్ నాయకత్వంలో సమావేశమయ్యారు. షహరాన్ పూర్ లక్నో ప్రయాణికుల రైలును దోపిడీ చేయాలని పథకం రచించారు. ఆ రైలులో ప్రభుత్వ ఖజానాను తరలిస్తుండడంతో దాన్ని కకోరి రైల్వేస్టేషన్ వద్ద 1925 ఆగస్టు 9న దోపిడీ చేయాలనేది విప్లవకారుల ప్రణాళిక హిందూస్థాన్ రిపబ్లికన్ అసోషియేషన్ సభ్యులైన అసఫుల్లాఖాన్, ఆయన అనుచరులు కలిసి కకోరీ దోపిడీలో పాల్గొన్నారు.

ఈ ఘటన తర్వాత అసపుల్లాఖాన్ ఆయన అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఆయన పాఠశాల స్నేహితుల్లో ఒకరు ఆయనకు ద్రోహం చేసి పోలీసు ఇన్ ఫార్మర్గా మారిపోయాడు. కకోరి దోపిడీ ఘటనకు సంబంధించిన విచారణ 1926 మే 21న ప్రారంభమైంది. 1927 జులై నెలలో తీర్పు వచ్చింది. ఈ కేసులో రామ్ ప్రసాద్ బిస్మిల్, అసపుల్లాఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరిలకు ఉరిశిక్ష పడింది. 1927 డిసెంబర్ 19న అందరినీ గోరఖ్ పూర్ జైలులో ఉరితీశారు.

భారతదేశానికి జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నివేదిత: స్వామీ వివేకానందుని శిష్యురాలైన సిస్టర్ నివేదిత ఐరిష్ ఎలిజబెత్ నోబుల్, ఐర్లాండ్ ఉత్తరప్రాంతంలోని టైరోస్ కౌంటీలో 1867 అక్టోబర్ 28న ఆమె జన్మించారు. స్వామి వివేకానందులవారు ఆమెకు సిస్టర్ నివేదిత అనే పేరును పెట్టారు. దేవునికి అంకితమైన వ్యక్తి అని ఆ పేరుకు అర్ధం. మహిళా విద్యకోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలిగా ఆమె పేరు సంపాదించుకున్నారు.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ప్రభావితురాలైన ఆమె భారతదేశాన్ని తన కర్మభూమిగా, తన మాతృభూమిగా భావించారు.

అందుకే మహిళా విద్యకోసం ఆమె ఎంతో చురుగ్గా స్వాతంత్య చైతన్యవంతంగా పోరాటంలో పాల్గొనడమే కాకుండా నాటి స్వాతంత్య్రం పోరాటయోధులకు, విప్లవకారులకు మద్దతుగా నిలిచారు. రవీంద్రనాధ్ ఠాగూర్, జగదీష్ చంద్రబోస్, అవనీంద్రనాధ్ ఠాగూర్, మందలాల్ బోస్ లాంటి ప్రముఖులతో స్నేహం చేశారు. మహారుషి అరవింద ఘోష్ పై బ్రిటీష్ కుట్రల గురించి తెలుసుకున్న ఆమె ఆయన్ను పాండిచ్చేరికి ( నేటి పుదుచ్చేరి) వెళ్లమని సలహా ఇచ్చారు. భారతదేశ దృక్పథంతో చరిత్ర రాయాలని ఆమె చరిత్రకారులు రమేష్ చందర్ దత్, జదూనాధ్ సర్కార్ లకు సలహా ఇచ్చారు. దేశంలో మహిళా విద్య ప్రాధాన్యతను ఆమె చాటారు.

ఇందుకోసం ఆమె కలకత్తాలో బాలికల పాఠశాల ప్రారంభించారు. వివేకానంద స్వామి గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస సతీమణి మాతా శారద చేతులమీదుగా ఆ పాఠశాల మొదలైంది, సిస్టర్ నివేదిత స్ఫూర్తిగా నేటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని బాలికల విద్యకోసం భేటీ బచావో భేటీ పడావో పథతాన్ని అమలు చేస్తోంది. సిస్టర్ నివేదిత పాఠకుల ఆదరణ పొందిన రచయిత కూడా. ఆమె పలు పుస్తకాలు రచించి భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించారు.

సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా నిలిచిన బిహార్ కేసరి డాక్టర్ శ్రీ కృష్ణ సింగ్: సిద్ధాంతాలను, విలువలను నమ్మిన సమరయోధుడే కాదు ఆధునిక బీహార్ నిర్మాత కూడా. బిహార్ కేసరి, బీహార్ విభూతి, శ్రీబాబులాంటి ముద్దుపేర్లతో రాష్ట్ర ప్రజలు ఆయన్ను పిలుచుకునేవారంటే ఆయనపట్ల ప్రజలకున్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆయన నవదా జిల్లాలోని భావ్వా గ్రామంలో జన్మించారు. నాలుగేళ్ల వయస్సున్నప్పుడే ఆయన తల్లిని కోల్పోయారు. జాతి పిత మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపుమేరకు చిన్నవయస్సులోనే అని సెంట్రల్, హిందూ కాలేజీలో శ్రీకృష్ణ సింగ్ అధ్వర్యంలో చంపారన్ సత్యాగ్రహం మొదలైనప్పుడు శ్రీకృష్ణ సింగ్ రైతు సంఘాలకు నాయకత్వం వహించారు.

దేశానికి స్వాతంత్యంసాధించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం కాగానే శ్రీకృష్ణ సింగ్ తన న్యాయవాద వృత్తిని వదిలేసి పోరాటంలోకి దూకారు. 1930 నాటి ఉప్పు సత్యాగ్రహంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 1933లో పౌర అవిధేయతా ఉద్యమంలో పాల్గొన్న ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి హజారీబాగ్ జైలులో వుంచారు. 1941లో గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన్ను మొదటి బిహార్ సత్యాగ్రహిగా గాంధీజీ ప్రకటించారు.

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తన జీవితాంతం ఆయన సామాజిక న్యాయంకోసం కృషి చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన జమిందారీ వ్యవస్థను రద్దు చేశాడు. అంతే కాదు దియోఘర్ లోని వైద్యనాధ్ రామ్ దేవాలయంలోకి దళితున్ని ప్రవేశించనీయాలని కోరుతూ ఉద్యమం నడిపారు. ఆయన చేసిన కృషి కారణంగా చిట్టచివరకు బాబా వైద్యనాధ్ ఆలయంలోకి దళితులు ప్రవేశించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments